StatCounter code

Saturday, January 9, 2010

అసమదీయులకు స్వాగతం

నేనొచ్చేసానోచ్... నేను సైతం చేతిదురదకి బ్లాగునొక్కట్టి మొదలుపెట్టాను అంటూ విచ్చేసా :)
చిన్నప్పటి నుండి తెలుగు పుస్తకాలు చదువుకుంటూ, పైంటింగ్స్ వేసుకుంటూ కాలక్షేపం చెయ్యడం నాకలవాటు. ఈ మధ్యనే కొత్త గా ఉద్యోగంలో చేరానా, నా కాలక్షేపానికి సమయం చిక్కట్లేదు. కాలు చెయ్యి విరిచీసుకున్నట్లయింది. ఎలా మళ్ళీ నా కాలక్షేప కార్యక్రమానికి దగ్గరవుదామబ్బా అని ఆలోచిస్తూంటే ఓ గోపిక తటస్థపడి, పిల్లా ఇలా రా అని తీసుకెళ్ళి తోటరాముణ్ణి చూపించింది, చంద-మామనందించింది, చేగోడీలు తినిపించింది. ఇహ అంతే ...అసలే కొస చూపిస్తే అల్లుకుపోయేరకం నేను...ఇలా వచ్చి ఈ బ్లాగ్లోకం లో పడ్డా. పడినదగ్గరనుండి ఒకటే వింతలు విడ్డూరాలునూ. ఇక్కడ రెండు రెళ్ళు ఆరట, చేగోడీలు తింటే నవ్వొస్తుందిట, జూ లో రన్నింగ్ సినిమాలట, టెక్కునిక్కుల వీవెనలట, ఏకి పారేసి పీకిపందిరేస్తారట, ఒకడు అరిస్తే వాద్యంట-కరిస్తే వైద్యంట, మధ్యమధ్యలో మలక్పేటరౌడీ బెదిరింపులు, చాకిరేవు లో ప్రశస్థమయిన ఉతుకుడు కార్యక్రమాలు, పక్కనే ప్రవహించే అంతర్వాహినిలో జాలువారే హిమబిందువులు, మదిలో నిలిచే ఆలోచనాతరంగాలు, చక్కని పర్ణశాల వంటి చిన్ని ప్రపంచంలో వినిపించే అసంఖ్యాకమైన తేటగీతులు, రసఙ్ఞులాలపించే వేణువులు, ఆనందం కలిగించే వరాళి వీచికలు, మనసులోని మాటలు, ఊసుపోని కబుర్లు ఇలా కలగూరగంపలా ఎన్నో ఎన్నేన్నో చిత్రవిచిత్రాలు. అలా అక్కడ విహారిర్తూండగా స్త్రీవాదం పేరిట ఒక పైత్యావలోకనం ఎదురుపడింది. ఆ పైత్యానికి తగ్గ వైద్యం చెయ్యడానికి, సహబ్లాగర్లతో చేరి ప్ర.పీ.స.స ఆస్పత్రి నిర్మించి దాని సెగట్రీగా ఉంటూ వచ్చాను. అంటే చెప్పుకుంటే బాగుండదుగానీ అక్కడ నాకు ఫ్యాన్లు, ఏసీ లు ఎక్కువయిపోయి బ్లాగు మొదలుపెట్టమని మరీ మొహమాటపెట్టేస్తూంటేనూ సర్లేపోనీ అని బ్లాగు మొదలెట్టేసా. ఆ ఆ ఆగండాగండి అప్పుడే కీబోర్డులుచ్చుకుని మీ మీ బ్లాగులవైపు పరిగెట్టేస్తున్నారా నా మీద బరికెయ్యడానికి...మీరు ఆపని చెయ్యకుండా ఉండడానికే ముందే వేసానుగదా సమ్మోహనాస్త్రం అసమదీయులని….కోప్పడకండేం, నాక్కొచం చేతి దురదెక్కువని ముందే సవినయంగా విన్నవించుకున్ననుగా. ఇలాగే మీ ఆదరాభిమానాలు నా మీద, నా బ్లాగు మీద ఉండాలని కోరుకుంటూ శెలవు కాదు మొదలు.....అంతం కాదిది ఆరంభం.....టడట్టడట్టడాయ్ తసమదీయులకు హెచ్చరిక: ఏదో సౌమ్యంగా ఉంటానని నా బ్లాగుకొచ్చి పిచ్చిరాతలు రాసి, కారుకూతలు కూసారో సహించను, క్షమించను. అసలే నేను మాయాశశిరేఖని, కనికట్టులు, కరకట్టులు నాకు వెన్నతో పెట్టిన విద్య. మీ మీ బ్లాగులకొచ్చి చిత్తచాంచల్యం, భ్రమ, భ్రాంతి లాంటివన్ని కలిగించేస్తాను. తస్మాత్ జాగ్రత్త !

26 comments:

నాగప్రసాద్ said...

హమ్మో! సౌమ్య గారు, మొదటి టపాతోనే "లక్ష్మణ కుమారు"లను భయపెట్టినంత పని చేశారు కదండీ. :-)

హై...హై...సెగట్రీ...హొయ్...హొయ్...సెగట్రీ. సెగట్రీ గారికి స్వాగతం.

ఆనందమానంద మాయనే.
మన సెగట్రీ బ్లాగు మొదలెట్టెనే.
కూడలిలో, జల్లెడలో బ్లాగునే కలపగా
బ్లాగులోకంలోకి మాయా శశిరేఖగా వచ్చెనె.
ఆనందమానంద మాయనె.

