StatCounter code

Tuesday, June 22, 2010

డింగుటక ఆహా డింగుటక

భ.రా.గో గారి చిరకాల మిత్రుడు అమెరికానుండి వచ్చిన సందర్భంలో "తెలుగు సినిమా చూసి చాన్నాళ్లయింది, వెళదాం రారా" అన్నాట్ట.

భ.రా.గో గారేమో "వద్దురా, నువ్వుభరించలేవు, మనకాలమనుకున్నవా, కానే కాదు ఇంటి దగ్గరే కబుర్లు చెప్పుకుందాం చక్కగా అన్నారట".

"ఊహు లేదు వెళ్లాల్సిందే" అని పట్టుబట్టారట ఆ స్నేహితుడు. "సరే కానీ" అని ఇద్దరూ వెళ్లారట.

అందులో మోకాలు ఊపుకుంటూ, నడ్డి ముందుకి వెనక్కి తిప్పుతూ డేన్సులు వేస్తూ పాడుతున్నారట. కాసేపయ్యక ఆ మిత్రుడు అడిగాడట "ఓరేయ్ ఆ పాటకి అర్థమేమిటంటావ్?" అని

భ.రా.గో గారికి చిర్రెత్తుకొచ్చి "మనసున మల్లెల మాలలూగెనే" అంటే అర్థం చెప్పగలను కానీ "డింగుటక ఆహా డింగుటక ఓహో డింగుటక" అంటే ఏమి చెప్పమంటావురా" అన్నారట.

ఈ మధ్య ఇలాటి సంఘటనే మా ఇంట్లో జరిగింది.

మా దూరపు బంధువు (మామయ్య వరస) పాతికేళ్ల తరువాత ఇండియా వచ్చారు. "పొద్దున్నే 9.30 కి రెడియోలో మనోరంజని వస్తుంది పెట్టవే చాలా రోజులయింది మంచి తెలుగు పాటలు విని" అని అడిగారు.

మావయ్య ఏ కాలం పాటలనుకుంటున్నారో అని నవ్వుకుని రేడియో పెట్టాను.

మొదటి పాట "బిల్లా" సినిమా లోది.

"ఏమిటే హిందీ పాటలిస్తున్నారు" అని గాబరాపడ్డారు మావయ్య. "లేదు మావయ్యా అది ఈ మధ్యనే వచ్చిన తెలుగు సినిమావే" అన్నాను.

"బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వొదలా బొమ్మాళీ"...పాట విని ఆయన అసహనంగా కుర్చీలో కదిలారు.

రెండవ పాట అదుర్స్ లో "వేర్ ఈజ్ ద పంచకట్టు వేర్ ఈజ్ ఇట్"......... ఆయన కుర్చీలోంచి లేచి అటు ఇటు తిరిగనారంభించారు.

మూడో పాట :
"ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను"......ఇంక ఆయనకి సహనం చచ్చిపోయింది. ఈ పాటకి కంటిన్యుయేషన్ గా ఇలా పాడారు

ముక్కు ఏమో మూతి ఆయెను
బుద్ధి కాస్త వంకరాయెను
గోళ్ళ చివర గడ్డి మొలిచెను
మెదడు కాస్త అరికాలుకి పాకెను
తెలుగు పాటలు బురదలో పొర్లెను


ఆ పాట విని మేమంతా ఒకటే నవ్వులు.








56 comments:

శ్రీనివాస్ said...

సరిగమ పదనిస్సా కరో కరో జరా జల్సా

సా.... జల్సా.

సనిదపమగారిస కరో కరో కరో కరో జల్సా సా జల్సా.

_____________________________________


జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టు గా ఉంది రూ ఈ సుందరి ....

ఈ పాటలు విని ఉంటే ఇంకా ఏమయ్యేదో

ఆ.సౌమ్య said...

@శ్రీనివాస్
హ హ హ ఏమో ఏమయ్యేదో...ఊహించుకోవడానికే కాస్త జంకుగా ఉంది :)
కామెంటినందుకు Thanks!

కమల్ said...

విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇప్పటి తెలుగు పాటలు అక్కడే వినే ఛాన్స్ లేదా? తెలుగు సిన్మాలు అక్కడ దొరకవ?

పాతికేళ్ళ నుండి మనోరంజని పేరు కూడా మార్చకుండా అదే 9:౩౦ కి ప్రసారం చేస్తున్నర? WAT A PITY...

వెంటనే ఆ programe పేరు డింగు టక అః డింగుటక అని మార్చెయ్యాలి అప్పుడే మన రేడియో బాగుపడుద్ది..

