StatCounter code

Wednesday, December 14, 2011

పొట్టి నవ్వులు - BUZZ సీరీస్ 1

ఆమధ్య బజ్జులొచ్చి బ్లాగులని మింగేసాయని కొందరు...లేదు, కాదు బజ్జుల వల్ల మంచే జరిగింది అని నాలాంటి వారు కొందరు చిన్న చిన్న వాక్బాణాలు విసురుకున్నాం కద! సుజాతగారైతే (మనసులో మాట) ఏకంగా బజ్జా? బ్లాగా? అని పోస్ట్ కూడా పెట్టేసారు.

ఇప్పుడేమో గూగలోడు బజ్జు మూసేస్తున్నానొహో అని ప్రకటించేసాడు. మా అందరికీ ఒకటే ఏడుపొచ్చేసింది. సరే ఇంక చేసేది ఏమీలేక బజ్జులో జరిగిన కొన్ని సరదా విషయాలు బ్లాగులో పంచుకుందామనే మొదటి ప్రయత్నం ఇది.

బజ్జు సీరీస్-1

"మన గురువుగారు బులుసుగారు ఒకరు తిన్నగా ఉండరు కదా...ఎప్పుడో ఏదో ఒకటి చెప్పి మనల్ని నవ్విస్తూ ఉంటారు. ఇప్పుడేమి చేసారంటే...నవ్వులని కుదించారు....బ్లాకెట్ల కొలతలు కొలవలేక విసుగొస్తున్నాదట అందుకని. సరే గురువుగారు కదా అని రాజ్, నేను చేతులు కలిపాం. "తెలుగులోనే నవ్వుదాం. బ్రాకెట్లలో వద్దు" అన్న నినాదం తో పని మొదలెట్టాం. అదెట్లనిన.....

చి.న = చిరునవ్వు
మ.హా = మందహాసం
ద.హా = దరహాసం
అ.హా = అట్టహాసం
వి.టా.హా = వికటాట్టహాసం
బా.హా. = బాలయ్య హాసం
సు.చి.న = సుమన్ చిరునవ్వు
రా.న = రాక్షస నవ్వు
కో.న - కోతి నవ్వు
బి.న = బిస్కట్ నవ్వు (అర్ధం కాలేదా? మీ పెట్ డాగ్ ముందు కూర్చొని బిస్కట్ తింటూ దాని వైపు చూడండి..యెస్..అదే ..)

ఇంకా మీకేమైనా తడితే కలుపుకోవచ్చు.

మా గురువుగారు ఇకనుండి ఇవి మాత్రమే ఉపయోగిస్తానని శపధం చేసారు. వారి శిష్యులలో అగ్రగణ్యులమైన మేము (అదంతే మమ్మల్ని మేమే పొగుడుకుంటాము :P)...వారి అడుగుజాడలలోనే నడవాలని నిశ్చయించుకున్నవారమై ఇవే ఉపయోగించబోతున్నాం. మరి మీరు?"

ఈ విధంగా మొదలయ్యిందండీ బజ్జులో ఈ పొట్టినవ్వుల ప్రహసనం...అంతే ఇంక మన జానాలు విజృంభించారు చూడండీ...నేనేం చెప్పను, మీరే చదవండి :)

దు.హా = దుఃఖహాసం (సుమన్ బాబు సినిమాలు చూసేటప్పుడు వచ్చేది)
పి.న - పిచ్చి నవ్వు (సుమన్ బాబు సినిమా చూసిన తరువాత వచ్చేది)
ప.న = పగలబడి నవ్వు
వె.న1 = వెకిలి నవ్వు
న.న.న - నవ్వలేక నవ్వే నవ్వు
కిం.ప.దొ.న కింద పడి దొర్లే నవ్వు (ఇది పాతదే, కొత్తగా కలుపుతున్నా)
ఎ. న - ఎదవ నవ్వు. (మన మ్యానేజరు ని చూసి నవ్వేది)
శు.హా = శుష్క హాసం
కె.న = కెవ్వు నవ్వు
ఏ.న = ఏడవలేక నవ్వు
పొ.ప.న = పొట్ట పగిలేటట్టు నవ్వు
ఏ. న. న = ఏడ్చినట్టు నవ్వే నవ్వు (మన హీరో సుమన్ బాబు లాగా)
కొం.న = కొంటె నవ్వు
చ.న.న = చచ్చినట్టు నవ్వాల్సిన నవ్వు (బాసు జోక్ కి మనం నవ్వే నవ్వు)
అ.భ.అ.పూ.న = అవమాన భరిత అవహేళనా పూర్వక నవ్వు (దుర్యోధనుని చూచి ద్రౌపది నవ్విన నవ్వు)
దీన్నే
కొం.కూ.న/కొం.అం.న = కొంపలు కూల్చే/అంటుకునే నవ్వు అని కూడా అనవచ్చు.