Anonymous said...

Most welcome into blog world..
మీ బ్లాగ్ లో మొదటి కామెంట్ నాదే :) !

చైతన్య.ఎస్ said...

బ్లాగ్లోకానికి స్వాగతం సుస్వాగతం :)

Wanderer said...

బ్లాగ్ మొదలు పెట్టావు, ముదావహం. నీ బ్లాగ్ అంచెలంచెలుగా ఎదగాలని, తసమదీయులకి సింహ స్వప్నం కావాలని ఆశిస్తున్నాను.

sowmya said...

@నాగప్రసాద్
హ హ హ మీ పాట సూపరు...ధన్యవాదములు

బ్లాగ్లోకాన్ని కాస్త స్టడీ చేసాను కదా ఇన్నాళ్ళు, చాలామంది లక్ష్మణకుమారులే కనిపించారు....మరి ముందు జాగ్రత్త తీసుకోవద్దూ :)

sowmya said...

@Mohan,
Thanks a lot !
మీకా ఛాన్సు Nagaprasad ఇచ్చినట్టు లేడు :)

sowmya said...

@wonderer
మీలాంటి పెద్దల ఆశీర్వాదం, అభిమానం ఉంటే అంచలంచలుగానే కాదు అచంచలంగా కూడా ఎదగగలనని ప్రగాఢ విశ్వాసం :)

sowmya said...

Thanks chaitanya !

karthik said...

బ్లాగ్లోకానికి స్వాగతం!! నీ క్రియేటివిటీ చూపించు..

ఏదొ కవితా సంకలనం రాస్తానన్నావు కదా అదేదొ తొందరగా రాసి నాకు అంకితమిచ్చేయ్, లేక పొతే నీకు వదినాధ్యక్ష పదవి తప్పదు..

"ఒకడు అరిస్తే వాద్యంట-కరిస్తే వైద్యంట"

మొదటి టపాలోనే నా మీద సెటైర్లు అవసరమా? అహాం అవసరమా అని ప్రశ్నిస్తున్నాను?? అంతే, తల్లి లేని పిల్లలన్నా, బిజీగా ఉండే బ్లాగర్లన్నా లోకానికి లోకువ :) :) :)

-కార్తీక్

sowmya said...

@కార్తీక్
మనకొచ్చిందే సెటైర్లు వెయ్యడంకదా...అది మనకి వెన్నతోపెట్టిన విద్య, సెటైర్లు వెయ్యకుండా చెయ్యూరుకోదుగా :)

అబ్బ ఛా ఏం సూక్తి చెప్పావ్ !

ఇస్తా ఇస్తా కవితాసంపుటి రెడీ అవుతున్నాది...కొంచం ఓపిక పట్టు !

Anonymous said...

welcome :)
meeku guide laantidi. ee blog posts & comments poortigaa chadivi blog prayaanam saaginchandi http://dhoommachara.blogspot.com/

All the best :D

Anonymous said...

రండి రండి. మీరూ మాయలోపడిపోకుండా, బ్లాగ్లోక గురువులను భజనచేసే లఘువులను భ్రమలో బతికే అక్కలను మానసికరోగులైన చెక్కలను ఓఆటాడించండి.

sowmya said...

@ Anonymous
బాబోయ్ ఇన్ని వింతలున్నయా బ్లాగ్లోకంలో...ముందుగానే హెచ్చరించినందుకు thanks
నా జాగ్రత్తలో నేనుటాలెండి.
ఇక ఆటాడించే కార్యక్రమానికొస్తే, నాజోలికి రానంతవరకు నేనెవరిని పట్టించుకోను. కానీ నన్ను అనవసరంగా కెలికారా, అంతే సంగతులు ముందే చెప్పాగా కనికట్టులు కరకట్టులు నాకు కొత్త కావు అని :)

Raj said...

చాలా బాగుంది మీ బ్లాగు.. మరియు రచనా శైలి.

sowmya said...

Thanks Raj :)

శ్రీనివాస్ పప్పు said...

స్వాగతం దొరీ("దొరా" కి ఆడపోలిక..హిహిహి)స్వాగతం
స్వాగతం దొరీ సుస్వాగతం,బ్లాగ్లోకానికి స్వాగతం...

sowmya said...

Thank you srinivas dora garu :)

Anonymous said...

Happy to see you start upon one of your fan's ( ante nene ) request !

Anonymous said...

Welcome to bloggers world as an author
all the best to you sowmya

-pra pee sa sa member

Anonymous said...

"ఒకడు అరిస్తే వాద్యంట-కరిస్తే వైద్యంట"
marthanda kada vadu
i know

sowmya said...

Thanks Anonymous గారు
ఏదో మీ అభిమానం :)
అరిస్తే వాద్యం-కరిస్తే వైద్యం అంటే మార్తాండ కాదండీ. అది మన కార్తీక్. తన బ్లాగు ఎప్పుడూ చూడలేదా మీరు? ఓ సారి చూసిరండి అప్పుడర్థమవుతుంది, ఎందుకలా అన్నానో

గీతాచార్య said...

Oh you started blog. Cheppanelede?

Any way congrats

sowmya said...

గీతాచార్యగారూ
ఇప్పుడు చెప్పాగా :)
Thank you !

ప్రియ said...

మీ బ్లాగు పేరు కత్తిలా ఉందండీ

sowmya said...

Thanks Priya ! :)

స్థితప్రజ్ఞుడు said...

హమ్మయ్య....ఈరోజు తో మీ బ్లాగులో ని అన్ని టపాలు చదివేసా.....ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది.