నా చిట్టితల్లిని చూడబోతున్నననగానే ఎంత ఆనందమేసిందో, అసలిప్పుడేమిటి ఎప్పుడూ అలాగే అనిపిస్తుంది. నా బంగారు తల్లిని వదిలిపెట్టి పదేళ్ళయింది. దానికి నా మీద ఎంత ఆపేక్ష ఉందో తెలీదుకానీ నాకు మాత్రం అపారమైన ప్రేమ ఉంది, రోజూ గుర్తు వస్తూ ఉంటుంది. ఆచిట్టితల్లితో గడిపిన రోజులు, ఆ సహవాసం ఎన్ని జన్మలకైనా మరచిపోగలనా! దాదాపు యేడాది తరువాత మొన్ననే నా వైడూర్యాన్ని కలుసుకున్నాను. అసలు నా వజ్రాల మూటని చేరుకోబోతున్నాననగానే నాకు ఎక్కడలేని శక్తి వచ్చింది. చేరువగా వెళ్తూ ఉంటే ఆ గాలిలో నా బంగారం తాలూక వాసనలు పరిమళించాయి. నా బుజ్జితల్లి కరుణామయి, ఎప్పుడూ నన్ను చేతులు చాచి ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది. ఆమెతో అనుభూతులు ఏమని వర్ణించగలను. ఆమె నాకు ఇన్నాళ్ళూ తల్లిలా అనిపించింది. ఇప్పుడేమో కొత్తగా కన్నకూతురిలా తోస్తోంది. ఇన్నాళ్ళూ నాకు తల్లి అయి నన్ను కంటికి రెప్పలా కాపాడింది. నా కన్నతల్లి, ఆమె ఒడిలో ఆడిన క్షణాలు మధురాతిమధురం. ఆమె చల్లని చేతులలో నేను పొందే సేద అనిర్వచనీయం. ఆమె అందించే ప్రేమ అనంతం. ఆవిడ సన్నిధి మనసుకి ఎంత ఉల్లసానిస్తుందో చెప్పలేను. నేనెప్పుడెళ్ళినా నా చల్లని తల్లి నన్ను అక్కున చేర్చుకుంటుంది. ఆపారమైన ప్రేమనందిస్తుంది. మాటల్లో చెప్పలేని ఆనందాన్నందిస్తుంది. కన్నపేగు మమకారం అలా ఉంటుంది కాబోలు.
కానీ.....చెప్పాగా, ఈమధ్యనే నాకు ఆవిడ కూతురిలా కనిపించడం మొదలుపెట్టింది. తనని మా బుజ్జితల్లి, బంగారు తల్లి, చిట్టి పాపాయి అని లాలించాలనిపించింది. అంతే ఆ క్షణమే నాకు ఆమె కూతురయిపోయింది. ముద్దులొలొకిస్తూ నా ఒడి చేరిన చిన్నిపాపలా అనిపించింది. పదేళ్ళయింది నా ముద్దులపాపని వదిలి. అప్పుడప్పుడు వచ్చి చూసిపోవడమే తప్ప తనతో గడిపిన సుదీర్ఘ క్షణాలు తక్కువే. చానాళ్ళ తరువాత ఈసారి రెండు వారాలు గడిపాను. ఎప్పుడు వెళ్ళినా నాలుగైదు రోజులకి వెళ్ళడమే తప్ప ఇన్ని రోజులు గడపలేదు. నా బంగారు తల్లి ఎంతో మారింది, గొప్పగా ఎదిగింది. నవయవ్వనశోభలు సంతరించుకుంది. నాకు తెలియని కొత్త విశేషాలు కనిపించాయి. తన శరీరపు లావణ్యం చాలా కొత్తగా అనిపించింది. బిడ్డ ఎలా ఉన్నా తల్లికి కొత్తగాను, గొప్పగానే కనిపిస్తుందేమో మరి! చాలారోజుల తరువాత సాయంత్రం షికారుకెళ్తున్నప్పుడు చూస్తే నా అమ్మి అందాలు ఏమని వర్ణించను. నా తల్లితో గడిపిన పాతరోజులన్నీ గిర్రున కళ్ళలో తిరిగాయి. ఆ ఆనందం అనుభవించగలిగేదేకానీ చెప్పనలవికాదు.
ఇంతకీ ఈ నా గారాలపట్టి ఎవరనుకుంటున్నరా అదేనండి మా "ఊరు". నను కన్న నా తల్లి, నా బంగారు తల్లి మా "విజయనగరం".
ఈ మధ్యే మా ఊరు వెళ్ళాను. ఊరు చేరువవుతూండగా నాకు ఇలాంటి భావనలు కలిగాయి. ఇదిగో ఇలా మీముందుంచాను.
36 comments:
మీది విజయనగరమా? సంతోషం
ధవళ సోమశేఖర్ గారు కూడా మీకు తెలుసా ఆయన కూడా మాకు చుట్టాలు అవుతారు
మన చెరువు beautification అని డబ్బంతా తగలపెట్టారు ఏమి ఉపయోగం లేదు
ఎన్నో ఎల్ల తర్వాత వచారు కదా మీకు పుట్టి పెరిగిన నెల పైన మీకున్న మమకారం మీతో ఇలా టపా రాయించింది అని అనుకుంటున్నాను
నెనర్లు
మీ భావాలు అద్భుతమండీ, మీ లాలనాతిశయంలో నేను నన్నే పసిపాపడిలా భావించాను.. అద్భుతం..
మాది మీ పసిపప పక్కూరే విశాఖపట్నం..
సొంత ఊరు ఎప్పుడెళ్లినా అలాగే అనిపిస్తుందేమో!
మనోజ్ఞకు, వినయ్‌కు శుభాకాంక్షలు.
@ గంటస్తంభం గంగరాజు గారూ,
మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. సోమశేఖరంగారు తెలుసండీ, బ్లాగుల్లోనే పరిచయమయ్యారు. మీరు వారికి చుట్టాలా, చాలా సంతోషం.
పెద్దచెరువు ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగానే ఉందండీ, గంటస్థభం దగ్గరనుండీ ఏదో బ్యూటిఫిచేషన్ చేసారు. ఇప్పుడు కంపు తగ్గి ఇంపుగానే ఉంది. చెరువు పక్కన బెంచీలు అవి వేసారు. కూర్చుంటే చల్లగాలి వేస్తూ బాగానే ఉందనిపించింది.
అయ్యబాబోయ్ అంతమాటనేసారేమిటండీ. ఎన్నో యేళ్ళు కాదండీ బాబూ, యేడాదికి 2-3 సార్లు వెళ్తూనే ఉంటాను. ఈ సారే కొంచం ఎక్కువ గేప్ వచ్చింది. క్రితం సంవత్సరం ఫిబ్రవరిలో వెళ్ళాను. మళ్ళా మొన్న వెళ్ళాను. ఎప్పుడూ వెళ్తూనే ఉంటానండీ. మా అమ్మ,నాన్నగాలు అక్కడే ఉన్నారు.
@చంద్రమౌళి
ధన్యవాదాలు, నా భావాలు మిమ్మల్ని కదిలించాయంటే చాలా ఆనందంగా ఉంది. మీది ఇసాకపట్నమా? మా ఇజీనారం నాకు కూతురైతే ఇసాకపట్నం నా కూతురికి ఇష్టసఖిలాంటిది :)
చంద్ర మౌళి గారు మీరు తెలుగులో రాయాలని అనుకునే ప్రయత్నానికి నిజంగా అభినందనీయులు
పసిపప గా రాసారు ప్రపీసస అని అనుకున్నాను అది పసిపప,పాసిపప్పఅని రాయకూడదు
గమనించగలరు
మీతో ఎకసేక్కలు ఆడాను అని అనూన్తె క్షమంతవ్యుడిని
@ నరేష్ గారూ
అవునండీ, కన్నతల్లిని, కన్న ఊరుని ఎప్పటికి మరచిపోలేము. మా చెల్లి మీకు తెలుసా? మీ శుభాకాంక్షలు వారిద్దరికి తప్పకుండా తెలియజేస్తాను.
@ బాషా పునరుద్ధరణ మాణిక్
చంద్రమౌళిగారు ఏదో పొరపాటున రాసారులెండి. ఒకవేళ అది మీకు ప్రపీసస గా కనిపించినా అర్థం పెద్దగా మారదులెండి. అదీ నా కన్నకూతురికింద లెక్కే :)
అన్ని నెలల తర్వాత వెళ్ళారంటే మీ పట్టణం మీద మీ ప్రేమ ఆలనాను తెలియచేస్తున్నాయి
ఇష్ట సఖి అని కొడుకు కి అయితే అనాలి కదా
ఇష్ట సఖుడు అని రాయాలి కదా?