వె.న2 = వెర్రి నవ్వు
టి.అ.న = టివీ అనౌన్సర్ నవ్వు
చిపి.న = చిలిపి నవ్వు
వి.న = వికీ నవ్వు (మన నవ్వుకి ఎవడో వివరణ ఇస్తే అది వికీ నవ్వు)
అ.న.న = అనుమానంగా నవ్వే నవ్వు
ఏ.పో.మ.న = ఏడుస్తూ పోనీ మన మంచికే అనుకునే నవ్వు
అప.హా = అపహాస్యం
అ.భ.అ.పూ.న = అవమాన భరిత అవహేళనా పూర్వక నవ్వు

ఈ అ.భ.అ.పూ.న వెనుక చిన్న కథ ఉంది. నేను పోస్ట్ వేస్తున్నప్పుడు "గురువుగారి" అని రాయబోయి "గురువుగాడి" అని పొరపాటున రాసాను. అది చూసి బులుసు గారు ఒక వె.న నవ్వి "గాడి" అని చూసి నేను ఏ నవ్వు నవ్వాలి? అని అడిగారు. నేనందుకు ఇంకో చిన్న నవ్వునవ్వాననమాట. నేను నవ్విన ఆ నవ్వుకి గురువుగారు "అ.భ.అ.పూ.న" అని నామకరణం చేసారు. :D

ఇదయ్యాక బులుసుగారికి ఇంకో ఐడియా వచ్చింది అదేంటంటే: యథాతథంగా క్రిందన

"Bulusu Subrahmanyam - మరేమో నే ఇప్పుడేమో మనం శ్రీకృష్ణ రాయబారం నాటకం వేస్తామన్నమాట . మరేమో నే మీ అందరూ నన్ను బలవంత పెడితే, పెట్టండి మరి, నేను శ్రీకృష్ణుడి వేషం వేస్తానన్నమాట. ఎవరో కింద పడిపోయారు. లేపండి అక్కడే కాలుతుంది. మీరందరూ బలవంత పెడితే కదా నేనొప్పుకుంట. అప్పుడేమో నాటకం అయిన తరువాత, మీరందరూ నన్ను మెచ్చుకుంటూ నవ్వే నవ్వు ని మెహా అని కానీ మెన అనీకాని అనాలి కదా మరి.

sowmya alamuru - మెహా, మెన.....ఈ నవ్వునకర్థమేమి గురువర్యా??????????
మెంటల్ హాసం, మెంటల్ నవ్వు అని కాదుగదా (దొ.న)

Bulusu Subrahmanyam - మెచ్చుకుంటూ నవ్వే నవ్వు

Bulusu Subrahmanyam - సౌమ్యా.. కోప హాసం కో.హా"

అంటూ కోపాన్ని ప్రకటించారన్నమాట :) దానితో మె.న, కో.హా కూడా చేరాయి.

పై అన్ని నవ్వులను క్రియేట్ చేసినవారిలో ప్రముఖులు బులుసుగారు, రాజ్ కుమార్, శంకర్ గారు మరియు నేను. గిరీష్ కూడా కొన్ని నవ్వులు చేర్చారు.

