StatCounter code

Wednesday, August 11, 2010

పి.హెచ్.డి కష్టాలు (సరదాగా...)


PHD అంటేనే "Permanent Head Damage" అని అర్థం..మరి కష్టాలు కాక ఇంకేముంటాయి చెప్పండి.

నేను ఐదు సంవత్సరాలు చేసాను. ఆ ఐదేళ్ళు చాలా రకాల టెన్షన్లు, బాధలు, సరదాలు, సంతోషాలు, సాహసాలు ...ఓహ్ ఒకటా రెండా. ఒక్కోసారి కొన్ని సంఘటనలు తలుచుకుంటే నవ్వు వస్తుంది, కానీ అవి జరిగినప్పుడు విపరీతమైన టెన్షన్ పడ్డాం, అలాంటివి కొన్ని...

ఒకరోజు నేను, మా ఫ్రెండు కోటీ వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాం. బస్ మా కేంపస్ గేట్ దగ్గర ఆగింది. బస్ వెనక తలుపు దగ్గరనుండి మా ఫ్రెండు ముందు దిగాడు, తన వెనకే నేను దిగబోతున్నంతలో డ్రైవరు లాగించేసాడు....బొక్క బోర్లా పడ్డాను, మోకాలి చిప్ప పగిలిపోయింది. మా ఫ్రెండు చెయ్యి పట్టుకుని కుంటుకుంటూ హెల్త్ సెంటర్ కి వెళ్ళాను. ఎముకలు కాస్త అటుఇటు అయ్యాయి ఎక్స్-రే తీయించాలన్నారు. సైకిల్ తొక్కకూడదు, మెట్లెక్కకూడదు, ఎక్కువ నడవకూడదు, కూర్చోకూడదు, నిల్చోకూడదు అంటూ బోల్డు కండీషన్లు పెట్టారు. సరే, డాక్టరు చెప్పినవన్నీ చక్కా వినేసి, మందులు మాకులు పుచ్చేసుకుని రూముకి చేరాను. మర్నాడు నేను డిపార్ట్‌మెంటుకి వెళుతూ ఉంటే మా సీనియర్ ఎదురొచ్చి "సౌమ్య పడిపోయావంటగా, ఎలా ఉంది, డాక్టర్ ఏమన్నారు?" అని అడిగాడు. ఎముకలు కాస్త డిస్‌లొకేటయ్యాయట, డాక్టర్ గారు జెరాక్స్ తీయించుకోమన్నారు అని చెప్పాను. "ఏంటి?" అని మళ్ళీ అడిగాడా అబ్బాయి, కాస్త ఆశ్చర్యపోతూ. "జెరాక్స్ తీయించుకోమన్నారు" అని మళ్ళీ చెప్పాను. ఆ పిల్లాడు నవ్వాపుకోలేక పడీ పడీ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక వెర్రిమొహం వేసాను. ఆ అబ్బాయి ఈసారి ఇంకాస్త విపులంగా "ఏం తీయించుకోమన్నారు?" అని అడిగాడు. జెరాక్స్ అనబోతూ ఆగిపోయాను...అప్పుడర్థమయింది నాకు. మొదట ఉడుక్కున్నా తరువాత నవ్వేసాను:). కానీ ఆ అబ్బాయి ఊరుకుంటాడా! వెళ్ళి అందరికి టమకు వేసాడు. ఇహ చూసుకోండి....ప్రతీ ఒక్కరూ "సౌమ్యా, నీ కాలికి జెరాక్స్ తీయించుకున్నవటగా, బాగా వచ్చిందా? సైడులు కట్ అయిపోకుండా అన్ని సరిగ్గా వచ్చాయా" అని ఒకటే గోల. నేను ఎక్కువ నడవకూడదు, సైకిల్ తొక్క కూడదు కాబట్టి రోజూ ఎవరో ఒకరు నన్ను డిపార్ట్‌మెంటుకి, రూము కి సైకిలు మీద తిప్పుతూ ఉండేవారు. రెండు రోజులు పోయాక నేను మళ్ళీ హెల్త్ సెంటర్ కి వెళ్లవలసి వచ్చింది కాలు చూపించుకోవడానికి. నా ఫ్రెండు నన్ను దింపుతానన్నాడు. నేను సైకిల్ మీద ఎక్కి కూర్చోగానే తను "సౌమ్య ఎక్కడికి వెళ్ళమంటావు జెరాక్స్ సెంటర్ కా, హెల్త్ సెంటర్ కా?" అని అడిగాడు. నాకు మండింది చూడండి....ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక అని పాడుకుంటూ నేను తలకొట్టుకున్నాను. ఇలా నా కాలు నొప్పి తగ్గేవరకు జనాలు నన్ను వదలలేదు. అక్కడితో అయిపోయిందా అబ్బే...... ఎప్పుడైన్నా ఏదైన ఫొటో కాపీ తీయించుకోవాలంటే "సౌమ్యా ఎక్స్ రే తీయించమంటావా" అని ఓ వెకిలి నవ్వు నవ్వేవారు. ఈరోజుకి ఎవరూ ఆ విషయాన్ని మరచిపోలేదు నాతో సహా :D

ఇంతకీ విషయమేమిటంటే మేమేమి చదువుకోవాలన్నా లైబ్రరీకెళ్ళి కావలసినవి జెరాక్స్ తీసుకోవడమేగానీ పుస్తకాలు కొనుక్కుని చదివే అలవాటు లేదు. కొనుక్కోలేము కూడా. ఇక జర్నల్స్, పీరియాడికల్స్ అయితే కొనడమన్న మాటే లేదు. అలా జెరాక్సులు తీసి తీసి ఎక్స్-రే కి బదులు జెరాక్సు అని అన్నాననమాట.