నా అజ్ఞానికి మన్నించి ఏది సరియైనదో తెలుపగలరు
@డల్లాస్ నాగేశ్వరరావుగారు
అన్ని నెలల తర్వాత వెళ్ళారంటే మీ పట్టణం మీద మీ ప్రేమ ఆలనాను తెలియచేస్తున్నాయి"....నన్ను తిట్టారా పొగిడారో అర్థం కాలేదండీ
ఇష్టసఖి అంటే ప్రియమైన స్నేహితురాలు అని అర్థం. ఏం ఆడపిల్లలకి ప్రియమైన స్నేహితులారు ఉండకూదదా అండీ.
"మహారాణీవారి ఇష్ట సఖి" అంటారు కదండీ. కాబట్టి మా ఇజీనారం, ఇసాకపట్నం ఇష్టసఖులన్నమాట. మా అమ్మయికి ప్రియ స్నేహితురాలు :)
మీ ఊరితో మీకున్న అనుబంధాన్ని పోగిడాను తిట్టలేదు అని గమనించగలరు
చెలికత్తె కి ఇష్టసఖి ఒక్కటేనా అయితే
రానికి చెలికత్తె ఉంటుంది ఇష్టసఖి అని మరొకరిని నియమించుకుంటారా ఉద్యోగం లో భాగంగా
నాకు తెలియదు మీరు చెప్పగలరు
ఎందేంది విశాఖ పట్నం విజయనగరం ఇష్ట సఖులా
మా భీమునిపట్నం ఉంపుడు గత్తె నా వారినాయనో
విశాఖ భీమిలి కి విడదీయరాని బంధం ఉంది
బావుంది ...ఇజీనగరం బాసలో రాస్తే బాక్సులు బద్ధలయ్యేవి..
@డల్లాస్ నాగేశ్వరరావు గారు
హమ్మయ్య పొగిడారు కదా, అయితే వాకే.
అవునండీ మహారాణీగారికి చెలికత్తెలుంటారు. వాళ్ళలో లీడర్లాంటి వాళ్ళని ఇష్ట సఖి అంటారు. ఈమెనే మహారాణిగారికి చెలికత్తె, స్నేహితురాలు అన్నీను. మహారాణి తరువాత అంతటి భోగాలు ఈ "ఇష్టసఖి" కి అందుతాయి. మీరు పాత మల్లీశ్వరి చూడలేదా అండీ. అలా అయితే వెంటనే చూసేయండి ఇష్టసఖి వివరాలు ఇంకా బాగా తెలుస్తాయి.
@ మేడికొండ ఇంద్రేష్ గారు
మీ బాధేమిటో నాకర్థం కాలేదు. "ఇష్టసఖి" అన్నాదాన్లో ఏ తప్పుడు అర్థం లేదు. అసలు భీమిలి గురించి నేనేమీ మాట్లాడలేదుగా. మీరెందుకు అన్ని అర్థాలు తీస్తున్నారు. మీరిది సరదాగా రాస్తే వాకే, నేనూ సరదాగా తీసుకుంటాను. కానీ సీరియస్ గా రాసారేమో అని అనుమానమొచ్చి వివరణ ఇస్తున్నాను, అంతే.
@ మృత్యంజయ్ గారూ
మొదట ఆ భాషలోనే రాదామనుకున్ననండీ, కానీ మరీ బాక్సులు బద్దలయితే బాగొదేమో అని రాయలేదు :)
కామెంటు పెట్టినందుకు thanks!
ఒహో... మీది wincity నా? ఆ ఊరులో bellspole తెలుసా మీకు... అక్కడ నుండి ఎడమ వైపు వెళితే onions street వస్తుంది.ఆ పని ఏమి లేదు, నాకు కూడా ఇజీనారం రాజుల చెరువు ఇం(కం)పు తెలుసునని చెబుతున్నా!
>>ఇష్టసఖి అంటే ప్రియమైన స్నేహితురాలు అని అర్థం.>>
ఇలా తెలుగులో మాట్లాడవచ్చు కదా! మా బోటివాళ్లకి అర్ధం అవుతుంది :-)
just kidding.
మీ పదాల ఎంపిక భావ ప్రకటన బాగున్నాయి. ఇంత చక్కగా తెలుగు రాద్దామనే మీ ప్రయత్నం ప్రసంశనీయం.