ఇదిలా జరుగుతుండగా పప్పు శ్రీనివాసరావు గారు ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు వచ్చారు. ఆయనొచ్చాక జరిగిన తమాషా సంభాషణ ఇక్కడ:

"pappu sreenivasa rao - ఎహే ఆపండీ గోల (ఎ.ఆ.గో)

Bulusu Subrahmanyam - వెన, ననన...అంటే శ్రీనివాస రావు గారూ గోలలకి స్థానం కల్పిద్దామా అని నా ఉద్దేశ్యం

sowmya alamuru - గోలలకి తావు లేదు...నవ్వులొక్కటే ఉండాలి

pappu sreenivasa rao - నవ్వుల గోలన్నమాట (న.గో)

Bulusu Subrahmanyam - కొంచె మార్చండి సారూ గోల నవ్వు - గోన సమూహం గా అందరూ కలిసి బలవంతాన నవ్వే నవ్వు అనుకుందామా హాస్య క్లబ్బుల్లో లాగా. "

అలా గో.న కూడా లిస్ట్ లోకి చేరిపోయింది.

ఇది ఇక్కడితో ఆగలేదు. ఇంక అందరూ బజ్జులో ఈ పొట్టినవ్వులనే ఉపయోగించడం మొదలెట్టారు. కొందరికిన్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉండడంతో నేను మళ్ళీ ఒక పోస్ట్ వేసాను.

"బజ్జు జనాలందరికీ పొట్టి గుర్తులతో కాస్త తికమకగా ఉన్నదని వార్త అందింది...అంచేత ఇప్పటివరకూ పోగయినవాటన్నిటినీ క్రోడీకరించి ఇక్కడ పెడుతున్నా. ఇకనుండి మీకు ఎప్పుడు ఏ డౌటు వచ్చినా ఈ బజ్జుని రిఫరెన్స్ గా వాడుకోవచ్చు."

అంటూ మొత్తం అన్ని నవ్వులనూ ఒకచోట చేర్చాను. కథ అక్కడే ఆగిపోతే అది మన జనాలా అల్లరి ఎలా అవుతుంది? మళ్ళీ మొదలెట్టారు.

మె.హ = మెచ్చుకుంటూ నవ్వు
కో.హా = కోప హాసం
గో.న = గోల నవ్వు
బో.న = బోసి నవ్వు
తి.న = తిట్టుకుంటూ నవ్వు
తిం.న = తింగరి నవ్వు
క.గీ.న = కన్నుగీటుతూ నవ్వు
గొ.న = గొర్రె నవ్వు
ఆ.భా.న = ఆనందభాష్పాలతో నవ్వు
వి.న = విలన్ నవ్వు
పొ.న = పొగరుబోతు నవ్వు
హే.న= హేళనగా నవ్వు
గ.న = గర్వంతో నవ్వు
ద్రౌ.న. = ద్రౌపది నవ్వు
త.తా.న = తలకాత తాటిస్తూ నవ్వు

ఇంతలోనేమో వేణూ శ్రీకాంత్ వచ్చి అ.భ.అ.పూ.న కొంచెం గజిబిజి గా ఉందండీ.. దీన్ని ద్రౌ.న. (ద్రౌపది నవ్వు)గా మార్చాలని అభ్యర్ధించారు. అభ్యర్థనని మన్నించి అ.భ.అ.పూ.న ని ద్రౌ. న గా మార్చేసాం.

అలాగే తి.న, తిం. న నవ్వుల వెనుక కథ:

"Bulusu Subrahmanyam - ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం. మనకి రావాల్సిన ప్రోమోషన్ పక్క వాడికి వచ్చింది. వెధవ, పార్టీ కూడా ఇస్తున్నాడు. అక్కడ మనం లోపల తిట్టుకుంటూ పైకి నవ్వే నవ్వు తినన తిట్టుకుంటూ నవ్వే నవ్వు. ఇది మరో రూపం లో వచ్చిందా సంపాదక మహాశయా.

sowmya alamuru - తినన రాలేదు గురువుగారూ...కలిపేస్తా ఇప్పుడే. దాన్ని తిన చేసేస్తా.

