StatCounter code

Monday, June 7, 2010

ఔనౌనౌనౌను పేరులోనేముంది????

char 'i' గారి, కిత్నమూతిగారు పేర్ల గురించి టపాలు చూసాక నా పేరు వెనకాల దాగి ఉన్న కథ గురించి కూడా రాయాలని దురద పుట్టింది.

నా పేరు చక్కగా, చిన్నగా "సౌమ్య" అని బావుంది కదా, కానీ నా అసలు పేరు ఇది కాదు. నాకొక సిసలైన మాంచి నిఖార్సైన చాంతాడంత పేద్ద పేరుంది.

అదే "ఆలమూరు వెంకట పైడి రమా నాగ రామరత్న సౌమ్య"....ఇంగ్లీషులో గనక రాస్తే A-Z అన్ని అక్షరాలుంటాయి.

ఈ పొడవాటి పేరులో ప్రతీ చిన్న పేరుకి వెనక ఓ పేద్ద కథ ఉంది. నాకు కొద్దిగా ఊహ తెలియగానే మా నాన్నారు ఈ పేరు నాచేత బట్టీ పట్టించి అర్థాలు పరమార్థాలు వివరించి చెప్పారు.

ఆ విధంబెట్టిదనిన.....

ఆలమూరు - మా ఇంటిపేరు

వెంకట - మా కులదైవం వెంకటేశ్వరుడి పేరు...మా ఇంట్లో ఆడ, మగ తేడా లేకుండా అందరికి ఉంటుంది, అలా నాకూ తగిలించేసారు (మనలో మనమాట మా ఇంట్లో మగవాళ్లలో సగం మంది వెంకటరమణమూర్తులు మిగతా సగం మంది వెంకటాచలంలు అదీ కాకపోతే రామకృష్ణలు ఉంటారు).

పైడి - మా ఊరిదేవత పైడితల్లమ్మవారు, ఆవిడ పండగ రోజునే నేను పుట్టాను, ఇంకేముంది అదీ కలిసింది.

రమా - అప్పటికి మా ఇంట్లో రెండు తరాలుగా ఆడపిల్లలు లేరు. మా తాతగారు, పెద్దనాన్నగార్లు ఆడపిల్లకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉండగా పుసుక్కున నేను పుట్టేసాను...మా ఇంటి మహలక్ష్మి అనిచెప్పి "రమా" అని తగిలించేసారట

నాగ - ఇక్కడుంది అసలు కథ - డెలివరీ టైంలో అమ్మ ని ఆస్పత్రిలో జాయిన్ చేసారు. ఆరోజు సాయంత్రం నాన్నగారు ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చి రాత్రికి కావలసిన సామానులు, అమ్మకి భోజనం అన్ని సర్దుకుని బయలుదేరబోయేటంతలో నాగుపాముపిల్ల తోక తొక్కేసారట పొరపాటున. అది కాటేసేలోపల ఆయన తప్పించుకుని ఒడుపుగా పట్టుకుని దూరంగా విసిరేసారట. ఆ టెన్షన్ నుండి బయటకి రాకముందే, ఆస్పత్రికెళ్ళగానే అమ్మకి సిజైరిన్ చెయ్యాలని ఇంకో టెన్షన్ పెట్టారట డాక్టరు. మొత్తానికి నలుసు క్షేమంగా బయటపడగానే, నాగుపాము కథ అమ్మకి వివరించగా "నాగ" పేరు మన అమ్మాయికి పెట్టాలి అంతే అని తీర్మానించిందిట మా అమ్మ....అలా అదీ తగిలించారు. (పేరు పెట్టడం వలనో ఏమోగానీ పాములకి నాకు అవినాభావ సంబంధం ఉంది...అదేమిటో తరువాతి టపాలో చెప్తా)

రామరత్న - రామరత్నం మా నాన్నమ్మ పేరు.

అలా ఏరి కూర్చి నా పేరుని పెద్దదిగా చేసారు. సౌమ్య అనే ఇంట్లో పిలిచినా మొత్తం పేరు బడిలో వెయ్యాలని మా తాతగారు పట్టుబట్టారట. బడిలో ససేమిరా అన్నారట. పోనీ కుదించి "A.V.P.R.N.RR. సౌమ్య " అని రాయమన్నారట. కుదించినా కూడా రిజిస్టర్ లో లైన్లు పట్టవు అనేసారట.

