StatCounter code

Friday, April 9, 2010

పిచ్చ పిచ్చగా లైట్ తీసుకో-రెండవ భాగము (ఎంగిలితెలుగు)

నిన్న అనవసరంగా టివీలో వార్తలు చదివేవాళ్ళని దుమ్మెత్తిపోసానేమోనని అనిపించేట్టుగా మరిన్ని అంశాలు తారసపడ్డాయి నాకు.

తెలుగుని సరిగ్గా పలకకపోవడం ఒక అంశమైతే ఎంగిలి చెయ్యడం ఇంకో అంశం.

నిన్న రాత్రి జీ-తెలుగు లో వచ్చిన "స రి గ మ ప" అనే పాటల పోటీని వీక్షించాను. అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాలెండి. అది తెలుగు పాటల పోటీ. తెలుగు వాళ్ళు రాసిన, బాణీలు కట్టిన పాటలని తెలుగు పిల్లలు పాడుతారు. తెలుగువాళ్ళే వ్యవహారకర్తలు, తెలుగువాళ్ళే న్యాయధిపతులు. ఇక్కడ మార్గదర్శకులు (mentors) అని ఇంకో తరగతి ఉంది. పెద్ద, బుల్లి మార్గదర్శకులు ఉన్నారు. న్యాయధిపతులుగా వచ్చే SP శైలజ, మాధవపెద్ది సురేష్ (నిన్నటికి వేటూరివారు వచ్చారనుకోండి) గార్లు చాలా చక్కగా తెలుగు మాట్లాడతారు. అంతగా తెలుగు రాని వ్యవహారకర్త నోయెల్ కి కూడా తెలుగులో మాట్లాడడం నేర్పించి, ఆ కుర్రాడు చక్కని తెలుగు మాట్లాడే స్థాయి కి తీసుకుని వచ్చారు. ఇకపోతే మార్గదర్శకులున్నారే...హేమచంద్ర, హిమబిందు. వీరిరువురూ కూడ నేపధ్య గాయకులే. వీళ్ళు...అసలుసిసలైన తెలుగుగాళ్ళు. ఎలాగంటారా,ఇలాగ....

"నేను actual గా, మాకు ఒక music company ఉంది. ఆ company through అమ్మ నన్ను వేటురిగారి దగ్గరకి తీసుకుని వెల్లరన్నమాట. I am lucky, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నేను, I want to sing వేటురిగారి పాట. sir, with your permission"

ఈవిడగారికి "ద్వారా", "దీవెనలు", "అనుమతి" లాంటి తెలుగు పదాలు తెలియవా????? (కోటి రూపాయల ప్రశ్న)

హేమచంద్ర ఏమీ తక్కువ కాదు. actual గా నువ్వు బానే పాడావు. but there is some shake in your voice, nasal వస్తున్నది. its good, బావుంది. but u have to improve a lot. మధ్యలో ఆ గమకం వస్తుంది కదా there u went wrong."......ఇలా ఉంటుంది వరస.

అసలు ఈ మధ్య ఇదో వింత పోకడ! గత 3-4 యేళ్ళుగా గమనిస్తున్నాను, కొందరి సంభాషణలు ఎలా ఉంటాయంటే....

"I went there అన్నమాట. అప్పుడు my friend told me this. సరే అని i did that"..... ఇలా ఉంటుంది. ఆ ఏడ్చేదేదో పూర్తిగా ఇంగ్లీషులోనే ఏడవచ్చుకదా, ఏమిటో విడ్డూరం !

సరే, అసలు విషయానికొద్దాం. నాకు ఈ ప్రోగ్రాం చూసి పిచ్చ పిచ్చగా తిక్క రేగింది. ఛీ థూ అని చెప్పి ఐ.పి.ఎల్ పెట్టానా, మన DC ఆడుతోంది. ఉత్సాహంగా చూసాను.

మన సినిమా బాబుల్లో ఒకరైన వెంకటేష్ బాబు ఆ ఆట చూడడానికి అక్కడకి వచ్చారు. DC గెలిచింది, ఆట ముగుసింది. మన బాబుని పిలిచి వ్యాఖ్యానించమని కోరారు. ఆ బాబు ఎంగిలిపీసులో టపా టపా బాగానే వాగారు. వాగిన పిమ్మట సదరు వ్యాఖ్యాత "మీ DC టీం గురించి తెలుగులో ఏమైనా చెప్పండి" అని అడుగగా మన బాబు "DC కి support చెయ్యండి. DC should go to final, we will support them" అని చెప్పారు.

ఇది విన్న వ్యాఖ్యాత this is not telugu అని చెప్పగా....హి హి అని ఒక వెకిలినవ్వు నవ్వి మరల DC కి సపోర్ట్ చెయ్యండి, thats it అని నిస్సిగ్గుగా అన్నారు.

ఒక ఛీ థూ తో సరిపెట్టుకుందామంటే ఉండనివ్వరుగా వీళ్ళు అని ఛీ ఛీ థూ థూ అని రెండుసార్లు అన్నాను.

మరల ఛానెల్ మార్చబడినది. (నీకేం పనిలేదా టీవీ చూడడం తప్ప అని అడగకండి. నిన్న నిద్ర రాక, నా ఖర్మ కాలి చూసాను అర్థరాత్రి వరకు).

మన ఇంకో బాబు, బాలయ్య బాబు కొత్త సినిమా "సింహ" సినిమా ప్రకటన వస్తున్నాది. అందులో ఒక డవిలాగు " నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి, లేకపోతే నీకు next birthday ఉండదు." అసలే గురుడు హావభావ ప్రకటనలో దిట్ట. ఆ రకంగా ఈ డవిలాగు చెబుతూ ఉంటే, నా సామి రంగ... కడుపులోంచి తన్నుకొచ్చింది వాంతి.

ఈ బాబుదే ఒక్క మగాడు అనే ఇంకో కళాఖండం వచ్చింది, కిందటి యేడాదో, ఆ ముందటి యేడాదో. అందులో ఒక డవిలాగు...."నేను decision తీసుకుంటే compromise అవ్వను. compromise అయితే decision తీసుకోను.
బాబు ఎంత సత్యం చెప్పారు. ఈ సూక్తిని మీరంతా కూడా పాటించండి అమ్మలారా, అయ్యలారా ! మిగతాబాబులు బాగా మాట్లాడుతున్నారని కాదు, కొన్ని ఉదాహరణలిచ్చాను అంతే.

డవిలాగులే కాదు పాటలూ అదే పద్ధతిలో ఉన్నాయి.

