StatCounter code

Wednesday, September 22, 2010

చెక్కిన చేతులకు జోహార్లు-1

చెన్నై నుండి తిరుచిరాపల్లి (తిరిచ్చి) కి ఐదు గంటలు ప్రయాణం రైల్లో. రాత్రి 9.00 కి ఎక్కి, అర్థరాత్రి 2.00 కి తిరుచ్చి లో దిగి ఆటోవాళ్ల సహాయంతో హొటేలు చేరుకున్నాం. మర్నాడు ఉదయాన్నే ఉపాహారం సుబ్బరంగా లాగించి శ్రీరంగం ప్రయాణం కట్టాం. తిరుచ్చి నుండి శ్రీరంగానికి ఏడు కిలోమీటర్లు మాత్రమే, కారులో అరగంట ప్రయాణం. శ్రీరంగం అసలు పేరు "తిరువారంగం". ఇక్కడ విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు, రంగనాథుడి పేరుతో కొలవబడుతూ ఉంటాడు. అక్కడ తమిళ్ లో రాసిన కథని నేను అర్థం చేసుకున్న విధంబెట్టిదనిన......సముద్రమధ్యంలో ఉన్న విష్ణువుని బ్రహ్మ పూజిస్తూ ఉండేవాడట. ఆ విష్ణువుని, బ్రహ్మ కొందరు ఋషులకు (నాకు పేర్లు గుర్తు లేవు) ఇచ్చి నిత్య పూజలు జరుపమని చెప్పాడట. వారు ఇంకెవరికో ఇవ్వగా...అలా అలా తిరిగి తిరిగి ఇక్ష్వాకుల రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి యాగానికి వెళ్ళిన చోళరాజు ఆ విగ్రహాన్ని చూసి "అరే ఇది మా దక్షిణ భారతంలో దొరికిన విగ్రహం, ఇది మాది, మాకు ఇప్పించండి" అని వేడుకున్నాడట. "బెంగపడకు రాజా, ఇది మీకు చేరుతుంది" అని ఇక్ష్వాక మహారాజు అభయమివ్వగా" ఆనందహృదయుడై చోళరాజు తన రాజ్యమునకు మరల ఏతెంచను. రాముడు తన పటాభిషేకానంతరం విభీషణునికి ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వగా, సంతోషంతో అది తీసుకుని ఆయన శ్రీలంకకి పయనమయిరి. మార్గమధ్యంలో శ్రీరంగం లో విభీషణుడు, సూర్యుడుకి అర్ఘ్యం ఇద్దామని.......ఆ అదిగో మీ అందరికీ భూకైలాస్ సినిమా గుర్తొచ్చింది కదూ, అచ్చం అలానే ఆ విగ్రహం శ్రీరంగ పట్టణంలో భూమిలోకి దిగిపోయింది. బాధపడుతున్న విభీషణుడితో విష్ణువు అన్నాడట..."భయపడకు, బాధపడకు, నేనెప్పుడు నిన్ను కాచుకుంటూ ఉంటాను. నీ రాజ్యాన్ని ఓ కంట చూస్తూ ఉంటాను". అందుకే ఆ విగ్రహం చూపు శ్రీలంక వైపు ఉందిట. ఆ విగ్రహం కళ్ళు శ్రీలంకని చూస్తూ ఉంటాయట. ఈ గుడి ని 14-17 శతాబ్దాల మధ్యన కట్టారు. గోపురం ఎత్తు 236 అడుగులు. గుడి లోపల విగ్రహాం చాలా చాలా పెద్దది. నల్లగా, నిగనిగలాడుతూ కనులకు నిండుగా ఉంటుంది. ఏకశిలపై, ఆదిశేషువుపై పవళించే విష్ణుమూరిని చెక్కిన కళ చూసితీరవలసినదే. గుడి లోపల నేలపై తెలుగు లిపి కనిపించింది. చాలా చోట్ల తమిళంకన్నా ఎక్కువగా తెలుగు లిపి కనిపించింది. కాస్త అర్థమయీ అవనట్టు ఉన్నాది. అక్షరాలు చదవగలిగానేగానీ భావం బోధపడలేదు. చాలాచోట్ల గొలుసుకట్టు లో రాసి ఉంది. అక్షరాలు విడగొట్టడానికి కూడా కష్టపడవలసి వచ్చింది. ఇంకా గుడి లోపల శిల్పాలు కడు రమణీయంగా ఉన్నాయి. కంబర్ తను రాసిన రామాయణాన్ని (అదే కంబ రామాయణం) గానం చేసి, వినిపించే ప్రదేశం ఉంది. అది ఒక చిన్న మండపంలా ఉంది, అందులో నిలుచుని ఆయన గానం చేస్తూ ఉంటే చుట్టూ ప్రజలు కూర్చుని వినేవారట.

శ్రీరంగం గోపురం

ఈ గుడికి గల ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఇది కావేరీ నది ఒడ్దున ఉంది. ఇక్కడ ఉన్న కావేరికి పేరు "కొల్లిడం" అంటే "చంపబడిన ప్రదేశం (కొల్=చంపడం, ఇడం=ప్రదేశం)" అని అర్థం. ఈ గుడి కట్టాక, ఆ కట్టిన వాళ్ళని కావేరి మధ్యలోకి తీసుకెళ్ళి చంపేసారట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. వారిని ఈ క్రింది ద్వారం గుండానే తీసుకెళ్ళారట అందుకని ఈ ద్వారానికి "పరమపద వాసల్" అని పేరు. అంటే పరమపద గుమ్మం అని అర్థం. గూడార్థం ఏమిటంటే....వారి కళను అక్కడితో నిలిపివేయడానికి చంపారని, వారిని గుడి ముందర పవిత్ర కావేరీ మధ్యలో చంపేసారు కాబట్టి వారు పరమపదం చేరే ఉంటారని, అలా వారిని పరమపదం చేర్చిన కావేరీ నది కి మొక్కాలని. ఈ ద్వారాలు తెరిస్తే కావేరి కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం విన్న, చదివిన వెంటనే అంతవరకూ అక్కడి కళాకృతులు చూస్తూ ఆనందిస్తున్న నాకు ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లు మంది. భయం, బాధతో కంపించిపోయాను. చాలా ఘోరం, పాపం, అన్యాయం కదూ! ఆ గుమ్మానికి భక్తులు మొక్కుతూ, కావేరిలో భక్తితో మునుగుతూ ఉంటే నాకెందుకో ఏవగింపు కలిగింది. అలా మునిగితే వారూ చివరికాలంలో పరమపదం చేరుతారని వారి నమ్మకం.


పరమపద వాసల్


కొల్లిడం అనబడు కావేరీ నది

ఇక్కడ కనిపించిన ఇంకో విచిత్రం: కింది ఫొటోలో మూడు చిన్న గదులు కనిపిస్తున్నాయిగా అవి చిన్న చిన్న గుళ్ళు. అందులో కొలువుతీరిన మూర్తులు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు. ముగ్గురూ లింగాకారంలో ఉంటారు. చాలా ఆశ్చర్యమేసింది. బ్రహ్మ, విష్ణువులను లింగాకారంలో నేనెప్పుడూ చూడలేదు, ఇదే మొదటిసారి.



అక్కడినుంచి తిరిగి తిరుచ్చి వచ్చి మలైకోట ఎక్కాము. ఇక్కడ వినాయకుడి గుడి ఉంది. ఇక్కడి నుండి ఏరియల్ వ్యూ బావుంటుంది. మలైకోట నుండి శ్రీరంగం గుడి గోపురం చూడడానికి బావుంటుంది. ఇంకా ఇక్కడ చూడవలసినవి జలకంఠేశ్వరుని గుడి, ఇది పురాతనమైనది, కానీ చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.