మా నాన్నారు "సరేలే" అనుకుని ఆలమూరు సౌమ్య అనే వేయించారు చివరికి (నా అదృష్టం బావుండి.)

కానీ మాతాతగారు నా పేరు దాని పుట్టుపూర్వోత్తరాలు తరతరాలకి తెలియజేయాలని మా నాన్నగారిచేత ఒట్టేయించుకున్నారట...ఇంకేముంది ఎక్కడకి వెళ్ళినా నా పూర్తి పేరు "ఇది" అని చెప్పి వెనకదాగిన కథలు బుర్రకథలా పాడడం పరిపాటయిపోయింది.

పోనీలే తెగ్గొట్టి, దిగొట్టి పేరు కుదించారుగా అని సంతోషించేలోపలే నా అందమైన పేరుకి కష్టాలు మొదలయ్యాయి. "సౌమ్య" అని చెప్పగానే "సేమ్యా" అనేయడం ప్రతీవారికి అలవాటయిపోయింది. కోపం, ఉక్రోషం, కళ్ళలో నీళ్ళు, దిగమింగుకోవడాలు అన్నీ అయ్యాక పోనీలే ఏ కాకరకాయకూరో అనకుండా నాకిష్టమైన సేమ్యా (పాయసం) అంటున్నారుగా అని సరిపెట్టేసుకున్నాను.

అక్కడితో ఆపారా, అబ్బే......సౌమ్య కాస్త "సోమియా" అయి కూర్చుంది. మా వీధిలో వాళ్ళాంతా సోమియా అని పిలిచేవారు, మాచెడ్దచిరాకుగా ఉండేది. నాపేరుని కరక్ట్ చెయ్యడంతోనే నా జీవితం అయిపోయుందేమో అని తెగబాధపడేదన్ని.

ఇహ కాలేజీ కొచ్చేసరికి అసలైన తంటా మొదలయ్యింది. నా పేరు ఎంతో సరళంగా చక్కగా పలకడానికి సులువుగా ఉంటుంది కదా. అదేమిటో నా ఖర్మ సౌమ్య కి బదులు సౌజన్య అని పిలిచేవారు. సౌజన్య అన్నది సౌమ్య కంటే కష్టమైన పదమే, అయినా అదేమి కంఫ్యూజనో నాకర్థమై చావదు. ఎవరికైనా సౌమ్య అని చెప్పగానే సౌజన్య అని పిలిచేవారు. సౌమ్య, సౌమ్య అని వారిచేత పదే పదే వల్లెవేయించాల్సి వచ్చేది. నాకు ఎంత విసుగు, కోపము వచ్చేదో చెప్పలేను. ఒక సుముహూర్తాన సౌజన్య అని ఎవరు పిలిచినా పలకకూడదు అని నిశ్చయించేసుకున్నాను. అంతే పలకడం మనేసాను. దెబ్బకి దారికొచ్చారు జనాలు. అయిన కూడా ఈనాటికి మొదటి పిలిపు సౌజన్య అని రావడం కడు బాధాకరం. మొన్నటికి మొన్న ఎవరో ఒకావిడకి మా అమ్మ నన్ను పరిచయం చేసి పేరు చెప్పగానే " సౌజన్యా ఎక్కడుంటున్నవమ్మా నువ్వు అని అడిగారు"....నాకు కోపం నసాళానికి అంటింది, కానీ ఏం చేస్తాం....హి హి హి అని ఓ వెకిలి నవ్వు నవ్వి "సౌమ్య" అని కరక్ట్ చేసాను....అలవాటయిపోయింది మరి.

ఇక నా పేరుని ఇంగ్లీషులో రాసే విషయానికొస్తే.....చెప్పగానే ఎవడూ కూడా SOWMYA/SOUMYA అని రాయరు. SOMA అనో SOMAYA అనో SOMIYA అనో SAMIYA అనో రాస్తారు. స్పెల్లింగు చెప్పలేక తలప్రాణం తోకకొచ్చేది.