"హేయ్ టిప్పు టాపు దొర కదిలిండో, ఎవరికి వీడు దోరకడులెండో, ముదురండో
ఉప్పుకప్పురంబు ఒక్క లుక్కునుండో, వీడి లుక్కు చూసి మోసపోకండో (వేమన గారు వింటే ఆత్మహత్య చేసేసుకుంటారు, అమంగళం ప్రతిహతమగుగాక)
కం ఆన్ కం ఆన్ మోస్టు కన్నింగు, మస్తు టైమింగు, రైటులలో రాంగు" (ఇంక రాయలేను)

"పాషు పాషు పరదేశి నేను, ఫారిన్ నుండి దిగి వచ్చాను
రోషమున్న కుర్రాళ్ల కోసం వాషింగుటన్ను వదిలేసాను"

"ఓం నమస్తే బోలో బేబీ, ఓం నమస్తే బోలో దిల్ మే డాష్ కొట్టే పార్టీ టైం లో
ఓం నమస్తే బాబా ఓం నమస్తే బోలో నీతో పార్ట్ నర్ అవుతా ఫ్యూచర్ క్రైం లో"

(రాసేసి చేతులు, నోరు సబ్బుతో కడిగేసుకున్నాను. మీరూ చెవులు, కళ్ళు కడిగేసుకోండి).

ఏదో సిరివెన్నెలలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టీ

"తలయెత్తి జీవించు తమ్ముడా,
తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని
తలవంచి కైమోడ్చు తమ్ముడా,
తెలుగుతల్లి నను కనిపెంచినాదని, కనుక తులలేని జన్మమ్ము నాదని" అనో

"ఉండుండి ఇలా ఉబికొస్తుందేం కమ్మానైన కన్నీరు, తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరు?
మధురమైన కబురందిందే కలతపడకు బంగారు, పెదవి తోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు !
గంగలాగ పొంగిరానా ప్రేమసంద్రమా, నీలో కరిగి అంతమవ్వనా ప్రాణబంధమా!
అంతులేని దాహమవనా ప్రియప్రవాహమా, నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా"

అనో చెవులకి ఇంపుగా అప్పుడప్పుడూ వినిపిస్తున్నాది.

అదండీ సంగతి. వీళ్ళండి మన తెలుగుకి ప్రతినిధులు ! ఇప్పుడు చెప్పండి, ఎలాగోలా కల్లనో, నీల్లనో, అనర్గళం అనకనో, ఏకసంతగ్రాహి అనో అష్టకష్టాలు పడైనా ఆ మాత్రం తెలుగు మాట్లాడుతున్న మన న్యూస్ రీడర్స్ మేలా, తెలుగుని ఎంగిలి చేస్తున్న బాబులు, వాళ్ళ సినిమాలు మేలా?


79 comments:

శ్రీనివాస్ పప్పు said...

"(రాసేసి చేతులు, నోరు సబ్బుతో కడిగేసుకున్నాను. మీరూ చెవులు, కళ్ళు కడిగేసుకోండి)".
సుపరో సూపర్ ఫినిషింగ్ టచ్ అదుర్స్.మేము కూడా పేగులు బయటకి తీసి కడిగేసి లోపల పెట్టేసుకున్నాములెండి.

Rishi said...

బాలయ్య బాబు చాల బెటర్,"కల్లు"బ్యాచ్ కాదు అట్లీస్ట్.మన జంధ్యాల గారి కామేడీ ఎమి పనికొస్తుందండీ బాబు, బాలయ్య ముందు.అసలు మాట కంటే ముందు యాక్షన్ అలా అలా వచ్చెస్తుంది బాలయ్య బాబు కి.మరి హేమచంద్ర లాగ కామెంటెయ్యమంటారేంటి,కాస్కోండి మరి.
"కమింగ్ టూ యువర్ పోస్ట్,చాలా బాగుందండీ.ఇలాగే రాస్తుందండి,కాశ్మీరు సమస్య లాగ మన యెంగిలి తెలుగు టాపిక్ నెవర్ యెండింగ్.యు కెన్ విజిట్ మై బ్లాగ్ టూ యాజ్ నా వ్యూస్ కూడా మీలాగే వున్నాయి"

Rishi said...

naa comment enduku kanapadatledu?sreenivas gaari kante mundu kaamentesaanu,vaaaaaaa (:

sowmya said...

@పప్పుసారూ,
ధన్యవాదములు
హి హి హి.....పేగులు మళ్ళీ భద్రంగా లోపల పెట్టేసుకోండి, మళ్ళా మళ్ళా బయటకి తీసే సదవకాశం వస్తూ ఉంటుంది మనకి

sowmya said...

@రుషిగారూ
ఏడవకండేడవకండి....రుషులే ఏడిస్తే మాలాంటి సామన్య మానవులేమి చెయ్యాలండీ.. మీ కామెంట్లు రెండూ ఒకేసారి వచ్చాయి, నేను రెండూ ఒకేసారి పబ్లిష్ చేసాను.

"మాట కంటే ముందు యాక్షన్ అలా అలా వచ్చెస్తుంది బాలయ్య బాబు కి.".....హ హ హ భలే చెప్పరండీ...అసలు ఆ హావభావ ప్రకటనలయితే కేక అనుకోండి. నిజమే జంధ్యాల సినిమాలలో కామెడీ, బ్రహ్మీ కూడా ఎందుకు పనికిరారు :)

thanks Rishi, అలాగే i will write regularly. మీరు అంతగా చెప్పలా, u see, i will see ur post :D

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

వెంకటేష్ బాబు గారికి ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు కావాలి గానీ తెలుగు మాత్రం వద్దు. ఎంతైనా విదేశాల్లో చదువుకుని వచ్చాడుగా.

సూపర్ సింగర్ 5 లో దేవిశ్రీ ప్రసాద్ తమ్ముణ్ణి వ్యాఖ్యాతగా పెట్టారు చూశారా. వాడు పార్టీ అనే మాటని పాడీ (ఎవడి పాడె? :-))... అంటాడు.

banthi said...

మీ Posts నేను regular గా follow అవుతుంటాను. I think మీరు tell చేసింది
exactly correct. And You know మీ
post really really మంచిగా ఉంది.

sowmya said...

@రవిచంద్ర
విదేశాలో చదువుకుంటే విదేశాల్లో నటించాలి. ఇక్కడకొచ్చి మనల్ని ఉద్ధరించడమెందుకు???????
పెద్ద పెద్ద భారీ డవిలాగులు మాత్రం భట్టీయం వేసి అప్పజెబుతారు సినిమాలలో. పొట్ట విప్పితే ఒక్క తెలుగు ముక్క ఉండదు.

పాడీ యా...హ హ హ భలే చతుర్లు వేస్తున్నట్టున్నాడే దేవిశ్రీ తమ్ముడు :D

అన్నాట్టు రవిచంద్రగారూ "ఏకసంతగ్రాహి" అన్నది ఒప్పేనండీ, నేను సరిగ్గానే రాసాను. మీరే నన్ను తికమకపెట్టారు. కొత్తపాళీగారి కామెంటు చూసారా?

sowmya said...

@బంతి
too much అండీ...కేక పెట్టించారు.....నాకు laugh ఆగట్లేదు :D :D

Anonymous said...

off topic-సరిగమప లో శైలజ, సురేష్, కోటి వీళ్ళు చిన్నపిల్లలను పట్టుకోని ఏవో వివరణలతో ఊదరగొట్టడం బుచికిగా ఉంటుంది. వాళ్ళు చెప్పేవిషయాలు అర్థంకాక పిల్లలు బిక్కమొహం వేస్తుంటారు. మీరు వ్రాసిన విషయం చాలా ముఖ్యమైనది. స్టైల్ కొడుతూ సంకరభాషను ఉపయోగించే వారిని మెత్తటిచెప్పుతో కొట్టారు.

satya said...

నిన్న ఒక మహాతల్లి వార్తలు చదువుతూ(కళ్లు ఇటూ అటూ తిప్పుతూ చేసేది అదేగా?)
'బలమైన ' బదులుగా ''బలయిన' అని చదివి మమ్మల్ని బలి చేసింది(ఏ బి ఎన్ అంధ్రజ్యోతి)

స్వర్ణమల్లిక said...

బాగుంది మీ తెలుగు బాధ. కానీ మనం చేయగలిగింది ఏమైనా ఉందా...... విద్యాలయాల్లో తెలుగు మాట్లాడితే తప్పు. కళాశాలలో తెలుగు తీసుకుంటే తక్కువ మార్కులు వస్తాయి. ఉద్యోగాల్లో తెలుగు మాట్లాడితే వింత జంతువుని చూసినట్టు చూస్తారు. పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్, ఇంటర్వ్యు లలో ఇంగ్లిష్, ఈ మధ్య కాలంలో తెలుగు భాషలో వ్యాసరచన, వక్తృత్వం పోటీలు పెట్టిన విద్యాసంస్థ లేదు. వార్తాపత్రికల్లో, దూరదర్శిని చాన్నేళ్ళలో (తెలుగు పదం నాకు తెలియదు) ఎక్కడా సరయిన తెలుగు కనిపించదు, వినిపించదు. అసలు తల్లితండ్రులే తమ పిల్లలు తెలుగులో మాట్లాడితే భరించలేకపోతున్నారు అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఎవరిని తప్పు పట్టాలి మనం? ముందు మనం, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు సాధ్యమైనంత ఎక్కువగా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. బంధువులని, పూలని, పండ్లని, జంతువులని ఇంకా ఇంతర భావవ్యక్తీకరణకు తెలుగు భాషని మాత్రమే ఉపయోగిద్దాం. ఎవరికి వారు ఇలా నిర్ణయం తీసుకుంటే సగం సమాజం బాగుపడుతుంది.

sowmya said...

@అఙ్ఞాత
బుచికిగా ఉంటుందా....ఇదేం ప్రయోగమండీ నేనెప్పుడూ వినలేదు....హ హ హ

నా టపాని మెచ్చినందుకు నెనర్లు.

@satya
అయితే బలమైన బలన్నమాట :)

తెలుగుయాంకి said...

వాళ్ళనని ఉపయోగము ఏముందండి? ఈ తెగులుకి బీజాలు 'కన్యాశుల్కం'నాటకము కాలానికి ముందే పడ్డాయి.

"మీ post, You know, simply super yaar. అస్సలు light తీసుకోవద్దు" :-)

sowmya said...

@స్వర్ణమాలిక గారు, బాగా చెప్పారు. అదేకదండి నా గత టపాలో నేను చెప్పినది....కనీసం మనం బ్లాగులలోనైనా తెలుగు బాగా రాస్తున్నాం అది ఒక మంచి విషయం.

"బంధువులని, పూలని, పండ్లని, జంతువులని ఇంకా ఇంతర భావవ్యక్తీకరణకు తెలుగు భాషని మాత్రమే ఉపయోగిద్దాం."....అందుకే నా స్నేహితుల పిల్లలకి ఆంటీ అనొద్దని అత్తో, పిన్నో అనమని చెప్పేసానండీ. నా మటుకు నేను వీలైనంత తెలుగే మాట్లాడతాను. ఎవరైనా తెలుగువాళ్ళు నాకు ఇంగ్లీషులో సమాధానాలిచ్చినా నేను తెలుగులోనే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాను.

ఆ మధ్య ఒక సంఘటన జరిగిందండీ
రైలు లో వెళ్తున్నప్పుడు నేను భానుమతిగారు అత్తగారి కథలు చదువుతు కూర్చున్నాను. నా పక్కన చలం పుస్తకాలు, శ్రీపాద పుస్తకాలు పెట్టుకున్నాను. ఒక కుటుంబం పక్క స్టేషన్ లో ఎక్కారు. అందులో ఒకావిడ నా చేతిలో ఉన్న తెలుగు పుస్తకాలు చూసి భలే సరదాపడిపోయారు. ఎన్నాళ్ళకి చూస్తున్ననమ్మా తెలూగు పుస్తకాలు చేతిలో పట్టుకుని కూర్చున్నవాళ్ళని అని ఆవిడ తెగ మురిసిపోయారు. ఇంగ్లీషు పుస్తకాలు చేతిలో పెట్టుకోవడం ఫేషనయిపోయింది అని వాపోయారు.

అసలు మనవాళ్ళలో ఇంగ్లీషులో మాట్లాడడం, చదవడం, రాయడం అన్నది తప్పు, తక్కువ అనే భావన పోవాలి. మన భాష మనకి గొప్ప అంతే.ఒకవేళ తప్పనిసరి అయి బడిలో ఇంగ్లీషు చదవాల్సి వచ్చినా ఇంట్లో కనీసం తెలుగు నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులకెంతైనా ఉంది.

sowmya said...

@తెలుగుయాంకీ
నెనర్లు :)
అవునండీ తెగులుపట్టి చాలాయేళ్ళయింది :(

స్వర్ణమల్లిక said...

సౌమ్య గారు, మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం. మనం తెలుగు మాట్లాడ్డం చిన్నతనంగా భావించకూడదు. ఎవరి మాతృభాష వారికి గొప్ప. మన భాష ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ గా పిలువబడినది. మనం రాసేదే చదువుతాము, చదివేదే రాయగలము. వేరే ఏ ఇతర భాషకు ఆ సౌలభ్యం లేదు.

sowmya said...

@స్వర్ణ గారు
మీరన్నారు కాబట్టి నేనడుగుతున్నాను.
తెలుగుని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని ఎందుకంటారో మీకు తెలుసా? అసలెంతమందికి తెలుసు?

venuram said...

సెగట్రీ గారూ...మీరు "మరో చరిత్ర"(కొత్తది)చూస్తే ఏమయ్యి పోతారో..ముఖ్యంగా నరేష్ డవిలాగులు అద్భుతం..

టపా బాగుంది..

Rajkumar

sowmya said...

@రాజ్ కూమార్ అందుకే నేనలాంటి రిస్కులు తీసుకోను :)

Anonymous said...

మీ టపా బాగుంది...ఉండుండి ఊబికొస్తుందేం...ఏ సినిమా పాట?

నాగేస్రావ్ said...

లైట్ తీస్కోండి సౌమ్య గారూ! ఈకల్లు గాల్లని, సంకర Bobల్నీ బాగుచేయలేం!!
తెలుగుని ప్రాచ్య ఇటాలియన్ అని ఎందుకన్నారా? విక్కీపీడితులు ఇలా అంటున్నారు:
"British authors in the 19th century called Telugu the Italian of the East as all native words in Telugu end with a vowel sound, but it is believed that Italian explorer Niccolò Da Conti coined the phrase in the fifteenth century. Conti visited Vijayanagara empire during the reign of Vira Vijaya Bukka Raya in 1520s."
అసలు నన్నడిగితే, తెలుగుని ఆపాశ్చాత్య భాషతో పోల్చి అదేదో గొప్ప అనుకోవడం మనని మనం కించపరుచుకోవటమే. మాటలు అచ్చంతాలు కావటం తప్ప ఇటాలియన్లో తెలుగుకున్న వైవిధ్యం ఏదీ? వాళ్ళని ఠ పలకమనండి. నేనూ 'సంగతేంటో చూద్దాంరా' అని ఈ ఇటాలియన్ తో మన తెలుగునెందుకు పోలుస్తున్నారోనని కుతూహలం కొద్దీ రెండు కోర్సులు వెలగబెట్టాలెండి.

Anonymous said...

ivala andhrabhoomi lo ide vishayam mida vennela lo article vachindi.

http://www.andhrabhoomi.net/vennela/paatalu-955

Anonymous said...

మంచి తెలుగు మాట్లాడే టీవీ ప్రొగ్రాములే(కార్యక్రమాలే) లేవా?నేను కొన్ని పాటల ,డాన్సుల పోటీలు చూసాను,కాని క్వాలిటీ (ఊప్స్) నాణ్యత ఎంత ఛండాలంగా వుందంటే కొన్ని నిమిషాలు కూడా భరించలేకపోయాను.ఈ ప్రైవేటు చానెల్స్ రాక ముందు పరిస్థితి బానె వుండేది అనుకుంటా!

గీతాచార్య said...

@Rajkumar, సౌమ్య,

అందుకేనేమో, నరేష్వరులు గారులుంగారు పాత దాని కన్నా క్రొత్త మరో చరిత్ర బాగుందని సెలవిచ్చారు.

మొత్తానికీ అది మ రో చరిత్రగా మిగిలి ఏడిచింది. (రో కి row అనే వేరు ఆంగ్ల అర్థం తీసుకోవలసినదిగా మనవి. పాపం కథానాయిక మీద నిర్మాత గారి తిరగమోత వ్యాఖ్యలు). లేక పోతే మరో(దన) చరిత్ర.

nagarjuna చారి said...

మీరు ఈ తరహా తెలుగుకి కొత్తనుకుంటా ఉరకనే బాధపడుతున్నారు. నేనైతే చిన్నప్పుడె జెమిని టివీలో ఉదయం వచ్చే (పేరుగుర్తులేదు) పుట్టినరోజు/పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పేదాంట్లో యాంకరమ్మల తెలుగువిని ఆకుపచ్చ కన్నీరుకార్చి బాలుగారి ‘పాడుతాతీయగా’లో ఆనందబాష్పాలుకార్చి స్థితప్రజ్ఞుడనయ్యా ఇప్పటివి నన్ను బాధించజాలవు.

చాలా wonderfulగా చెప్పారు, కల్లు opening for అందరికి

Seetharam said...

సౌమ్య గారూ,

నాకు చాలా ఆనందము గా అనిపించింది, నాలాంటి చాదస్తులు (మా మేనల్లుడు పెట్టిన పేరు లెండి) ఇంకా ఇంత మంది ఉన్నారుకదా అని. నాకూ మీలాగే ఎన్నో భవసాగరాలు. ఏమి చేస్తాము? మన ఖర్మ అని సరిపెట్టుకోవడము తప్ప. మీరు వ్రాసిన మాటలలో తప్పులు వెదకాలని కాదు కానీ ఉచ్చారణ అన్న పదము లో చ కి వత్తు ఉండదు కదా!!

పోతే, మరో రెండు విషయాలు, స, శ, ష ల ఉచ్చారణ ఎంత మందికి తెలుసునంటారు? శంకర అన్న పదము షంకర గా వంకర పోయింది నేడు.

అలాగే, పేరు కి చివర దీర్ఘపు ఉచ్చారణ, ఉదాహరణ కి, సీత వచ్చిది కాక, సీతా వచ్చింది అనే మాట్లాడుతున్నారు ఆందరూ, అలా కాదు అంటే, మా మేనల్లుడి లాగ పేరు పెడతారు. ఏం చేస్తాము, తప్పక, చాదస్తుడి గా మిగిలిపోయాను.

మనవాడు, చిన్నవాడు లాంటి పదాలు మనోడు, చిన్నోడు లాగ చిన్నబోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే, నాది వ్యాఖ్య కాక వ్యాసము అయిపోతుంది. మళ్ళీ మీరు వ్రాసినప్పుడు, మళ్ళీ మరో సారి...

భవదీయుడు,

సీతారామం

Seetharam said...

తెలుగు పదాల ఉచ్చారణ కూడా, ఇటాలియన్ భాషలాగా అచ్చు స్వరాలతో ముగుస్తుంది కనక, భాష రాని వారికి, ఇటాలియన్ భాష ధోరణి లో వినిపిస్తుంది. అందుకే అప్రాచ్యులు (అంటే పశ్చిమ దేశాల వారన్న మాట), అలా ా "ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్" అన్నారు

భవదీయుడు,

సీతారామం

హరే కృష్ణ . said...

సౌమ్య గారు
మీ టపా కెవ్వుకేక

వేణూ శ్రీకాంత్ said...

మళ్ళీ మరో కెవ్వు... :-) బాబోయ్ ఇలా ఉతికి ఆరేస్తున్నారేంటండీ బాబు, this is too much you know :-)

ఏదేమైనా పాటల్లో ఇంగ్లీష్ మిక్స్ బానే ఉందనిపిస్తుంది ఆ ట్యూన్ కి అతికేట్లు. ఆ వర్గం ప్రేక్షకులు అవి కూడా ఆస్వాదిస్తారు కదా. పైగా ఆ సినిమాలకీ అవే ఎక్కువ, అదీకాక ఇలాటి పాటల జీవిత కాలం తక్కువ అతితక్కువ రోజుల్లో భూస్థాపితమైపోతాయ్, కనుక ఓ నాలుగు రోజులు ఎంజాయ్ చేయనివ్వచ్చు తప్పేం లేదు.

సిరివెన్నెల గారిలాంటి వాళ్ళిచ్చే ఎప్పటిక నిలిచే మధురాలు ఎలాను ఉన్నాయి కదా.

Anonymous said...

నా కామెంట్ ఎక్కడ?

స్వర్ణమల్లిక said...

సౌమ్య గారు,

తెలుగు భాషలోని అక్షరాలు అన్ని ఓవల్ సౌండ్స్ తో అంతం అవుతాయి. అందుకని తెలుగుని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అంటారు అనుకుంటున్నాను. దీని వెనక ఇంకా ఏమైనా చరిత్ర ఉంటే మీరే చెప్పాలి.

Vinay Chakravarthi.Gogineni said...

very clear cut analysis.......


1 personal......quote

nijamgane maya sasirekhalaaga iragadeesaaru.

sowmya said...

నాగేస్రావు గారూ, ముచ్చటైన మాట చెప్పారండీ.
మీరిచ్చిన వివరణ సరి అయినదే. ఇటాలియన్ ని తెలుగు ఆఫ్ ది వెస్ట్ అంటే సంబరపడాలిగానీ, తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఏస్ట్ అంటే ఎందుకు సంబరపడాలో నాకర్థం కావట్లేదు.

@అఙ్ఞాత గారూ
అది మహత్మ సినిమాలో వచ్చే "ఏం జరుగుతోంది ఏంజరుగుతోంది నా మన్సుజ్కివాళ" పాటలోని రెండో చరణం అండీ

@ రెండవ అఙ్ఞాత గారూ
మంచి వ్యాసం ఇచ్చారు. ధన్యవాదాలు!

కత్తి మహేష్ కుమార్ said...

మీకో సీక్రెట్ చెప్పనా...ఈ మధ్య నేను-వెంకట్ ‘న్యూ’ అనే చిత్రానికి మాటలు రాశాం. సినిమా సాఫ్ట్ వేర్ నేపధ్యంలో ఉంటుందిగనక బోలెడు ఇంగ్లీషు డైలాగులున్నాయి. ఉన్నంత తెలుగు సంభాషణల్లో వీలైనంత అచ్చ తెలుగులో రాద్ధామని ప్రయత్నించాం. సినిమా చూసొచ్చిన మితృడొకడు "కొన్ని డైలాగులు చాలా బుక్కిష్ గా ఉన్నాయి. అంత అచ్చ తెలుగులో ఈ కాలంలో మనుషులు మాట్లాడతారా?" అని ప్రశ్నించాడు. తనకి ఏంచెప్పాలో అర్థంకాలేదు.

sowmya said...

@కృష్ణ

ఈరోజుల్లో మచి తెలుగు మాట్లాడే టీవి ప్రోగ్రాం అంటే కష్టమేనండీ. నాకు తెలిసినంతవరకు ఉన్నంతలో కాస్తయిన తెలుగు మాట్లాడేది ఈటీవి లోనే.

@గీతాచార్య
మీకెంత ఓపికండీ మరోచరిత్ర చూసి విశ్లేషించడానికి :)

sowmya said...

@ నాగార్జునా చారి గారు
ఈ తరహాకి కొత్తేం కాదుగానీ పరిస్థితులుమరీ చెయ్యిదాటిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక బాధ వెళ్ళగక్కడం అంతే.

@ హరేకృఇష్ణ
నెనర్లు :)

sowmya said...

@సీతారాం
నేను మీలాగే చాదస్తురాలినే కాబోలు మరి అయితే :) మీ బాధ నాకు చాల బాగా అర్థమవుతున్నాది. మీది నాది ఒకే భాష(బాధ) మరి !
మీరన్నది నిజమేనండీ శ్యామ కాస్త షామ అయిపోయింది. స కి శ కి తేడా తెలియకుండా పలుకుతారు. "సందేంసం" అంటున్నారు ఏం చేస్తాం చెప్పండి.
అవునండీ అదేదో సినిలాలో "అనిత" ని "అనీతా" అని పిలుస్తున్నారు. నరాలు కోసేసినట్టనిపించిమిది. తెలుగుని తెలుగులా కాక మరోల పలకడం పద్ధతయిపోయిందిప్పుడు.
హ హ హ భలే చెప్పారండీ...పరాచ్యులు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారని...నాకు తెగ నచ్చింది :)


@స్వర్ణ మాలిక గారు
పెద్ద చరిత్రేంలేదండీ, మీరు చెప్పినది ఒప్పే

sowmya said...

@వేణూ శ్రీకాంత్
"ఏదేమైనా పాటల్లో ఇంగ్లీష్ మిక్స్ బానే ఉందనిపిస్తుంది ఆ ట్యూన్ కి అతికేట్లు."...ఇది నిజమేగానీ మీ పేరుని "వేనూ సీకాంత్" అని పిలుస్తారేమో చూసుకోండి :)
మీ కేకలు నాకు వినబడ్డాయి, ధన్యవాదములు :)

@ కృష్ణ గారూ
మీ కామెంటు ఎక్కడకీ పోలేదండీ, నా దగ్గరే భద్రంగా ఉంది

@వినయ్
హి హి హి....ధన్యవాదములు !

sowmya said...

@ మహేష్
అలా ఉంది మన ప్రారబ్ధం...ఇంకేం చెప్పమంటారు?
చెప్పాను కదా తెలుగు మాట్లాడకపోవడం, తెలుగు చదవకపోవడం అనేది చాలా పేద్ద ఫేషన్ ఇప్పుడు. మీరు అచ్చ తెలుగు పదాలను వాడడానికి ప్రయత్నించడం అభినందనీయం. ఎవరు ఎలా వ్యాఖ్యలు చేసినా మీ పట్టు విడవకండి. మనమైన మన తెలుగుని కాపాడుకుందాం.

Ramu S said...

చాలా అద్భుతంగా రాసారండి. మీ మాటల్లో చాలా ఫ్లో ఉంది. థాంక్స్.
రాము
apmediakaburlu.blogspot.com

sowmya said...

ధన్యవాదాలు రాముగారు, మీ అబ్రకదబ్ర అంత కాకపోయినా కొంత ప్రయత్నించాను :)

డి.వి.యస్.అబ్బులు said...

సౌమ్యగారూ,
ఎంత చక్కగా రాశారండి! యాదృచ్ఛికంగా మీ బ్లాగు చూడటం జరిగింది. మీ టపాలు చదువుతుంటే, పండు వెన్నెల రాత్రి మా గోదారితల్లి ఒళ్ళో (నాటు పడవలో)కూర్చుని అలల ఉయ్యాలలూగుతూ సేదతీరుతున్న అనుభూతి కలిగిందంటే నమ్మండి. నిజంగానండి...అమ్మ తోడండి...కావాలంటే...ఇదిగో చూడండి...ఒట్టు, భూదేవి బొట్టు!