ఆ.సౌమ్య said...

@ కమల్
మీకెప్పుడైనా కొన్నేళ్ళ క్రితం దూరదర్శన్ లో వచ్చే చిత్ర రంజని, సుమాంజలి గుర్తు రావా? ఒకవేళ అవకాశమొస్తే వినాలనో, చూడాలనో మీకనిపించదా. అందరూ మీలాగే గతాన్ని మరచిపోలేరేమోలెండి. పాపం మీ ప్రశ్నలకి బదులివ్వడానికి భ.రా.గో గారు బ్రతికిలేరు. మా మావయ్య ఇక్కడ లేరు. సో మీకు జవాబు తెలిసే చాన్సు లేదు, WAT A PITY... :D

విదేశాల్లో తెలుగు సినిమాలు చూడడం, తెలుగు పాటలు వినడం లాంటివి ఈ జెనెరేషన్ కి తెలుసుకానీ ఆ జెనరేషన్ కి తెలియవండీ.

మేధ said...

రీమిక్స్ వర్షన్:

ముక్కు ఏమో మూతి ఆయెను
యే.. యే.. వి డిడ్ ఇట్ ..

బుద్ధి కాస్త వంకరాయెను
హే..హే.. యు గాట్ ఇట్...

గోళ్ళ చివర గడ్డి మొలిచెను
యూ.. చో చ్వీట్ ;)

మెదడు కాస్త అరికాలుకి పాకెను
తెలుగు పాటలు బురదలో పొర్లెను

హి.. హి.. దట్స్ కూల్ మాన్

కమల్ said...

@అందరూ మీలాగే గతాన్ని మరచిపోలేరేమోలెండి.

..సౌమ్య గారు నేనెప్పుడు గతాన్ని మచిపోయననలేదండి... మీరు నా కామెంట్ సరిగా అర్థం చేసుకోలేదు.

అయినా మీరు వర్తమానంలోనే లేనట్టున్నారు. వర్క్ బ్యుజి అనుకుంట.

ఆ.సౌమ్య said...

@ కమల్
అయ్యో ఊరికే నేను జోక్ చేసానండీ. మీరు గతానికి సంబంధించిన అన్ని ప్రశ్నలడిగారుగా అందుకే జోకా.
నేను వర్తమానంలోనే ఉన్నాను, మీరే నా జోకుని అర్థం చేసుకోలేదు. అర్థం కాకపోయినా నవ్వేయాలిగానీ ఇలా ఎదురు ప్రశ్నలడగకూదదు :D

ఆ.సౌమ్య said...

@ మేధ గారు
మీ రీమిక్సు వెర్షన్ ఇంకా అదిరించి.....హ హ హ
Thank you!

కమల్ said...

@అర్థం కాకపోయినా నవ్వేయాలిగానీ ఇలా ఎదురు ప్రశ్నలడగకూదదు :D

అర్థమైంది అయినా నవ్వేస్తున్నా... :)

ఎం అనుకోకండేం......

ఆ.సౌమ్య said...

@ కమల్
వాకే అలా నవ్వేసేయండి హయిగా, ఏ గోడవా ఉండదు :)

మధురవాణి said...

:D :D అసలు పేరడీ, మేధ గారి remix పేరడీ రెండూ సూపర్! ;-)

Sai Praveen said...

డబ్బింగ్ పాటల దాక ఎందుకండీ, స్వఛ్చమైన స్ట్రైట్ సినిమాల్లోనే బురద పోర్లుతోంది. ఇంకా కొన్ని ఆణిముత్యాలని ఏరి వినిపించండి. వెంటనే ఇండియా వదిలి పారిపొయినా ఆశ్చర్యం లేదు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

శుభప్రదం అని విశ్వనాధ్ గారి సినిమా వస్తుంది.అందులో పాటలు బావుంటాయేమో చూడాలి.బావున్నా లేకపోయినా కనీసం తెలుగులో ఉంటాయి.

వెంకట్ said...

ఇప్పటి తెలుగు సినిమాల్లో పాటలు వినాలంటే నిజంగా చిర్రెత్తుకొస్తోంది, కన్నడ పాటలు కొంచెం బెటర్ ఈ విషయం లో మరీ అంత హిట్ సినిమాలు పాటలు రాకపోయినా ఉన్న వాటిలో భాషను ఖూనీ చేయరు

ఆ.సౌమ్య said...

