ద్రవిడ భారతంలో ముఖ్యంగా తమిళంలో ఇదే కథావస్తువుతో రామయణం అనేక మార్పులు చెంది రాయబడింది. రాముని కన్నా రావణుడే సీతని ఎక్కువగా గొప్పగా అభిమానించి ప్రేమించాడు అనే వాదన కూడా ఉంది. తెలుగులో చలం కూడా ఇదే కాన్సెప్టు తో రెండు కథలు రాసారు."సావిత్రి" "జెలసీ" పుస్తకంలో ఈ కథలు ఉంటాయి.
ఇప్పుడొచ్చిన రావణ్ సినిమా తమిళ సాహిత్యంలోంచి పుట్టుకొచ్చినదే. రాముడికి వ్యతిరేకంగా రాసిన తమిళ కథలు నేను చదవలేదుగానీ విషయాలు మాత్రం కాస్త తెలుసు. రాముడిని ఆర్యులకు ప్రతినిధిగా, రావణుణ్ణి ద్రావిడులకి ప్రతినిధిగా చేసి ద్రావిడులను తక్కువచేసి చూపడానికి, ఆర్యులను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి రామాయణం రాయబడినదని వాదన. ఈ వాదన లోంచి కొంత కథావస్తువుని తీసుకుని "రావణ్" తీసారు మణిరత్నం.
ప్రచారంలో ఉన్న రామాయణంతో పోల్చి చూస్తే ఈ కథ ఎవరికీ నచ్చదు. ఎందుకంటే ఈ కథలో రాముణ్ణి చెడ్డవాడుగానూ, అన్యాయం చేసేవాడుగానూ చూపించారు. రావణుడు మంచివాడుగానూ, మంచి మనసున్నవాడుగాను, సీతని నిజంగా ప్రేమించినవాడుగానూ చూపించారు. అలాగే సీత కూడా రావణుడి మంచితనాన్ని చూసి అభిమానిస్తుంది చివరికి.
రామాయణాన్ని పక్కనబెట్టి దానితో ఈ కథని పోల్చకుండా చూస్తే "వీరా" (రావణ్) మీద మనకి అభిమానము, పోలీస్ ఆఫీసర్ (రాముడు) మీద ద్వేషం కలగకమానదు. పోలీసుల కుళ్ళుకుతంత్రాల మీద, గిరిజనుల మంచితనం మీద మనకి ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిని మనం ఆదరించాం, అలాగే దీన్ని మనం ఆదరించగలం. కానీ రామాయణంతో పోలిక పెట్టడం వలన దీన్ని ఆదరించి మెచ్చుకోవడం సమాజానికి కష్టమే.
ఇంక సినిమా పరంగా చూస్తే ఫొటోగ్రపీ చాలా బాగుంది, విక్రం నటన, ఐశ్వర్య అందం బాగున్నాయి. కానీ కథలో ఒక ఇంటిగ్రిటీ లోపించింది. ఏమి చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నడో సగం సినిమా అయ్యేవరకు అర్థం కాదు. కథావస్తువు కొత్తగా ఉన్నా కట్టె కొట్టె తెచ్చే అని చెప్పినట్లనిపించింది. ఆ ముక్కల్ని కూడా సాగదీస్తూ చెప్పాడనిపించింది.
తన వాదన జనప్రచారంలో ఉన్న కథకి వ్యతిరేకంగా ఉన్నా, తను అనుకున్నదానికి బలమైన కారణాలను, తర్కాన్ని చూపెట్టి ఉంటే బాగుండేది. కనీసం కథకి పట్టునిచ్చే సంభాషణలు పెట్టినా బాగుండేది. ఈ సినిమాలో అవేవీ లేవు. అసలు ఈ సినిమాకి రావణ్ అని పేరు పెట్టకుండా, ఇది రామాయణం అని హైప్ ఇవ్వకుండా ఉండి ఉంటే బాగుండేది దళపతి సినిమాలా (దళపతి దుర్యోధన, కర్ణుల కథ). ఇదేమి కథో ప్రేక్షకుల విఙ్ఞతకే వదిలేయాల్సింది.
