StatCounter code

Thursday, April 8, 2010

పిచ్చపిచ్చగా లైట్ తీసుకో !


ఇదే మన తెలుగు న్యూస్ ఛానెళ్ల భాష.

వీటీకి ఆదిగురువు...వేరే చెప్పక్కర్లేదనుకుంటా, అదేనండీ మన నిరంతర వార్తా స్రవంతి TV9.

ఆ మధ్య ఎప్పుడో నా ఖర్మ కాలి అందులో ఏదో దిక్కుమాలిన ప్రోగ్రాం చూసాను. అందులో వాళ్ళ భాష మహ కనికిష్టం.

" ఇవాల అక్కడ పబ్లిక్ పిచ్చ పిచ్చ గా ఎంజాయ్ చేస్తున్నారు"

"జరిగిందేదో జరిగింది అనుకుని జనాలు లైట్ తీసుకున్నారు"

ఇవి వింటుంటే నాకు చెవుల్లో ఆముదం పోసినంత బాధగా అనిపించింది.

పిచ్చ పిచ్చగా, లైట్ తీసుకో అన్న పదప్రయోగాలు చూసి నివ్వెరపోయాను. ఈ పదాలు మనం సరదాగా, మన స్నేహితులతో అంటూ ఉంటాం. వాటిని తీసుకొచ్చి తమ ప్రోగ్రామ్ముల్లో వాడితే జనాల్లోకి దూసుకుపోవడం అనుకుంటున్నారు కాబోలు ఆ సదరు టివివారు.

ఈ మధ్య నా దురదృష్టం పుచ్చిపోయి జెమిని వార్తలు వినాల్సిన అగత్యం ఏర్పడింది. ఆ సదరు మహాతల్లికి "విద్యార్థి" అనడం రాదు. అరగంటసేపు చదివిన వార్తల్లో ఓ 10-15 సార్లు విద్యార్థి అన్న పదం వచ్చి ఉంటుంది. అన్నిసార్లు ఆవిడ "విధ్యార్థి" అని అంటూనే ఉంది. ధ కి ఒత్తులేదన్న విషయం సదరు పఠకురాలికి తెలియదనుకుంటాను. సరే, ఆ రోజు పొరపడినట్టున్నారు మర్నాడు సరి చేసుకుంటారని ఆశపడ్డాను. ఆ ఆశ అడియాశ అని ఋజువయింది. వరుసగా నేను చూసిన మూడు రోజులు ఆవిడ విధ్యార్థి అనే చదివింది. చెవుల్లో చీమలు దూరినట్టు అనిపించింది.

వీళ్లకి ఎక్కడ ఒత్తు పెట్టలో, ఎక్కడ పెట్టకూడదో తెలీదు.
"సంబంధం", "భేదం" "బాధ" లాంటి పదాలు వారి నోట పడి మనకు కడు ఖేదాన్ని కలిగిస్తాయి. "ళ" పలకడం రాదు. వీల్లకి, వాల్లకి, నీల్లు అంటారు.

ఇంకొక ఉదంతం TV5లో...."సంభ్రమాశ్చర్యాలు" అనేది మాహా కష్టమైన పేద్ద పదం ఆ సదరు పఠకుడికి.

ఆయనగారు సంబ్ర్ సంబ్ర్ సంభ్రమాశ్చర్యాలు అని చదివారు.

ఇదేమిటి పాటలే రీమిక్సు అనుకున్నాను ఇప్పుడు మాటలు కూడా రీమిక్సు చేస్తున్నారా అని హాశ్చర్యపడ్డాను.

(మొన్ననే పాడుతా తీయగా లో SPB "కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అనే పాటని రీమిక్సు చెయ్యకుండా మనమీద దయతలచి వదిలేసారు మహానుభావులు, లేదంటే కడవెత్ కడవెత్ కడవెత్ కొచ్చి కొచ్చి కొచ్చి అని మొదలెడతారు ఈ లోపల కడవ పగిలిపోతుంది" అన్నారు.)