@Ramu S - "చాలా అద్భుతంగా రాసారండి. మీ మాటల్లో చాలా ఫ్లో ఉంది. థాంక్స్."

రాముగారూ...అన్యాయం గురువుగారూ...ఆవిడ గుండెలనిండా కన్నీళ్ళు నింపుకుని రాస్తే, మీరేమిటండీ, మరీను...."ఫ్లో...థాంక్స్" అంటూను! ఇంచక్కా తెలుగులో రాయచ్చు కదండి.

sowmya said...

అబ్బులుగారు
నన్ను మునగచెట్టెక్కించేసారండీ.......ఏం రాసారండి, నన్ను ఇంతలా పొగిడినవాళ్ళు ఈ భూప్రప్రంచంలో లేరు, నమ్మండీ, ఒట్టండీ, మీ గోదారితల్లిమీదొట్టు, నమ్మరా, పోనీ ఈ భూమ్మీదొట్టు.

ఇప్పుడే మీ బ్లాగు చూసాను, దడిగాడు వానసిరా ఏమిటండీ బాబూ, నవ్వలేక చచ్చాను...భలే ఉంది పేరు....పేరులో ఏమీ లేదంటూనే భలే పేరు పెట్టారే
:)

నా బ్లాగుని మెచ్చినందుకు నెనర్లు....చాలా చాలా ధన్యవాదములు :)

వేణూ శ్రీకాంత్ said...

వామ్మో!! సెగట్రీ గారండీ మీతో ఎట్టుకుంటే దిమ్మతిరిగే దెబ్బతీసినారు గాదేటండీ!! అయ్ బాబోయ్ నన్నొగ్గేయండి :-) అసలే నా పేరంటే నాకు బోల్డు కుంచెం ఇష్టం :-)

sowmya said...

ఆయ్ బాబోయ్ వేనూ సీకాంత్ గారూ, మరి నా సంగతి మీకు ఎరుకేగదండీ...మరి నాతో ఎట్టుకుంటే అంతేగాదండీ....పోనీలెండీ ఈపాలికి ఒగ్గేస్తున్నాను :) :) :)

కనకాంబరం said...

As you said...
"అదండీ సంగతి. వీళ్ళండి మన తెలుగుకి ప్రతినిధులు ! ఇప్పుడు చెప్పండి, ఎలాగోలా కల్లనో, నీల్లనో, అనర్గళం అనకనో, ఏకసంతగ్రాహి అనో అష్టకష్టాలు పడైనా ఆ మాత్రం తెలుగు మాట్లాడుతున్న మన న్యూస్ రీడర్స్ మేలా, తెలుగుని ఎంగిలి చేస్తున్న బాబులు, వాళ్ళ సినిమాలు మేలా?".......

మీరు ఇంతగా ఆవేదన చెంది పోతే ఎలాగండి. ఎంగిళ్ళను ప్రతీ దినం అంగిళ్ళనుండి దిగమ్రింగుతూనే వున్నాం.భరిస్తూనే వున్నాం.
అసలే తెలుగు కొన వూపిరితో వుందనీ,దానికి తమదేమీ తప్పులేదనీ,అంతా ప్రజలదేననీ,పరభాషపై మోజుతో తెలుగు గొంతుకను తెలుగు చేతులే నొక్కేస్తున్నాయనీ ,తెలుగు ప్రభుత్వాలూ, ఇంగ్లీషు, హిందీ భాషా పదాల సహకారం లేకుండా,తెలుగుమాట్లాడలేని తెలుగు భాషా భేషజులూ,
తెలుగు పండితులు లేరన్నట్లు, టి.వి. నృత్య, సంగీత కార్యక్రమ న్యాయ నిర్ణేతలు అదే ..... తెలుగును ఖూనీ చేసే తమిళ తంబీల తెలుగు పాండిత్యాలూ......పాపం తెలుగు ఛానెళ్ళు. వారేం చేస్తారు?అందులో ఎక్కువ భాగం బయటి వారివే ,అయినా పాపం, పిల్లలలోనూ,వారి పెద్దల్లోనూ తెలుగు యడల అత్యంతగా అభిలాషనుపెంపొందించే దిశగా గుడ్డిలో మెల్లగా తమ వంతు క్రుషి చేస్తున్నారని నేను అభినద్దిద్దామని నేననుకుంటుంటె ...మీరేంటండీ ఎన్నెన్ని శ్రమలు పడుతున్నారో చూడండి పాపం. ఏదో చూసీ చూడనట్లు వదిలేయరాదూ. "పెళ్ళి" అన్న పదం ఏ టి.వి లోనైనా ఎవరినోటైనా "పెల్లి" గానే వుశ్ఛరించబడుతోంది పెద్ద పెద్ద హీరోల నోళ్ళ నుండి.ఏ నిర్మాతా కానీ,దర్శకుడు కానీ పట్టించుకోడు. ప్రస్తుతం ఆమాత్రమైనా తెలుగు గుడిసెల్లోనూ,ప్రాధమిక పాఠశాలలలోనూ, కొన్ని టి.వీ ప్రోగ్రాములలోనూ మాత్రమే బ్రతుకు తోందనుకొంటున్నాను.అది ఎంగిలిదైనా మురికి పట్టినదైనా......కనీసం పిల్లలలో ఓ రకమైన తెలుగు నేర్చుకోవాలనే అభిలాషను కలిగిస్తున్నాయి. గుడ్డిలో మెల్ల కదా.మీ "ఎంగిలి తెలుగు" పద ప్రయోగం నాకు బాగా నచ్చింది. అలాగైనా కొన వూపిరితో వున్న తెలుగుకు వూపిరులూదనీండి... అసలంటూ బ్రతికుంటుంది కదా...అభినందనలతో ..శ్రేయోభిలాషి...నూతక్కి రాఘవేంద్ర రావు..

sowmya said...

రాఘవేంద్ర రావు గారు,
అందుకేకదండీ లెంపలేసుకున్నాను, తెలుగు టీవి చానెళ్ళకి జోహార్లన్నాను. మీరన్నట్టు మిగతావాటితో పోల్చుకుంటే టీవి లోనే పెల్లి గానో, కల్లు గానో తెలుగు ఆ మాత్రమైనా కొన ఊపిరితో ఉన్నాది.

మొత్తానికి మెత్తటి చెప్పుతో గట్టిగా కొట్టారు సుమండీ.

"ప్రస్తుతం ఆమాత్రమైనా తెలుగు గుడిసెల్లోనూ,ప్రాధమిక పాఠశాలలలోనూ, కొన్ని టి.వీ ప్రోగ్రాములలోనూ మాత్రమే బ్రతుకు తోందనుకొంటున్నాను."....ఇది అక్షరాలా నిజం.

