మా యూనివర్శిటీలో ఆర్థికశాస్త్ర విభాగంలో ఒక లెక్చరర్ ఉండేవారు/ఉన్నారు. ఆయన్ని సూక్ష్మార్థికశాస్త్రం అంటే ఏమిటి అని అడిగితే అవి కాయలా పళ్ళా అని మనల్ని ఎదురుప్రశ్నడుగుతాడు. కొందరు పనికిమాలిన పెద్దల పంచనచేరి, మసి పూసి మారెడుకాయజేసి యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. గవర్నమెంటు ఉద్యోగాల్లో ఒకసారి చోటు సంపాదించాక అక్కడనుండి వాళ్ళని కదపడం బ్రహ్మతరం కాదు. ఈ సదరు వ్యక్తికి పొట్టవిప్పితే పేగులేతప్ప అక్షరం ముక్క కనపడదాయే, మరి నలుగురు మధ్య గుర్తింపు పొందడమెట్లా? విద్యార్ధులను బుట్టలో వేసుకోవడమెట్లా? ఒకానొక మండుటెండవేళ, ఆచ్చి మసాలాలాంటి ఘాటైన మాయోపాయం తట్టిది గురుడికి. పుస్తకాలు రాసిపారేద్దామని గాఠ్ఠిగా నిర్ణయించేసుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక తలకుమాసిన పబ్లిషర్ ని పట్టుకుని, ఇంకో నలుగు పనిలేని వెధవాయిలచేత ఆర్టికల్స్ రాయించి ఈయనగారు ఆ పుస్తకాన్ని చించి(ఎడిట్)అవతలపారేసారు. దుడ్డు తో బాది, ఘనులను రప్పించి, పుస్తకావిష్కరణ కార్యక్రమం సశేషంగా జరిపించీసేడు. ఇక అసలు విషయమేమిటంటే, ఆ పుస్తకం తెరవగానే మనకి కనబడేది...
పుస్తకం పేరు
సదరు వ్యక్తి పేరు
Faculty in Economics అని ఉండవలసిన చోట Faulty in Economics అని అచ్చు పడింది. ‘C’మిస్ అయింది. ఇంకేముంది అచ్చుతప్పు అతనికి సరిగ్గా అన్వయమయింది.
ముఖ్య గమనిక: ఈ పుస్తకం, దేశంలో ఉన్న అన్ని గ్రంధాలయాలకు ఉచితముగా ఇవ్వబడింది.
వెల: 450 రూ.
బరువు: అరకేజీ
పదార్ధము: మేడిపండు
ఈ సందర్భంలో రమణగారు అదేనండి మన ముళ్ళపూడి వెంకటరమణగారు గుర్తొస్తున్నారు, ఎందుకంటారా...
1960 లో తన ౠణానందలహరి పుస్తకం ఫస్ట్ ఎడిషన్ వెలువడింది. ఆ కాపీని ఇచ్చేటప్పుడు దానిపై అచ్చుతప్పులతో, అభినందనలతో అని రాసి మరీ సంతకం చేసి ఇచ్చారట ఆ గ్రంధకర్త శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ-కొంత వరకైనా పాప పరిహారం అవుతుందని.
ఒక్కోసారి అలవాటులో చిన్న చిన్న పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. నిర్వచనోత్తరరామాయణం అట్టమీద పద్యకావ్యం అని బ్రాకెట్లో ప్రచురించారట.
రెండవ టపాలోనే అచ్చుతప్పుల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఒకవేళ ఎప్పుడైనా నా టపాలలో అప్పుతచ్చులు దొర్లితే మీరు సంయమనం పాటించగలరని.
9 comments:
మొదటి టపాలోనే, కోపడ్డకండేం, శెలవు, కరట్టులు లాంటి తప్పులన్నీ టైపించేసి, తప్పించుకోవడానికి ఈ టపా రాశారన్నమాట. ఎంతైనా మీ లెక్చరర్‌కు తగ్గ శిష్యురాలు అని నిరూపించుకున్నారు. :) :) :)
సంయమనం అంతా మేము పాటించం. మీ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు కుర్చుంటాం అంతే :)
"Faulty in Economics" --- hahahahahahaha.... దేవుడు పై నుంచి చూడడూ మరి?
@ నాగ ప్రసాద్
మీలాంటివాళ్ళు ఉంటారని తెలిసే ఈ పోస్ట్ వేసాను. నా లక్ష్యం నెరవేరింది....హి హి హి
బాబోయ్ అంతమాటనీకండి, ఆ గురువుగారి దగ్గర నేను చదవలేదు నా అద్రుష్టం బావుండి :)
అధ్యక్షా మీ పని మన ఆస్పత్రి లో చెప్తాను :)
@wanderer
మరే...తగినశాస్తి జరిగిందని బాగా నవ్వుకున్నాం మేమంతా !
"Faulty in Economics"
super coincidence!!
"Faulty in Economics" Super.
@కొత్త పాళీ, karthik
thanks :)
Post a Comment