మలైకోట నుండి శ్రీరంగ గుడి

అక్కడకి మధ్యాన్నం అయింది. భోజనం చేసి తంజావూరు పయనమయ్యాము. వెళ్ళడానికి గంటంపావో, గంటన్నరో పట్టింది, 54 కిలోమీటర్లు కదా మరి. ఉదయమునుండి తిరిగి తిరిగి ఉన్నామేమో కడుపులో బువ్వ పడగానే గొప్ప అలసట వచ్చేసింది. కారులో మాంచి కునుకు తీసాము. తంజావూరులో దిగి మొదట "సరస్వతీ మహల్" గ్రంధాలయానికి వెళ్ళాము. ఇది క్రీ.శ. 1500-1600 లలో తంజావూరుని పాలిస్తున్న నాయకర్ రాజుల ప్రైవేటు గ్రంధాలయంగా ఉండేది. 1675 లో తంజావూరుని మరాఠా రాజులు ఆక్రమించుకున్నాక ఈ గ్రంధాలయాన్ని చాల విస్తృతపరిచారు. సర్‌ఫోజీ అనే మరాఠీ రాజు పఠనాసక్తిగల గొప్ప రాజు. సర్‌ఫోజీ అనగానే త్యాగయ్య సినిమా గుర్తొస్తోందా? ఆ, అవును ఆ శరభోజి మహారాజే ఈ సర్‌ఫోజీ గారు. తంజావూరు అనగానే త్యాగయ్య గుర్తురాని తెలుగువారుండరేమో కదా! ఈ సర్‌ఫోజీ మహారాజుకి ఉన్న పఠనాశక్తి వలన ఎక్కడెక్కడి నుండో పుస్తకాలను సంపాదించి ఇక్కడ భద్రపరిచారు. ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో ఉన్న అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకొక ముఖ్య విశేషమేమిటంటే అత్యంత పురాతనమైనవి, పొడవైనవి అయిన తాళపత్రగ్రంధాలు ఇక్కడ ఉన్నాయి. చిన చిన్న అక్షరాలతో, గొలుసుకట్టు రాతతో భలే ఉన్నాయి ఆ తాళపత్రాలు. మాములు కంటితో వాటిని చదవలేము అంత చిన్న అక్షరాలు. సందర్శకుల సౌలభ్యం కోసం అక్కడ ఒక భూతద్దం పెట్టారు. అసలు నాలుగు అంగుళాల వెడల్పు, ఒక అడుగు పొడవు ఉన్న తాళపత్రం పై ప్రింటింగ్ లో రెండు ఠావులలో పట్టేటంత విషయాన్ని ఎలా రాసారో ఏమిటో! నాకైతే ఆ రాతలు చూసి మతిపోయింది. ఆవగింజంత అక్షరాలు, అలా కలిపేసుకుంటూ రాసుకుంటూ పోయారు. మనకి ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెంది అక్షరాలని ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి చేసుకుని చదువుకోవచ్చుగానీ, ఈ రోజుకీ అలాంటి తాళపత్రాలే చదువుకోవాల్సి వస్తేనా మనందరికీ ఖచ్చితంగా సోడాబుడ్డికళ్ళద్దాలు వచ్చేవి. ఇంకా అక్కడ అప్పటి భౌగోళిక నియమాలను సూచించే పత్రాలు, మేప్ లు ఉన్నాయి. అప్పటి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలను సూచించే రకారకాల చిత్రపటాలు కూడా ఉన్నాయి.

అలా ఆ గ్రంధాలయం చూడడం పూర్తి అయ్యాక పక్కనే ఉన్న గంట ఆకారపు భవనం (bell shaped building) చేరుకున్నాం. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలీదు. కొంతమందేమో జైల్ అన్నారు. కొంతమందేమో ఊరికే కట్టారన్నారు.

గంట ఆకారపు కట్టడం

ఆ పక్కనే ఉన్న మ్యూజియం కి వెళ్ళాం. అక్కడ క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుండి దొరికిన దేవుని విగ్రహాలున్నాయి. కొన్ని విగ్రహాలు చెక్కిన తీరుని చూస్తే చెక్కిన ఆ చేతులకి జోహార్లు అర్పించక మానరు, ముఖ్యంగా ఏకశిలావిగ్రహాలు.


శివుడు - క్రీ.శ 9 వ శతాబ్దం


మహా విష్ణువు - క్రీ.శ 8-10 వ శతాబ్దాలు


నటరాజు - క్రీ.శ 11 వ శతాబ్దం

ఇవన్నీ చూసేసరికి సాయంత్రం 4.00 అయింది. చాలా అలసిపోయాము. పైన చెప్పినవాటిల్లో చాలామటుకు చెప్పులు లేకుండా అరికాళ్లతో తిరిగాము. ఆ దెబ్బకి కాళ్ళు నొప్పులు పుట్టాయి. ఇంక నడవలేమేమో అనిపించింది. ఓపిక నశించిపోయింది. గొప్ప నీరసం ఆవరించింది...నాకయితే ఇంటికి పోయి కాళ్ళకి కాసింత నూనె రాసుకుని వేన్నీళ్ళ కాపడం పెట్టుకుంటేగానీ ఎక్కడికీ కదలలేను అనిపించింది.

కానీ కానీ............
ఏం చెప్పను, ఎలా చెప్పను ఈ కళ్ళతో చూసిన అద్భుతాన్ని మాటలలో వర్ణించగలనా, నా తరమౌనా!


(సశేషం)

57 comments:

హరే కృష్ణ said...

మొదటి కామెంట్ నాదే

హరే కృష్ణ said...

చాలా బావున్నాయి ఫోటోలు
మీ ఫోటో బ్లాగ్ లోనికి అప్లోడ్ చెయ్యండి

హరే కృష్ణ said...

రెండో పార్ట్ కోసం వెయిటింగ్

రాజ్ కుమార్ said...

hmm... baavundandi...baaga varnincharu..2nd part kosam waiting..
emaina twistlu unnaya ???

ఆ.సౌమ్య said...

@ హరేకృష్ణ
ధన్యవాదములు. ఈ పోస్ట్ అయిపోయాక ఫొటో బ్లాగులో బొమ్మలు పెడతానండీ. కొంచం వైట్ చెయ్యంది, రెండో పార్ట్ రాస్తాను. మీ బోణీతో నాకు వంద కామెంట్లు వస్తాయని ఆశిస్తున్నాను :)

ఆ.సౌమ్య said...

@వేణూరాం
ధన్యవాదములు. ట్విస్టులేమీ లేవండి, తినబోతూ రుచెందుకు,మీరే చదువుతారుగా త్వరలో, వైట్ చెయ్యండి.

వేణూశ్రీకాంత్ said...

బాగుందండీ.. కానీ.. కానీ.. అని అలా ఊరిస్తె ఎలా వెంటనె తరువాయి భాగం రాసేయండి :-)

శ్రీనివాస్ పప్పు said...

బావున్నాయి మీ యాత్రా విశేషాలు.ఆ గంటాకారం భవనం సాయంత్రాల్లో చల్లగాలి పీల్చుకోడానికండి.మేమూ కిందటేడు దసరాల్లో ఇవన్నీ చూసొచ్చి ధన్యులమైపోయాం.

శివరంజని said...

రాసిన చేతులకు డబుల్ జోహార్లు ... సౌమ్య గారు

3g said...

చాలా బాగుంది పోస్ట్ తోపాటు ఫొటోస్ కూడా!!

Kalpana Rentala said...

సౌమ్య,

విషయాలు బాగానే చెప్పారు కానీ నాకెందుకో....ట్రావెలోగ్ ని ఇంకొంచెం బాగా raasi వుండాల్సింది అనిపించింది.

ఈ వ్యాసం మొత్తం లో ముఖ్యమైన విషయం...కళ ను చంపేసి మతాన్ని అందలం ఎక్కించిన విషయం. అదొక్కటి ఒక పీస్ గా raasi వుంటే అందరి దృష్టి లోకి వెళ్తుంది...

మాయా శశిరేఖా కి ఇవన్నీ చెప్పటం ఏమిటి తెలియదన్నాట్లు....

Rani said...

good post sowmya :)

సుజాత వేల్పూరి said...

సౌమ్యా, నువ్వు పంపిన ఫోటోలు చూసి మతి పోయింది. చెక్కిన చేతులకు మాములుగా కాదు, పాదాభివందనాలు! శ్రీరంగంలో కావేరి నది అద్భుతంగా ఉంటుందట. నీ description , ఫోటోలు చూస్తుంటే జేబుకు త్వరలో చిల్లు పడక తప్పేలా లేదు:-))

అరికాల్లో దురద మొదలైపోయింది

అద్భుతమైన ఫోటోలు తీసినందుకు నీక్కూడా అభినందనలు

ఆ.సౌమ్య said...

@వేణూ శ్రీకాంత్
ధన్యవాదములు, ఉండండి మాస్టారు, కొంచం ఓపిక పట్టండి...త్వరలో రాస్తాగా :)

@పప్పుసారు
ధన్యవాదములు, సాయంత్రం చల్లగాలి పీల్చుకోవడానికి అంత ఎత్తు కట్టడం ఎందుకండీ??? అదంతా ఎక్కేసరికి చల్లగాలి పీల్చుకోవడం మాటటుంచి ఊపిరి తీసుకోలేని పరిస్థితి రావొచ్చు :)

ఆ.సౌమ్య said...

@శివరంజని
ధన్యవాదములు, కానీ మరీ అంతమాటనేసారేమిటండీ....చెక్కిన చేతులతో పోల్చుకుంటే రాసినచేతులకి నక్కకి,నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది :P. ఏమైనాగానీ మీ అభిమానానికి కృతజ్ఞతలు:).

@3g
Thank u so much! మీరేంటి ఒక పోస్ట్ తో బాగా నవ్వించి ఆపేసారు. శీనుగాడి రెండోభాగం రాసాక కబురెడతానన్నారు, ఏ కబురు రాలేదే?

కొత్త పాళీ said...

బాగుంది. ఓపిగ్గా రాసి చక్కటి ఫొటోలు కూడ పెట్టినందుకు నెనర్లు.
అసలు తిరుచి తంజావూర్ మధ్యదేశమంతా పరమాద్భుతంగా ఉంటుంది. తంజావూరు వెళ్ళారంటే, కుంబకోణం, ఆ చుట్టుపక్కల ఆలయాలు కూడా చూశారా?

బంతి said...

photos bagunnaayi :)

మనసు పలికే said...

సౌమ్య గారు, చాలా బాగుంది మీ టపా..:)
అందులో యాత్రా విశేషాలు, శిల్పాలు చాలా చాలా బాగున్నాయి. టపా టైటిల్ సూ..పర్..
వంద కామెంట్లా..? కృష్ణ తలుచుకుంటే 200 వచ్చేస్తాయి..:)

Unknown said...

అద్భుతమైన చరిత్ర గల ప్రదేశాల గురించి విసదీకరించి నాకు ప్రయాణపు ఖర్చులు మిగిలించారు థాంక్సండీ

waiting for the next part
excellent write up sowmya garu

మాలా కుమార్ said...

ఇప్పటికీపుడే శ్రీరంగం వెళ్ళాలని పించేంత బాగా రాశారు . ఫొటోలు కూడా బాగున్నాయి .

Unknown said...

thank you so much for interducing new places and the culture

ఆ.సౌమ్య said...

@కల్పనగారూ,
ధన్యవాదములు. విషయమదే అయినా కొంచం balanced గా రాద్దామని అలా రాసాను. తరువాతి బాగం ఇంకా బాగా రాయడానికి ప్రయత్నిస్తాను.

అయ్యో భలేవారే, ఎంత మాయాశశిరేఖ అయితే మాత్రం అన్నీ తెలిసిపోతాయిటండీ! మీలాంటి పెద్దలు మాకు సలహాలిస్తూ ఉంటే మేము మెరుగుపరుచుకుంటూ ఉంటాము.


@రాణి గారు
Thank you so much!

కత పవన్ said...

ఒక్క ముక్క మిస్ కాకుండా అంతా రాసారు మీకు ఒపిక ఎక్కువే ..... good very good

ఎంటి ఇంకా ఉందా ......

Overwhelmed said...

miru raasindi chadivaaka adi chudadaniki velte same feelinsg vastayemo..

Tajmahal gurinchi kuda similar story undi kada..

ఆ.సౌమ్య said...

@సుజాత గారూ
ధన్యవాదములు. ఇంకేందుకండీ ఆలశ్యం, ప్రయాణం కట్టండి. అన్నీ చూసొచ్చాక జేబులకి చిల్లు పడిందని బాధే ఉండదండీ. జీవితానికి సరిపడా మంచి, విలువైన అనుభవాలు మూటగట్టుకోవచ్చు.

ఆ.సౌమ్య said...

@కొత్తపాళీ గారూ
ధన్యవాదములు. అవునండీ అత్యద్భుతంగా ఉన్నాది. అవన్నీ చూడలేదుకానీ, కొన్ని చూసాము. తరువాతి భాగాల్లో మిగతా విశేషాలు కూడా వివరిస్తాను, చదువుతూనే ఉండండి. :)

@banthi
Thanks!
ఫొటోలు మాత్రమే బాగున్నాయా, పోస్ట్ బాలేదా?????? :(

ఆ.సౌమ్య said...

