StatCounter code

Wednesday, March 17, 2010

ఆమెకు అభినందనలు


ఇది కథో, నిజమో తెలీదు, కానీ ఇన్నాళ్లకి ఒక మహిళ ఇలా పోరాటం సాగించడం నిజంగా అభినందనీయం. ఇది ఇవాళ "ఈనాడు" పత్రికలో వచ్చింది.

ఈ గొడవలలో ఆమె జీవితం కొంత నలుగుతున్నందుకు బాధ కలిగినా, ఆమె ఆత్మస్థైర్యానికి జోహార్లు. ఇవన్నీ మామూలే అని చెప్పి, సింపుల్ గా అబార్షన్ చేయించుకుని జీవితంలో ముందుకు సాగిపోవడం కూడా ఈ సమస్యకి ఒక పరిష్కారమయితే అవ్వొచ్చు, కానీ ఆమె మనశ్శాంతికోసం చేస్తున్న ఈ పోరాటానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆమెకి ఎలా సహాయం చెయ్యగలనో తెలీదు కాని అవకాశం వస్తే తప్పక ఆమె పక్షాన నిలబడతాను.


అందరికీ నా విఙ్ఞప్తి:
ఒకవేళ ఈ వ్యధ నిజమయితే, ఈ అమ్మాయి వివరాలు తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నించగలరు, నేను కూడా చేస్తాను. ఎవరికైనా ఏ విధమైన ఇంఫర్మేషన్ దొరికినా నాకు తెలియజేయగలరు.

23 comments:

Anonymous said...

ఒక ఆడపిల్లకు కష్ట౦ వస్తే సర్దుకోమనేవాళ్ళే అ౦దరూ. వాడికే౦ మగాడు, అనేసి తప్పి౦చుకోజూస్తారు. ఈ సమాజ౦ ఎన్నటికి బాగుపడేనో...!

Nuvvu-Nenu said...

e kadhanam chadivaka...ammayi vishayam lo badha ga unna koncham kopam ga kooda undhi...

intha chaduvu chaduvu kuni..koda ila abbayila trap lo ela padatharo kooda ardham kadhu...

Thanu cheppina matalu vintuntey...he just need physical relation with her ani clear ga ardham avuthundhi....

any how i just wish her a success.

కత్తి మహేష్ కుమార్ said...

వాడిమీద సెక్షన్ 420 క్రింద కేస్ వెయ్యొచ్చే!
పోరాడుతున్న మహిళకు మనం ఇవ్వగలిగింది నైతిక మద్దత్తు. ఇలాంటి విషయాలపై పోరాడుతున్న సంస్థల అడ్రస్సు. సత్యవతిగారిదో సంధ్యగారిదో ఫోన్ నెంబర్.

sowmya said...

స్పందిన పై ముగ్గురికీ ధన్యవాదములు

@ మహేష్
ఈ అమ్మయి వివరాలు అవీ నాకు తెలీవు.
ఇది ఇవాళ (17/03/10) ఈనాడు పేపర్ లో వసుంధరలో వచ్చింది.
అమ్మాయి వివరాలు తెలిస్తే ఆమెకి, మనమేమైనా సహాయం అందించగలమేమో.


అందరికీ నా విఙ్ఞప్తి:
ఈ అమ్మాయి వివరాలు తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నించగలరు, నేను కూడా చేస్తాను. ఎవరికైనా ఏ విధమైన ఇంఫర్మేషన్ దొరికినా నాకు తెలియజేయగలరు.

నీకోసం.. said...

నాకైతే అమ్మయిదే తప్పనిపిస్తుంది. ఆవిడ ఒప్పుకొని ఉండకపోతే ఇలా జరిగేది కాదు. గర్భం దరిస్తే పెద్దలు ఒప్పుకుంటారు అని చెప్తే ఎలా నమ్ముతారు ఎవరైనా?

సందిస్తే ప్రతి ఒక్కరు అవకాశవాదులే. ఎవరిని ఎక్కడ ఉంచాల్నో అక్కడ్ ఉంచితే ఇలా జరిగేది కాదుగా. అంతదాక తెచ్చుకొని ఇప్పుడు బాద పడడం లాబం లేదు.

Nuvvu-Nenu said...

i Agree with the above comment.

కత్తి మహేష్ కుమార్ said...

@నీ కోసం: మీ వాదనలో చాలా సహజమైన ఆభిజాత్యం ఉంది చూడండీ, అదే అసలు సమస్య. నమ్మిన అమ్మాయిది తప్పు. నమ్మించి మోసం చేసినవాడిది తక్కువ తప్పంటారా!

ఆ అమ్మాయి కేవలం బాధపడి ఊరుకోవడం లేదు. ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. అది ఎంత కష్టమో, ఎంత సాహసమో గుర్తించండి.