యూనివర్సిటీకి రాగానే కొత్తల్లో "సోమియా" వా "సోనియా" వా అని అడిగేవారు కొందరు. ఓ 2-3 నెలల తరువాత సీనియర్లు, స్నేహితులు అంతా ఆలమూరు అని పిలవడం మొదలెట్టారు. సౌమ్య ని నానావంకర్లు తిప్పడం కంటే ఇదేదో బాగనే ఉందిలే అని నేను కూడా ఊరుకున్నాను. ఇహ ఆలమూరు అష్టవంకర్లు తిరగడం ప్రారంభించంది."అలుమురు,ఆలమీరు,అలిమేరు"....ఇలా నానారాకాలుగా వర్ధిల్లింది. ఒకరోజు మా స్నేహితురాలు వాళ్ళ అన్నని పరిచయం చేసింది. నా పేరు చెప్పగానే ఓ "అలమారు సౌమ్య" అంటే మీరేనా అన్నాడు. చెప్పొద్దూ నాకు ఏడుపొక్కటే తక్కువ !

ఇప్పుడు మీ అందరికో క్విజ్....పైన చూడకుండా నా పూర్తి పేరుని తిరిగి చెప్పండి చూద్దాం?





















43 comments:

Unknown said...

అయ్యో
నాగుపాము ఎదురుపదిండా కొండచిలువ ఎదురుపడితే అప్పుడు ఏంటి మీ పరిస్థితి :(
ఆలమూరు వెంకట పైడి రమా ఫణి రామరత్న సౌమ్య
అని పెట్టేవారేమో
తేలు జర్రి అని ఒకవేళ వుంటే
విషపురుగు అని ఉండేదేమో
Just for fun
తప్పుగా అనిపిస్తే వెంటనే డిలీట్ చేసేయండి
హర్ట్ అయ్యేలా అనిపిస్తే నా క్షమాపణలు

krishna said...

హి హి హి హ్హి ....హె హె హెహ్హె... ఒహ్హొ ఒహ్హొ .... మా బాగా అయ్యింది సొమయ్య గారు, ఎర్ర్ ..సొమియా..ఎర్ర్..ఆ ఆ సెమియా గారు..
అన్నట్టు క్విజ్జు సంగతి... ఎలాగు నేను చీటింగు చేసాను అంటారు కాబట్టి i am not trying :-)

ఆ.సౌమ్య said...

@సూర్య మౌళి
బాబోయ్ భలే భయపెట్టారండీ...ఏమి ఊహ వచ్చిందండీ మీకు. నాకిప్పుడనిపిస్తోంది తేలు, జెర్రి మీద కాలు వెయ్యకుండా మా నాన్నగారు నన్ను బతికించారని :)

అయినా నాగరాజుని దేవుడిగా కొలుస్తారు కాబట్టి పెట్టరులెండి....తేలు, జెర్రి అయితే ఎందుకు పెడతారూ :D

మీరు మరీనండీ కొండచిలువలు ఇంట్లో తిరుగుతాయ ఏమిటి?

ఫరవాలేదండీ ఆ మాత్రం హాస్యం నాకూ ఇష్టమే మీ కామెంటుని సరదాగానే తీసుకున్నాను...భయపడకండి :)
కామెంటు రాసినందుకు thanks!

ఆ.సౌమ్య said...

@కృష్ణ
హమ్మయా మీ సరదా తీరిపోయిందా, కడుపుచెక్కలయ్యేలా నవ్వేసారా...హాయిగ పడుకోండి ఇవాళ :)

శ్రీనివాస్ said...

పైన చూడకుండా మీ పేరు
ఆలమూరు వెంకట పైడి నాగ రత్న రమా సౌమ్య

ఆ.సౌమ్య said...

@శ్రీనివాస్
పప్పులో కాలేసారుగా!
నా పేరు తప్పు చెప్పేసారోచ్చ్, మళ్ళీ ఒకసారి చదవండి....ఈసారి కరక్ట్ గా వచ్చేస్తుందిలెండి :)

అయినా మీ ఎఫర్ట్ కి జోహార్లు 70% కరక్ట్ గానే చెప్పారు...వేసుకోండి వీరతాళ్ళు :D

స్వర్ణమల్లిక said...

పేరులోనేముంది? ఏముంది అంటారేంటి? అంతా పేరులోనే ఉంది. ఎలాంటి పేరు పెట్టినా సరే.. ఈ రోజుల్లో చదువుల మాయ వల్ల తెలుగుని ఎంత వంకర టింకరగా పలికితే అంత గొప్ప అన్నట్టు భావిస్తున్నారు జనాలు కూడా. ఎంతో తేలికగా పలకగలిగిన నా పేరు లక్ష తూట్లు పొడుస్తూ అష్టవంకరలు తిప్పేస్తూ ఉంటే ఎంత బాధ పడేదాన్నో. కనీసం రెండు సగాలు విడదీసి ఏదో ఒక పేరుతొ ఫిక్స్ అవచ్చు కదా.. అబ్బే ... అలా కూడా ప్రయత్నించా. ఎన్ని సార్లని సరి చేస్తాం చెప్పండి. సర్డుకుపోడమే....