అలాగే సంబ్ర్ సంబ్ర్ సంభ్రమాశ్చర్యాలు అంతే అదేదో రీమిక్సు మాట అనుకున్నాను.
నోరు తిరగకపోతే ఏం దొరా మేమే తిరుగుతాం (మాయాబజార్ డైలాగు) అన్నట్టు ఆ ముక్క పలకడానికి అష్టవంకర్లు తిరిగాడు మహానుభావుడు.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈటీవి లో ఈ బాధ చాలమటుకు లేదు. ఈటీవీలో వచ్చే వాళ్ళందరు వార్తలు బాగా చదువుతారు. వాళ్ల ఉచ్చారణ, పద్ధతి అన్నీ బాగుంటాయి. 99 శాతం మంచి తెలుగులోనే వార్తలు చదువుతారు. అడపాదడపా 2-3 ఇంగ్లీషు పదాలు దొర్లినా, అవి తెలుగులోకి మార్చబడనివో, మార్చబడలేనివో అయి ఉంటాయి. ఈ విషయంలో మాత్రం ఈటివి వారికి జోహార్లు !

క్రితం నెల ఉగాది రోజున సాయంత్రం మన తెలుగువాళ్ళు ఒకానొకచోట వేడుకలు జరుపుకుంటూ ఉంటే ఆహ్వానితులుగా వెళ్ళాము. ఎవరో కూచిపూడి చేస్తూ ఉంటే నిమగ్నమయిపోయిన నా ముందుకి ఒకతను వచ్చి "మేడం ఉగాది గురించి మాట్లాడతారా?" అన్నాడు. ఎందుకు,ఎక్కడ అని అడిగాను. మేము న్యూస్ ఛానెల్ నుండి వచ్చాము. ఇక్కడ మన పండగ జరుగుతోంది కదా, దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి అన్నాడు. ఇంత అచ్చ తెలుగులో అడగలేదనుకోండి. ఉగాది ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు కదా దానిపై మీ ఒపీనియన్ చెప్పండి అన్నాడు. సరే మన ఉగాది గురించి మనం కాకపొతే ఇంకెవరు మాట్లాడతారని ముందుకెళ్ళాను. ఒక 5-6 మైకులు నా నోటి ముందుకొచ్చాయి. TV9, TV5, HM, i news, జెమిని ఉన్నాయి. కెమెరా ఆన్, షాట్ రెడీ అన్నారు. మనం గొంతు విప్పి గడ గడ ఐదు నిముషాలు మాట్లాడేసాం. ఉగాది పండగ గురించి, ఉగాది పచ్చడి ప్రాశస్త్యం గురించి వివరించి నాలుగు ముక్కలు చెప్పేసాను. అయిపోగానే TV5 నుండి వచ్చిన రిపోర్టరు "ఏకసంతాగ్రాహి" ఎలా మాట్లాడేసారో అని తెగ హాశ్చర్యపోయాడు. నాకు ఒక్క నిముషం అర్థం కాలేదు. నేను ఏమి చదవలేదు, వినలేదు, ఏకసంతగ్రాహినెలా అయ్యానబ్బా అని ఆలోచిస్తే తెలిసిన విషయమేమిటంటే వాడికి "అనర్గళం" అన్న పదం తెలీదు అని. అనర్గళంగా మాట్లాడేసారు అనడానికి బదులు ఏకసంతగ్రాహి అన్నాడు. వాడికి అనర్గళం అన్న మాట తెలియకపోగా ఏకసంతగ్రాహికి కూడా అర్థం తెలీదు.

అదండీ విషయం, వీటన్నిటినీ మనం పిచ్చ పిచ్చ గా లైట్ తీసుకుని మన తెలుగు బ్లాగులలోనైన చక్కని తెలుగు ఉపయోగిస్తున్నందుకు సంతోషిద్దాం, ఏమంటారు?


52 comments:

Anonymous said...

చాలా బాగా చెప్పారు, ఇలానే మరిన్ని టపాలు వ్రాస్తుండండి.

Anonymous said...

Good Post :)

వాత్సల్య said...

బాగుందండి,టీవీ వాళ్ళకే కాదండోయ్,మన హీరొలకి కూడా నొర్లు తిరగవు.
కళ్ళు అనే పదాన్ని మహా అయితే ఒక నలుగురు సరిగ్గా పలుకుతారేమొ.మిగతా అందరూ "కల్లు" బ్యాచీనే. మన ఖర్మ కాలి అన్నీ ప్రేమ కధలేనేమో సినిమాలలో, ఈ "కల్లు" వినలేక చస్తున్నాము.

వీవెన్ said...

:)

మీరన్నట్టు తెలుగు వాడకంలో ఈటీవీ (ప్రత్యేకించి ఈటీవీ2) మేలు.

‘బ తర్వాత ధ’ అనే నియమానికి భేదం అన్నది మినహాయింపు.

ఆ.సౌమ్య said...

ఇద్దరు అఙ్ఞాతలకి ధన్యవాదములు, మీ పేర్లు కూడా రాసి ఉంటే ఇంకా సంతోషించేదాన్ని.

ఆ.సౌమ్య said...

రిషిగారూ ధన్యవాదములు.
అవునండీ మంచి విషయం గుర్తు చేసారు. సినిమా లో భాషకి కల్లలో నీల్లు వస్తున్నాయి...హి హి హి

ఆ.సౌమ్య said...

వీవెన్ గారు నా బ్లాగు కి స్వాగతం !
ధన్యవాదములు.

హ హ హ చూసారా చూసారా ఈ టీ.వి వాళ్ళ ప్రభావం నా మీద కూడా పడింది. భేదానికి బేధానికి భేదం తెలియకుండా పోయింది :)
ఇప్పుడే మార్చేస్తాను, చెప్పినందుకు కృతఙ్ఞతలు!

saabu said...

వాళ్ళ తెలుగుతో వేగలేక టీవీ చూడడమే మానేసామండీ.నిఝ్ఝంగా...........నిజం.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

>> కూచపూడి

సుబ్బారావు said...

99 శాతం తెలుగు మాట్లాడుతున్న ఈటీవీ వారు అభినందనీయులు

నేను గుర్తించినవి..
ఒక సినిమా లో హీరో ఇలా అంటాడు..
హా! మధు నా షెల్లా ..?
ఒక హిందీ గాయకుడు పాడిన తెలుగు పాట ఇలా వుంది.
వికసిం..... చావు మదిలో.. (మరి ఇది ఏదైనా రాగం లో పాడాడేమో నాకు తెలియదు..).

నిన్న టీవీ9 వార్తల్లో, ఒకామె వార్తలు ఇలా చదువుతుంది.
1. షోయాబ్ మాలిక్ గురించి చెబుతూ.... మనోడికి ( షోయాబ్ మాలిక్ మనోడు ఎందుకు అయ్యాడో అర్థం కాలేదు.) దిమ్మ తిరిగి....
2. ముఖ్యమంత్రుల సమావేశం పాల్గొనటానికి ఢిల్లీ వచ్చిన (వెళ్ళిన అనాలి కదా.) రోశయ్య ..... ఆవిడ హైదరాబాద్ లో కూర్చుని చదువుతుందో లేక ఢిల్లీ లో కూర్చుని చదువుతుందో మరి.

నాగప్రసాద్ said...

హిహిహి నేను టీవీ పెద్దగా చూడనుగా. ఎప్పుడో అమావాస్యకో, పున్నానికో చూస్తాను. :)). అప్పుడు కూడా ఏదో ఒక క్రికెట్ చూస్తాను కాసేపు. :-)). కాకపోతే, తెలుగు సినిమాలు సిస్టమ్‌లో పిచ్చ పిచ్చగా చూస్తాను. సినిమా బాగుంటే చాలు నాకు. తెలుగు ఎలా ఉన్నా లైటు. :-))).

jeevani said...

హిహిహి నేను టీవీ పెద్దగా చూడనుగా. ఎప్పుడో అమావాస్యకో, పున్నానికో చూస్తాను. :))

thank u naga.

Ravi said...

ఏకసంతాగ్రాహి నా? ఏకసంథాగ్రాహి నా?
కనికిష్టం. --> కనాకష్టం ?

తెలుగు గురించి రాశారు కాబట్టి పట్టేశా.... :-)

Anonymous said...

chevilo aamudam veste baagaane untundi-seesam postene kashtam

స్వర్ణమల్లిక said...