Malakpet Rowdy said...

LOLZ the fault is on both sides. Everything happened with mutual consent. She knew well ahead that he was engaged to somebody else but still decided to continue the romantic relationship with him. So, I am not sure whether its a legal case at all.

Even if it's a case, it will be a minor case and he has a strong legal point that she knew everything in advance.

As of the morality of the issue - the fault is on both sides. A physical relationship before marriage says it all!

It's bad thing that she has been left to her own fate but I am not sure whether he can be punished unless some more information is available.

తార said...

sadharanam ga eenadulo, ee column naku telisi genuine kaadu

Anonymous said...

ఇంత అమాయకంగా ఉంటే మీరు ధైర్యం అంటారేంటి?
ఒక రెండేళ్ళు వెంటపడి నాలుగు లవ్ లెటర్లు రాయగానే ప్రేమ అనేసుకుని తిరిగి,....అసలు ప్రేమంటే ఇంతేనా? Thanks to our so called love movies. ఒక పక్కన అతగాడికి వేరే పెళ్ళి కుదిరినట్టు తెలిసినా కూడా ఇంకా కలవడం అమాయకత్వం కాక మరేమిటి? కానీ ఆ తర్వాత పోరాటం సాగిస్తున్నందుకు మద్దతు తెల్పాల్సిందే.
కాని ఇలాంటివి చదివైనా ఒక పదిమంది అమ్మాయిలు ప్రేమకు ఆకర్షణకు తేడా తెలుసుకున్నప్పుడు, బాగు పడినప్పుడు ఆవిడ చేసే పోరాటనికి అర్థం ఉంటుంది.

sowmya said...

మీరు అందరు చెప్పినదాన్లోనూ ఒక్కొక్క పాయింటు ఉంది.

అన్ని తెలిసి మోసపొయింది అని చెప్పడంలో అర్థం లేదు, కానీ ఆ అమ్మయి జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆ కుర్రాడి అసలు రూపం ముందే కనిపెట్టల్సింది. కానీ గుడ్డిగా నమ్మింది. సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని ఏడుస్తూ కూర్చోక ధైర్యం గా పోరాడుతున్నాది. అది చాలా ధైర్యసాహసాలతో కూడిన పని. మన సమాజంలో సాధారణంగా ఎవ్వరూ చెయ్యని పని. అందుకే ఆమె పోరాటనికి మన నైతిక మద్దతు అవసరం.

మలక్ చెప్పినట్టు ఋజువులు లేక ఆ అబ్బయి తప్పించుకునే అవకాశం కూడా ఉంది. బలాబలాలు, లోతుపాతులు మనకి తెలియవు. తప్పు ఇద్దరి వైపు నుండి ఉండొచ్చు. కానీ ఫలితం ఒకరే అనుభవించడం అన్యాయం. దానికే ఆమె పోరాడుతున్నది. అందుకే ఆమె అభినందనీయురాలు.

అఙ్ఞాత చెప్పినట్టు ఈ అమ్మయిని చూసి మరికొందరైనా నేర్చుకుంటే ఆమె చేస్తున్న పోరాటానికి సార్థకత ఉంటుంది.

నీకోసం.. said...

@ మహేష్
మోసం అనేది నమ్మిన వాళ్ళనే చేస్తారు. నమ్మని వాళ్ళను ఎవరు మోసం చేయ్యరు. ఇక్కడ జరిగింది రేప్ కాదండి. ఎవరో రేప్ చేసి పారిపోతే అది ఒక్క మగాడి తప్పు. అప్పుడు మహిళ పక్కన నిలబడి న్యాయం కొసం పోరాడడం లో ఒక అర్థం ఉంది. కాని ఇక్కడ ఇద్దరి అంగీకారంతోనే అన్నీ జరిగాయి. అందునా, ఈ అమ్మాయికి అన్ని విషయాలు తెలుసు. తెలిసి కూడ తన జాగ్రత్తలో తను ఉండక పోతే ఏ అబ్బాయయినా ఇలాగే చేస్తాడు (నా ఉద్దేశంలో).


______

ఆ అమ్మాయి కేవలం బాధపడి ఊరుకోవడం లేదు. ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. అది ఎంత కష్టమో, ఎంత సాహసమో గుర్తించండి.
________________________
ఈ సాహసం ఇప్పుడు చేయడం కంటే, అబ్బాయితో తిరుగుతున్నప్పుడే సాహసం చేసి ఇంట్లో వాళ్ళకు చెప్పుంటే పరిస్తితి ఇలా ఉండెది కాదుకద.

నేను అబ్బాయి చేసింది కరెక్ట్ అని వాదించడం లేదు. అతను నమ్మించి మోసం చేయడం ముమ్మాటికి తప్పే. నమ్మకాన్ని వమ్ముచేసే గుణం మగాల్ల జన్మ లక్షణం. ఇలా ఇద్దరు కలిసి తిరిగే విషయాల్లో చివరగా నష్టపోయేది అమ్మాయే కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది.

Praveen Communications said...

సౌమ్య. ICRIER వెబ్ సైట్ లో నీ ప్రొఫైల్ చూశాను. నువ్వు ఇంత చదువుకున్నదానివయ్యుండీ మూఢ నమ్మకాలని ఎలా నమ్ముతున్నావు? విధవా వివాహాలని వ్యతిరేకిస్తూ భర్త చనిపోయిన స్త్రీలు పిల్లలని చూసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని వాదించేవాళ్ళు స్త్రీవాదులా? సంప్రదాయవాదం మీదే ఎక్కువ నమ్మకం ఉన్న నీకు స్త్రీవాదంతో పనేమిటి?

sowmya said...

@ప్రవీణ్,
ఈ కామెంటు రాసినది అసలు ప్రవీణే అయితే

నేను విధవా వివాహాలకు వ్యతిరేఖమని ఎక్కడ చెప్పాను?
నువ్వు నా కామెంటు ఎక్కడ చూసావు?
భర్త చనిపోయిన స్త్రీలు పిల్లలని చూసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని నేనెక్కడ వాదించాను?

అసలు నేను రాసిన టపాకి, నువ్వు రాసిన విషయాలకి ఏమైనా సంభందం ఉందా?

sowmya said...

@ నీకోసం

మీరు చాలా పొరబడుతున్నారు. మోసం చెయ్యడం మగవాళ్ళ జన్మ లక్షణం, మగవాళ్ళంతా అంతే అనుకోవడం చాలా చాలా పొరపాటు. దయచేసి మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఎక్కువ శాతం అబ్బయిలు అలా ఉండొచ్చు, కానీ అందరూ అలాంటివాళ్ళు కాదు.

మేమంటున్నదొక్కటే....ఇందులో అమ్మయిది, అబ్బయిదీ ఇద్దరిదీ తప్పు ఉంది అనుకుంటే అమ్మయి ఒక్కర్తే ఫలితమనుభవించడం భావ్యం కాదు. అబ్బయి తప్పించుకుని తిరుగుతున్నాడు, కాబట్టే ఆ అమ్మాయి పోరాడుతున్నాది. ఆ అమ్మాయి, అతని విషయం ముందే గ్రహించగలిగిఉంటే తగు జాగ్రత్తలు తీసుకునేదే. తమ మనసులోని కుళ్లు ను బయటపడనివ్వకుండా నటించడం పెద్ద విషయమేం కాదు. అలా ఎంతో మంది చెయ్యగలరు.ఆ తెలివితేటలతోనే తనని మోసం చేసాడు. ఇంత జరిగాక ఆ "అమ్మయి సరిగ్గా ఉండలేదు, తనదే తప్పు" అని తప్పు మొత్తం తన నెత్తిన రుద్దడం సమంజసం కాదు.

karthik said...

మీరందరూ ఒక విషయం మర్చిపోతున్నారు.. ఇప్పుడు ఆ అమ్మాయికి తన బిడ్డని పెంచడం లేదా, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కాదు.. అంతకంటే పెద్ద సమస్య ఆమెకు తగిలిన మానసిక గాయం.. ఒకసారి అంతాగా దెబ్బతిన్న తర్వాత మరొక మనిషిని ఆమె నమ్మడం జరిగే పనేనా?? for me the core issue is the breach of trust which is severe than pregnancy!!

మన సమాజం లో వ్యక్తుల స్థాయి నుంచీ సమూహాల స్థాయి వరకూ ఉన్న అపనమ్మకాలకు ఇలాంటి సంఘటనలే కారణం అని నాకనిపిస్తుంది.. ఒక్క క్షణం ఆలోచైంచండి ఎంత మంది పిల్లలకు ఎవరిని నమ్మొద్దు అని చెప్పకుండా ఉన్నారు??

-కార్తీక్

sowmya said...

well said kartik,
అందుకే నేనన్నాను, ఆమె మానసిన ప్రశాంతత కోసం చేస్తున్న పోరాటమిది అని.
ఎవ్వరినీ నమ్మొద్దు అని చెప్పలేము, అందరినీ నమ్ము అని చెప్పలేము.
ఎవరిని నమ్మలో, ఎవరిని నమ్మకూడదో అనుభవం ద్వారా నేర్చుకోవల్సిందే. కానీ తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం. ఏదైనా పని చేసే ముందు ఒకటికి, రెండు సార్లు వివేకంతో ఆలోచించుకోవాలి

నాగప్రసాద్ said...

మరోసారి వాడి పక్కలో పడుకుంటా అని చెప్పి, సైలెంటుగా ఏసెయ్యాలి ఆణ్ణి అంతే. సచ్చూరుకుంటాడు ఎదవ. ప్చ్...ఇలా చేసినా కూడా ఇప్పుడు మరో అమ్మాయి జీవితం బలవుతుంది. :((.

కనీసం, ఇటువంటివి చదివినప్పుడైనా అమ్మాయిలు పెళ్ళికి ముందు ఎంతమందితో తిరిగినా కొన్ని విషయాల్లో హద్దులు దాటకుండా జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళకే మంచిది. ఈ ఆర్టికల్ చదివి కనీసం పదిమంది అమ్మాయిలు అలాంటి జాగ్రత్తలు తీసుకున్నా, వాళ్ళ పాలిటి దేవత ఈమె.

sowmya said...

well said నాగప్రసాద్

Pradeep said...

Just found your blog. I read it all posts in sequence.. nice blog

Anonymous said...

karthik గారు సరిగ్గా చెప్పారు ఇలాంటి సందర్భాలు మరియు వైవాహిక జీవితంలో జరిగిన గాయాలు, బంధం విచ్చిన్నమైనప్పుదూ అందరూ స్త్రీ గురించి స్పందించే తీరు డబ్బుతో compensation గురించే! 'ఆమెకి తగిలిన మానసిక గాయం' అదీ అందరూ ఆలోచించవలసింది ఆమె గాయాన్ని మానిపించే కోల్పోయిన ఆత్మస్థైర్యం కలిగించే దిశగా మొదట ప్రయత్నించాలి.

sowmya గారు ప్రవీణ్ ఇలా గాక ఇంకెలా రాస్తాడు కామెంటు :) అన్నయ్యకు స్త్రీలను ఉద్దరించటమంటే పెళ్ళి ఉద్యోగం అవే. స్త్రీ ని తన్ని మరీ చెయ్యను మొర్రో అన్నా ఉద్యోగం చేయించాలంటాడు. ఉద్యోగమైనా పెళ్ళి ఐనా చెయ్యాలో వద్దో చేసుకోవాలో వద్దో నిర్ణయించుకునే అధికారం స్ర్తీలకు ఇస్తే మరి మరి మన అన్న్యా ఎవరిని ఉద్దరిస్తాడు పాపం :)

అన్న్యా ఇంకో సూత్రం స్త్రీలు పెళ్ళి చేసుకునే ముందే ఈ పెళ్ళి నిలవకపోతే (నష్టం వస్తే)రెండో పెళ్ళి ఎవరిని చేసుకోవాల అని నిర్ణయించుకుని ( బిజినెస్సుమొదలెట్టే ముందే ఫ్రాఫిట్స్ రాకపోతే ఇంకోబిజినెస్ ఆలోచించుని పెట్టుకున్నట్టు) పెళ్ళి పీటల మీద కూర్చోవాలి.
ఈ స్త్రీ వాదికి ప్రేమ అనే పదం ఒకటుందని ఎప్పుడు తెలుస్తుందో. తన భార్య లేదా భర్త లేకపోతే జీవితమే లేదనుకునే అనుబంధాల గురించి ఈ స్త్రీవాదికి చెప్పినా అర్ధం కాదు.

నాగప్రసాద్ గారు. సరిగ్గా చెప్పారు. జాగ్రత్త పడాల్సిందే. కానీ ఓ నాలుగు రోజుల కిందట టివి లో ఓ వార్త చూశాను. ఓ స్కూలు అమ్మాయిని ఆమె ప్రియుడు అతడి ఇద్దరు స్నేహితులతో తన రూము కి తీసుకువెళ్ళి అందరూ కలిసి ఆమెని బలవంత పెట్టారట. ఆమె ఒప్పుకోకఇలా జరిగితే నేను కాల్చుకుని చస్తాను అన్నదని ఐతే మేమే కాల్చేస్తాం అంటూ కిరోసిన్ పోసి నిప్పుపెట్టి పారిపోయారట. ఆమె 40% కాలిన గాయాలతో చావు బతుకుల్లో వుంది. అమాయకంగా ఇలా బలి ఐపోయేవారి పరిస్థితి ఇంకా దారుణం.

పవన్ said...

ఏందుకో ఇది నిజంగా జరిగింది అనుకోవడం లేదు....
ఒక్కవేళ జరిగే ఉంటే..
నిశ్చతార్దం అయింది అని తేలిసి, మళ్ళి ఏలా ఆ వేధవని నమ్మగలిగింది.ఇప్పుడు చుపిస్తున్న దైర్యం ముందు ఉంటే బాగుండేది.

sowmya said...

Thanks Pradeep

@Anonymous
మీకు అన్నయ్య గురించి బాగా తెలిసిపోయిందనుకుంటాను :)

@పవన్
ఇది నిజం కాకపొతే ఎంతో సంతోషం