కాకపోతే దేశభక్తి పేరు పెట్టుకుని లవ్ స్టొరీస్ (రోజా, బోంబే) తీసిన మణిరత్నం ఆ మాత్రం బుర్రపెట్టి తీసాడే అని అనిపించింది నాకయితే (మణిరత్నం అసలు బుర్రలేనివాడని, పనికిరాని పిచ్చి సినిమాలు తీస్తాడని నాకో ఒపీనియన్). సినిమా మొదటిభాగం బోరు, చివరి భాగం పర్లేదు. విక్రం అంటే ఇష్టమున్నవాళ్ళు (అంటే నాలాంటి వాళ్ళు) సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూ (అంటే విక్రం ని చూస్తూ) చూడొచ్చు.
రాముడిని నమ్మినవారికి ఈ సినిమా అస్సలు నచ్చదు. చూసే ప్రయత్నం కూడా చెయ్యకండి. కానీ దేవుని నమ్మనివాళ్ళకి, ద్రవిడులకి ఆర్యులు అన్యాయం చేసారు అని నమ్మేవాళ్లకి ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది.
పోలికలేం పెట్టకుండా కాస్త లాజిక్కు ఉంటే చాలు అనుకునేవాళ్ళకి, ఏది ఏమైనా ఈ సినిమా చూస్తాం అనుకునే ఔత్సాహికులకు ఉచిత సలహా: సినిమా OK. ఒకసారి చూడొచ్చు.
29 comments:
నిజమే.. సిన్మా రంగనాయకమ్మ"రామాయణ విషవ్రుక్షం"లా వుంది..
రంగనాయకమ్మ గారి విషవృక్షంలో రావణుడికి ప్రత్యేకంగా మార్కులేమీ పడవు. వాడో మూర్ఖుడు అన్న ధోరణిలోనే రాశారు ఆమె! (నాకలాగే అనిపించింది)
సౌమ్య నువ్వు కూడా మార్తాండ లా తెలిసి తెలియని విషయాల గూర్చి తెగ రాస్తున్నావు.
@ మృత్యుంజయ్ గారు
ఇది రామాయణ విషవృక్షం కాదండీ, ఇది ఏదీ కాదు.
సుజాత
అవునండీ నాకు కూడా ఇది రామాయణ విషవృక్షం లా అనిపించలేదు. అసలు ఈ కథకి రామయణానికి, తమిళుల్లో ప్రాచుర్యం ఉన్న రామాయణానికి ఏమీ పోలికలు లేవు. అసలు ఇది ఏదీ కాదు.
@ వినయ్
ఎవరి అభిప్రాయాలు వాళ్లవి.
మీరు భాష విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. అనవసరంగా మాట పారేసుకోవడం అంత మంచిది కాదు.
@ Anonymous
ఈ విషయాన్ని గ్రహించినందుకు చాలా సంతోషం. పోనీ నాది మిడిమిడి ఙ్ఞానమే, తమరికి క్షుణ్ణంగా తెలిసిన ఆ విషయలేమిటో రాస్తే చదివి తరిస్తాం.
*పోలీస్ ఆఫీసర్ (రాముడు) మీద ద్వేషం కలగకమానదు*
నాకైతె పోలిస్ ఆఫిసర్ మీద అభిమానం కలిగింది. అతను వ్యక్తిగత జీవితం కన్నా దేశానికి ప్రాధాన్యత ఇచ్చాడు.కొంచెం ఆలోచిస్తె మార్క్సిట్స్లు, కమ్యునిస్ట్టులు ఎలా వ్యక్తిగత జీవితం కన్నా ఆదర్శాలు, ఆచరణ ముఖ్యమని భావిస్తారో ఈ హీరో పాత్ర కూడా అలానే భావించి ఆచరిస్తుంది. వాస్తవాన్ని సినేమా లో చూస్తె అదేదో గిరిజనుల మీదికి హీరో గారు పనిగట్టుకొని వ్యక్తిగత ద్వేషాం తో పోలెదు. తమాషా ఎమీటంటె 60సం|| ద్రవిడులే ఈ సినేమాని తిరస్కరించటం వారు ఇప్పుడు ఆర్యా-ద్రవిడ సిద్దాంతం లోని డొల్లతనాన్ని,వాస్తవాన్ని,సత్యాన్ని గ్రహించారని తేలుస్తున్నాది. కారణం గత 70సం||కాలం లో ప్రజల లో విద్యాభివృద్ది వలన, బాధ్యతా గల ఉద్యోగాలు చేయటం వలన వ్యక్తిగత జీవితానికి, ఆదర్శాలకి, వృత్తి ధర్మానికి గల సన్నటి సరి హద్దు రేఖను ప్రజలు గుర్తించగలిగారు. మణిరత్నం చెత్తను రెండవ రోజె తిప్పి కొట్టారు.