మీరు మన మీడియా గురించి చాలా తక్కువ చెప్పారు. అయినా వాళ్ళ లీలలు అనంతం అనుకోండి. ఎంత చెప్పినా తరగవు. కొన్నాళ్ళకి కళ్ళు అనాలో కల్లు అనాలో మనకే అనుమానం వచ్చేయగలదు ఈ టీవీలు, సినిమాల పుణ్యమా అని. చివరగా నా మాట:

సి సి మీ బ్లాగోల్లున్నారే... ఎప్పుడు ఇంటే.. మా టివి వాల్లను ఎప్పటికీ అరదం సేసుకోలేరు

నాగేస్రావ్ said...

"మన తెలుగు బ్లాగులలోనైన చక్కని తెలుగు ఉపయోగిస్తున్నందుకు సంతోషిద్దాం, ఏమంటారు?"
బ్లాగుల్లో కూడ 'కల్లు' గాళ్ళు బాగనే కనబడుతున్నారు. అది కొంతవరకు తెలుగు రాయటం రాకేమోనని, ఆబ్లాగులో వేరెక్కడైనా 'ళ్ళ' ఉందేమొనని పరిశీలిస్తుంటాను. అయినా బ్లాగులు చాలాఆఆఆ నయం.
టీవీల్లోను, సినిమాల్లోను ఈ 'కల్లు' జనాల్ని చూడలేక ఛస్తున్నామండీ!
నిన్నేదో బ్లాగులో రాసినట్లు వీళ్ళ పేర్లు ఏమాచుండ్రు, మలవిక లుగా మార్చాలి.

ఆ.సౌమ్య said...

@ saabu, నాగప్రసాద్
మంచి పని చేసారు...మీ అన్ని తెలివితేటలు లేకే మేము దొరికిపోయాము :)

@jeevani
:))

ఆ.సౌమ్య said...

@గణేష్
కూచిపూడి అనే రాసాను కదండీ, మళ్ళీ చూడండి ఒకసారి :)

@రవి చంద్ర
మా ఊర్లో కనికిష్టం అనే అంటారండీ, రాయడం కూడా అలాగే రాస్తారు. అది కోస్తా ఆంధ్ర భాష, అర్థం చేసుకోరూ !

ఏకసంతాగ్రాహి అని వాడన్నాడు కాబట్టే నేను అలా రాసాను :)

Anonymous said...

ఎవరూ కనిపెట్టక పోతే కొత్త పదాలు ఎలా పుడతాయి? టీవీజే లందరికి మంచి బ్లాగులు చదవటం కంపల్సరీ చేయాలి.

ఆ.సౌమ్య said...

@సుబ్బారావు
"హా! మధు నా షెల్లా ..?" "వికసిం..... చావు మదిలో"....హ హ హ భలే పట్టారండీ
షోయబ్ మాలిక్ మనోడేనండీ బాబూ....వార్తాపత్రికల్లో చూడట్లేదూ, షోయబ్ హైదరాబాదీ అల్లుడని ఊదరగొట్తేస్తున్నారుగా...హిహిహి
హ్మ్ ఒత్తులు, దీర్ఘాలే పలకట్లేదనుకున్నాను. క్రియాపదాల్లో కూడా తికమాకపడుతున్నారా! "వచ్చిన" కి "వెళ్ళిన" కి తేడా తెలీయట్లేదా... మన పయనమెచటికో?????????

@స్వర్ణమాలిక
హ హ హ నిజమేనండీ..."సి సి సి మీ బ్లాగోల్లున్నారే...." హి హి హి

@ నాగేస్రావు
హి హి హి....ఏమాచుండ్రు, మలవిక నా...కేక కదా. భలే మర్చారే పేర్లు....మరి తాళి కి తాలి అని పాడితే చుండ్రు, మలం కాక ఇంకేమవుతారు వాళ్ళు:)

మధురవాణి said...

సంబ్ర్ సంబ్ర్ సంభ్రమాశ్చర్యాలు...
వాడికి అనర్గళం అన్న మాట తెలియకపోగా ఏకసంథాగ్రాహికి కూడా అర్థం తెలీదు.
LoL :-D :-)

ఆ.సౌమ్య said...

@అఙ్ఞాతగారు
"టీవీజే లందరికి మంచి బ్లాగులు చదవటం కంపల్సరీ చేయాలి".....తప్పనిసరి చెయ్యలా? కంపల్సరీ చెయ్యాలా? :) :)

@ మధురవాణి
:D :D

mrityunjay said...

స్తుతిని సుత్తి అని చదివిన సందర్భాలు నాకు తెలుసు.

ఆ.సౌమ్య said...

@mrityunjay
హమ్మో మరీ ఇంత దిగజారిపోయారా ! స్తుతి ని సుత్తి అనే స్థాయికి పడిపోయారన్నమాట. నేనింకా ఒత్తులు, దీర్ఘాలే అనుకున్నాను...బాబోయ్, ఘోరాతి ఘోరం !!!!!! :(

Anonymous said...

అయితే నేను బోలెడంత కామెడీ మిస్సయ్యిపోతున్నానన్నమాట,ఈ టీవీ చానెల్స్ చూడక,అయ్యొయ్యో!
@ మృత్యుంజయ్ గారు,స్తుతి మించి సుత్తి స్థాయి కి చేరిందని అలా వ్యంగ్యంగా అంటున్నారా?లేదు లెండి వాళ్లకి అంత సీను లేదు అని తెలుస్తుంది.
@ నాగప్రసాదు గారు మీరు కూడా మొదలెట్టాలి మరి,ఇంత కామెడి మిస్సవ్వకుండా!
@ స్వర్ణమల్లిక గారు మీ కామెంట్ సూపర్!
@ నాగేస్రావ్ మీరు చెప్పిన బ్ళాగర్ళో నేను కూడా వున్నాణు అండీ!
@ ఏక సంతా(థా)గ్రాహి గారు,లైటు తీసుకోండి.

Srujana Ramanujan said...

నేను పిచ్చ పిచ్చగా వెయిట్ తీసుకుంటాను. :D

బాగా రాశారు

హరే కృష్ణ said...

హిహిహి
పిచ్చ పిచ్చ గా కుమ్మేసారు

Kamala said...

Soumya Garu,

Edo site nunchi nenu yadruchikamga ila mee site ki vachanu. Ee tapa chadivanu. Boledu rojula tarvata nenu ila navvutunnanu. Kallallo neellu vastunnayi ante nammandi.....Kakpote, naa pakka cubicle lo vaallu (tellammayi) nanu choosi deenikidemi poyekalam anukuntundemo....rendu saarlu adigindi nuvvu baane vunanva ani :-)

Chaala saarlu nenu TV lo inka cinemalo telugu ni khooni cheyadam vini bhadhapadedaanni.....Okati rendu saarlu Laksmi Prasanna "Lakshmi Talk Show" choosi aavida bhasha panti kinda raayila (Gundrayi anoca?)tagili, inka meedata telugu program lu choodakoodadani nirnayinchukunnanu. Ippatidaaka aa nirnayaaniki kattubadi vunnanu...

Ivvale telisindi, mana vallu telugu lo bloglu rastu tama badha ni vellagakkutunnarani. Naaku inka telugu lo typing pravesham ledu. Ippudu mimmalni andarini chooste tondaraga nerchukovalani vundi.
Ee saari comment telugu lone raasta....Eesaariki elago chadiveyyandi...sarena?

Tapa chaala baaga raasaru....Veelu chikkinappudu migilina tapa lu chaduvuta.....abhprayalu raasta....

Dhanyavaadalu,
-Kamala

Malakpet Rowdy said...

"కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అనే పాటని రీమిక్సు చెయ్యకుండా మనమీద దయతలచి వదిలేసారు మహానుభావులు, లేదంటే కడవెత్ కడవెత్ కడవెత్ కొచ్చి కొచ్చి కొచ్చి అని మొదలెడతారు ఈ లోపల కడవ పగిలిపోతుంది"
__________________________________________________

SPB గారు "మల్లన్న" అనబడే మహా కళాఖండాన్ని చూడలేదేమో :))

కొత్త పాళీ said...

ఏకసంతగ్రాహి సరైన వాడుక.
సంత అంటే వేద పాఠం చెప్పుకునేప్పుడు గురువు వాక్యాన్ని ఒకసారి చెబితే దాన్ని వెంటనే శిష్యులు రెండుసార్లు తిరిగి పలకడం. అలా ఒకసారి చెప్పినప్పుడే నేర్చేసుకోగలిగిన వారిని ఏకసంతగ్రాహి అంటారు.
పాఠం అయిపోయిన తరవాత శిష్యులు విడిగా పాఠాన్ని మననం చేసుకోవడాన్ని వల్లె వెయ్యడం అంటారు.
ఏకసంధాగ్రాహి అని వొత్తుతో పలకడం ఎలా మొదలైందో తెలియదు గాని, అదే సర్వసాధారణ మైపోయింది.