మీరు నాకింకో విషయం గుర్తు చేసారు. నేను ప్రాధమికంగా ఇంగ్లీషు చేసిన ఎంగిలి మీదే దృష్టి నిలిపాను, కానీ హిందీ చేస్తున్న ఎంగిలిని విస్మరించాను చూసారూ..."ఇంగ్లీషు, హిందీ భాషా పదాల సహకారం లేకుండా,తెలుగుమాట్లాడలేని తెలుగు భాషా భేషజులూ"......వంద శాతం నిజం.

నా టపాకి స్పందించినందుకు మీకు ధన్యవాదములు !

karthik said...

ఇదో నీకు కామెంటు రాస్తున్నా.. శాపనార్థాలు వెనక్కు తీసుకో..
"ఈ బ్లాగర్ చాలా మంచిది.. ఈ టపా ఇంకా సూపరు.. ఈ బ్లాగర్ వాళ్ళ అన్న మరింత సూపరు"

-కార్తీక్
గుంటనక్కల సంఘం
తెలుగు బ్లాగులు

sowmya said...

హి హి హి ధన్యవాదములు కార్తీకులుంగారూ,
సంబంధం లేకుండా వ్యాఖ్యలు రాయమంటే నీ తరువాతే, అచ్చం మా అన్నలాగే :)

Maruti said...

చాలా చక్కగా రాసారండి !!

Anonymous said...

నా బాలసాహిత్యం బ్లాగ్ ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ’పిల్లి ఇక్కట్లు’ కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం
-శాఖమూరి శ్రీనివాస్

vivek said...

"I went there అన్నమాట. అప్పుడు my friend told me this. సరే అని i did that"..... ఇలా ఉంటుంది. ఆ ఏడ్చేదేదో పూర్తిగా ఇంగ్లీషులోనే ఏడవచ్చుకదా, ఏమిటో విడ్డూరం !
ee line chaala bagundi..hahahaha!!

and inka meeru mana balayya gurinchi raasaru gani,..aa venkatesh garu aithe{thana gurinchi kuda raasarnakondi}...aa venky gaaru telugu program lo intrw ki vahcina kuda mottham englsih lone matladthadu..nenu eni sarlu thittukunnano vadni,..chettha vedhava..edo acting baaga chesthadu ani public ga thittakudadhu kani,..vadu chesedhi telugu films,thinedhi telugu sommu,..aa mucchata kosam ayna atleast 2 telugu padhalu matladadu okka intrw lo.!!

asalu baaga raasaru nijanga!!

sowmya said...

అవును వివేక్
నేను కూడా చాలాసార్లు గమనించాను.. ఆ వెంకీ బాబు తెలుగులో మాట్లాడడం చాలా చాలా అరుదు. మొన్న మళ్ళీ చూసాక కడుపుమండి ఇలా తోలు తీసాను.

karthik said...

నీ మార్కు పంచ్ లు బాగా పడ్డాయి సౌమ్యా..
ఇక తెలుగు తెగులు గురించి కొత్తగా చెప్పేదేముంది చెప్పు.. హై. లో పిల్లలు 'క ' అనేది ఇంగ్లీష్ లో "యస్" రాసి పైన నైకీ గుర్తు పెట్టాలని నేర్చుకుంటున్నారని విన్నాను. ఒక సారి గుండెమండినట్టు అనిపించింది.. కానీ ఏం చేద్దాం అది మన వ్యవస్థలో లోపం.. తెలుగు భాష అంతరిస్తే భవిష్యత్ తరాలకు ఒక మధురమైన అనుభవాన్ని దూరం చేసినందుకు చరిత్ర మనల్ని క్షమించదు..

-కార్తీక్
షరా: నేను టపా మొత్తంగా చదవకుండా కామెంట్లు పెట్టను. నీ టపా పూర్తిగా చదవటానికి ఇప్పటికి వీలయ్యింది. అందుకే ఇన్ని రోజులు కామెంట్లు పెట్టలేదు.

sowmya said...

ఏమిటి కార్తీక్, ఇంత చేదు నిజాన్ని చెప్తున్నావు. క రాయాలంటే యెస్ రాసి నైకీ గుర్తు పెట్టాలా.............వామ్మో వారి నాయనో నా తెలుగు కి ఎంత కష్టమొచ్చిపడిందిరో బగమంతుడో....ఇంత ఘోరం నేనెక్కడా వినలేదు, అసలు ఏమిటి ఈ అఘాయిత్యం....బాబోయ్ నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. గుండె రగిలిపోతోంది.

షరా: నాకు తెలుసు కార్తీక్, నువ్వు టపా చదవకుండా కామెంటు పెట్టవని. టపా చదవకుండా కామెంటు పెట్టడం అనేది ఒక కళ అది మా అన్నకే స్వంతం. నువ్వు ప్రయత్నించినా నీకు చేతకాదు :)

Anonymous said...

సౌమ్యా నిజం చెప్పండి మీరు రామోజీ రావు నియమించిన గూఢచారి కదూ :)
మీ బ్లాగుపేరు, మీ పరిచయం ఎన్నెన్నో అర్ధాలను చెబుతున్నాయి.
మీరు రాసే వాటిల్లో కొన్ని వ్యాక్యాల ద్వారా కొందర్ని హెచ్చరిస్తున్నారు కదూ:)

M. Pavan Kumar said...

మీ బ్లాగు చదువుతుండగా, నాకు నాస్నేహితుడు గుర్తొచ్చాడు.అతగాడి సంభాషణాభూషణాలలో మచ్చుకొక్కటి. "ఒరేయ్! Yesterday Shopping కెళ్ళి Things purchase చేసానురా!".ఇవ్వాళ్టి రోజున దాదాపు అన్ని భారతీయభాషలది ఇదే పరిస్థిఇ. ఏం చేస్తాం!

sowmya said...

@Anonymous
వామ్మో మోకాలికి బోడి గుండుకీ ముడెట్టకండీ బాబూ
నాకూ ఆ సదరు వ్యక్తికి ఏ సంభందం లేదు.

(మనలో మనమాట మీకెలా తెలిసిందీ నిజం?, భలేవారే ఇలా ఎవరైనా బయటకి చెప్పేస్తారా!)

కొంపదీసి మీరుగానీ జగన్ గూఢచారి కాదుకదా??????
పేరు కూడా రాయలేదు, నా కార్యక్రమాలు పసిగడుతున్నారు.....నిజం చెప్పండి మీరుగాని జగన్ అనుచరుడు కాదుకదా :)

sowmya said...

@పవన్ గారు అదే కదా నా బాధ...ఈ మధ్య సామానులు, వస్తువులు అనడం మానేసి things అనడం ఫేషనయిపోయిందిలెండి

Mahee said...

chala chala baga rasaru...kadu kadu chala baga chepparu...chupincharu mallii :)

sowmya said...

నెనర్లు మహీ గారూ

సవ్వడి said...