Unknown said...

ఖరేవా ఆచారం ప్రకారం భర్త చనిపోయిన స్త్రీని వయసుతో నిమిత్తం లేకుండా మరిదికి ఇచ్చి పెళ్ళి చేస్తారు

పైన సూర్య మౌళి ప్రస్తావించినట్టుగా

ఈ లెక్కన మీ ఇంట్లో ఆ నాగుపాము కొండచిలువతో అక్రమసంబంధం కలిగి ఉంటే

ఖరేవా ఆధారం ప్రకారం ఆ కాన్సెప్ట్ ఆధారంగా మార్తాండ కథలు వ్రాసినప్పుడు అవి బూతు కథలు అని విమర్శించారు. సినిమాలలో బావ-మరదలు పెళ్ళికి ముందు సరసాలాడుకుంటున్నట్టు చూపిస్తే బూతు అనరు. వదిన మరిదిని లీగల్ గా పెళ్ళి చేసుకుంటున్నట్టు వ్రాస్తే బూతు అంటారు కొందరు టిపికల్ సంప్రదాయవాదులు

అందుకే నేనూ రాబోయే కధల్లో పాము కొండచిలువల సంబంధాలను అవి సరసాలాడుకున్నట్టుగా చూపిస్తాను అని మార్తాండ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందినది

ఆ.సౌమ్య said...

@స్వర్ణ మాలిక
అమ్మో మీ పేరుని కూడా అష్టవంకర్లు తిప్పారంటే...ఇహ మనల్నెవరు కాపాడలేరు. ఏదో నా పేరులో కాస్త అక్షరం కింద అక్షరం చూసి తికమకపడ్డారనుకోవచ్చు. మీ పేరుని కూడా అంటే....ఇహ తట్టుకోవడం నా వల్ల కాదు.

Unknown said...

స్వర్ణమల్లిక గారు
ఇదే విషయాన్నీ ఏకలింగం గారు ప్రస్తావించారు
బాషా పునరుద్దరుకుడి గా ఈ టపా వల్ల బ్లాగులోకానికి చాల మేలు జరిగింది అని భావిస్తున్నాను
http://ekalingam.blogspot.com/
మీరు కూడా చూడండి

Unknown said...

అయ్యో ఆవిడ ఇప్పుడే వాపోయారు మీరు మల్లె ఖూనీ చేసేసారు
స్వర్ణ మల్లిక అని రాయాలి
స్వర్ణ మాలిక అని కాదు

ఆ.సౌమ్య said...

@ మాణిక్ భాషా పునరుద్ధరణ గారూ
మీరు ఇక్కడుండవలసినవారు కాదు, మా ప్ర.పీ.స.స లో సభ్యత్వం తీసుకుని అక్కడ ఉండవలసినవారు....."పాము, కొండచిలువల అక్రమ సంబందం" కేకో కేక.....అదుర్స్!

ఒహో మల్లిక బదులు మాలిక పడింది...ఆ అలవాటులో పోరపాటులు జరుగుతూ ఉంటాయిలెండి :)

SRRao said...

సౌమ్య గారూ !

మీ పేరు కథ, అంతకంటే మీ కథనం బాగుంది.

Wit Real said...

Jamesbond joke గుర్తొచ్చింది ;)

Once upon a time, Sowmya finds Jamesbond in her next seat in the flight.

So, sowmya asks the bond: "whats your name?"

Bond says,
"My name is Bond..... James Bond!"


Next, bond asks Sowmya's name.

Sowmya says:
My name is
సౌమ్య
రత్న సౌమ్య
రామరత్న సౌమ్య
నాగ రామరత్న సౌమ్య
రమా నాగ రామరత్న సౌమ్య
పైడి రమా నాగ రామరత్న సౌమ్య
వెంకట పైడి రమా నాగ రామరత్న సౌమ్య
ఆలమూరు వెంకట పైడి రమా నాగ రామరత్న సౌమ్య

By then, bond fainted!

ఆ.సౌమ్య said...

@SRRao

Thanks రావు గారూ

@Wit real
ha ha ha.....nice joke, good imagination....liked it :)


ఈపాటికి నా పేరు కంఠతా వచ్చేసుండాలే!