ఆ.సౌమ్య said...

హమ్మయ్యా కొత్తపాళీగారు, నాకున్న పెద్ద బాధని తొలగించారు. నేను ముందు ఏకసంతగ్రాహి అనే రాసాను. నేను అలాగే నెర్చుకున్నాను. కానీ ఇక్కడ ఒక మిత్రుడు తప్పుపట్టేసరికి. నాదే తప్పేమో అని ఏకసంథాగ్రాహి అని మళ్ళీ మార్చాను. మార్చానేగానీ మనసంతా దాని మీదే ఉంది, నేనిన్నాళ్ళు తప్పుగా నేర్చుకున్నానా అని. మీరు దానికి వివరణ ఇచ్చి నా గుండెభారం తగ్గించారు. హమ్మయ్య నేను తప్పుగా నేర్చుకోలేదన్నమాట. మళ్ళి ఏకసంతగ్రాహి కి మార్చేసానోచ్చ్

ఆ.సౌమ్య said...

కృష్ణగారూ మీరు టీవి చూడరా !!!!!

అప్పుడప్పుడూ అవి కూడా చూస్తూ ఉండాలండీ, మన తెలుగు ఏ దశలో ఉందో తెలుసుకోవద్దా మరి? మీరు భలే విచిత్రంగా నా పోస్ట్ కి కామెంటు పెట్టకుండా కామెంట్లకి కామెంటు పెట్టారే :)

బ్లాగరు లో వర్డ్ ప్రెస్స్ లో ఉన్న బాధ లేదండీ. బ్లాగరు లో స్పాం ఉండదు. అన్ని కామెంట్లు చచ్చినట్టు పోస్ట్ కి చేరవలసినదే.

ఆ.సౌమ్య said...

@Srujana Ramanujan
ధన్యవాదములు. మీ వెయిట్ ని లైట్ తీసుకోండి :)

@హరే కృష్ణ
నెనర్లు :)

@Malakpet Rowdy
ఒహో కాదేదీ రీమిక్సు కి అనర్హం అన్నమాట :)

ఆ.సౌమ్య said...

కమల గారూ చాలా సంతోషం గా ఉందండీ.
అయితే నా పోస్ట్ మిమ్మల్ని ఏడిపించిందంటారు.....హి హి హి.
అవునండీ తెలుగు బ్లాగ్లోకం చాలా పెద్దది. ఒకసారి మీరు అడుగుపెడితే వెనకడుగెయ్యరు.....నాది పూచీ :)

కష్టపడెందుకండీ, ఇష్టపడే చదివేసాను మీ కామెంటుని.
తెలుగు టైపింగ్ కి ఇది ప్రయత్నించండి
http://lekhini.org/

లక్ష్మీ టాక్ షోని చూసారా, మీకెంత ఓపికండీ బాబూ? ఇదులో సగం ఓపిక ఉన్నా టివీ లో వార్తల్ని భరించేయగలరు.

నా పోస్ట్ మీకు నచ్చినందుకు చాల చాలా ఆనందంగా ఉంది. మిగతా పోస్టులు కూడా చదువుతానని మాటిచ్చేసారు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టకూడదు మరి, ఇప్పుడే చెప్పేస్తున్నా ఆ :)

Anonymous said...

@ ఏక సంతా(థా)గ్రాహి గారు,లైటు తీసుకోండి.
ఏక సంతగ్రాహి అంటే మీర కదండీ!లైటు తీసుకోమన్నది మిమ్మల్నే !

బంతి said...

>>సంబ్ర్ సంబ్ర్ సంభ్రమాశ్చర్యాలు అంతే అదేదో రీమిక్సు మాట
హి హి :)

ఏంటో లెండి ఈ మధ్య లో మీకు ... కథల గురించి ప్రత్యేకమైన మెయిల్స్, జెమిని వార్తలు చూడటం హ్మం ...

బంతి said...