Vikram
@Anonymous
అసలు గిరిజనుల మీద దాడి ఎందుకు చేసారో చూపించారా సినిమాలో? గిరిజనులు ఏమి తప్పు చేసారో చూపించారా, లేదే? అలాంటప్పుడు పోలీసులు సరి అయిన పని చేసారని ఎలా నమ్మమంటారు? by the way నాకు మార్కిస్టు, కమ్యూనిస్టుల భావజాలపై నమ్మకం లేదు. వ్యక్తిగత జీవితం కన్నా సమాజ ఉద్ధరణ మీద నాకు నమ్మకం లేదు. ముందు వ్యక్తిగతాభివృద్ధికే ఎక్కువ విలువిస్తాను. ముందు తనని, తన ఇంటిని సంస్కరించుకుంటే సమాజానికి సేవ చేసినట్టే.
కథ మొదలవడమే పోలీసులపై గిరిజనుల కోపం తో మొదలవుతుంది. కారణం ఇంట్రవెల్ తరువాత తెలుస్తుంది. అసలు ఏ రకంగానూ గిరిజనులు చేసిన తప్పేమిటొ ఎక్కడా చూపించలేదు. అటువంటప్పుడు పోలీసు ఆఫీసరుని ఎలా సమర్థిస్తారు? దేశం కోసం సేవ చేస్తున్నాడని ఎలా చెప్పగలరు? కానీ పోలీసులు వీరా చెల్లెలి విషయంలో చేసినది మాత్రం ఖచ్చితంగా తప్పే.
ఎవరైనా ఆ సిద్ధంతాన్నో, సినిమానో తిప్పికొట్టవచ్చు. నాకు అందులో ఏ సమస్యా లేదు. ఇప్పుడు ద్రావిడులు ఆ సినిమాని నెత్తినకట్టుకుని ఊరేగుతారని నేను చెప్పలేదు. ఆ సినిమాలో కథా కమామిషు చెప్పాను అంతే.
అక్కాయ్, అసలు విషయం ఏమిటంటే, రావణుడు కూడా సొ కాల్డ్ 'ఆర్యుడే' అంటే నార్త్ ఇండియన్. లంకను జయించాడు. లంకలో పుట్టలేదు. పైగా బాపనోడు. అనవసరంగా నల్లగా ఉన్నాడన్న ఒక పాయింట్ తో అరవాళ్ళు సమర్ధించారు. పై గా వీళ్ళకు ఉన్న రెండు మూడూ పెళ్ళాళ కాన్స్ ప్ట్ సమర్ధంచు కోవటానికేమో. అన్నట్టు కృష్ణుడు కూడా నలుపేగా ఆయన పనికి రాలేదు ఎందుకో.
రామాయణం ప్రకారం హనుమ, శబరి, గుహుడు, వాలి , సుగ్రీవుడు అచ్చ సౌత్ ఇండియన్స్.
ఈ చెత్త అంతా అరవై యేళ్ళ క్రితం చదువులు లేని జనాల్ని రెచ్చగొట్టటానికి కాని ఈరోజుల్లో మరీ అంత లాజిక్కు లేకుండా మాట్లాడితే తంతారని మణికి తెలిసింది.