హరే కృష్ణ said...

వారినయనో ఇంతాకాద ఉందా మీ పేరు వెనుక
అంత సరళమైన పేరునే గుర్తు పట్టుకేలేకపోయారంటే వాళ్ళు ప్రవీణ్ శర్మ రూపాలను గుర్తుపెట్టుకోవాలంటే పిచ్చేక్కి పులిహోరచేసుకోనేవల్లేమో ఆ కధలు చదివే క్షోభతో పాటు

మధురవాణి said...

:-D :-Dబాగుందండీ మీ పేరుకున్న చరిత్ర. మీకో విషయం తెలుసా.. సౌమ్య అని అబ్బాయిలకి కూడా పేరుంటుంది. ఆ పేరుతో ఒక బెంగాలీ అబ్బాయి పరిచయమయ్యాకే తెలిసింది ఇది అబ్బాయికి కూడా పెట్టే పేరని. బోలెడంత హాశ్చర్యపడిపోయానంటే నమ్మండి ;-)

..nagarjuna.. said...

aka char'i' : కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడిందనీ నాపేరుని జగద్విగితతం చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు. ధన్యోస్మి
ఆలమూరు వెంకట పైడి రత్న... ఉహు
ఆలమూరు వెంకటరత్న...ఉహు
ఆలమూరు వెంకట పైడి నాగ రమారత్న...నా వల్లకాదండి..ఆలమూరు సౌమియాగారు

నేనుకూడా మీకో పేరునిస్తున్నా పెద్దపేరు గుర్తెట్టుకోవడం అలవాటైంది కాబట్టి
మా ఈ ఇంజనీరింగ్ ఫ్రెండు పేరు ఒకే ఒకసారి చదివి మళ్ళా చెప్పండి
'అప్పన శ్రీనివాస రామకృష్ణ నాగసుబ్రహ్మణ్య సంతోష విఘ్నరాఘవ విశ్వపునీత్'

మాలా కుమార్ said...

మీ పేరు బాగుంది , కాని నేను గుర్తు పెట్టుకొని చెప్పలేనండి .
మా అమ్మాయి పేరు సంజ్యొత్ . ఆ పేరును ఖూనీ చేయటమే కాదు , ఓసారి నీ పేరు రిజిస్టర్ లో లేదు పొమ్మన్నారు . అలాగే ఏడుస్తూ ఇంటికి తిరిగి వొచ్చింది . ప్రతిసారి స్కూల్ మారినప్పుడల్లా బాయ్స్ సెక్షన్ లో వేస్తారు . బోలెడు కష్టాలు లెండి .

ఆ.సౌమ్య said...

@ హరే కృష్ణ
మరే అంత ఉంది నా కథ
హ హ హ....ఒక్క పులిహోరేం ఖర్మ, దద్ధోజనము, చక్రపొంగలి కూడానూ :)


@ మధురవాణి
ధన్యవాదాలు....అయ్యో భలేవారే నాకు ఈ విషయం తెలుసు. మా జూనియర్స్ లో సౌమ్య రంజన్ మిశ్రా అనే ఓరియా అబ్బాయి ఉండేవాడు. సౌమ్య అని పిలిస్తే ఇద్దరం పలికేవాళ్ళం :)

ఆ.సౌమ్య said...

@ char'i' హి హి హి ఏదో మీ 4E మీదున్న అభిమానం :)
అబ్బే మీ వల్లకాదుగానీ వదిలేయండి.....నా పేరుని ఖూనీ చెయ్యకండిబాబూ మీకో దణ్ణం.
అమ్మో ఈ విశ్వపునీత్ ఎవరండీ బాబూ నాకు పోటీగా తయారయ్యాడు....ఇంతపెద్ద పేరా, అందరు దేవుళ్ళు వచ్చేసారుగా :)

@ మలా కుమార్ గారు
ధన్యవాదాలు....వద్దులెండి మీరంత కష్టపడొద్దు నేను చూడలేను...అసలే మహిళాబ్లాగర్లను వెతికి పట్టి ఒకచోట కూర్చి మీరు చాలా కష్టపడ్డారు, పేరే కదా బట్టిపట్టక్కర్లేదు, వదిలేయండి :)

హ హ హ మీ అమ్మాయికీ కష్టాలు తప్పలేదా ! సంజ్యోత్...పేరు బావుంది. అంటే అర్థమేమిటండీ?

Venugopal said...