ఇంకోసారేమయిందంటే....
మాకు పి.హెచ్.డి లో రెండేళ్ళ పూర్తి అయిన తరువాత నుండీ ప్రతీ ఆరునెలలకొకసారి ఒక సెమినార్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ విద్యార్థికి గైడ్ కాక ఇంకో ముగ్గురితో కూడిన డాక్టరల్ కమిటీ ఉంటుంది. వాళ్ళ ముందు అప్పటివరకు మేము చేసిన ఘనకార్యాలన్నీ అదేనండీ రిసెర్చి అంతా చెప్పి ఒప్పించాలన్నమాట. వాళ్ళేమో రకరకాల వంకలు పెడుతూ మమ్మల్ని చీల్చి చెండాడేస్తారు. ఈ సెమినార్ అయి, వాళ్ళ చేత సంతకం పెట్టించుకుంటే తప్ప స్కాలర్షిప్ వచ్చి చావదు. అందుకని ఈ డాక్టరల్ సెమినార్ అంటేనే ప్రతీ ఒక్కరికి దడ. నా స్నేహితురాలికి వాళ్ళ గైడ్ తో సబ్జెక్ట్ విషయంలో కాస్త సమస్య వచ్చి ఈ డాక్టరల్ కమిటీ సెమినార్ వచ్చేసరికి చాలా టెన్షన్ పడింది. తను అగ్రిగల్చర్ ఎకనామిక్స్ లో రిసెర్చి చేస్తోంది. ఈ పిల్లకి రెండు రోజులముందు నుండే విపరీతమైన టెన్షన్. ఆ సెమినార్ కి ముందురోజు నేను తను, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి లంచ్ కి మెస్‌కెళుతూ ఉండగా మాలో ఒకర్తి కళ్ళు తిరిగి పడిపోయింది. మేము గాబరాపడి ఆ అమ్మాయిని హెల్త్ సెంటర్ కి తీసుకెళ్ళాం. ఏ కళనున్నాడో ఆ డాక్టరు మహానుభావుడు చిటపటలాడుతూ కనిపించాడు. "ఈ అమ్మాయి బాగా నీరసంగా ఉంది, అందుకే కళ్ళు తిరిగాయి" అన్నాడు. అసలే సెమినార్ టెన్షన్ లో ఉన్న నా ఫ్రెండు డ్రిప్ ఇస్తారా అనబోయి "అయితే డ్రిప్ ఇరిగేషన్" ఇస్తారా అంది. దాంతో ఆ డాక్టరుకి పిచ్చ కోపం వచ్చింది, మండిపడిపోయాడు. కళ్ళతో నిప్పులు కురిపిస్తూ "యు ఆర్ ఇన్సల్టింగ్ మై ప్రొఫెషన్" అన్నాడు. డ్రిప్ ఇరిగేషన్ అంటావా అని అంత ఎత్తున ఎగిరాడు. నేను వెంటనే తేరుకుని "హయ్యో ఆ పిల్ల టెన్షన్లో అలా మాట్లాడిందండీ. మిమ్మల్ని కించపరచడం తన ఉద్దేశ్యం కాదు అని సర్ది చెప్పబోయాను. ఊహూ వింటేగా...అసలు ముందు నుండే ఏదో కోపంలో ఉన్నట్టున్నాడు, హాట్ హూట్ అని ఎగిరాడు. పక్కనే నా స్నేహితురాలికి కళ్ళమ్మట నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. ఒక్కసారిగా అతను అలా అరిచేసరికి తను నిశ్చేష్టురాలయిపోయింది. తేరుకుని సారీ చెప్పింది. మేము అతన్ని బతిమాలి, తప్పయిపోయింది పొరపాటున అలా అన్నాది అని సర్ది చెప్పేసరికి మా తల ప్రాణం తోకకొచ్చింది. మరేమనుకున్నాడో ఏమో, ఇంకెప్పుడు అలా ఒళ్లు పై తెలియకుండా మాట్లాడకండి అని చెప్పి తనకి సెలైన్ ఎక్కించాడప్పుడు.

నా ఫ్రెండు అగ్రిగల్చర్ ఎకనామిక్స్ లో చేస్తోంది అని చెప్పాగా...తను ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీద ఏదో చేస్తోంది. దాని పర్యవసానమే ఈ డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట :P.

మరోసారేమయిందంటే...
గోప్స్ (గోపాల్‌జీ షాపుకి షార్ట్ కట్ అన్న మాట) అని ఒక ప్రదేశముండేది. అక్కడ చిరుతిళ్లు, టీ, కాఫీలు దొరుకుతాయి. వీటి కోసం కాకపోయినా, పిచ్చపాటీ వేసుకోవడానికి సాయంత్రమయ్యేసరికి విద్యార్థులంతా అక్కడకి చేరుతారన్నమాట. ఒకరోజు మేమంతా గోప్స్ లో ఉన్నప్పుడు యధాతధంగా గైడ్స్-వాళ్ళతో మా కష్టాలు (సాధారణంగా రిసెర్చి చేసేవాళ్ళకి ఉండే కామన్ టాపిక్ "గైడ్") గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మా గుంపులో ఆర్థికశాస్త్రము, తెలుగు, పొలిటికల్ సైన్స్, హిందీ లలో పి.హెచ్.డీ చేస్తున్నవాళ్ళు ఉన్నారు. ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. తెలుగులో రిసెర్చి చేస్తున్న అబ్బాయి " మా గైడ్ చాదస్తంతో చంపేస్తున్నాడురా బాబు, పదాలల చివర "ము" పెడితే "అం" పెట్టమంటాడు. "అం" పెడితే "ము" పెట్టమంటాడు. అంటే కలము అని రాస్తే కలం అని రాయమంటాడు, కలం అని రాస్తే కలము అని రాయమంటాడు. ఏదైనా రాసి ఇస్తే విషయం చూడకుండా విసర్గ ఏది అంటాడు, కామా లేదంటాడు, బుర్ర తినేస్తున్నాడు. ఏది రాసినా ఇంకా బాగా రాయలంటాడు. నీ ఆలోచనలు సరిగ్గా ఆవిష్కృతం కాలేదంటాడు. ఏమైనా తెలుగులో రిసెర్చి చెయ్యడం కష్టం రా బాబూ" అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అంతా విన్నక మరొక మితృడు "ఎళ్ళెళ్ళవోయ్, తెలుగులో రిసెర్చి ఏమి కష్టం?.... ఏదో ఒక కథో, కవితో తీసుకుని మరు చూపు, ముందు చూపు, తొలి చూపు అని దాన్నే మళ్ళీ తిరగరాస్తారు. లేదా కొత్త కోణం, దృక్కోణం, లంబకోణం అని వెనకనుండి ముందుకి రాస్తారు అంతే కదా" అన్నాడు. అది విని మేమంతా పగలబడి నవ్వాము. తను సరదాకే అన్నాడని మాకు తెలుసు. ఆ తెలుగు లో రిసెర్చి చేస్తున్న అబ్బాయి కూడా పడి పడి నవ్వుతూ ఎందుకో వెనక్కి తిరిగాడు.....వెనుక దృశ్యం చూసి హతాశుడైపోయాడు. ఏముంది సిగరెట్ కాల్చుకోవడానికి అక్కడికొచ్చిన వాళ్ళ గైడు ఉరిమి ఉరిమి చూస్తున్నారు. మాకు పై ప్రాణాలు పైనే పోయాయి, "విన్నాడా" అని సందేహమొచ్చింది. ఇహ చూసుకోండి ఆ గురుడు మొదలెట్టాడు.....మీకేం తెలుసు తెలుగు గురించి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమైనా అంటే క్షమించవచ్చు. తెలుగు విద్యార్ధివైయుండి నువ్వు కూడా నవ్వుతావా అని మా స్నేహితుడిని చెడామడా తిట్టి, నా ఆఫీసుకి రా నీ పని చెప్తాను అన్నట్టు చూసి అక్కడనుండి వెళ్ళిపోయాడు. ఇక మా ఫ్రెండుకి ఒకటే భయం, గుండెదడ, వణికిపోయాడు. మేము అక్కడ జేవురించిన మొహాలతో బిక్కచచ్చిపోయాము. కాళ్ళు చేతులు ఆడలేదు ఎవ్వరికీ. ఆ అబ్బాయి సంగతేమవుతుందో అని మా అందరికీ బెంగే. మర్నాడు భయపడుతూ భయపడుతూ వాళ్ళ గైడ్ ఆఫీసుకి వెళ్ళాడు. బెరుకు బెరుకుగా చూస్తూ నిల్చున్నాడు. వాళ్ళ గైడేమో "రావోయ్, ఏదీ నేనిచ్చిన కరక్షన్స్ చేసావా, చూపించు" అంటూ నవ్వుతూ మాట్లాడాడట. ఇదేమిటి ఇలా మామూలుగా మాట్లాడేస్తున్నారు అని తను ఆశ్చర్యపోయి తను చేసిన వర్క్ చూపించాడట. ఆ గైడేమో అసలు నిన్నటి విషయమేమీ జరగనట్టు చాలాసేపు నా స్నేహితుడితో మాట్లాడి చివర్లో "నిన్న ఎందుకో మీ స్నేహితుల మాటలు వినగానే గొప్ప కోపం వచ్చేసిందోయ్, కాని తరువాత తలుచుకుంటే నవ్వొచ్చింది, ఆ అబ్బాయి సరదాకే అన్నా తను చెప్పిన దాన్లోనూ నిజం లేకపోలేదనిపించింది. నిన్న అనవసరంగా మీ అందరినీ తిట్టేసాను, సారీ అని మీ మితృలందరి చెప్పు" అన్నారట. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని మా స్నేహితుడు పరిగెత్తుకుంటూ మా వద్దకొచ్చి విషయం చెప్పాడు. విన్నాక మేమంతా తేలికగా ఊపిరి పీల్చుకున్నాం :).

ఇలాంటివి ఇంకా బోలేడు. ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే నవ్వొస్తున్నాది, కానీ ఆ రోజు వచ్చిన దడ, టెన్షన్ చెప్పనలవి కాదు. వీటితో పాటు గైడ్స్ సరిగ్గా సహకరించక కొన్ని పాట్లు, సహకరించినా అనుకున్న రిజల్ట్స్ రాక మరికొన్ని బాధలు. అన్నీ సరిగ్గా అమరినా సెమినార్స్‌లో అందరినీ ఒప్పించడానికి పడే కష్టాలు...ఇంకో వైపు ఇంకా అవ్వలేదా, ఎన్నేళ్ళు చేస్తావు అంటూ బంధువుల సొడ్డు మాటలు. ఇవన్నీ చూస్తూ అమ్మనాన్నాల విచారం. ఇన్ని పాములూ దాటుకుని నిచ్చెన ఎక్కేసరికి తల ప్రాణం తోకకి వస్తుంది. అందుకే అన్నాను "Permanent Head Damage" అని. అది పూర్తి చెయ్యడమంటే వైకుంఠపాళీ యే.



ఏది ఏమైనా పి.హెచ్.డీ పూర్తి చేసాక వచ్చే విజయ గర్వం,ఆనందాలతో సరిసమానమయినది ఏదీ లేదు. అది అది అనుభవైకవేద్యమే తప్ప చెప్పనలవి కాదు.

82 comments:

సుజాత వేల్పూరి said...

మీకు కష్టాలేమో కానీ ఇక్కడ నాకు మాత్రం భలే నవ్వొస్తోంది సౌమ్యా! సరే ఇంతకీ జిరాక్స్ లో ఏమి తేలింది? ఎముక విరిగిందా లేదా...అయ్యో సారీ, అదే ఎక్స్ రే లో!

ఈ వైకుఠ పాళీ మాత్రం సూపర్బ్ గా ఉంది.మొత్తానికి నిచ్చెనలెక్కి పరమపదం సాధించారన్నమాట!

Manjusha kotamraju said...

నిజమేనండి మీరు చెప్పింది,,మా వారు ముడేళ్ళుగా చేస్తున్నారు,,అయనకేమో గాని నాకు విసుగు వస్తొంది Ph.d అంటేనే,,its really partial head damage

ప్రసాదం said...

అంతలా భయపడటం ఏమిటండీ నేను అసలు గైడ్లను లెక్క చేయను.

ప్రసాదం said...

ఎందుకంటే ఇలాంటివి తెలిసి నేను డిగ్రీనే చదివాను కాబట్టి. :)

vivek said...

ఇంకో వైపు ఇంకా అవ్వలేదా, ఎన్నేళ్ళు చేస్తావు అంటూ బంధువుల సొడ్డు మాటలు.

hahaha,..ee line bagundi....

And very natural one...ante nijam ga jariginave ayna,me writing style chala improve ayindi.....gud one!!

oremuna said...

యెచ్ సీ యూ అన్న మాట :-)

శేఖర్ పెద్దగోపు said...

హాహ్హ..హ్హ..భలే ఉన్నాయి కష్టాలు..పీ.హెచ్.డీనా మజాకానా? టపా క్రింద మీ పీ.హెచ్.డీ లైఫ్‌ని ఎక్స్‌రే తీసి పెట్టారు చూడండి..అది మాత్రం సూపర్..:-):-)

మారూమ్మేట్ phd చేసే రోజుల్లో లెక్కకు మిక్కిలి జిరాక్స్‌లు, చిత్తు కాగితాలు రూం నిండా పడి ఉండేవి..పాత పేపర్లు కొనేవాడు ఎప్పుడొచ్చినా 'సారూ.మీ సదువైపోయాక ఆ పేపర్లన్ని నాకే ఇవ్వాల' అని వచ్చిన ప్రతీసారు పోరుపెడుతూ కట్టలు కట్టలుగా ఉన్న వాటివంక ఆశగా చూసేవాడు....

ఆ.సౌమ్య said...

@సుజాత గారూ
నవ్వండి నవ్వండి, నవ్వితే మీ పళ్ళే కనిపిస్తాయిలెండీ, నాకేం పోయింది :)
జిరాక్స్ లో ఎముకలు డిస్‌జాయింటయ్యాయని తెలిసిందండీ
పరమపదం....కరక్టుగా చెప్పారండీ. అన్ని నిచ్చెనలు ఎక్కేసరికి, దిగేసరికి జీవం కోల్పోయి ఎలాగోలా పరమపదం చేరాము.
వైకుంఠపాళీ నచ్చిందా.....thanks!

@ మంజు గారు
అబ్బే మూడేళ్ళకే విసుగంటే ఎలాగండీ...ఇంకా ముందుంది ముసళ్ల పండగ. మీవారికి నా good luck చెప్పండి.
ధన్యవాదములు

ఆ.సౌమ్య said...

@ ప్రసాదం గారూ
అర్థమయింది మీ కవిహృదయం. మొదటి ముక్క చెప్పినప్పుడే గ్రహించాను :)
ధన్యవాదములు

@ వివేక్
ఏం నాయనా, చాలా రోజులకి కనిపించావు. అంతా సౌఖ్యమేనా?
అయితే నేను రాబోయే కాలానికి కాబోయే రచయిత్రినంటావా! Thanks :)

ఆ.సౌమ్య said...

@ oremuna
అవునండీ HCU నే. మీ వెనుకే మేము HCU లో, బ్లాగుల్లో కూడా :)

ఆ.సౌమ్య said...

@ శేఖర్ గారూ
మీరూ నవ్వుతున్నారా, నవ్వండి నవ్వండి.
అనేసారా మీరూ ఎక్స్-రే అనేసారా.....ఇక బ్లాగుల్లోనూ మొదలెట్టారా నన్ను ఏడిపించడం....హి హి హి, వైకుంఠపాళి నచ్చిందా, thanks!

అవునండీ, నేను ఏమి కూడబెట్టినా బెట్టకపోయినా ఈ జెరాక్స్ కాగితాలు మాత్రం రూమునిండా కూడబెట్టానండీ. చివరికి రూము ఖాళీ చేసేటప్పుడు అవే పెద్ద పెద్దా డబ్బాలనిండా పట్టాయి. ఏవి ఉంచాలో, ఏవి పారేయాలో తెలియక తికమకపడ్డాననుకోండి. ఎప్పుడు ఏది అవసరమవుతుందో అని ఆబ ఒకటి.

Anonymous said...

వైకుఠ పాళీ బాగుందండి.

Anonymous said...

మీరన్నా నయం Ph.D కోసం కష్టాలు పడ్డారు, మా గైడ్ తొక్కలో M.Tech థెసీస్ కే బోల్డు బిల్డప్పులు ఇచ్చాడు.

జయ said...

ఆ.సౌమ్య తొందరలోనే ఎటువంటి జిరాక్స్ సమస్యలు లేకుండా (సంవత్సరాలు పొడిగించకుండా అన్నమాట)... తొందరలోనే డా.సౌమ్య గా మారాలి అని కోరుకుంటున్నాను. ఎంతైనా రీసెర్చ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని కదా:) All the best.

ఆ.సౌమ్య said...

@ అను
ధన్యవాదములు

@ ఆకశ రామన్న
అసలు గైడ్ అంటేనే బిల్డప్‌లిచ్చేవాడని అర్థం. గైడ్ కి విద్యార్థి ని హింసించడంలోనే పరమానందం దొరుకుతుంది. అదే వారికి ఆహారం కూడా :)

Sai Praveen said...

హ హ హ.
కాలికి జిరాక్స్. నవ్వలేక చచ్చాను.

తార said...

అలా జరిగిందా జెరాక్స్ సేమియా గారు..

ఆ.సౌమ్య said...

@సాయి ప్రవీణ్
ధన్యవాదములు.
నా కష్టాలు మీకు నవ్వులాటగా ఉన్నాయా...సరే సరే కానీండి :)

@ తార
అవును బూర, అలాగే జరిగింది.

నేస్తం said...

హ హ భలే ఉన్నయండి మీ కబుర్లు.. మీ ఎక్స్ రే ,జిరాక్స్ టైపులో మా ఇంట్లో పెద్దవాళ్ళకు ఇన్లాండ్ లెటర్ అని అనడం రాక ఇంగ్లాండ్ లెటర్ అనేవారు ..సరే వాళ్ళన్నారు .. మాకు పలకడం వచ్చి కూడా అలవాటులో పొరపాటు.. బుక్ షాప్కి వెళ్ళినపుడల్లా ఇంగ్లాండ్ లెటర్ ఇవ్వండీ అనడం ..అది అయితే ఇంగ్లాండ్ వెళ్ళి తెచ్చుకోండి అని వాడనటం..నాలుక్కరుచుకుని ఇబ్బందిగా నవ్వడం .. తలుచుకుంటే నవ్వొస్తుంది

జ్యోతి said...

నాకు కూడా డాక్టరు జెరాక్స్ తీసుకోమన్నాడు..

ఛి . ఛీ.. ఎక్స్ రే.. ఈ టపా చదివి నాకు జెరాక్స్ అనే వస్తుంది. ఇపుడు నిన్ను జెరాక్స్ సౌమ్య అని పిలవొచ్చు. ఇద్దరు సౌమ్యల మధ్య confusion ఉండదు..

ఆ.సౌమ్య said...

@ జయ గారు
నేను PhD పూర్తి చేసేసానండీ. ఆ కష్టాలన్నీ తీరిపోయాయి కాబట్టే ఇప్పుడు నవ్వుకోగలుగుతున్నాను. హా మీకు తెలియనివా ఆ కష్టాలు :)
ధన్యవాదములు.


@ నేస్తం
మీ పేరు పిలవడానికి భలే బావుంటుందండీ.
నా కబుర్లు నచ్చినందుకు సంతోషం :)
హహహ మేము కూడా చిన్నప్పుడు ఇంగ్లాడు లెటర్ అనే వాళ్ళమండీ. అసలు చాన్నాళ్ళవరకు అది ఇన్‌లాండ్ లెటర్ అని నాకు తెలీనే తెలీదు.

సవ్వడి said...

PHD లో ఇన్ని కష్టాలుంటాయా...................
phd ఐపోయింది అన్నారు. దేనిమీద చేసారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు.

Ravi said...

ఇలాంటి కష్టాలు ముందుగా ఊహించే మా ప్రొఫెసర్ నా ఎంటెక్ అయింతర్వాత పీహెచ్‌డీ చేయమంటే తప్పించుకొచ్చేశాను.

శ్రీనివాస్ పప్పు said...

జెరాక్స్ కాన్సెప్ట్ మాత్రం కేక జెరాక్స్ఎక్సరే సౌమ్య గారూ.అవునూ మీ ఎముక డిస్‌జాయింట్ అయ్యిందా డిస్‌లొకేట్ అయ్యిందా?మీరు తప్పా?నేను రైటా?ఏది కరష్టూ ఇంతకీ?రెండూ కరష్టేనా.
సైకులు కాదు సైకిలు.
ఇంతకీ జెరాక్స్ అన్న పదం కూడా తప్పే మరి,ఫొటోకాపీ అంటారు,జెరాక్స్ అనేది ఆ ఫొటోకాపీ తీసే మెషిన్ తయారుచేసే కంపెనీల్లో ఒకటి(హమ్మయ్య చెప్పేసాను నాకు తెలిసున్న ఒకే ఒక్క విషయం,ఇది కూడ తప్పయితే నా తప్పు కాదు,నా పూచీలేదు).
అసలు పీహెచ్‌డీ ఎన్ని ఏళ్ళు? మీరు ఐదేళ్ళు చేసానన్నారు.
అన్నిటికన్నా మీ పీహెచ్‌డీ యాత్రా వైకుంఠపాళీ చాలా బావుంది.
నిజమే ఎంత కష్టపడా చివర్న దాని ఫలితం చూసుకున్నాక కలిగే ఆనందాన్ని అనుభవించాల్సిందే.

..nagarjuna.. said...

గైడులందిరినీ ఒకే గాటున కట్టడం ఏం బాలేద్దేచ్చా.. నన్నే తీసుకోండి, నేను నా గైడును 20 రోజుల తరువాత కలిస్తే ఆయన కాసేపు ఆలోచించి ఏమనకుండా ఓ వారం తరువాత కనపడమన్నాడు. ఆ మాట చెప్పి ఇవాల్టికి 12 రోజులు కావొస్తుంది. నేనింకా కలవలేదు. కలిసినా మా గైడు మంచోడు మరి ఏం అనడు (ఏమో..రేపువెళ్ళి కలిస్తేగాని తెలియదు)

ఇంతకీ కొత్తాగా ’జెరాక్స్‌ సౌమియా’ ఎవరండీ ఆలమూరు సౌమ్యగారు....జనాలు చాలా మాట్లాడేస్తున్నారావిడ గురించి ;)

Ram Krish Reddy Kotla said...

హ హ ...నవ్వు తెప్పించాయి సౌమ్య గారు మీ పీ.హెచ్.డీ కష్టాలు...చాలా బాగా రాసారు..నేను డిల్లీలో ఐ.ఏ.ఎస్ కోచింగ్ తీసుకునేప్పుడు,IARI క్యాంపస్ లో ఉండేవాడిని..ఆ అగ్రికల్చరల్ రిసర్చ్ instituteలో మీలాగే చాలా మంది పీ.హెచ్.డీ చేసేవాళ్ళు పరిచయం అయ్యారు..వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలు చెప్తుండే వాళ్ళు...ఏమైనా ఈ రీసర్చ్ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్..చాలా టైం కూడా పడుతుంది, కానీ పూర్తి అయ్యాకా మీరు అన్నట్లు వచ్చే విజయ గర్వం,ఆనందాలతో సరిసమానమయినది ఏదీ లేదు..

Chari Dingari said...

HCU naa...me too, I did my M.Sc. there...

WitReal said...

ఐదేళ్ళలో సేసారంటే, మాంచి స్పీడ్ గా సేసినట్టే!

ఒక ఆటోవోడు కాంపస్ లో దారి తప్పి, అటుగా వొస్తున్న పి.హెచ్.డి స్టూడెంట్ ని "బయటకి ఎలా వెల్లాలి" అని అడిగాట్ట.

దానికా స్టూడెంట్, "అది తెల్వక ఏడెల్లనించి ఎతుక్కుంటున్నా బాబు", అన్నాట్ట! ;)

btw, పి.హెచ్.డి టైంపాస్: phdcomics site

శ్రీలలిత said...

డాక్టరేట్ వచ్చాక ఈ కష్టాలన్నీ దూదిపింజల్లా కనిపిస్తాయి కదా..
అభినందనలు.

వాత్సల్య said...

ఈవిడ బ్లాగేమిటి ఇలా ఉంటుంది అనుకున్నా.. Permanent Head Damage క్యాండేటు కదా..అదన్నమాట సంగతి..



"ఏదో సరదాకి" అన్ననండీ అలమారు Dr.సౌమ్య గారూ..కోపంతో మీ బ్లాగ్బాణాలు నా మీద ఎక్కు పెట్టకండి బాబోయ్.5 సంవత్సరాలలో ఇంకా బోలెడు సంఘటనలు జరిగుంటాయి కదా.అన్నీ రాయండీ భాగాలు భాగాలుగా.

నేనూ కొన్ని పుస్తకాలు "ఎక్స్ రే లు" తీయించుకుని చదివిన బాపతే :).

krishna said...

కుమ్మేసారు :)
కంటిన్యూ....

శివరంజని said...