@ మనసు పలికే (అపర్ణే కదూ)
హమ్మయ్య నేను పెట్టిన టైటిల్ గురించి ఎవరైనా చెప్తారా అని చూస్తూ ఉన్నా....మీరు చెప్పారు, చాలా సంతోషమేసింది, ధన్యవాదములు. :)
అదే నేనూ ఆశిస్తున్నానండి కృష్ణ బోణీ అయిందిగా....100 వస్తే ఇంకేం కావాలి. :P

@బ్లాగు చిచ్చు
ధన్యవాదములు. అయ్యో అలా ఖర్చులు మిగిల్చేసుకోకండి, నేను కొంచం రుచి చూపించానంతే, చూడవలసినది ఇంకా చాలా ఉంది. once again thank u so much!

మనలోమన మాట, ఏ బ్లాగులో చిచ్చు పెట్టారండీ ఆ పేరు పెట్టుకున్నారు? :D

ఆ.సౌమ్య said...

@ మాల గారూ
ధన్యవాదములు, తప్పకుండా వెళ్ళి చూడండి. అద్భుతమైన ప్రదేశాలు, ప్రతీ ఒకరూ దర్శించవలసినవే.

@ పవన్
ఏంటో పవనూ చిన్నప్పటినుండీ ఓపిక అలా అలవాటయిపోయింది :D
ఇంకా చాలా ఉందయ్యా బాబూ...నువ్వు కూడా ఓపికగా చదువుతూ ఉండు, సరేనా. Thanks for the comment!

ఆ.సౌమ్య said...

@జాబిలి
నా రాతలు మీమీద ముద్ర వేసాయంటే ఆనందంగా ఉంది. తప్పకుండా వెళ్ళి చూసిరండి. అవునండీ తాజ్‌మహల్ నిర్మించిన వారి చేతులను ఖండించారని చెబుతారు.
Thanks for commenting!

Anonymous said...

>>1675 లో తంజావూరుని మరాఠా రాజులు ఆక్రమించుకున్నాక

ఇది నిజమే? దీని మీద అక్కడ పెద్ద పేద్ద గొడవలు ఐపోతున్నాయి..

నాకు ఫొటోలు సరిపోలేదు..ఇంకా బోలెడు కావాలి..

Overwhelmed said...

comments malli chadivaaka Kalpana gaari tho differ avvakunda undalekapotunna..

Aa killings mataanni andalam ekkinchaalani kaadu, ade kala ni vere places lo spread cheyyakudadu, ade place ki parimitam avvali anna swardham..

Hope I can visit these places sometime. Kani sure ga haunting ga anipistundi ee stories chadivaaka.

వెంకట్ said...

wooo, i loved it as tara said need more pics, write next part asap.

ఆ.సౌమ్య said...

@తార
ఏమో మరి. అలాగే రాసుంది అక్కడ, వికీ లో కూడా అదే ఉంది. ఆ గొడవల సంగతి నాకు తెలీదు. ఇంకా మిగతా భాగాలలో బోలెడు ఫొటోలు పెడతాను, చూస్తూ ఉండు.

@జాబిలి
మీ ఉద్దేశ్యం, అవగాహన కరక్టేనండీ. అటువంటి కళ ఇంకెక్కడా కనిపించకూడదని అలా చంపేసారు. అవునండీ ఆ ద్వారము, నది చూస్తే చాలా బాధ అనిపించింది, ఎంతోసేపటి వరకు తేరుకోలేకపోయాను. వీలైతే తప్పకుండా వెళ్ళి చూసిరండి. ఆ కళని ప్రతీ ఒక్కరూ దర్శించి అనుభవించవలసినదేగానీ చెప్పనలవి కాదు.

ఆ.సౌమ్య said...

@venkat,
sure sure i will.
there will be more photos in next parts, wait and see :)
Thanks for the comment!

Unknown said...

యాత్రలకి వెళ్ళే ఖర్చులతో ఉన్నంతలో పేదలకు దానం చేస్తే పుణ్యమైనా వస్తుంది
స్కూల్ లో ఒక విద్యార్ధి/ విద్యార్ధిని కి ఒక సంవత్సర కాలం చదివించే వారిమైనా అవుతాము

Unknown said...

అవునండీ
విద్యాదానం మహాదానం అని అన్నారు
కనీసం మీ ద్వారా ఈ టూర్ విశేషాలు తెలుసుకొని ఒక మంచిపని కి వినియోగించామనే మనఃతృప్తి కలగుతుంది
ఒకే బ్లాగు వల్ల రెండు మంచి పనులు

Unknown said...

మీరు కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాము
మీ ఫోటో బ్లాగు లింక్ ఇవ్వగలరు

Unknown said...