>>సంబ్ర్ సంబ్ర్ సంభ్రమాశ్చర్యాలు అంతే అదేదో రీమిక్సు మాట అనుకున్నాను. హి హి :)
జెమిని వార్తలు చూడటం, కథలు చదవమని మెయిల్స్ రావటం ... ఏంటో మరి మీ టైం బాడ్ అనుకుంట ;)
---బంతి

ఆ.సౌమ్య said...

@కృష్ణ
ఒహో నేనేనా, నన్నే అన్నారా! నేను ఏకసంతగ్రాహిననీ మీకు కూడా తెలిసిపోయిందా :)

ఆ.సౌమ్య said...

కామెంటు ప్రదాతలందరికి విన్నపం. బ్లాగరు కి ఏదో మాయరోగమొచ్చి కామెట్లని చూపట్లేదు. మీ కామెంట్లని నేను పబ్లిష్ చేస్తున్నాను, అయినా అవి కానరావట్లేదు. తప్పు నాది కాదు. కాస్త సహనం పాటించమని మనవి. లేదా పిచ్చ పిచ్చ గా లైట్ తీసుకుని నా తరువాతి టపా కి బదులివ్వండి.

ఆ.సౌమ్య said...

అవును బంతిగారూ నా ఖర్మ కాలి ఇలా జరుగుతున్నాయి అన్నీ :)

వేణూశ్రీకాంత్ said...

కెవ్వ్.. అనర్గళం!! ఏకసంతగ్రాహి!! ఆహా..
బాగా రాశారండీ వీళ్ళ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే :-)

ఆ.సౌమ్య said...

@వేణూ శ్రీకాంత్

హి హి హి మరే, ఎంత చెప్పుకున్న తక్కువే. మీరు పెట్టిన కేకలకి నెనర్లు :)

vivek said...

mana channels,films loni telugu guirnchi raayali ante meeru inko blog modhalupettalsindhe!!hahahaha!

ఆ.సౌమ్య said...

@వివేక్
మరే. నిజమే......ఒక బ్లాగు కూడా చాలదు.

స్నిగ్ధ said...

నమస్కారం వెంకట పైడి రమా నాగ రామరత్న సౌమ్య(మరొక సారి టపా పైకి వెళ్ళకుండా మీ పేరు చదవకుండా రాస్తున్నాను అండీ నిజ్జం) గారు,రవిచంద్ర గారి బ్లాగ్ చూస్తొంటే మీ పేరు కనిపించింది.అలా మీ బ్లాగ్ ని దర్శించే భాగ్యం కలిగిందన్నమాట.

చాలా బాగుందండీ..చాలా రోజుల తరువాత నవ్వుకున్నాను.మధ్యలో నాలో నేను నవ్వుకోవడం చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటారెమో అని ఆపేసా..

మీ పిచ్చ పిచ్చ గా లైట్ తీసుకో టపాలు రెండూ...కేకండీ...

అన్ని బ్లాగులు చదవలేకపొయాను.తీరిగ్గా చదివి అభిప్రాయం రాస్తాను...

ఆ.సౌమ్య said...

@ స్నిగ్ధ గారూ
నిజంగా చెప్పేసారా నా పేరుని! అయితే మీకు 100 వీరతాళ్ళు.
ఓహో రవిచంద్రగారి బ్లాగు ద్వారా నా గురించి తెలుసుకున్నరా, చాలా సంతోషం. నా టపాలు మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించినందుకు ఆనందంగా ఉంది.

మీరు మాత్రం నా మిగతా టపాలని పిచ్చపిచ్చగా లైట్ తీసుకోకుండా టపీ టపీ మని చదివేయండి. చదివి మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మరచిపోకండేం...నేను ఎదురుచూస్తూ ఉంటాను :)

కామెంటు రాసినందుకు చాలా బోల్డు ఇంకా పెక్కు ధన్యవాదములు :D

స్థితప్రజ్ఞుడు said...

పిచ్చ పిచ్చగా లైట్ తీసుకో....ఏం భాషండీ బాబూ...

ఈ గోల తట్టుకోలేక...నేను అసలు టీవీ చూడడమే మానేసా...

టీవీ కన్నా కొంచెం బ్లాగ్లోకం లోనే కొంచెం మంచి తెలుగు దొరుకుతోంది...