హ్మ్ కృష్ణాగారూ, మీకు ఉల్లివీధికి సంబంధాలెక్కువన్నమాట.
అయినా ఏమిటీ వెటకారం, మా అన్న తో చెప్పమంటారా...ఆ హన్నా :)
అయినా కృష్ణా, మీకర్థం కాని విషయమేమిటంటే "ఇష్ట సఖి", "ప్రియ స్నేహితురాలు" రెండూ కూడా సంస్కృతపదాల కలయికతో వచ్చినవే. రెండూ తెలుగు కావు.
మీ పొగడ్తలకి నా భుజాలు గజాలయిపోయాయనుకోండి :) ఏదో కన్న ఊరు, మాతృ భాష అంటే ఉన్న మమకారం కొద్దీ అలా రాస్తూ ఉంటాను.
నన్నుక్షమించండి
నేను సరదాగానే రాసాను
extreemely sorry
చాలా బావున్నాయి మీ విశేషాలు
బాగా ఎంజాయ్ చేసారు అనుకుంటా
great
@ మేడికొండ ఇంద్రేష్
అయ్యో క్షమాపణలెందుకండీ...నేనే కాస్త తికమకపడ్డాను. మీరు సరదాగా రాసారో, సీరియస్ గా రాసారో తెలుసుకోలేక అలా సమాధానమిచ్చాను. ఏమనుకోకండి.
@ హరేకృష్ణ
అవునండీ చాలా బాగా ఎంజాయ్ చేసాను. thanks!
ఇస్టసఖి కి ప్రియసఖికి తేడా వుంది గమనించగలరు.. :-))
Some views of pedda cheruvu in the video
http://www.youtube.com/watch?gl=AU&hl=en-GB&v=yXhyOm2A7Jc
@ మంచు.పల్లకి
ఆమాత్రం తేడా ఉంటుందిలెండి :)
@gaddeswarup
మంచి వీడియో ఇచ్చారు, చాలా thanks!
అయ్యబాబోయి మీది విజయనగరమా..నేను అక్కడ చదూకున్నా..మహారాజా వారి మోడల్ స్కూల్ లో 89 దాకా..అక్కడి గాలి వలనే నాకు కొద్దో గొప్పో కళ అబ్బింది..ఘంతసాల వారి సంగీత కళాశాలలో మృదంగం నేర్చుకున్నా...పెద్ద చెరువు గట్టు మీదుగా నాన్న ఆఫీసు ఆర్టీసీ బస్టాండుకి సైకిల్ మీద తిరిగా..గుంచి దగ్గర ఇల్లు..అక్కడ అయ్య కోనేరు గట్టు మీద వినాయకుడి గుడి దగ్గర మొదటి నా ప్రోగ్రాం..పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి కవి సమ్మేళనాలు..గురజాడ అప్పారావు గారింటిమీదుగా మహారాజా కాలేజీ కి వెళ్ళిన టీనేజి తొలిరోజులు...పొద్దూనే మారుతీ కెఫటేరియాలో ఇడ్లీ...ఆదివారం శ్రీదేవీ విలాసులో NCC పెరేడ్ కోసం పూరీ, సాయంత్రం కోట దగ్గర నాగభూషణం మసాలా..అబ్బ...ఎన్నాళ్ళైందో ...ఆ ఊరు చూసి..పైడితల్లి అమ్మవారి గుడి..ఏడుకొండల ఎలెక్ట్రానిక్స్..షాపు..సిరిమాను ఉత్సవం..చాలా థ్యాంక్స్ అండీ గుర్తుచేసినందుకు..
@Fun counter
అయ్యబాబోయ్ బాబోయ్ మీదీ విజయనగరమేనా, మోడల్ హై స్కూల్ లో చదివారా, వినాయకుడి గుడి దగ్గర కచేరీ చేసారా, అయితే నేను ఖచ్చితంగా ఆ కచేరీ వినుంటాను. మహారాజా కలేజీలో చదివారా, నేనూ అక్కడే చదివాను. మీరు ఏ బేచ్? మీ కామెంటుతో ఒక్కసారి నన్ను విజయనగరంలో తీసుకెళ్ళి పడేసారు. గురజాడవారి ఇల్లు, నాగభూషణం మసాలా, దేవీ విలాస్, మారితీ కేఫ్....హా అన్నీ కళ్ళముందు ఒక్కసారిగా తిరిగాయి. మారుతీ కేఫ్ రాజుగారు మాకు బాగా పరిచయం. ఎప్పుడూ అక్కడే ఇడ్లీలు తినేవాళ్ళం.