అమ్మాయ్ శ్రియా జోహార్లు అని అంటావు ఏంటి
ప్రయాణం విశేషాలు ఎన్ని రాసినా తనివి తీరవు తెలుసా
సౌమ్య గారు చిచ్చు పెట్టేసానండీ :P

3g said...

>>రెండోభాగం రాసాక కబురెడతానన్నారు, ఏ కబురు రాలేదే?

అంటే మీరు గుళ్ళు అవీ తిరుగుతూ శిల్పాలు గట్రా చెక్కిస్తూ బిజీగా ఉన్నారుకదా అని రాయలేదండి.

Anonymous said...

ఇక్కడ ఉన్న కావేరికి పేరు "కొల్లిడం" అంటే "చంపబడిన ప్రదేశం (కొల్=చంపడం, ఇడం=ప్రదేశం)" అని అర్థం. ఈ గుడి కట్టాక, ఆ కట్టిన వాళ్ళని కావేరి మధ్యలోకి తీసుకెళ్ళి చంపేసారట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
----------

ఏవో నాకు ఉన్న కొన్ని అనుమానాలు, ఎవరు చంపారు? ఎప్పుడూ చంపారు? మరి అలా ఐతే గుడి కట్టకుముందు నుంచే ఆ నదికి ఆ పేరు ఎందుకు ఉన్నది?
సరే చంపారే అనుకుందాం, మూడు వందల ఏళ్ళకు పైనే కట్టారుగా, మరి అప్పుడు వాళ్ళు చచ్చిపోయే వరకే సక్కగా పని చేసేవారుగా? ఇది మొదలు అయ్యింది తంజావూరు నాయకలప్పుడు, ఐపోయినది మరాఠాలు, బ్రిటీషు వారు తంజావూరిని ఏలుతున్నప్పుడు, మరి ఎవరు ఎప్పుడు చంపారో కాస్త వివరంగా చెప్పాలి.

మీరు మరీ అంత బాధపడాల్సిన అవసరం లేదులెండి, కొల్లయి (ఒడ్డులో చీలిక) అనే పదం నుంచి మరాఠాల పాలన చివర్లలో ఆ కొల్లిడం అనే పదం వచ్చింది ఫ్రెంచ్ వారి పుస్తకాలలో ఈ పేరు ఎలా మారిందో వివరం దొరుకుతుంది, వాళ్ళు రాసిన తిరుచినాపళ్ళి చరిత్ర చూడండి..

కానీ ఇదే మాటని అక్కడ ఎలా నమ్ముతున్నారో నాకు అర్ధం కాదు..

తెనాలి పేరు ఎలా వచ్చింది అంటే తెనాలిలో చెప్తారు తీన్ నాలి నుండీ వచ్చింది అని ఎంతో గొప్పగా, నా బొంద తెనాలిలో కాలువలు వచ్చింది మొన్నీమధ్య, తెనాలి ఊరు బి.సి. నుండి వచ్చింది.. అలా ఏడుస్తాయి ఇవి...

ఇక మీరు చెప్పిన అర్ధానికి వస్తే ఎవడో విలియం టేలర్ అనే మహానుభావుడు కనిపెట్టిన అర్ధం అది, 1835లో తమిళ భాషమీద ఒక పుస్తకం రాసి, దానిలో అన్నగారు చెప్పారు ఆ పదానికి అర్ధం, ఈ పుస్తకం చదివినవారు చక్కగా ప్రచారం చేశారు, తమిళోల్లు కుడా నమ్మేశారు, ఎట్టానమ్మారో కుడా నాకు అర్ధం కాదు.

అప్పట్లో అది ఫేషన్‌లేండి, మన చరిత్ర మొత్తం తిరగ రాసిన రోజులు అవి, దాన్ని మనవాళ్ళు కుడా తెల్లోడు చెప్పాడు నమ్మాల్సిందే అని, నమ్మకపొతే అదేదో యాటిట్యూడ్ అని చాలా గొడవలు..

ఆ.సౌమ్య said...