* వ్యక్తిగత జీవితం కన్నా సమాజ ఉద్ధరణ మీద నాకు నమ్మకం లేదు. ముందు వ్యక్తిగతాభివృద్ధికే ఎక్కువ విలువిస్తాను. *
మంచి గా చెప్పారు. నాకు మీరు నచ్చారు. నేనేదొ మీరు ద్రవిడా రామయణం గురించి రాస్తుంటె మీకు సామాజిక భాద్యత ఎక్కువని ఆ దృష్టి లో ఆలోచిస్తున్నారని అనుకున్నాను. అదే కాక మీ వ్యక్తిత్వాన్ని చెప్పె ఈ మాటలు
*నేనంటే నేనే....భారతవీరకుమారిని నేనే, నారీరతనము నేనే, భారతనారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే.*
చదివి మీలో నాయకురాలి గుణాలు ఉన్నాయంకుని నా అభిప్రాయాం రాయటం జరిగింది కాని మీది చాలా సింపుల్ పిలాసపి అని ఒక్క ముక్క లో చేప్పాలంటె "మీ ఇంటి కొస్తె నాకేమి ఇస్తావు నాఇంటికొస్తె నాకే తెస్తావు" అనేది తెలియక బ్లాగాను. ఇక ఉంట్టాను.
@ Anonymous
హ హ హ మీరు నా ప్రొఫైల్ లో మాటలని ఇలా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు. ఆ పాట రాసినవారి ఉద్దేస్యం కూడా మీకు అర్థం కాలేదు. "భారతనారీ అభ్యుదయానికి నాయకురాలిని" నేనే అంటే నేను ముందు అభ్యుదయాని సాధించి అలా సాధించినవాళ్ళకి నాయకురాలిని అవుతానని. ఇందులో కూడ ముందు ఉన్నది "నేనే". మనల్ని మనం సంస్కరించుకోలేకోతే సమాజాన్ని ఏమి ఉద్ధరిస్తామండీ. ప్రతీ వ్యక్తి ముందు తాను ఎదిగి ఇతరులకి మార్గదర్శకం కావాలిగానీ ఊరికే సమాజాన్ని ఉద్ధరిస్తాను అంటే సరిపోదు.
నా పిలాసఫీని కూడా మీరు వక్ర్రికరించి అర్థం చేసుకుంటే నేనేమీ చెయ్యలేను... మీ ఇంటికొస్తే ఏమిస్తావ్, మా ఇంటికొస్తే ఏం తెస్తావ్ అని అడిగే స్వభావమే నాకుంటే నాకు వ్యతిరేకంగా వచ్చిన కామెంట్లని accept చేసి ఉండేదాన్ని కాదు.
@ second Anonymous
తమ్ముడూ నువ్వెవరిని సపోర్ట్ చేస్తున్నావో నాకర్థం కాలేదు. మణిని సమర్థిస్తున్నావా లేక రామాయణాన్ని సమర్థిస్తున్నావా. మరేమనుకోకు నీ వ్యంగ్యాన్ని అర్థం చేసుకునే స్థాయికి నేనింకా ఎదగలేదు. కాస్త విడమర్చి చెప్పరాదే? "నువ్వు" అన్నానని అలగకు తమ్మీ, చిన్నవాడివి కదా అందుకే అలా అన్నాను.
నేను అరవవాళ్ళ పిచ్చి థియరీని, దాన్ని నెత్తికి ఎక్కించుకొన్న/ కాష్ చేసుకొందామనుకొన్న మణి లాంటి పిచ్చి మేధావుల్ని చూసి నవ్వుకొంటున్నా. నువ్వూ ఆ టైపే అని నా అనుమానం.
సౌమ్యా నేనింకా ఈ సినిమా చూడలేదు కనుక ఏమీ చెప్పలేను...కానీ చూసిన వారు చెప్తున్న దాన్ని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి, మీ అనాలిసిస్ కరెక్టే నేమో అని అనిపిస్తుంది.. మీరు చెప్పినట్లుగా సినిమా టైటిల్ రావణ్ అనికాకుండా, దీనికి రామాయణం అన్న హైప్ ఇవ్వకుండా... మాములు కమర్షియల్ చిత్రంగా దీన్ని మార్కెట్ చెయ్యల్సింది.. ఇండియాలో ఇలా యాంటి-రామా మూవీస్ వర్కవుట్ అవ్వవు..తమిళ నాడు పరిస్థితి కొంచెం వేరుగా ఉండొచ్చేమో ..