భలే కలిసామండీ, మీ బ్లాగు చూస్తూ ఉంటాను ,కానీ మీది విజయనగరమని తెలీనే తెలీదు. మృదంగం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను కూడా వయొలిన్ నేర్చుకున్నాను సంగీత కాలేజీలో. మీకు ఆలమూరు (మండా) సుధారాణి తెలుసా? ఆవిడ మా అక్కే.
ఇంతకీ మీ పేరేంటి?
సౌమ్య గారు మీది ఇజినారమేనా? మాది అదేనండి. నాకు మన ఊరంటే చెప్పలేనంత ఇష్టం. చిన్నప్పుడు ఫూల్ బాగ్లో పిక్నిక్లు, నెల్లిమర్లకు సైకిళ్ళ మీద మా టీచర్లకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళడం ఇలా ఎన్నో ఎన్నెన్నో తీపి గుర్తులు , ఆర్టిసీ కాంప్లెక్సు దగ్గరున్న మా కాలేజికి పొలాల గట్ల వెంబడి సైకిలు తొక్కుకుంటూ వెళ్తూ 'ఈ నేలా ఈ గాలి..' అని పాడుకునేదాన్ని.
మా ఇంజినీరింగు స్నేహితులు మన ఊరిని పల్లెటూరు అని ఏడిపిస్తూ ఉండేవారు. మెట్రోపాలిటన్ని, కాస్మొపాలిటన్ని కలిపి మిక్సీ లో వేసి అరగంట తర్వాత తీస్తే వచ్చేదే మా ఊరు అని చెప్తూ ఉంటాను ఇప్పటికీ :D
@సుభగ గారూ
ఆయ్ మీదీ ఇజీనారమేనా....భలే!
మీరు బ్లాగు లోకంలోకి అడుగుపెట్టడం మన ఇజీనారమోళ్ళకి శుభసూచకం :P
పూల్‌బాగ్ కి పిక్నిక్కు, ఆర్టిసి దగ్గర పొలాల గట్లు...ఓహ్ భలే గుర్తు చేసారండీ. అసలదేమిటో మన ఊరి కి చేరువవుతుంటేనే ఆ గాలి గుండెలనిండా నిండిపోయి ఏవేవో లోకాలకి తీసుకెళుతుంది కదండీ.
"మెట్రోపాలిటన్ని, కాస్మొపాలిటన్ని కలిపి మిక్సీ లో వేసి అరగంట తర్వాత తీస్తే వచ్చేదే మా ఊరు అని చెప్తూ ఉంటాను ఇప్పటికీ".....హ హ హ సూపరు....బాగా చెప్పారు. మన ఊరినెవరైనా పల్లెటూరంటే నేను పెద్ద యుద్ధమే చేసేస్తాను వాళ్ళతో.
ఇజీనారంలో మీరెక్కడుండేవారు? మీరు రఘు కాలేజీలో చదివారా?
మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
బ్లాగ్లోకానికి స్వాగతం :).
నిజమేనండి మన ఊరి గురించి ఎంత చెప్పినా, అనుకున్నా తక్కువే. మన ఊరి గురించి తల్చుకుంటేనే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది .
మేము బాబామెట్ట లో ఉండేవాళ్ళం. ఇప్పటికీ అమ్మానాన్నలు అక్కడే ఉంటారు. నేను ఇంటర్ గాయత్రి లో చదివానండి.
మీ కథలను (చీమ కథ, నక్క,కొంగబావ కథ మొ..) చదివిన స్పూర్తితో నేను నా చిన్నప్పుడు విన్న కథలను రాద్దామనుకుంటున్నా. మీరెవరూ అవి విని ఉండరనే నా నమ్మకం. తప్పక చూసి కమ్మెంటాల్సిందిగా ప్రార్థన.
@సుభగ
అవునండీ , మన ఊరు మనకి ముద్దు కదా.మీరు బాబమెట్టలో ఉండేవారా, మేము అక్కడే ఉండేవాళ్ళం. ఇప్పుడు కోట దగ్గరకొచ్చేసాములెండి. ఓహ్ మీరు గాయత్రి కాలేజీ లో చదివారా, నేను M.R. college లో చదివాను.