Bulusu Subrahmanyam - తింగరి నవ్వు తిన అని అనుకున్నట్టున్నాము

sowmya alamuru - తింగరి నవ్వు లేదు...అదీ కలిపేపెస్తా ....తిం.న"

ఈ గోల ఇలా జరుగుతుండగా V.B.సౌమ్య వచ్చి ఒక పొగడ్త విసిరారు.

"Sowmya V.B. - మీరు పదాల కూర్పే కాక, జనాల మధ్యలోకి తీసుకురావడానికి కూడా ఇతోధికంగా కృషి చేస్కుంటున్నారనమాట. (క.న - కన్నుగీటుతూ నవ్వు)"

ఈ క. న ని కొంచం మార్చి క.గీ.న గా లిస్ట్ లో పెట్టేసాం.

అలాగే వేణు శ్రీకాంత్, రెహ్మాన్, శ్రీనివాస్, సంతోష్, కల్లూరి శైలబాల, వరూధిని గారు, మధుర, కొత్తావకాయ, నైమిష్ గారు, అపర్ణ మున్నగువారందరూ వచ్చి ఇంకాసిన్ని పొగడ్తలు మామీద కురిపించి ఇతోధికంగా కొన్ని నవ్వులు కూడా చేర్చారు.

ఈ మొత్తం ప్రహసనం చూసి మా గురువుగారు ఆనందపరవశులై

"Bulusu Subrahmanyam - 67 ఏళ్లగా నవ్వుతున్నాను కానీ ఇన్ని నవ్వులున్నాయని ఇప్పుడే తెలిసింది.
సౌమ్య కి ధన్యవాదాలు"

అన్నారన్నమట :)

"sowmya alamuru - హహహ గురువుగారూ....అంతా మీ ఆశ్వార్వాదం...నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షి (ద.హా)"

అని గురుభక్తిని చాటుకున్నానన్నమాట :D

అదండీ గమ్మత్తైన పొట్టినవ్వుల కథ!

ఇంత గొప్ప ప్రయోగానికి తెర తీసిన బులుసు సుబ్రహ్మణ్యం గారికి అందరం కలిసి మరొక్కసారి జేజేలు చెబుదాం!

ఇకనుండీ మనందరం కూడా వీలైనంత వరకూ బ్లాగుల్లోనూ, బజ్జుల్లోనూ తెలుగులో నవ్వుదాం, ఏమంటారు? (చి.న)

27 comments:

రాజ్ కుమార్ said...

మళ్ళీ చాలా కాలం తర్వాత రకరకాలు గా నవ్వేను.
ఫైనల్ గా ది భ.న గా రూపాంతరం చెందిందీ
(భయంకరమయిన నవ్వు)

బజ్ సిరీస్ లో నెక్స్ట్ ఏమిటండీ? చాలా వర్క్ చేసినట్టున్నారు ??

G.P.V.Prasad said...

For your Kind Information Buzz is ending by April 2012

శశి కళ said...

mee koka....a.haa....ante yemitaa?
akataatta haasam...ante yemito naaku teleedu....kaaka pote ayyo appudu nenu lene ane baadato adi vachchindi

Gopal said...

మె.హ. అంటే మెహర్బానీ కోసం నవ్వు (లేక మెహర్బానీ హాసం) అనుకున్నాను.

సరే నాకు బజ్జు తెలీదు. కానీ గూగుల్ గాడు బజ్జోపెడుతున్నాడన్నారు కాబట్టి తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు.

వి.హా.

ఛాయ said...

"పో.ప .న . " = ?

రసజ్ఞ said...

ఆ.న.న (ఆపకుండా నవ్వే నవ్వు) వచ్చింది ఇన్ని నవ్వులని చూసి ముమున (ముసి ముసి నవ్వు) కూడా వచ్చింది.

తృష్ణ said...

@raj:మళ్ళీ చాలా కాలం తర్వాత రకరకాలు గా నవ్వేను...:)))

same for this post !
good post sowmya gaaru.

బులుసు సుబ్రహ్మణ్యం said...