ఈ సినిమా చెత్త అని తెలిసి చూడలేదు. చూడను. నాకు శంకర్ పై మీ అభిప్రాయమే!. ఈ సినిమాను మినహయిస్తే మణి రత్నం మంచి దర్శకుడే!
@ Third Anonumous
నేను ఏ టైపో మీ విఙ్ఞతకే వదిలేస్తున్నాను. మీరే నిర్ణయించుకోండి.
@ వినయ్
మీరు "నీ..." అని రాసారు. అది నన్ను తిడుతున్నట్టుంది. సెటైర్లు వెయ్యడం వేరు, తిట్టడం వేరు. సెటైర్ వెస్తే నాకు ఏ బాధ లేదు. నేను వేస్తాను, ఇతరులు వేసినా నాకు అభ్యంతరంలేదు. అయినా నేను చాలా మర్యాదగా భాష చూసుకోండి అని రాసాను. మీరు నా పోస్ట్ వ్యతిరేకంగా కామెంటు రాసినా పర్లేదు కానీ రాసేదేదో డీసెంటు గా రాస్తే చాలు. నేను పాసిటివ్ గానే తీసుకుంటాను. అదే చాలా మర్యాదగా చెప్పాను.
ఇప్పుడు కూడా చూడండి...మీకు, నాకు ఏమంత పరిచయం ఉందని ఏకవచన సంబోధనలోకి దిగిపోయారు?
ఇకనైనా కాస్త భాష, భావం చుసుకుని కామెంట్లు రాయండి. నా బ్లాగులోనే కాదు ఎవరి బ్లాగులోనైనా అలాగే రాస్తే మంచిది.
@ రామకృష్ణ
అవునండీ ఈ కథ అటు జనబాహుళ్యం పొందిన రామాయణానికిగానీ ఇటు విరుద్ధ ఆలోచనలున్న తమిళుల వెర్షన్ కిగానీ దగ్గరాగా లేదు. రామాయణం అని చెప్పకపోతే బాగుండేది. మీరన్నది నిజమేనండి....రామాయణానికి వ్యతిరేకంగా తీస్తే ఇండియాలో ఆడదు. నార్త్ ఇండియాలో అసలు ఆడదు. ఏ ధైర్యంతో ఈ సినిమాని హిందీలో తీసాడో నాకర్థం కాలేదు.
@ సవ్వడి
నాకు శంకర్ మీద, మణిరత్నం మీద ఒకేలాంటి అభిప్రాయాలున్నాయండి. ఇక రావణ్ ని చూడడం, చూడకపోవడం మీ ఇష్టం :)
అంటే మరిది వదిన అనే ఒక్క పాయింట్ పట్టుకొని ప్రవీణ్ కుమార్ మందంగి అనే వ్యక్తీ ని విమర్శించడం సరి అయినదా
మణిరత్నం ఇదే కదా వస్తువు అనగా మరిది వదినతో తీస్తే మీరు అప్పుడు కూడా సమర్ధిస్తారా ?
మీరు భయపడనవసరం లేదు నష్టాల ఊబిలో కూరుకుపోయి వున్నాడు మణిరత్నం ఆల్రెడీ ఈ సినిమా అన్నీ బాషలలో తీసి మళ్ళీ రిస్క్ చెయ్యడు లెండి
గోగినేని విని చక్రవర్తి
నువ్వు చెప్పిన దానిలో తప్పేముంది
కాని రాసే ముందు మరొక్కసారి చదివితే బావుంటుంది అని బ్లాగు యజమాని చెప్పారు
సింపుల్ విషయాలకు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు
asalu comment raaayadam vundi choosaaru...........nannu anaali.
Good review, ఫోటోగ్రఫి , విక్రం నటన సూపర్బ్ . తెలుగులో దీని పేరు విలన్ కనుక దీనిని రామాయణం తో ముడి పెట్టకుండా చూడండి . హీరో , హీరోయిన్ , విలన్ పేర్లు కూడా రామాయణం తో సరిపోవు . మణి రత్నం గారు దీనికి రావణ్ అని పేరు పెట్టకుండా ఉండాల్సింది . వేటూరి గారు సూచించిన విలన్ సరిగ్గా సరిపోతుంది ఆ భావనతో చూస్తే సినిమా బాగుంటుంది . కార్తీక్ నటనను సినిమా లో ఎడిట్ చేసింటే బాగుండేది , అది అనవసరం . మూవీ ని విలన్ గా , విక్రం నటన తో మీరన్నట్టు ఎంజాయ్ చేయ్యవచ్చు .