సౌమ్య గారు మీ Ph.d కష్టాలు అన్ని ఉన్నాయా??.. మీ కు కోపం తెచ్చుకోనంటే ఓ మాట అడుగుతా ?? ఏవండీ జీరాక్స్ సైడులు కట్ అయి పోవడమే కాదు ఒక్కొకసారి బ్లాక్ గా కూడ వస్తుంది .ఎంత నవ్వొచ్చిందో ఈ జీరాక్స్ టాపిక్

నేను ఇలాగే ఒకసారి సార్ చాంబర్ లో ఉన్నారా అని అడగకపోయి పొరపాటున సాంబార్ లో ఉన్నారా అని అడిగా అప్పుడు చూడాలి మా ఫ్రెండ్స్ సారేమన్నా వంకాయా , ములక్కాడ , గుమ్మడికాయ అని ఎన్ని వంకలు పెట్టారో .

Anonymous said...

పప్పూ సార్, డిస్‌జాయింటే అండి, జాయింట్ ఊడి పక్కన పడిపొతే, సైకిల్ మీద మోసుకెళ్ళారు అంట, తరువాత పక్కనే ఉన్న మెకానికల డిపార్ట్మెంట్ వారు వచ్చి ఫెవీకాల్ వేసి అతికించారు.

@విత్ రియల్ :D

సౌమ్యగారు డాక్టరా, నాకు తెలియదే, హయ్యో, మొన్న అనవసరంగా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళానే, ఇక నుంచి వైద్యం ఫ్రీ ఐతే నాకు..

ఆ.సౌమ్య said...

@జ్యోతి గారు
ధన్యవాదములు
చూసారా చూసారా....ఒక్కసారి చదివితేనే మీకు జెరాక్స్ కి, ఎక్స్-రే కి ఇంత కంఫ్యూజ్ అయిపోయారు. మరి ఎప్పుడూ జిరాక్స్ లు చదివే నేనంత కంఫ్యూజ్ అయిపోవాలి చెప్పండి, అర్థం చేసుకోరూ ఊ ఊ!

తల్లీ మీకో పుణ్యం ఉంటుంది, నాకు కొత్త పేరేం పెట్త్టకండి బాబూ. సౌమ్య ల మధ్య కంఫ్యూజన్ ఉండకూడదనే కదా "ఆ.సౌమ్య" అని రాస్తున్నాను ఈ మధ్య....మళ్ళీ ఈ జెరాక్స్ సౌమ్య అని ఎందుకు ఊ ఊ?

@సవ్వడి
Thanks!
నేను Economics లో PhD చేసానండి. Permanent head damage అయిపోయాక ఎవరు మాత్రం ఏం చేస్తారండీ....ఉద్యోగం వెలగబెడుతున్నాను.

@రవి
మీ అన్ని తెలివితేటలు నాకు లేవు కాబట్టే నేను దొరికిపోయాను :)

ఆ.సౌమ్య said...

@పప్పు సారూ
అబ్బ అదేనండీ డిస్‌లొకేట్ అయింది, పొరపాటున డిస్‌జాయింట్ అని రాసాను. బాబూ ఫొటోకాపీలనాలని, జెరాక్స్ అంటే ఆ మిషనని మాకు తెలుసండీ. కానీ అందరూ జెరాక్స్ అనే అనేస్తారు..అందుకే అలాగే అలవాటయింది. కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడం మీకు బాగా అలవాటయిపోయింది సుమండీ :).
పి.హెచ్.డి ఎన్నేళ్ళేమిటండీ...ఓపికుంటే ఎన్నేళ్ళయినా చెయ్యొచ్చు. రకరకాల సమస్యల వల్లా పదేళ్ళు పి.హెచ్.డి చేసినవాళ్ళు కూడా ఉన్నారు.
వైకుంఠపాళి నచ్చిందా....Thanks!
అవునండీ ఫలితం చూసుకున్నాక పడ్డ కష్టాలన్నీ మరచిపోతాం.


@ నాగార్జున
మీ గైడ్ ఏమీ అనరా.....ఆహా ఎంత అదృష్టవంతులు మీరు! నూటికో, కోటికో అలాంటి గైడ్ దొరుకుతారు, అందరికీ సాధ్యమా.

జెరాక్స్ సౌమియా....బాబోయ్ ఏమిటండీ ఈ పుకార్లు! అల్లప్పుడెప్పుడో మీ పేరు ని వెక్కిరించానని, పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇప్పుడు నా మీద ఇలా పుకార్లు పుట్టిస్తారా హన్నా!

ఆ.సౌమ్య said...

@రామకృష్ణ
ధన్యవాదములు.
అవునండీ మొదట నవ్వులాటగా ఉన్నా, చాలా కష్టపడాల్సి వస్తుంది. చివరికి సంతృప్తి దొరుకుతుంది. అదే వైకుంఠపాళీ మహిమ :)

@dnc
oh wow...nice to meet you.
మీరు ఏ year లో M.Sc. చేసారు?

@విట్ రియల్
ధన్యవాదములు.
అవునండీ ఐదేళ్ళు అంటే వేగంగానే అయింది అని అందరూ అంటూ ఉంటారు...కానీ నాకు మాత్రం ఐదు యుగాలయినట్టు ఉంటుంది.

హ హ హ మీరు చెప్పిన జోక్ బావుంది. ఇలాంటివి చాలా ఉన్నాయండి. పి.హెచ్.డి జోక్స్ అని కూడా ఒక సైట్ ఉంది.

ఆ.సౌమ్య said...

@రిషి
హమ్మ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, నా మీద సెటైర్ వేద్దమా అని ఎదురుచూస్తున్నారా...ఇదేం బాలేదు సుమండీ. నా మీద మీరు ఒక సెటైర్ వేస్తే నేను మీమీద మూడు వేస్తా, మీరు రెడీ యా? :)
ఓహ్ ఒకటా, రెండా...బోల్డు జరిగాయండీ ఇలాంటివి.....తప్పకుండా రాస్తాను, చదివే ఓపిక మీకుండాలేగానీ:). thanks!

@కృష్ణ
Thanks!

నేను said...

PHD valla mee head damage avvaledu anukunta. aa mokaali chippapagilinapudu damage ayyindemonani naa doubt :D

.. (rendu kanneeti chukkalu, mee phd kastaalaki )
00 (rendu aananda bhashpaalu, mee doctorate ki ) :P

ఆ.సౌమ్య said...