Naa P.G lo oka friend vunde vadu.. vaadi peru Theerdhankar. Ika meerandaru vuhinchukovachu enta kastapadalo vadini pilichevallu. Nenu intavaraku vaadi peruni first time ardham chesukunna vallanu chudaledu..
Soumya perune anni vankarlu tippe vallu veedi peruni enni vankarlu tippevallo guess cheyandi...
Mee andariki ippudu quiz.. veedi peruni telugulo correct ga evaru rastaro chuddam...

ఆ.సౌమ్య said...

@ వేణుగోపాల్
హ హ హ సౌమ్య కే ఇన్ని కష్టాలంటే తీర్ధంకర్ కి ఎన్ని కష్టాలో పాపం, తలుచుకుంటే జాలేస్తోంది :) కామెంటినందుకు thank you!

Unknown said...

ఆవెంపైరనారారసౌ (ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీ పేరుని) గారూ,

బాగున్నాయండీ మీ సి"నేమా" కష్టాలు. BTW,మీ ఊరిదేవత పైడితల్లమ్మవారు అన్నారు, మీది ఇజీనారమ?

ఆ.సౌమ్య said...

@KK గారూ
ధన్యవాదములు!
ఆవెంపైరనారారసౌ....బాబోయ్ ఇదేదో కొండ భాషలా ఉంది :)
అవునండీ మాది ఇజీనారమే.....మీది కూడానా?

vatsalya said...

నా పేరు ఏ ముహుర్తాన నాన్నగారు వాత్సల్య అని పెట్టారో గానీ ఇప్పటివరకూ ఎంతమంది ఎన్ని రకాలుగా ఖూనీ చేసారో.పెద్దగా చదువుకోని వాళ్ళు "వాచ్చల్య" అంటారు. నోరు తిరగక కొంతమంది వాస్చల్య అంటారు.వాచ్చెలియ అని కూడా పిలిచారండోయ్ కొంతమంది విదేశీయులయితే వత్సా..ల్యా అనో వాసల్యా అనో పిలుస్తారు

ఆ.సౌమ్య said...

@vatsalya

వాత్సల్య...అబ్బ ఎంత చక్కని పేరండి...పాపం మీ తల్లిదండ్రులు ఎంత వాత్సల్యంతో పెట్టుకున్నారో మీకా పేరు....జనాలు ఖూనీ చేసి పారేసారన్నమాట.

మీ పేరు వినగనే ఇలాగే ఖూనీ అయిన ఇంకో పేరు గుర్తొచ్చింది నాకు...సువర్చల అని ఒక ఫ్రెండుండేది నాకు. పాపం దాన్ని అందరు సువచ్చల, సువత్సల, సువచల అనో పిలిచేవారు...అది తెగ ఏడ్చేది వాళ్ళ ఉచ్చారణ చూసి :)

Unknown said...

ఏవీపీఆరెన్నారారు సౌమ్యాగారూ.. కేక పెట్టించారు ఈ పోస్టులో.. ఐనా మిమ్మల్ని అలమారు చేసిన ఆ "బీరు"వా ఎవరండీ.. హహహహ్హ ఆయనకి మంచి సెన్సాఫ్ హ్యూమరుందండీ.. మీరు చాలా లక్కీ అండీ ముక్కోటి దేవతలూ మీ ఇంటి ఇలవేల్పులయ్యుండుంటే.. మీరు పిహెచ్.డి. చేసే ఏజ్‌కి సక్సెస్‌ఫుల్‌గా మీ పేరు గుర్తు పెట్టుకున్నానని చెప్పేవారు.. ఐనా ఇన్ని బాధలెందుకని నేను అందరికీ ముందే చెబుతూ ఉంటాను.. పుట్టేటప్పుడు.. టైమూ, ప్లేసూ, పండగలూ, ఇలా పేర్లు మార్చేసే జనాలూ అన్నిటినీ చూసుకుని పుట్టాలని.. ఎవరన్నా నా మాట వింటే కదా.. ఊహూ ఎవరిష్టం వారిదైపోయింది.. నా పేరుకలాంటి కష్టాలైతే రాలేదండీ ఐతే మౌళీ అని కానీ లేకుంటే చంద్ర అని కానీ జాగ్రత్తగా పిలుస్తూ ఉంటారు.. ఎందుకో అలాగా.. ఒక సారి చిన్నప్పుడు ఒక చిన్నపాటి పెద్దాయన నన్నేడిపిద్దామని మా ఇంటి పేరు(మల్లేడ)ని పట్టుకుని ఇలా అన్నాడు "మల్లేడ మడిగట్టి దాక దగ్గర పెట్టి దవడూడగొట్టు" అని.. అడిగాడు కదా అని ఒకటి దవడ మీద పీకి వీదిలోకి పరిగెట్టాను.. మళ్ళీ ఆయన ఇంటి దగ్గర నుండి వెళిపోయేవరకూ ఆ ఛాయల్లో కనిపిస్తే ఒట్టు.. కాకుంటే మా అమ్మ తర్వాత తిట్టిందనుకోండీ.. ఏంటో పేరు చెప్పుకుని ఏవేవో‌ విషయాలు చెప్పుకుంటుంటే సరదాగా ఉంది..