@ మధురవాణి
మేధగారు భలే రీమిక్సు చేసారు కదా, నాకూ తెగ నచ్చింది :)
Thanks !

@ Sai Praveen
హ హ అవునండి అదుర్స్ లో "వేర్ ఈజ్ ద పంచకట్టు" పాట విని బేజారెత్తిపోయారు ఇది తెలుగుపాటా అని! అప్పటికే ఓ దండం పెట్టేసారులెండి.
కామెంటినందుకు thanks.

ఆ.సౌమ్య said...

@ చెప్పు దెబ్బలు-పూలదండలు
హ హ హ భలే చెప్పారండీ..."బావున్నా లేకపోయినా కనీసం తెలుగులో ఉంటాయి.".....హి హి హి....అదీ మన దౌర్భాగ్యం....బావున్నా లేకపోయినా తెలుగులో ఉంటే చాలు అనే పరిస్థితుల్లో ఉన్నాం.

@ వెంకట్
ఏమోనండీ నాకు కన్నడ అసలు రాదు. తమిళ్ లో పాటలు కాస్త బెటర్గానే ఉన్నయి తక్కువ ఇంగ్లీషుతో. మళయాళం పాటలు నిజంగా చాలా బావుంటున్నాయి మంచి సాహిత్యం, మంచి సంగీతం తో.

"ఇప్పటి తెలుగు సినిమాల్లో పాటలు వినాలంటే నిజంగా చిర్రెత్తుకొస్తోంది"......చిర్రెత్తుకురావడం చాలా చిన్నమాటండీ, పిచ్చెక్కుతోంది అనాలేమో !

ramnarsimha said...

very funny..

Thanq..

Ram Krish Reddy Kotla said...

డబ్బింగ్ సినిమా పాటలు వింటే నాకు భలే నవ్వొస్తుంటుంది .. ఆ సాహిత్యం విని చెవులు మూసుకోడం మొదటి స్టేజ్ అయితే.. ఇప్పుడు కామెడీ చేసుకోడం రెండో స్టేజ్ .. పాటలైనా తమిళం నుండి తెలుగుకి దిగుమతి అయితే అవి వినడం మన వల్ల కాదు .. అప్పుడెప్పుడో చూసిన రన్ మూవీలో ఓ పాట ఉంది "ప్రేమా పిశాచి .. ప్రేమా పిశాచి .. మనసూ కుసెలం పరవాలేదు.. " ఇలా సాగుతూ మనకేమో "పాటా పిశాచి... పాటా పిశాచి .. మైండు దొబ్బింది పరవాలేదు.." అనిపించక చస్తుందా .. :)

హరే కృష్ణ said...

హ హ్హ
బెదిరిపోయి వుంటారు
ఆ మగధీర లో మార్తాండ ఫేవరెట్ సాంగ్ rolling టైటిల్స్ కూడా వినిపించాల్సింది
మళ్ళీ అమెరికా వెళ్ళిపోయేవారు దెబ్బకి
పోస్ట్ బాగా రాసారు

ఆ.సౌమ్య said...

@ ramnarasimha gaaru
thanks for commenting

@ రామకృష్ణ
డబ్బింగ్ సినిమా పాటలంటే మరి చెప్పక్కర్లేదెలెండి. "వదినా నీ మరిదెంతో పిచ్చోడే" (ప్రేమాలయం) అనో లేదా మీరన్నాట్టు ప్రేమా పిశాచి ప్రేమా పిశాచి అనో ఉంటాయి.
కామెంటినందుకు thanks :)

@ హరే కృష్ణ
ధన్యవాదములు....మరే ఇంకదొక్కటే తక్కువ, మరెప్పుడూ ఇండియా రారు :)

..nagarjuna.. said...

పోన్లెద్దురూ ఆ ఆకాశవాణి వాళ్లు ఇలాగైనా డబ్బులు సంపాదిస్తున్నారు. శుద్ద తెలుగు పాటలు మాత్రమే వెస్తే ఏమౌతుందో ఓసారి ఇక్కడ చూడంది
http://thotaramudu.blogspot.com/2007/03/blog-post.html


చివరగా నలుగురిలో నారాయణ టైపులో...

Everybody wanna know what we like a we like a..I really wanna be here with you..
Is that enough to say that we r made for each other..is not that is hosannah.. true
Hosannah..be there when u r calling i will be there..
Hosannah..be the life the whole life i vl share.....

ramnarsimha said...

@SOUMYA GARU,

Plz see - NAVATARANGAM.COM


rputluri@yahoo.com

ఆ.సౌమ్య said...

@ నాగార్జున
4E గారూ ఈ తోటరాముడి పోస్ట్ ని ఇప్పటికో వందసార్లు చదివుంటాను. నేను చెప్పే కొత్తపాటలు మరీ జగన్మోహిని కాలం నాటివి కావులెండి :)

ఇంతకీ నలుగురితో పాటూ నారాయణా అంటూ మీరు ఇంగిలిపీసులో రాసినది ఏమిటో అర్థమయ్యింది కానీ ఎందుకో అర్థం కాలేదు. కాస్త వివరించరూ?

ఆ.సౌమ్య said...

@ ramnarasimh gaaru
నేను నవతరంగం ఎప్పుడూ చూస్తూ ఉంటానండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చూడమన్నారూ? ఏమిటి విశేషం?

ramnarsimha said...

ఎడిటర్ గారికి,

నా పేరుతో గానీ, నా పైన అనుమాఅనం కలిగేలా కానీ -
ఏవైనా అశ్లీల సందేశాలు అందినట్లైతే నాకు తెలియపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను..

ఇట్లు, ఒక పాఠకుడు,
పుట్లూరి రాంనర్సింహారెడ్డి..
(సెల్ నం:80999 91076, E-mail:PUTLURIR@YAHOO.COM)

ఆ.సౌమ్య said...

@ ramnarasimha గారూ
మీకూ మొదలయ్యాయా ఈ బాధలు.
తప్పకుండానండీ, అనుమానంగా తోస్తే వెంటనే మీకు తెలియజేస్తాను.

ramnarsimha said...

@SOUMYA GARU,

Thanks..for publishing my letter.

If possible..plz inform to the all

Bloggers..

ఆ.సౌమ్య said...

@ ramnarasimha
no mention.
sure, i will.

..nagarjuna.. said...

అయ్యో..మరీ జగన్మోహిని కాలం వరకు వెల్లాలని కాదండి, అచ్చతెలుగు పాటలు వినాలంటే కనీసం దశాబ్దం వెనక్కు వెళ్ళాలని చెబుతున్నా...

ఆ ఇంగిలిపీసు ముక్క ‘ఏ మాయచేసావె లోనిది’. నేను ఆ మనోరంజని గ్రూపులో బలయ్యి గుడ్డికన్ను కన్నా మెల్లకన్ను బెటర్ అని ఫీలవుతూన్నాని చెప్పడానికి పెట్టాను.

ఆ.సౌమ్య said...

@ naagaarjuna 4E

హి హి హి మీ భావం ఇప్పటికి బోధపడింది....కాస్త ట్యూబ్ లైట్ లెండి :D

karthik said...

అచ్చ తెలుగులో ఉన్న రింగా రింగా పాట వినిపించాల్సింది.. అప్పుడు అర్థమయ్యేది తెలుగు సినిమాలు ఎక్కడ ఉన్నాయో.. :P

ఆ.సౌమ్య said...

@కార్తీక్
:D అప్పటికి ఇంకా ఆ పాట రాలేదు, అదిగానీ విని ఉంటే ఆయన మరెప్పుడూ ఇండియాకి రారు.

Anonymous said...

మనసారా నవ్వుకున్నాను...సుమా..
బాగుంది....

ఆ.సౌమ్య said...

@ఆదిత్య గారూ
ధన్యవాదములు.

Anonymous said...

సావిత్రి మాయమయ్యిందేమిటి?

ఆ.సౌమ్య said...

@ఆదిత్య గారూ
సావిత్రి మాయమవడమేమిటండీ? ఓ ఆ పోస్ట్ ఆ...అది నేనే డిలీట్ చేసాను. అది 'కాని' సమయంలో పెట్టాను అందుకే. మళ్ళీ పెడతాను త్వరలో.

Anonymous said...

ఔనా... ఎప్పుడు...

ఆ.సౌమ్య said...

సమయం వచ్చినప్పుడు, త్వరలో :)

Anonymous said...

దీనిక్కూడా...అలాంటివి చూస్తున్నారా?
ముహూర్తాలు...వగైరా..

ఆ.సౌమ్య said...

చ చ మీరు మరీను...నా దేవుని రూపం పోస్ట్ చదివాక కూడా మీరిది అడగవచ్చా? :)

అంటే ప్రతీదానికి సమయం సందర్భం ఉంటాయి కదండీ. అటువంటి సందర్భం వచ్చినపుడు పెడతాను.

Anonymous said...

మరి దేవుడి రూపాన్ని కొలిచే మా లాంటి వాళ్లు..
అలాగే సమయం సందర్భం చూస్తారని..దానికి
శాస్త్రీయపద్ధతి పై ఆధారపడతామని ఎందుకనుకోరు!!?

Anonymous said...

టైం ఉందా ఇంకా...సరి సరి..
కొత్తగా ఏమైనా రాస్తున్నారా?

ఔను...అవేమిటి...రాతలు...బూతులు.
etc...

ఆ.సౌమ్య said...

నేనంటున్నది ఆ సమయము సంధర్భము కాదండీ...దానిలో శాస్త్రీయత ఉంది అంటే నేను నమ్మలేను. కానీ దానిపై నాకంత అవగాహన లేదులెండి. ఉన్న కొద్దిపాటి జ్ఞానంలో ఆ శాస్త్రీయత కనిపించలేదు. కొంత తెలుసుకునే ప్రయత్నం కూడా చేసాను...ఊహూ కనిపించలేదు. మనము అనుకున్నదే మంచి ముహూర్తం అని నా నమ్మకం.

>>ఔను...అవేమిటి...రాతలు...బూతులు.etc...<<.....ఎక్కడండీ? నా బ్లాగులోనే?

ఆ.సౌమ్య said...

కొత్తగా రాస్తున్నానండీ. త్వరలో కొత్త పోస్ట్ పెడతాను. నెలకి 3-4 దాకా పెడుతూనే ఉంటాను.

Anonymous said...

నాక్కూడా లెక్కల మీద నమ్మకం లేదండి..
చిన్నప్పుడేప్పుడో...నమ్మడం మానేసా...
కొత్తగా రాస్తున్నదేమిటిట....ప్రకటన వెలువడనుందా?

రా & బూ : మీ బ్లాగ్'లో కాదు...అప్పుడెప్పుడో..ఏవో
చిన్నపాటి యుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి..+
ఎవరో కనిపెట్టుకుని...అదే పనిగా పెట్టుకున్నట్టనిపించిందిలెండి.

ఆ.సౌమ్య said...

మీరూ నమ్మారా...బావుంది.

ప్రకటనలూ అవీ ఏమీ ఉండవండీ. డైరెక్టుగా సినిమా రిలీజ్ అవుతుంది అంతే. :)

ఓ అదా..ఏవో పాతగొడవలులెండి. నాకు బ్లాగు లోకంలో శతృవులు బాగానే ఉన్నరు. ఆడపిల్ల ముక్కుసూటిగా మాటాడితే తట్టుకునేవారి సంఖ్య తక్కువ ప్రపంచంలో. ఆడపిల్లలు మాట్లాడకూడని కొన్ని టాపిక్కులు కొన్ని ఉన్నాయి సమాజంలో. మనం అలాంటివి పట్టించుకోము. అదన్నమాట సంగతి.

Anonymous said...

లెక్కలంటే..గణితం...

Anonymous said...

ఫాక్షనిజం నేపధ్యం కూడా ఉందన్నమాట.
ఈ గొడవల్లో...
ఎవరైనా..ఎవర్నయినా చంపారా?? లేదా చచ్చారా?
....లేదా ఉత్తుత్తి వీధి కొళ్లాయిల దగ్గర అమ్మలక్కల గోలేనా?

ఆ.సౌమ్య said...

ఆ జాలంలో చావడాలు, చంపుకోవడాలు ఏముంటుందిలెండి....వీధి కొళాయిల తగవులే, కాకపొతే ఆ అమ్మలక్కలు అప్పటికప్పుడు మరచిపోతారు. ఇక్కడ మరచిపోరు....అలా జీడిపాకంలా సాగదీస్తూ ఉంటారు. నేను పట్టించుకోను.

Anonymous said...

బాగుంది...మరి మీరు అమ్మాయిలు మాట్లాడటానికి
ఫలానా పద్ధతి అంటూ వుందంటున్నారు..కదా..అది ఏమిటి?

Anonymous said...

ఏమైనా అమ్మాయిలు సౌమ్యంగా,సుకుమారంగా వుంటే
బాగుంటుంది....ఝాన్సీరాణి,రుద్రమ దేవిల్లా యుద్ధాలు
చేసినా బాగుంటుంది....కానీ యుద్ధానికి అర్ధముంటే...
బాగుంటుంది.

ఆ.సౌమ్య said...