సౌమ్య గారు! మంచి విషయం చెప్పారు. మన భాషని ఎలా బ్రతికించుకోవాలో అర్థమవ్వట్లేదు.
తెలుగు విషయంలో బాలయ్య బాబుని తిట్టడాన్ని ఖండిస్తున్నాను. తెలుగు మాట్లాడడం గాని, తెలుగు పద్యాలు చదవడం గాని, తెలుగు చరిత్ర చెప్పడంలో గాని ఇంకే హీరో పనికిరాడు.
మీ మిగతా టపాలు కూడా త్వరలో చదివేస్తా!

sowmya said...

ధన్యవదములు సవ్వడి గారూ
"తెలుగు మాట్లాడడం గాని, తెలుగు పద్యాలు చదవడం గాని, తెలుగు చరిత్ర చెప్పడంలో గాని ఇంకే హీరో పనికిరాడు"......బాబోయ, మీరిలా నిజాలు చెప్పేస్తే ఎలాగండీ :)

అంకుర్ said...

బాగా చెప్పారండి...
మన తెలుగు పరిస్థితి ఇలా ఉందన్నమాట

Sirisha said...

ammo...na blog choostey meeru nannu champestaru aitey...

sowmya said...

@ శిరీష
హ్మ్ మీ బ్లాగు ఇప్పుడే చదివాను......చంపడం అనే విషయం కొంచం ఆలోచించాల్సిందే, కాబట్టి తొందరగా మీ భాష మార్చేసుకోండి :)

RAM CH said...

వీరాధి వీరుడంట స్టారాది స్టారుడంట గ్రేటాది గ్రేటుడంట వింటేనో...

ఆ.సౌమ్య said...

@రామ్ గారు
ధన్యవాదములు...మీరు "డింగుటకా..." టపాకి రాయబోయి దీనికి రాసినట్టున్నారు కామెంటు. పర్లేదులెండి రెండూ నావే కాబట్టి థాంక్స్. :)

అయినా అదేం దిక్కుమాలిన పాటండి, నేనెప్పుడూ వినలేదు, ఏ సినిమాలోది?

Anonymous said...

తెలుగు మాత్రమే కాదు...
అన్నీ భాషల్లో అదే పోకడ..ఉంది గమనించండి.
కళల్నీ,సమాచారాన్నీ నలుగురికీ చేరవేసే మాధ్యమాల నుండి
సరళమైన,స్వచ్ఛమైన తెలుగుని ఆశించటం సరైన ఆలోచన కాదేమో.

ఆ.సౌమ్య said...

@ఆదిత్య గారూ
అవునండీ. అన్ని భాషలనూ ఖూని చేసేస్తున్నారు. కళల్ని, సమాచారాన్ని అందించే వాళ్ళు కాబట్టే స్వచ్చమైన తెలుగు మాట్లాడాలని నా ఉద్దేశం. మన తెలుగు ప్రజలకు తెలుగులో సమాచారం అందించలేకపఒతే ఇంకెందుకండీ! పోనీ ఆ ఏడ్చేదేదో పూర్తిగా ఇంగ్లీషులోనే ఏడ్చినా బావుండేది. ఇది అటూ ఇటూ కాకుండా ఉన్నాది.

ఆదిత్య గారూ, ఓపిక గా నా టపాలన్నీ చదివి కామెంట్లు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములు.

ఇలాగే నా బ్లాగు పై ఓ కన్నేసి ఉంచమని ప్రార్థన :)

Anonymous said...

మీ తెలుగు వెలుగుతూ వుంది.
కథనంలో వేగం..హాస్యం కలిసి..కంటికింపుగా వుంది.
వీలున్నప్పుడల్లా వచ్చి, పలకరించి వెళ్తుంటాను.
ఈ మధ్య మీరు చేయి తిప్పుతున్నట్టులేదు....

ఆ.సౌమ్య said...

@ ఆదిత్య గారూ
"మీ తెలుగు వెలుగుతూ వుంది."....అబ్బ నా భుజాలు గజాలైపోతున్నాయండీ, ధన్యవాదములు. :) నా రాతలు మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.

"కథనంలో వేగం..హాస్యం కలిసి..కంటికింపుగా వుంది".....మాస్టారు ఏమనుకోవద్దు. ఇది మొదట గబగబా చదవడంలో 'కంటగింపు' అని కనబడింది. ఇదేమిటి ఇలా రాసారు అని మళ్ళీ చదివా....నాకే బలే నవ్వొచ్చింది. :D

ఈ మధ్య చెయ్యి తిప్పుతున్నానుగానండీ కాస్త నెమ్మదిగా ఉంటోంది గమనం...సమయం కుదరక. త్వరలో ఫుల్‌ఫాం లోకి రావాలని ప్రయత్నం. మీవంటి వారు ప్రోత్సహిస్తూ ఉంటే చెలరేగిపోనూ! :P

Anonymous said...

మందగమన..మధుర వచన...

ఆ.సౌమ్య said...

@ ఆదిత్య గారూ
హహహ...చమత్కారులు సుమండీ! :D

buddha murali said...

బాలయ్య బాబు గారి మాటలను కూడా అర్థం చేసుకోగలరు అంటే మీరు సామాన్యులు కాదు . అన్న గారు ....... నాన్నగారు .... అనే మాటలు తప్ప అయన మాట్లాడినవి ఏవి సరిగా అర్థం కావు . చిరంజీవి మీద బాలయ్య సెటైర్లు వేశారని నిన్న టీవి వార్తల్లో హోరేట్టిస్తే చాలా ఆసక్తిగా టివికి అతుక్కు పోయాను మళ్లీ అంతే అన్న గారు .. నాన్న గారు తప్ప ఏదీ సరిగా మాట్లాడలేదు

ఆ.సౌమ్య said...

@మురళీ గారు
హిహిహిహి...మరీ అలాపొగడకండి..నాకసలే సిగ్గెక్కువ :P

రామ said...

""I went there అన్నమాట. అప్పుడు my friend told me this. సరే అని i did that"..... ఇలా ఉంటుంది. ఆ ఏడ్చేదేదో పూర్తిగా ఇంగ్లీషులోనే ఏడవచ్చుకదా, ఏమిటో విడ్డూరం !"
అలా చెయ్యలేరండి. ఎందుకంటే, ఆ మాత్రం ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలిగే చదువో తెలివో ఉంటే, మాతృభాష లో మాట్లాడాలి అనే సంస్కారం ఏడుస్తుంది కదా!!. అప్పుడు ముందు ఇంగ్లీషులోనే మొదలు పెట్టరు.

ఆ.సౌమ్య said...

@ రామ
బాగా చెప్పారండీ...వీళ్ళకి అటు ఇంగ్లీషూ సరిగ్గా వచ్చి చావదు, తెలుగులోనూ సుబ్బరంగా ఏడవలేరు.