StatCounter code

Monday, December 26, 2011

రాజన్న నాకు నచ్చింది

నాకు రాజన్న నచ్చింది

ముందుగా
ఇలాంటి ఆలోచనతో ముందుకొచ్చిన విజయేంద్రప్రసాద్ గారికి ఒక సెబాస్
ఈ సినిమా చేసిన నాగార్జున కి ఒక భేష్
మొత్తం సినిమాని భుజస్కందాలపై మోసిన కీరవాణికి జేజేలు.

దిక్కుమాలిన కాలేజీ ప్రేమలు, అడ్డం గా నరుక్కోవడాలు, వెకిలి కామెడీలు, వందమందిని ఇరగదియ్యడాలు లేవు.

కొత్తగా, హాయిగా పోరాటవీరుడి చరిత్ర ఉత్తేజం కలిగించేలా ఉంది. మనకి ఇటువంటి కథలు సినిమాలుగా ఇంకా ఇంకా రావాలి.

ఈ సినిమాకి ప్రాణం కీరవాణి సంగీతం. పాటలు చాలా బావున్నాయి. నేపథ్య సంగీతం అంతకంటే బావుంది. నేపథ్య సంగీతం మాత్రం రికార్డ్ దొరికితే బాగుందును. రికార్డ్ వింటున్నప్పుడు "అమ్మ అవని" పాట బాగా నచ్చింది కానీ సినిమాలో ఇది mis fit అనిపించింది. రాజన్న పాడిన పాటలైనా పోరాటపటిమను నింపే జానపదాలు, మల్లమ్మ పాడిన పాటలు అందమైన జానపదాలు. చివరికి సడన్ గా వచ్చి మల్లమ్మ కర్నాటక సంగీతం పాడితే ఎలా? ఒక ఉద్వేగభరితమైన జానపదం....నేలమ్మతల్లి మీద...పెడితే ఇంకా రక్తి కట్టి ఉండేది. "వెయ్ వెయ్యరా వెయ్" పాటకి రోమాలు నిక్కబొడుచుకున్నాయి నిజంగానే.

బాగా కదిలించిన దృశ్యం రాజన్న వెనక్కి తిరిగొచ్చినప్పుడు ప్రాణం లేని పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకుని "గంగా మేలుకో" అని పాడే పిచ్చి తల్లి ఆవేదన. ఈ దృశ్యం ఒక్క కుదుపు కుదిపి పారేసింది.

అలాగే మల్లమ్మా రాజన్న సమాధిగా భావించే తులసికోటకి ఆకర్షితురాలు అవుతున్నాది అని గమనించి, భయపడ్డ ముసలితాత "అక్కడికి వెళ్ళొద్దు దెయ్యాలుంటాయని" మల్లమ్మని భయపెడతాడు. మల్లమ్మ భయపడి తాతని పట్టుకుని నిద్రపోతుంది. కానీ మధ్య రాత్రిలో తాత లేచి చూస్తే మల్లమ్మ రాజన్న సమాధి దగ్గరే కూర్చుని ఉంటుంది. అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లోఅపుడు ఒక పాట వస్తుంది...."చెడు మనసులో ఉన్న మనుషులకన్నా పెద్ద దెయ్యాలు లేవని రాజన్న చెబుతున్నాడో ఏమో" అన్న అర్థం లో వస్తుంది. చాలా బావుంది ఆ చిన్న బిట్.

ఒక పెద్ద అసంతృప్తి నాకు కనిపించింది ఏమిటంటే రాజన్నలాంటి ఉద్యమకారులు ఎందరో పుట్టారు ఆ సమాజంలో. ఇది ఒక వ్యక్తి తెచ్చిన విప్లవం కాదు. ఈ ఉద్యమాన్ని కొందరు వ్యక్తులు, కొన్ని తరాలు నడిపించారు...రజకార్లని ఎదిరించారు. కానీ ఇందులో రాజన్న ఒక్కడే ఎదిరించినట్టు, రాజన్న పోయక మళ్ళీ వాళ్ళ బతుకులు రజకార్ల కిందన నలిగిపోయినట్టు చూపించడం కొంత నచ్చలేదు. రాజన్న ఇచ్చిన స్ఫూర్తి కొన్ని తరాలకి కంటిన్యూ అయ్యింది అన్నటు చూపించి ముగిస్తే బావుండేది. అనవసరంగా నెహ్రూ గారిని తీసుకొచ్చి, ఎలా ముగించాలో తెలియక ముగించినట్టు అనిపించింది.