@శివ రంజని
హిహి అవునండీ జిరాక్స్ ఒక్కోసారి బ్లాక్ గా కూడా వస్తుంది :)
హ హ హ మీ జోక్ ఇంకా బావుందండీ...సార్ సాంబార్ లో ఉండడం..కేకో కేక!

@తార
బూరా...నీకు వెటకారాలెక్కువయ్యాయి...తగ్గు తగ్గు, లేకపోతే తవికాస్త్రం సంధించాల్సి ఉంటుంది ఆ :)

ఆ.సౌమ్య said...

@బద్రి
హహహహ అంటే మోకాలి చిప్ప పగిలినప్పుడు సగమే డేమేజి అయింది PhD పూర్తయ్యేసరికి
మొత్తం డేమేజి అయిందన్నమాట :)

మీ కన్నీటి చుక్కలకీ, ఆనంద భాష్పాలకి చాల చాలా ధన్యవాదములు.

రాజ్ కుమార్ said...

Sooper post soumyagaru...
chaala bagundi...

సవ్వడి said...

సౌమ్య! economics లో చేసారని నాకు తెలుసు. మీరు తీసుకున్న టాపిక్ ఏంటని అడుగుతున్నాను. accounts, economics లోతుకెళ్ళేకొద్దీ చాలా బాగుంటాయి. అందుకే అడుగుతున్నాను.

హరే కృష్ణ said...

LOL
చాలా బావుంది సౌమ్య గారు

ఆ.సౌమ్య said...

@వేణురాం
ధన్యవాదములు

@ హరే కృష్ణ
Thanks!

ఆ.సౌమ్య said...

@ సవ్వడి
నేను Macroeconometric modelling లో చేసానండి. Macroeconomics, modelling, public economics నా
specializations.
ఇంకా వివరంగా కావాలంటే నాకు మైల్ చెయ్యండి....తప్పకుండా చెబుతాను.

WitReal said...

అద్దిరిబన్నా! ఇప్పుడర్ధమయ్యింది stagflation ఎందుకొచ్చిందో!

మోకాలికి దెబ్బ తగిలించుకున్న macro economics PhDల వల్ల! ;)

ఆ.సౌమ్య said...

@ విట్ రియల్
హిహిహి మీరు ట్యూబ్ లైట్ అనుకుంటా.....అన్నీ లేట్ గా వెలుగుతాయి :)

వేణూశ్రీకాంత్ said...

హ హ జిరాక్స్ ఎక్స్ రే సూపర్ అనుకుంటే చాంబర్ సాంబార్ ఇంకా అదిరింది :) పోస్ట్ బాగుంది సౌమ్య గారు.

ఆ.సౌమ్య said...

@వేణూ శ్రీకాంత్
ధన్యవాదములు
చాలారోజులకి దర్శనాలు. అంతా సౌఖ్యమేనా?

సి.ఉమాదేవి said...

నిజమే!ఆ కష్టాలలో పాలుపంచుకున్నవారికీ ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.ప్రొఫెసర్ గారి ఇల్లాలిగా వారి అనుభవాలను మరోమారు ఇరువురము తలచుకునే అవకాశం కలిగించింది మీరు సరదాగా రాసిన పి.హెచ్.డి కష్టాలు.

ఆ.సౌమ్య said...

@ఉమాదేవిగారూ
ధన్యవాదములు. మీ ప్రొఫెసర్ గారు కూడా ఇలాగే బహు కష్టాలు పడి ఉంటారు కదా!
అయితే మీ తీపి జ్ఞాపకాలు నెమరువేసుకోవడానికి నా పోస్ట్ ఉపయోగపడిందన్నమాట...చాలా సంతోషం :)

శ్రీలలిత said...

డాక్టరేట్ చేతికొచ్చాక ఈ కష్టాలన్నీ దూదెపింజెల్లాగ తేలిపోతాయిగా..
అభినందనలు..

Anonymous said...

సౌమ్య గారూ
మీ post చాలా బాగుంది. నవ్వాపుకోలేకపోయాను. ఇప్పుడు admmissions time అండీ బాబూ, మళ్ళీ కష్టాలు.. స్టార్ట్..hmmm dc ready chestuunnaam

మాలా కుమార్ said...

మీ కష్టాలు బాగా రాసారండి . వైకుంఠపాళి బాగుంది .

ఆ.సౌమ్య said...

శ్రీ లలిత
అవునండీ, డిగ్రీ చేతిలో పడ్డాక కష్టాలనీ ఉష్ కాకి :)
ధన్యవాదములు.

@కృష్ణ
ఎక్కువగా నవ్వకండి, మీకూ ముందుంది ముసళ్ళ పండుగ. ధన్యవాదములు, ఓ DC రెడీ చేస్తున్నారా, ఫ్రెషర్స్ కా? ఆహా i am missing all those things.
మీరు ఇవన్ని చెప్పి నాకు రోజులని మళ్ళీ గుర్తు చేసారు. Thanks :)

@ మాల గారు
కష్టాలు బాగా రాసానా...మరి పడ్డాను కదండీ అందుకే బాగా రాసుంటా :P
ధన్యవాదములు.

స్నిగ్ధ said...

ఏంటా సౌమ్య గారి దగ్గర నుంచి కొత్త పోస్ట్ రాలేదే అని అనుకుంటున్నాను.ఇంతలో మీ కొత్త పోస్ట్ చదివే భాగ్యాన్ని కలిగించారు...
ముందుగా మీ పి.హెచ్.డి పూర్తి అయ్యినందుకు శుభాభినందనలు..(మరో మాట మీ Permanent Head Damageని తగ్గించుకున్నందుకు అభినందనలు) :)
మీ వైకుంఠపాళీ బాగుందండీ..కానీ ఒక్క సారి స్టూడెంట్ లైఫ్ ని గుర్తుకు తెచ్చారు..ఆ టైం లో మనం పడ్డ టెన్షన్లు, బాధలు, సరదాలు, సంతోషాలు, సాహసాలు అన్నీ మనం అనుకున్న ఫలితాన్ని సాధించినప్పుడు కలిగే ఆనందం ముందు దిగదుడుపేనండీ...ఏమంటారు??

అడగడం మర్చిపొయా మీ జిరాక్స్ లో ఏమీ negativeగా తేలలేదు కదా..
:)

gajula said...

dr.a.soumyaku all the best,inka futurelo mimmulanu etuvanti kashtaalu emi cheyyalevu (phd kashtaalatho poliste avi oka lekka)

ఆ.సౌమ్య said...