ఆ ఫలానా పద్ధతి నేను అంటున్నాది కాదండోయ్...సమాజం పెట్టింది. అవేమిటో చెప్పాలంటే అబ్బో...చాలా ఉందిలెండి. ఉదాహరణకి నేను రాసిన అసమాన సమాజంలో.... పోస్ట్ చాలామందికి నచ్చలేదు. అది నేను మాట్లాడకూడని విషయం.
ఇంక డీటైల్స్ ఎందుకులెండి. అసలే బ్లాగు గోడలకి చెవులుంటాయి.

>>ఏమైనా అమ్మాయిలు సౌమ్యంగా,సుకుమారంగా వుంటే బాగుంటుంది.<<...ఈ భాజాలమే నాకు నచ్చనిది. ఈ సుకుమారం, సౌమ్యం అన్నదానిపై ఒక పోస్ట్ పెండింగ్లో ఉంది. చాలారోజులుగా రాద్దామనుకుని ఆగిపోయాను. ఇక మీదట రాయాలి. సుకుమారం, సౌమ్యం న్నది మనసుకి సంబంధించినదండీ. శరీరానికి సంబంధించినది కాదు......ఆ లక్షణం ఆడవాళ్ళకి, మగవాళ్ళికి కూడా ఉండాలి. సౌమ్యంగా మాట్లాడడమన్నది ఆడమగాతేడా లేకుండా ఎవరికైనా వెలుగునిచ్చే లక్షణం.

Anonymous said...

అబ్బాయిలు సిగ్గు పడినా..
అమ్మాయిలు సిగ్గు విడిచినా..
కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది...
ఐతే...మనకి ఆడ,మగ తేడాలున్నాయి.
భేదాలున్నాయి...అంత మాత్రం చేత
వేరుగా ఉండలేంగా....
బేధాలు,తేడాలున్నదే కలయిక కోసం....

అలా తే&బే ఉండకూడదు...అంటే...
భౌతికంగా ఒకటే మార్గం ఉంది....సర్జరీ.
మానసికం ఐతే పరిణతి...ఇది పూర్తిగా
వ్యక్తిగతం...ఎవడ్ని ఎవడు మార్చాలి?మార్చగలడు?
మన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వుండొచ్చు...
దానికి చర్చలెందుకు...మనింట్లో మనం హాయిగా ఉండాలి అనుకోవటంలో తప్పులేదు...అందరిళ్లల్లో హాయిగా ఉండాలి..అనుకోవటం ఎలాంటిది అంటే...అందరిళ్లల్లో టి.వి'లు...ఏ.సి'లు
ఉండాలి అనుకోవటంలాంటిది..ఇలా వ్యాపారస్తులు మాత్రమే ఆలోచిస్తారు.....

గోడలు...అగాధాలు కాకూడదు...

ఆ.సౌమ్య said...

దీని మీద నా అభిప్రాయాలు వేరు. త్వరలో పోస్ట్ రాస్తాను అప్పుడు చర్చిద్దాం, ఏమంటారు?

Anonymous said...

చర్చ పాదరసంలాంటిది సుమా....
వేడెక్కితే వాదనవుతుంది.....

అభిప్రాయాలు తెలిసేవరకే చర్చ...
ఆపైన వాదనలే....
చర్చలే అరుదు...వాదనలో బిరుదులు వద్దు.
మీరు రాసినా చదివి ఊరుకుంటా....అంతే..
ఇలాంటి వాటిల్లో నేను పాసివ్ హీరోని.

*Browser Crash...i was unable to send u quick reply.

ఆ.సౌమ్య said...

చాలా బాగా చెప్పారండీ. చర్చ కి వాదనకి తేడా తెలిసినవాళ్ళు కొంతమందే. ఈ బ్లాగు లోకంలో అయితే మరీ అరుదు.

నేనూ వాదనని చాలామటుకు aviod చేస్తాను. కానీ ఒక్కోసారి దిగిపోతూ ఉంటాను (ఉడుకు రక్తం పైగా ముక్కు మీద కోపం)....కాకపోతే త్వరగా గ్రహించి బయటకి వచ్చేస్తాను.

నేను పోస్ట్ రాస్తానన్నది నా అభిప్రాయం చెప్పడానికే. ఇది మీకోసం మాత్రమే కాదులెండి. నేను గత 4-5 నెలలుగ పెండిగ్ పెట్టిన పోస్ట్. మొదలెట్టి ఆపేసాను. కాబట్టి త్వరలో పూర్తి చేస్తాను. అది చదివి మీ అభిప్రాయం చెప్పండి చాలు. వాదనలొద్దు, చర్చిద్దాం.