అన్నట్టు చెప్పడం మరిచా....ప్ర.పీ.ప.స లో మీ కంమెంట్లు కేక...

నాకు మీ బ్లాగ్ లింక్ అక్కడే దొరికింది....

మీ....మిగతా పోస్ట్లు కూడా చదివే పన్లో ఉన్నా....

ఆ.సౌమ్య said...

@ స్థితపజ్ఞుడు
మీ బ్లాగు పేరు భలే ఉందండీ :)
హ హ అయితే టీవీ చూడడం మానేసి మీరు స్థితపజ్ఞులయ్యారన్నమాట...బావుంది :D
ఒహో అయితే మీరూ మా ప్ర.పీ.స.స మెంబరయిపోయారా...అన్ని పొస్ట్ లు చదివారా, great...ఈపాటికి మీకు విషయం బాగా అర్థమయ్యుండాలే. కొంపదీసి అన్న బారిన పడ్డార ఏమిటి, ప్ర.పీ.స.స కి చేరువయ్యారు :P

హ్మ్ నా మిగతా టపాలు కూడా చదివి మీ అభిప్రాయం చెప్పాండి. కామెంటు రాసినందుకు ధన్యవాదములు.

స్థితప్రజ్ఞుడు said...

ఏం చెప్పమంటారండి....నా కష్టాలు....

ఓ రోజు తిన్నది అరక్క....మన మలక్ పేట రౌడీ గారి బ్లాగ్ కి వెళ్ళా..

అక్కడ ఆయన... కూడలి లో లేకుండానే పోస్టు కి 100 వ్యాఖ్యలు వస్తున్న బ్లాగ్ అని ..మన ప్ర పీ స స గురించి రాసారు...

ఆయ్!!.... బ్లాగ్లోకం లో కొమ్ములు తిరిగిన వాళ్ళకే 50 వ్యాఖ్యలు వస్తే గొప్ప..అలాంటిది అదేం బ్లాగాబ్బా...అని ప్ర.పీ.స.స. ని దర్శించడం జరిగింది...అక్కడ మీ వ్యాఖ్యలు చూసి తెగ నవ్వుకున్నా అనుకోండి. అప్పుడు నాకో అనుమానం వచ్చింది...అసలు భూమ్మీద...వీళ్ళు చెబుతున్న లక్షనాలున్నా వ్యక్తి ఉండే ఆవకాశం ఉందా అని. ఖచ్చితం గా ఉండడని అనిపించింది..

సర్లే అదేంటో చూద్దామని అన్నగారి బ్లాగ్ ని దర్శించా...(దూల ఆక్క....)

నేను పప్పులో కాలేసా అని తెలుసుకోవడానికి పెద్ద సమయమేం పట్టలేదనుకోండి...

అన్న గారు రాసిన కొన్ని కథలు తవికలు చదివాక ఓ రెండు రోజులు నిద్ర పట్టలేదనుకోండి...

మన ప్ర.పీ.స.స కు వచ్చి ఓ రెండు వ్యాఖ్యలు కొట్టాక గాని నిద్ర సరిగ్గా పట్టలేదు...

ఆ.సౌమ్య said...

@స్థితప్రజ్ఞుడు
హ హ హ అయితే మీరు పప్పులో కాదు పెంటలో కాలేసారు, పాపం. దీన్నే కొరివితో తలగోక్కోవడం అంటారు....హిహిహిహి:D. మీలాగే మేమూ తెలియక ఆ పెంటలో కాలేసి బయటపడ్డవాళ్లమే. అందుకే ఆ సంఘాలు అవీనూ. మరేం పర్లేదులెండి మీకు తోడుగా బోలెడంతమంది ఉన్నారు.
హ్మ్ ఇప్పటికైనా అర్థమయిందా అలాంటి మనిషి ఒకడున్నాడని...నమ్మలేని నిజాల్లో ఇదీ ఒకటి :P

Anonymous said...

కడవెత్..కొచ్చి....ఇక్కడ ఆగి.
చాలా సేపు నవ్వుకున్నాను.

ఆ.సౌమ్య said...

@ఆదిత్య గారూ
ధన్యవాదములు. ఆ పదానికి నేనూ చాలా నవ్వుకున్నానండీ.