@స్నిగ్ధ గారూ
వచ్చారా, అదే ఏంటా మీ కామెంటు రాలేదు అని చూస్తున్నా :)
మీరింతగా ఎదురుచూస్తున్నారని తెలిస్తే పూటకో టపా రాసిపారేయనూ (అలా అని అడక్కండి బాబోయ్...ఊరికే అన్నా):P

మీ అభినందనలకి ధన్యవాదములు :)
అవునండీ, ప్రతీ మనిషికీవిద్యార్థి దశ మధురాతి మధురం. నా టపా మీ పాత జ్ఞాపకాలకు మేల్కొలిపినందుకు సంతోషం.
జిరాక్స్ లో నెగటివ్ ఏమీ రాలేదండీ.....అంతా పాజిటివ్ :D

@గాజుల
థాంక్సండీ, బాగా చెప్పారు ఆ కష్టాలతో పోలిస్తే మిగినవి కూరలో కరివేపాకులాంటివి :)

Kalpana Rentala said...

సౌమ్య ,
వైకుంఠపాళి బావుంది. మీ పి. హెచ్. డి. కష్టాలు చదివి తెగ నవ్వుకున్నాను. ఇంతకూ ఎముకలు, జెరాక్సులు అన్నీ సౌఖ్యమేనా?

ఆ.సౌమ్య said...

@ కల్పన
నా కష్టాలు మీకు నవ్వులాటగా ఉన్నాయా :P
అన్ని సౌఖ్యమేనండీ, బాగానే నడవగలుగుతున్నాను ఈ నాటికీ
కామెంటు రాసినందుకు ధన్యవాదములు

స్నిగ్ధ said...

మీరు పోస్ట్ రాయడం దానికి మేము కామెంట్ పంపకుండా ఉంటామా చెప్పండీ...

:)

ఆ.సౌమ్య said...

@స్నిగ్ధ
Thank you so mcuh!
మీ అభిమానానికి కృతజ్ఞతలు :)
మళ్ళీ ఏ అజ్ఞాతలైనా వచ్చి గొడవపెడతారేమో :P

Unknown said...

evandi nenu kuda hcu studentne andi..
meeru phd delhi ani pettarendukandeee...?
meeru yae earlo vunnarandi hculo..

ఆ.సౌమ్య said...

@చంద్రకళ గారూ
మీది HCU నేనా...wow, great...nice to meet you!
నేను 2009 వరకు HCU లోనే ఉన్నానండీ. మీరు ఏ year లో ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్?

లేదండీ PhD, Delhi నేను అని పెట్టలేదు. current location:Delhi అని పెట్టాను :)

హను said...

nijame anDi chala kashTame, kaani tappadu mari

ఆ.సౌమ్య said...

@ హను
అవునండీ....ఎలాగో నెట్టుకొచ్చాం!
ధన్యవాదములు :)

Vinay Chakravarthi.Gogineni said...

baagundi..........
my advisor very cool guy.

so whats the next step? pdf or any other?

by the way naa dc member Prof.srinisivasa chakravarthi (saastra vignanam blog)

u could have given the links to your papers.

forgot to say "congrats"

ఆ.సౌమ్య said...

@వినయ్
ధన్యవాదములు
ఓహ్ చక్రవర్తిగారు మీ D.C మెంబరా ...భలే, గురుశిష్యులిద్దరూ బ్లాగుల్లో...బావుంది :)

థాంక్స్...పేపర్లు అవి అంటే...మన గొప్ప మనమే చెప్పుకోవడమెందుకని ఇవ్వలేదు :P

PDF తరువాత చేద్దామనే ఆనుకుంటున్నాను ప్రస్థుతానికి.

thanks!

Vinay Chakravarthi.Gogineni said...

hey dont think like that.......i want to have a look.....upload yaar

ఆ.సౌమ్య said...

@vinay
ok, i will :)

..nagarjuna.. said...

DC అనగా doctoral committee అనా..?

BTW శ్రీనివాస్ చక్రవర్తి గారు ప్రొఫెసరా...? నాకు ఇంతవరకు తెలియదు!!

ఆ.సౌమ్య said...

@4E
అవును DC అనగా doctoral committee

Vinay Chakravarthi.Gogineni said...

ya professor in IIT Madras(bio-tech dept.

చందు said...

late ga chadivina latest stroke ichcharu ......navvaleka chachchaanandi ....

:))))))))


naku bhayamesthondi mee Phd badalu chusthunte !!!!!!!

ఆ.సౌమ్య said...

@సావిరహే
ధన్యవాదములు :)
భయపడకండి, సుఖాలు కష్టాలు ఒకే పేకేజీలో వస్తాయి మరి, రెంటినీ ఆదరించి అనుభవించాల్సిందే !

వాత్సల్య said...

ఎటెళ్ళిపోయారు ఈ మధ్య?

ఆ.సౌమ్య said...

చిన్న బ్రేక్ తీసుకున్నా...నా నుండి మీ అందరికీ కాస్త విశ్రాంతి కలిగిద్దామని :D
ఇప్పుడొచ్చేసాగా, ఇక మీకు no rest :P

karthik said...

మా హాస్టల్ కూడా చాలామంది డామేజ్ అయిన జనాలు ఉండేవాళ్ళు, అందరూ ఎప్పుడు చూసినా ల్యాబులో బుర్ర పగలగొట్టుకునే వాళ్ళు.. మేము మాత్రం వాళ్ళ పక్కనే కూర్చుని సినిమాలు గట్రా చూసేవాళ్ళం.. దేనికైనా రాసి పెట్టి ఉండాలి ;)

ఆ.సౌమ్య said...

@కార్తీక్
హుం అయితే తప్పించుకున్నావన్నమాట, త్వరలో నీ బుర్ర కూడా డేమేజ్ అయ్యే అవకాశం కలుగుగాక. :P

Unknown said...

really funny incidents!!! right now am doing phd in UK ....

ఆ.సౌమ్య said...

@srinath
Thanks!
ఓహ్ మీరు పి.హెచ్.డి చేస్తున్నరా...అయితే మీకు ఎదురవుతాయి ఇలాంటి సన్నివేశాలు :) ...all the best!

Nagaraju said...

visit my blog

gsystime.blogspot.com

universal informatin

thanks,
nagaraju