నాగార్జున డైలాగ్ డెలివరీ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుందును. చిన్నపిల్ల మల్లమ్మ నడిచి ఢిల్లీకి వెళ్ళడం అస్సలు నప్పలేదు. అదిలాబాదు నుండి ఢీల్లి కి వెళుతూ పంజాబ్ ని, రాజస్థాన్ ని ఎందుకు టచ్ చేసిందో తెలీదు.

మల్లమ్మగా ఏనీ, స్నేహ, రాజన్న నలుగురు మితృలూ, మల్లమ్మ ని పెంచిన ముసలోడు, దొరసానిగా వేసిన శ్వేతా మీనన్....అందరూ బాగా నటించారు.

నాకు బాగా నచ్చిన విషయమేమిటంటే రాజన్న ఊరికి వచ్చిన తరువాతా రజకార్లను, వారి కింద పనిచేసినవారినీ ఒక్క దెబ్బతో ముక్కలు ముక్కలుగా నరికేయలేదు....అందరికీ అండా దండా నేనేనంటూ ఒంటరిగా అందరినీ చావచితగ్గొట్టలేదు...రాఖీ సినిమాలోలాగ. ప్రజలలో పోరాట స్ఫూర్తిని నింపుతూ, కావలసి వచ్చినప్పుడు నడుం బిగించి పోరాటానికి దిగిన రాజన్న పాత్ర మలచిన తీరు చాలా బావుంది.

సినిమాలో హేమాహేమీలైన నటులున్నారు. వారందరీ పాత్రల నిడివి బాగా తగ్గినట్టనిపించింది. పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. అలాగే దొరసాని పాత్రధారి శ్వేతా మీనన్ ని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు అనిపించింది. పుర్తిగా సంతృప్తినిచ్చిన పాత్రలు ముసలి తాత, మల్లమ్మ మాత్రమే. ఎందుకో సినిమా complete అని అనిపించలేదు. అయినా సరే నాకు నచ్చింది. మంచి సినిమా చూసాం అనిపించింది.

ఈ సినిమాలో లోపాలు లేవని కాదు, కానీ ఇటువంటి సినిమాలకి ఇది ముందడుగు అయితే బావుంటుంది. అయితే దీన్ని ఇంకా చాలా గొప్పగా తీసి ఒక చరిత్ర సృష్టించగలిగిన golden chance మిస్ చేసుకున్నారనిపించింది. ఏది ఏమైనా ఇది మన తెలుగు సినిమాలకి స్ఫూర్తి ని అందించగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి.



23 comments:

శేఖర్ (Sekhar) said...

నాకు సినిమా సో-సో గ అనిపించింది..కాని మీ రివ్యూ చదివాకా మీరు చెప్పినదంత నిజమే అనిపించింది.....తెలుగు సినిమాలు చూసొచ్చి ఈమధ్య పాజిటివ్ గా రాసేవాళ్ళే కరువైన ఈ రోజుల్లో .....లోపాలని సున్నితంగా మందలిస్తూ సినిమా ని మెచ్చుకోవటం "నాకు నచ్చింది"

సినిమా ఓవరాల్ గా బాగుంది కాని...it could have been better అన్న ఫీలింగ్ నన్ను కొంచెం అసంతృప్తి కి గురిచేసింది.నాకు పాటలు మాత్రం చాల నచ్చాయి.

అందరికి ఒక మనవి....ఇలాంటి జానపద పాటలు ఇంకేమన్నా ఉంటె చెప్పండి..లేకపోతే ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తే అందరికి గుర్తుండి పోతుంది..

కృష్ణప్రియ said...

హ్మ్, నాకూ చూడాలని ఉంది.

శశి కళ said...

sowmya gaaru meerekkado undi kooda choosesaaru.
nenikaa choodaledu.ippudu choodaalani anipistundi.
agree with sekhar gaaru in songs matter

రాజ్ కుమార్ said...

excellent review..
నాకు నచ్చినవన్నీ మీరు చెప్పారు. బింగో...