విడిన పెదాల చివర చిన్నగా మొదలైన ద.హా కాస్తా మ.హా గా మారి చి.న గా పెరిగి, పెద్దదై అహా చేయించి పొ .ప.న అయింది.

32 పళ్లూ (అన్ని లేవు అని జోకకండి) బయట పడేసి, ఒళ్ళు కదిలి పోయేటట్టు, కళ్ళు మెరిసేటట్టు, అందరూ అన్నివేళలా మనస్ఫూర్తిగా, నిష్కల్మషం గా, నిరభ్యంతరంగా, సిగ్గులేకుండా పడీ పడీ నవ్వుకోవాలని కోరుకుంటున్నాను.

నవ్వే జీవితానికి శ్రీరామ రక్ష.

Kottapali said...

ఇదంతా చదివాక నవ్వాలంటే భయంగా ఉంది!

Disp Name said...

ఆ సౌ , బాకు గారు,
(ఆలమూరు సౌమ్య బాలాకుమారి గారు!)

O = BR Power 2!

బజ్జుల బందు పుణ్యమా అని ఈ 'బజ్జు'మాణిక్యాలు బయట పడుతున్నాయన్న మాట ! నేను విన్న మాట ఏమిటంటే , గురువు గారు బులుసు గారు ఇక బజ్జు ల లోనే నా బ్లాగు ని నడుపుతా నని వాక్రుచ్చేసాక , గూగుల్ వాడికి భయమేసి , బజ్జులని బందు చేస్తానని చెప్పాడని!

మొత్తం మీద బజ్జు బందు ఖబురు పుణ్యమాని బావురు మంటున్న బ్లాగు లకి కొత్త కొత్త టపాలు రావచ్చని భావిస్తాను.

బజ్జులో మాణిక్యాలు మరిన్ని మీ మాయా శశిరేఖ తవ్వి తీయ వలె నని మనవి చేసుకుంటూ చీర్సు సహిత

జిలేబి.

Anonymous said...

బలే! బలే! ఆనంద మానందమాయెనే!

కొత్తావకాయ said...

మె.హా.

సుభ/subha said...

ఇప్పుడు నేనెలా నవ్వాలి? అన్నీ కలిసి ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయండీ.. చి.న.

Ruth said...

ద హా !!!
మె న ఉంది మరి, మొ న (మొహమాటపు నవ్వు) లేదా ???

Anonymous said...

నువ్వు సూపర్ సౌమ్యా .
బజ్ పోయిందని బాధపడుతుంటే ...భలే భలే నవ్వించావు .

Anonymous said...

నిన్ననేచూసాను. కామెంటూ పెట్టేను. సు.చి.ద.హా
( సు రుచిర దరహాసం)( సుర చిరు దరహాసం)

చైతన్య.ఎస్ said...

నెక్స్ట్ సిరిస్ ఎప్పుడండి ??

ఆ.సౌమ్య said...

@ రాజ్
Thanks....మరే మరే, బాగానే వర్క్ చేసాను (ద.హా)
మిగతావా surprise...ఒకదాని తరువాత ఒకటి వస్తాయి, వేచి చూడు!

@గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారూ
బజ్జు ఆల్రెడీ మూసేసాడండీ!

@ శశి గారూ
Thanks (చి.న)
ఇప్పూడూ ఇవి వాడడం మీరు మొదలెడితే మీరు అప్పుడూ ఉన్నట్టే లెక్క (చి.న)

ఆ.సౌమ్య said...

@ D. Venu Gopal said...
బజ్జుని బజ్జోపెట్టేసాదండీ. మా పొట్టి నవ్వులు వాడడం మొదలెట్టినందుకు thanks

@ ఛాయ
పొ.ప.న అంటే పొట్ట పగిలేట్టు నవ్వడం అండీ. అదీ ఉందిగా లిస్ట్ లో.

@ రసజ్ఞ
ముమున బావుందండోయ్!
Thanks!

ఆ.సౌమ్య said...