ఆ.సౌమ్య said...

@ చంద్రమౌళి గారూ
పూర్తిపేరు చూడకుండా చెప్పమంటే ఇలా కుదించిన పేరు కాదు, చక్కగా సుబ్బరంగా తెలుగులో చెప్పాలి....అప్పుడే మీరు గెలిచినట్టు.

ఒక "బీరు"వాగాడు తగిలాడులెండి నాప్రాణానికి...వాడి చేతిలో ఆలమూరు కాస్త అలమారయింది...ఏం చేస్తాం!

అబ్బ చా....మీరు నేను పుట్టే ముందే ఈ మాట చెప్పి ఉంటే ఇబ్బంది లేకుండా పేరు పెట్టుకునేదాన్ని కదా, ఇప్పుడు చెప్పి ఏం లాభం! మీరెప్పుడు ఇలా లేట్ గానే సలహాలిస్తారనుకుంటా, అందుకే మీ మాట ఎవరూ వినట్లేదు :)

హ హ హ పాపం ఆ పెద్దాయన, అప్పటి నుండి మీరిటొస్తే ఆయన అటెళ్ళేవారేమో కదా!

Unknown said...

Hi Sowmya, i think so spelling is correct?? by the by this is 2nd time vising this blog but this is 1st time read. very nice and ur renaming article is veryyy... funny.

By the way I am Adhikari.

Feel different.

ఆ.సౌమ్య said...

@ sudarsanam/adhikaari
hi, yes yes spelling is very correct :) thanks a lot!

మీ పేరు నిజంగానే అధికారి యా?...yes i felt the difference ;)

నా బ్లాగు చదివినందుకు ధన్యవాదములు. మీరు ఇంకా ఎక్కువగా నా బ్లాగుని చదువుతారని నాకు బోల్డు హిట్లు రావడానికి సహాయపడతారని ఆశిస్తున్నాను :)(just kidding)

P>Madhava Rao said...

సౌమ్యగారు, నమస్కారములు.

మీ కథనం తీరు చాలా బాగుంది. మొట్టమొదటిసారిగా మీ బ్లాగుని చదువుతున్నాను. మీ కథ చదివిన తరువాత,నాకు చిన్నప్పటి ఒక కథ గుర్తుకువస్తున్నది. "ఒక పేదరాశి పెద్దమ్మ..ఒక ఈగ..ఒక కోతి... కోతి ఈగను; పెదమ్మను నేను నా పేరును మర్చిపోయాను, మీరెవరైనా చెప్పగలరా అని అడుగుతూ పోయిందిట. అట్లాగే,మీరు, మీ పేరును ఎదుటివాళ్లకు సరిగ్గా ఎలా పలకాలో చెబుతూ, ఈలోపు ఎదుటివాళ్లు మీ పేరును రక,రకాలుగా మార్చి చెబుతుంటే, మీ అసలు పేరును మీరే చివరికి మర్చిపోతారేమో జాగ్రత్తపడండి. ఇంకా ఎన్నో మంచి రచనలు చేయాలని ఆశిస్తూ,

భవదీయుడు,
మాధవరావు.

ఆ.సౌమ్య said...

@ మాధవ రావుగారూ నమస్కారం.
నా బ్లాగు చదివి, కామెంటు రాసినందుకు ధన్యవాదములు.

హ హ హ భలే కథ గుర్తు చేసారు.... మీకాభయం అక్కర్లేదండీ...అది నేను ఇప్పటికి ఎనిసార్లు వల్లెవేసానంటే, మరో పది జన్మలకి కూడా మరచిపోను :)

స్థితప్రజ్ఞుడు said...