కానీ ఇంకా బాగా తీసిఉండాల్సింది అని మాత్రం అనిపించింది. సినిమా చాలా బాగుందీ అనే మాట అనలేక పోతున్నా. కానీ కచ్చితం గా మంచి ప్రయత్నం

>>>>>
బాగా కదిలించిన దృశ్యం రాజన్న వెనక్కి తిరిగొచ్చినప్పుడు ప్రాణం లేని పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకుని "గంగా మేలుకో" అని పాడే పిచ్చి తల్లి ఆవేదన. ఈ దృశ్యం ఒక్క కుదుపు కుదిపి పారేసింది.
>>>>>
exaclty....

Indian Minerva said...

"దీన్ని ఇంకా చాలా గొప్పగా తీసి ఒక చరిత్ర సృష్టించగలిగిన golden chance మిస్ చేసుకున్నా"

నాకూ అదే అనిపించింది. ఈ చిన్నచిన్న లోపాలనుగూర్చి తగుజాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలాబాగుండేది

ఆ.సౌమ్య said...

@ శేఖర్
అవును it could have been better అనే అనిపించింది నాకూను.
Thanks!

@ కృష్ణ ప్రియ గారూ
మీ బెంగళూరులో ఆడుతోంది సినిమా చూసేయండి త్వరగా.
ఇంతకీ మీరు శ్రీరామరాజ్యం చూసారా లేదా?

ఆ.సౌమ్య said...

@ రాజ్
అవును మంచి ప్రయత్నం. ఇదే మొదటి మెట్టు కాబట్టి చిన్న చిన్న లోపాల్ని పక్కనబెట్టి మనం ఆదరించాలి. ఇలాంటివి ఎన్నో రావాలి.


@ శశికళ గారూ
చూడండి, తప్పకుండా చూడవలసిన సినిమా!

ఆ.సౌమ్య said...

@ Indian Minerva
అవును, కథ ఇంకాస్త పకడ్బందీ గా రాసుకుని ఉంటే బాగుండేది. హేమాహేమీలైన నటులున్నారు. వారనదరి నిడివి చాలా తగ్గించేసినట్టనిపించింది. సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఏదైనాగానీ మొదటి ప్రయత్నం కాబట్టి మెచ్చుకోవాల్సిందే! ఏమంటారు?

S said...

"అదిలాబాదు నుండి ఢీల్లి కి వెళుతూ పంజాబ్ ని, రాజస్థాన్ ని ఎందుకు టచ్ చేసిందో తెలీదు."
- దారి తప్పిపోయి ఉంటుందిలెద్దూ.... అంత దూరం చిన్న పిల్ల నడిచి వెళ్ళాలంటే.. పాపం కష్టం కదా. ఎంత రియలిస్టిక్ గా చూపారో! హౌ క్యూట్! :P

ఆ.సౌమ్య said...

@ S
దారి తప్పిపోయిందా....హహహహ...ఇంకా నయం కాశ్మీర్ వెళ్ళొచ్చిందిగాదు :D

Anonymous said...

సినిమా బాగుంది. కానీ చివర్లో ఆ నెహ్రూ ఎపిసోడ్ బాలేదు. ముఖ్యంగా నెహ్రూ గారి ప్రాత్ర వేసిన వ్యక్తిని చూసి హాలు నవ్వులతో దద్దరిల్లిపోయింది. సెన్సార్ కట్ ఇస్తుందని భయపడో ఏంటో నా తెలంగాణా కోటి రతనాల వీణ అన్న లెజండరీ కోట్ ని కూడా నా తెలుగు జాణ కోటి రతనాల వీణ అని మార్చారు.
తెలుగులో తెలంగాణా సాయుధ విప్లవం గురించి సినిమాలు రావాలి. ఓ పక్క రంగ్ దె బసంతి (భగత్ సింగ్), మంగళ్ పాండే, లగాన్ లాంటి సినిమాలతో హింది వాళ్లు వాళ్ల వాళ్ల వీరుల్ని తల్చుకుంటూంటే తెలుగు వాళ్లు రక రకాల కాంప్లెక్సులతో వదిలేసుకుంటున్నారు. ఆత్మకథలుగా, నవలలుగా, కవితలుగా, జానపదగేయాలుగా విస్తరించిన తెలంగాణా సాహిత్యాన్ని వాడుకుంటే ఎన్ని సినిమాలో తీసుకోవచ్చు.

ఆ.సౌమ్య said...

@ పక్కింటి అబ్బాయి గారూ
చాలా మంచి మాట చెప్పారు. ఇటువంటి కథలు మనకు రావాలి...ఎన్నో రావాలి. మన పోరాట చరిత్రలు, మన జానపద వీరులు, సాహిత్యం విరివిగా తెరకెక్కాలి.

Pavani said...

రాజన్న బావుంది అనే చెప్తా కానీ..1) నాగర్జున ఎంట్రీ దగ్గరినించి హీరోఇజం ఎక్కువైంది, ఆ పిల్ల మీదే కథ మొత్తం నడిపిస్తే బావుండేదేమో 2)రెండు హాఫులు దేనికదే అయిపొయ్యి వాటి మధ్య కనెక్షన్ గల్లంతైంది3)కొన్ని సన్నివేశాలకి లీడ్ సీన్స్ అసలు లేవు..ఉన్నచోట క్లియర్ గా లేవు. ఉదాహరణకి రాజన్న ఇంట్రో ఫైటింగ్, రాజన్న పెళ్ళి, దొరసాని-తమ్ముడు ఎపిసోడ్,చివరి సీన్లు మొత్తం 4)నాగర్జున కొన్ని చోట్ల తెలంగాణా, కొన్ని చోట్ల కొస్తా భాష అదీ అల్టెర్నేట్ సీన్స్ లో..కన్విన్సింగ్ గా లేదు 5) మల్లమ్మ ఢిల్లీ యాత్ర, అక్కడ ఒంటరిగానే ప్రధాని ఇంటి దగ్గరకి పోవటం(అక్కడ తనున్న ఇంటి వాళ్లు ఎందుకురాలేదు?) దారి మధ్యలో ఎడారి, దొరసాని ఢిల్లీ వొచ్చి మరీ అందర్నీ చితకబొడవటం (నేను ఆ పిల్లల్ని రక్షించిన వాళ్ళు పొయారనే అనుకున్నా ఆ రక్తం చూసి, బుట్ అరగంట తర్వాత ఒంటి మీద గాటైనా లేకుండా ప్రత్యక్షమౌతారు!) 6)ఒకటీ రెండు నాకు తెలియని విషయాలు..ఈ కథ మాయబజార్ కి ముందా? తర్వాతా?. అలాగే హైలెశ్శొ అంతూ వఛే పదాలు తెలంగణాలో చెరువు వొడ్డున పంచేసుకెనే వాళ్ళ నోటి వెంట వస్తాయా?రాజన్న చంపిన బ్రిటిషర్స్ ఏ ప్రాంతం వాళ్ళు? ఆటైములో నైజాం లో బ్రిటిషర్స్ ఉన్నారా?

అయినా నాకీ సినెమా నచ్చింది.మల్లమ్మ, పాటలు, కొన్ని కావ్య గౌరవాన్ని అందుకునే సన్నివేశాలు, ఇవి చాలు దీన్ని మరొ సారి చూట్టానికి.

SHANKAR.S said...

ఈ సినిమా కథ రజాకార్ల కాలంలో జరిగినట్టు చూపించారు. అంటే ఈ సినిమా కాలానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదన్న మాట. అంతే కదా. కానీ సంగీతం మాస్టారు పాత్ర(నాజర్) మల్లమ్మపాత్రధారికి రేడియో బహుకరించినప్పుడు అందులో "లాహిరి లాహిరి లాహిరిలో" అని 1957 లో రిలీజయిన మాయాబజార్లో పాట ఎలా వినబడిందో నాకర్ధం కాలేదు. :))))

గిరీష్ said...

After a long time, a different Telugu Movie..
u r right Sowmya ji..

ఆ.సౌమ్య said...

@ పావని గారూ
మీరు చెప్పినవన్నీ చాలా valid points. ఒప్పుకుంటున్నాను. చరిత్ర కి సంబంధించిన సినిమాలు తీస్తున్నప్పుడు ఇలాంటి వాటిల్లో ఇంకాస్త careful గా ఉండాల్సింది. చాలా వాటిల్లో లీడ్ సీన్లు లేవు అన్నది ముఖ్యమైన విషయం.

ఇంక మీ సందేహాల విషయానికొస్తే మాయాబజార్ సినిమా గురించి నాకూ డౌటు వచ్చిందండీ. కానీ ఆ సందేహం తీరిపోయేలా సినిమాలో ఒక చిన్న సీను ఉంది గమనించారా? మల్లమ్మ సంగీతం మాస్టారికి ఉత్తరం రాస్తుంది. అందులో తేదీ రాస్తూ 1958 అని వేస్తుంది. మాయాబజార్ 1957 లో విడుదల అయ్యింది. 1958 కి మాయాబజార్ కొత్త సినిమా కాబట్టి రేడియోలో ఆ పాటలు విరివిగా వేస్తున్నాడు అన్నది సమంజసమైన విషయమే. అలాగే దొంగరాముడు సినిమా 1955 లో విడుదల అయ్యింది. "చిగురాకులలో చిలకమ్మ" పాట కూడా వచ్చింది సినిమాలో. కాబటి మాయాబజార్, దొంగరాముడు పాటలు రావడం సముచితమే.

ఇంకా రెండో విషయానొకొస్తే....రాజన్న ఎంట్రీ సీను జరిగినది 1947 ముందు. మహరాష్ట్ర, ఆంధ్ర బోర్డర్ లో ఉన్న ఆంగ్లేయులతో రాజన్న, అతని మితృలు పోరాడారు. కాబట్టి అక్కడ బ్రిటిష్ వారు, మిగతావారు తెలుగు మాట్లాడడం లో ఆశ్చర్యం లేదు. ఆ పోరాటం తరువాత రాజన-మితృబృందం కలిసి తాము ఈ ప్రజలకై పోరాడతామని ప్రతిజ్ఞ పూనుతారు. ఆ తరువాత మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సంబరాలు చూసాక రాజన్న తన నేలకు పయనమవుతాడు. అప్పుడే మన నేలను ఆంగ్లేయులు విడిచిపెట్టిపోయారుగాని రజకార్లు ఇంకా ఉన్నారు. కాబట్టి ఈ విషయం కూడా సమంజసమే.

>>మల్లమ్మ, పాటలు, కొన్ని కావ్య గౌరవాన్ని అందుకునే సన్నివేశాలు, ఇవి చాలు దీన్ని మరొ సారి చూట్టానికి.<<

Yes, completely agree with you! :)

ఆ.సౌమ్య said...

@ శంకర్ గారూ
అవునండీ ఆ సమయానికి ఆంధ్రరాష్ట్రం ఏర్పడలేదు....అందుకే సినిమాలో ఆంధ్రప్రదేశ్ అన్నమాట ఎక్కడా తేకుండా అదిలాబాదు, నేలకొండపల్లి అంటూ ఊర్ల పేర్లని మాత్రమే ప్రస్తావించారు.

ఇంక మాయా బజార్ విషయమంటారా...మల్లమ్మ కథ 1958 లో జరుగుతోందండీ. మాయాబజార్ 1957 లోనే వచ్చేసింది కదా. పైన పావని గారికిచ్చిన కామెంటులో ఇంకా వివరంగా రాసాను. ఒకసారి చూడండి.

ఆ.సౌమ్య said...

@ giriish
Ritto :)))

Kottapali said...

Shankar.S, సామాన్యులు కాదు! పట్టు అంటే అదీ పట్టు!! సెబాష్!

ఆ.సౌమ్య said...

@కొత్తపాళి గారు
:)) సినిమా చూస్తున్నప్పుడు మా అందరికీ అదే డౌటు వచ్చిందండీ....కానీ సినిమాలో చూపించినది సముచితమే. వివరణ పైన పావని గారికి రాసిన కామెంటులో ఇచ్చాను, చూడండి.

Unknown said...

మీ పోస్టూ, కామెంట్లూ చూసాకా నాకూ సినిమా చూడాలని అనిపిస్తోంది. అందరూ బావుందనే అంటున్నారు. , మీరందరూ పేర్కొన్న లోపాలు తప్ప.

ఆ.సౌమ్య said...

@ ప్రసీద గారూ
తప్పకుండా చూడండి. బావుంది సినిమా!

వేణూశ్రీకాంత్ said...

రివ్యూ బాగా రాశారు సౌమ్యా.. నాకూ ఈ సినిమా గొప్ప సినిమా కాకపోయినా ఓ మంచి సినిమా అనిపించింది.