తప్పకుండా మీరు కథలు రాయండి. ఆ కథలను కల్పన రెంటల గారు తన "తూర్పు-పడమర" బ్లాగులో సేకరిస్తున్నారు. మీరు రాసాక మీ బ్లాగు లింకు ఆవిడకి కూడా ఇవ్వండి, సరెనా. మీకు మొత్తం కథ, కమామిషు తెలియాలంటే ఈ కింది లింకు చూడండి.
http://kalpanarentala.blogspot.com/2010/05/blog-post_25.html
మీ విజయనగరం టపా బాగుందండీ ,చాలా పాత విషయాలు గుర్తు చేసింది, మాది కూడా విజయనగరమే ,నేను 4వ క్లాస్ నుండీ 10 వ క్లాస్ వరకు అక్కడే చదివాను.చిన్నప్పుడు మేమంతా ఆయికోనేరు ,శంకరమఠం ,తూర్పు గట్టు మీద ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి గుడి ,దాసన్నపేట వీటిలో దేన్నీ వదలకుండా ఆడేవాళ్ళం.అప్పట్లో అదే మాకు ఒక ఉపనగరం లా ఉండేది. మీరు చెప్పినట్లు అప్పటికీ ఇప్పటికీ ఊరు బాగా మారింది.
చాలా బాగా వ్రాసారు మీరు
అమ్మనాయన యెంతమందున్నార్రాబావూ ఇజనారపోలు,
బాక్సుకీ బొక్కసానికీ యేదో లింకుందేమో అని అనుమానం రాలేదా మీలో ఎవరికీ?
గంటస్థంభం దరిన ఓ చిన్నపాటి టీబడ్డీలో టీతాగినానోపాలి అప్పుడో సారి బాక్సుబద్దలైంది
యెంతయినా ఇజనారపోలు దరమపెబువులు,ఆలు రూలర్సన్నమాట అల్లప్పుడు.
ఊరిని కూతురుగా చూసుకోవటం అద్భుతమైన ఊహ అభినందనలు.
అయ్యకోనేరు చెరువు,ఆంజనేయ స్వామీ టెంపుల్,సిరిమాను ఉత్సవం , దసరా వేషాలు ,ఫూల్బాగ్ picnics రామతీర్థం అన్నీ గుర్తు కోస్తున్నాయీ .............
@ సుబ్రహ్మణ్యం గారూ
మీదీ విజనగరమేనా! మిమ్మల్ని ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది.
మేము చాలా ఏళ్లు లంకవీధిలో ఉండేవాళ్ళం. కానీ మా బంధువుల ఇళ్ళు, ప్రైవేటు, స్నేహితులు అందరూ దాసన్నపేట, అయ్య కోనేరు గట్టు, ఆంజనేయస్వామి గుడి పరిసరప్రాంతాల్లో ఉండేవారు...కాబట్టి ఆ వైపంతా తెగ తిరిగేవాళ్ళం. తరువాత మేము బాబామెట్టకి వెళ్ళిపోయాం. మీరన్నట్టు అదే ఒక ఉపనగరం. మీ కామెంటు తో అవన్నీ కళ్ళముందు కదలాడాయి. Many Thanks!
@ రాజేంద్ర గారూ
మా ఇజీనారం వాళ్ళు ఏ మూలకెళ్ళినా మీకు తగులుతారు...ఇజీనారం గురించి మాట్లాడతారు..మా ప్రేమ అలాంటిది...మా ఖ్యాతి అలాంటిది :)
ఓసారి మా ఊర్రండి..గంటస్థంభం దగ్గర టీ యేం ఖర్మ సావిత్రమ్మ కొట్టులో అట్లు, గణేష్ భవన్ లో మాంచి మసాలా దోశ, నాగభూషణం మసాలాలో చాట్, ఇంకా మా ఇజీనారం ఫేమ పాలకోవా ఓ కేజీ....ఆ పై మా ఇంట్లో కమ్మటి భోజనం పెట్టిస్తా! :D
@ లక్ష్మి గారూ
వాటితో పాటు బ్రాంచి కాలేజీ, MR కాలేజి, సంగీత కాలేజీ, గురజాడ గ్రంధాలయం, మూడు లాంతర్లు, కోట, పెద్ద చెరువు, కన్యకాపరమేశ్వరి కోవెల, గట్టు మీద చిన్న వెంకటేశ్వర స్వామి గుడి, మూడు కోవెళ్ళు కూడా గుర్తొస్తున్నయి నాకు :)
Post a Comment