@ నారాయణ రావు గారు
మీరు మార్తాండ గురించి అన్నీ తెలిసే అంటున్నారో, లేక సరదాకి అంటున్నారో నాకు తెలియట్లేదు. అక్కడ వదిన-మరిది సంబంధం మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలున్నయి. మీరు ఇంకొక్కసారి పరిశీలించి ప్రవీణ్ కథలను చదవండి. మీకే తెలుస్తుంది. మణిరత్నం కాదు కదా, స్పీల్ బర్గ్ వచ్చి తీసినా వదిన ని పెళ్ళి చేసుకోవడం కోసం అన్నయ్యని చంపాలనో, జైలు పాలు చెయ్యలనొ చూసే మరిది కథని నేను (మేము) అంగీకరించలేను (ము).
@ వినయ్
అసలు మీరేదో చికాకుల్లో ఉన్నట్టున్నారు. cool down my dear cool down.
అసలు నేనేమన్నానని ఇంత గొడవ చేస్తున్నారు.
మీకు నచ్చితే కామెంటు రాయండి లేకపోతే మానేయండి. రాసేదేదో డీసెంటుగా రాయమని అన్నాను అంతే. ok, leave it, no more arguments.
మీరు రాసిన మొదటి కామెంటు ఎందుకు డిలీట్ చేసేసారు? అది ఉండడ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు అనవసరంగా దాన్ని డిలీట్ చేసారు. anyways అది మీ ఇష్టం.నాకేమి అభ్యంతరం లేదు.
పైన అఙ్ఞాత చెప్పినట్టు ఇంత చిన్న విషయానికి వాదనలేమిటి.
Thank you anonymous!
@ RAM గారు
ధన్యవాదాలు. అవునండీ నాకు కూడా కార్తిక్ నటన చిరాకనిపించింది. ఆంజనేయుడు పాత్రని పెట్టడం కోసం అనవసరంగా ఈ పాత్ర సృష్టించారు. ఆ చెట్ల మీదకి ఎగరడాలు, పోలీసులతో ఆటలు...పిచ్చి పిచ్చిగా ఉన్నాది. మతిలేని, గతి తప్పిన పాత్ర.
నా రివ్యూ మీకు నచ్చినందుకు thanks!
hahhahaha.......i agree with first anonymous.......
ide correct ani arogant ga cheputaru....anduke annanu.....
@ last anonymous
ths for ur suggestion.idi simple but enduko peddadi chesanu waste gaa.....eemetoti naakenduku....
రివ్యూ సరిగ్గా రాసారు ....
బ్లాగ్ అన్నాక ఎవరి అభిప్రాయలు వారు రాస్తారు...
వాళ్ళు రాసింది నచ్చిన్దనుకోండి.....మీది తెనాలే.... మాది తెనాలే.... మనది తెనాలే.... అనుకోవడం.
నచ్చకపోతే...వీలైతే ఊరుకోవడం..లేకపోతే...మీరు అలా కాకుండా ఇలా రాసుంటే బాగుండేది...అనో చెప్పి ఊరుకోవాలి గాని
ఇలా వ్యక్తిగతంగా తీసుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం...
అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా...
చిన్న చిన్న విషయాలను కూడా ఇంత సీరియస్ గా తీసుకుంటారా....
అసలీ అజ్ఞాత వ్యాఖ్యలను కొట్టకుండా చేస్తే సగం గొడవ వదులుతుందేమో...
@ స్థితప్రజ్ఞుడు
బాగా చెప్పారు, ఆ మాత్రం జ్ఞానం ఏడిస్తే వీళ్ళెందుకు ఇలా రాస్తారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం అనేది ఒక మంచి సంస్కారం. అది అంత సులువుగా అందరికీ అబ్బదులెండి.
Post a Comment