@ తృష్ణాజీ
Thank you (చి.న)

@ గురువుగారూ
మిమ్మల్ని ఈ పోస్ట్ అంత ఆనందింపజేసినందుకు సంతోషం గా ఉంది (ద.హా)
thanks

@ కొత్తపాళీ గారూ
భయపడకుండా ఎలాగోలా నవ్వేయండి. దానికి మేమేదో ఒక పేరు పెడతాం (కొం.న)

ఆ.సౌమ్య said...

@ జిలేబీ గారూ
హమ్మమ్మా గురువుగారికి అంత పని చేయనిస్తామా! వారెదో బిజీగా ఉండి పోస్ట్ రాయలేదుగానీ. త్వరలో ఒక సూపర్ డూపర్ పోస్ట్ తో మన ముందుకి వస్తారు చూడండి.

మీకు నచ్చిమదుకు సంతోషం...అలాగేనందీ తప్పకుండా బజ్జు మాణిక్యాలన్నీ మీ ముందుకి తీసుకుని వస్తాను.

@ kastephale
మీ రెండు కామెంట్లకూ thanks. మీకు నచ్చినందుకు సంతోషం (చి.న)

@ కొత్తవకాయ
thanks పిల్లా!

ఆ.సౌమ్య said...

@ సుభ గారూ
హహహ...హాయిగా ఎలా కావాలంటే అలా నవ్వేయండి (ద.హా)

@ Ruth
మొ.న....లేకపోతే చేర్చేసుకుందాం, దానిదేముంది (కొ.న)
thanks!

@ లలిత గారూ
మరే మరే, అలా బాధపడుతూ కూర్చోకూడదనే ఈ పోస్ట్ పెట్టాను. మీకు నచ్చినందుకు సంతోషం! (చి.న)

@ చైతన్య. ఎస్
అతి త్వరలోనే (చి.న)

Unknown said...

ఈ పోస్ట్ కి విస్తృతంగా పబ్లిసిటీ ఇవ్వాలి.
సూపర్ పోస్ట్ సౌమ్యగారు. ఇది వరకు నవ్వి ఊరుకునేవాళ్ళం
ఇప్పుడు నవ్వు పేరు చెప్పి నవ్వుతున్నాం.
మీకు బోలెడు ధన్యవాదాలు.

Disp Name said...

కల్లూరి శైల బాల గారు,

ఈ పోస్టుకి విస్త్రుతం గా పబ్లిసిటీ ఇవ్వాలంటున్నారు. చాలా సింపల్. "ప్రవీణూ" అని ఓ కేక పెట్టండి, ఆ పై పబ్లిసిటీ ఎలా పాకుతుందో చూడండీ ! ఎమంటారు సౌమ్య గారు ?

G K S Raja said...

అబ్బ ఇన్ని రకాల నవ్వులున్నాయని నిజ్జంగా తెలియదు. ఇప్పుడూ ఇంకా కిచ కిచ నవ్వులు చాలా కనబడుతున్నాయి. ముఖ్యంగా మా బుజ్జిపాపాయి నవ్వులలో.చాలా చాలా నెన(ర్లు)వ్వులు.

ఆ.సౌమ్య said...

@ రాజా గారు
మా నవ్వులు మీకు నచ్చినందుకు ధన్యవాదములు!
మీ పాపయి నవ్వులు ఉండగా ఇంక మిగతావెందుకండీ! :)
అసలి పిల్లలదగ్గర నేర్చుకోవాలి నవ్వులన్నీ! కదూ!

కనకాంబరం said...

అలిసిపోయానండీ క.ప.న. యిన్ని నవ్వుల జల్లుల్లో తడిసి. వినియోగించాలనే తపన ఉన్నా గుర్తుపెట్టుకోవడం కష్టమే టేబుల్ గ్లాస్ కింద రాసిపెట్టుకుంటా .పైన లాప్ టాప్ ఉంటుందిగా. నాకు జ్ఞాపకశక్తి తక్కువని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త . ఇంతకీ చెప్పలేదు కదూ క.ప.న= కడుపు పగిలే నవ్వు.... కలపండి ప్లీజ్ మీ శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు .(కనకాంబరం )