మీరు చాలా అదృష్టవంతులు సౌమ్య గారు....

జనాలు మీ పేరు సరిగ్గా పలకట్లేదు...అదే కదా మీ బాధ...

నా కష్టాల ముందు అసలు మీవి లెక్కలోకే రావు....



నా పేరు నరసింహదేవర నాగ సాయి రాఘవేంద్ర ప్రసాద్..



దీన్ని 10th క్లాసు లో N S R Prasad NDevara అని రాసి చచ్చాడు ఎవడో....(వాడిని నేను తిట్టుకొని రోజు లేదంటే నమ్మండి..)

అసలు నరసింహదేవర ని NDevara అని మార్చాలని ఎలా అనిపించిందో ఆ ఎదవకి.... శుభ్రంగా N అనే ఒక్క అక్షరం రాయొచ్చు గా...

నా ఒక్కో కార్డు మీద ఇలా ఉంటుంది...

Driving license: N S R Prasad NDevara

voter ID: N S R Prasad Ndevara

PAN card: N S R Prasad N Devara


NDevara ఏంటయ్యా....NTini లాగా..నువ్వేమన్నా సౌత్ ఆఫ్రికా నుండి వచ్చావా....కొంత మంది వేసే కామన్ జోక్..

నా 10th క్లాసు వాళ్ళు NSR అని పిలుస్తారు. ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రసాద్ అంటారు. B.Tech వాళ్ళు రాఘవేంద్ర ప్రసాద్ అంటారు.

M.Tech friends ప్రసాద్ అంటారు. ఆఫీసు లో వాళ్ళు NDevara అని పిలిచి చస్తున్నారు. ఇంట్లో సాయి అంటారు..

ఎన్నని చావమంటారు.....

శివరంజని said...

సౌమ్య గారు ఇంక నా వల్ల కాదండీ బాబోయ్ .... నేను నవ్వలేను సుమా.....

ఏమిటో మీకు నా లాంటి కష్టాలే అన్నమాట ...అబ్బా !!!!!నా పోస్ట్ కంటే మీ పోస్ట్ ఇంకా అదిరిపోయింది :):) పేరు భాదితులు ఇంతమంది ఉన్నారా?

@స్థితప్రజ్ఞుడు : ప్రసాద్ గారు అయ్యో పాపం ! మీరు పేరు తో కష్టాలు లో మమ్మల్ని మించిపోయారులేండి

ఆ.సౌమ్య said...

@శివరంజని
అడగ్గానే చదివి కామెంటు పెట్టినందుకు ధన్యవాదములు.
హ హ హ మరే మీరొక్కరే కాదూ మేమూ ఉన్నాం మీతో పాటు పేరు భాదితులం.

jeevani said...

అలమారు సౌమ్య :))))

ఇది పరాకాష్ట...
మీ వల్ల మరింత మంది బాధితులు వెలుగులోకొచ్చారు. నిజమే ఇవి ఎదుటి వారికి సరదాగానూ బాధితులకు ఉక్రోషంగానూ ఉంటాయి. నేను విన్న వింత పేరు " పెద్ద బజార్" :))

ఆ.సౌమ్య said...

@ జీవని గారూ ధన్యవాదములు

అవునండీ, ఇప్పుడు రాయడానికి, చదవడానికి సరదాగానే ఉంటుంది, కానీ ఆ సంఘటనలు జరిగినప్పుడు ఎంత ఏడుపొస్తుందో చెప్పలేను.

బాబోయ్ "పెద్ద బజార్" ఆ...ఏ పేరుని ఇలా మార్చారు స్వామీ?

3g said...

మీ నేములో ఇంతుందా!!!!!!!!!!! చాలా బాగుంది.
మీరు పూర్వ కాలంలో ఆలమూరులో ఉండేవారా!!!!!!!

jeevani said...

its real name !!

ఆ.సౌమ్య said...

@ 3g
ధన్యవాదములు.
అవునండి పేరులో అంతుంది...అంతే కాదు ఇంకా ఎతో ఉంది:)
మేమెప్పుడు ఆలమూరులో లేమండి...మరి మా పూర్వీకులు అక్కడ ఉండేవారేమో మరి, నాకు తెలీదు.

@జీవని
అవునా....అది నిజం పేరా...వామ్మో !

Anonymous said...

బాగుంది...
పేరు, పేర్చిన పదాలు..

ఆ.సౌమ్య said...

@ఆదిత్య గారూ
ధన్యవాదములు.