@బ్లాగు చిచ్చు
"యాత్రలకి వెళ్ళే ఖర్చులతో ఉన్నంతలో పేదలకు దానం చేస్తే పుణ్యమైనా వస్తుంది"
ఏమిటండీ మీరమైనా కలప్రపంచం స్వప్న కి స్నేహితులా? :P ఆ అమ్మాయి కూడా ఇలాగే ఒక బ్లాగరుని అడిగింది, యాత్రలు చేసే బదులు పేద విద్యార్థులకు అనాధలకి సాయం చేయొచ్చు కదా అని. మీరు ఈ విషయాన్ని సరదాగానే రాసారు అనుకుని నేను సీరియస్ జవాబు ఇవ్వట్లేదు. లేదు సీరియస్ గానే రాసాను అంటారా, చెప్పండి అప్పుడు ఇస్తా జవాబు.

ఏమి విద్యా దానమో ఏమోగానండీ, నేనయితే మాత్రం నా కోసం, నాకు తెలిసిన విషయాలను నలుగురితో పంచుకోవడంలో వచ్చే ఆనందం కోసం రాసాను. అది మీకు ఉపయోగపడుతుందంటే నాకంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. :)

శ్రియా, నాకు మంచి ఫ్రెండులెండి,మీరేం చెప్పినా ఆ అమ్మాయి ఏమీ అనదు. :D

హమ్మయ్య మీరు పెట్టిన అన్ని రకాల చిచ్చులని ఆర్పేసాను :P

ఆ.సౌమ్య said...

@ బ్లాగు చిచ్చు
ఓ తప్పకుండా కంటిన్యూ చేస్తానండి, కాస్త ఓపిక పట్టండి.
నా ఫొటో బ్లాగు లింక్:

http://cheluvamulu.blogspot.com/

ఆ.సౌమ్య said...

@ తార
ఆ పేరుకి అర్థాన్ని ఫ్రెంచ్ వారే కనిపెట్టారో, బ్రిటిష్‌వారే కనిపెట్టారో మనకేలా తెలుస్తుంది, చరిత్ర చదువుకునే విద్యార్థులమయితే తప్ప. అక్కడ ఉన్న శాసనాల మీద ఏమి రాసుందో, బహుళ ప్రచారంలో ఏది ఉందో అదే నమ్ముతాం. ప్రతీదానికి వెళ్ళి చరిత్ర పుస్తకాలు తిరగేయడమంటే కుదిరే పనా? అది అందరికీ సాధ్యం కాదు తమిళులైనా తెలుగులైనా. కానీ కొల్లయి పదం లో నుండి కొల్లిడం అనే పదం వచ్చిందంటే మాత్రం నమ్మశక్యం కావట్లేదు. రెంటికీ అర్థంలో చాలా తేడా ఉంది. కానీ జరిగే అవకాశం ఉందిలే. అలా చాలావాటి పేర్లు మారాయి. దీనిలో లోతుపాతులైతే నాకు తెలీవు. నువ్వు చెప్పావు కాబట్టి వీలైతే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.వీటికి సంబంధించిన లింక్స్ ఏమైనా ఉంటే ఇవ్వు. చదువుతాను.

ఆ.సౌమ్య said...

@3g
అబ్బ చా..... నేనెన్ని తిరిగినా, చెక్కించినా మీరు కబురెడితే రాకుండా ఉంటానా, హెంతమాట! :D

Anonymous said...

అమ్మాయ్ సౌమ్య, నేను మీ సంగతి ఏమైనా ఎత్తానా అసలు?
ఆ తమిళ తంబిలు దీన్ని ఎట్టా నమ్మి ఎట్టా ప్రచారం చేస్తున్నారు అని అడిగాను, ఎందుకంటే వాళ్ళు అక్కడే పుట్టి పెరిగారు, ఎవరో చెప్పగానే వీళ్ళు ఎలా నమ్మేశారు అని.
ఇది నీరో చరిత్ర లాగా వున్నది, ఎవడికో నీరో ఇష్టం లేకపొతే, రోముకాలిపోతున్నప్పుడు నీరో ఫిడేలు వాయిస్తున్నాడు అని పుట్టిచ్చాడు, అదే నిజం అయ్యి కూర్చున్నది.

ఇంక తంజావూరు సంగతికి వస్తే, అక్కడ ఆ రాజుకి అంత తీరికెక్కడిది? ఉన్న ఏడుగురు భార్యలతో, మధ్యలో పెద్ద కొడుకు వచ్చి నాన్నా రాజ్యం చక్కగా పరిపాలించుకుందాం అని గొడవ..

ఆ.సౌమ్య said...

@తార
ఇక్కడ "మన" అంటే నేను, తమిళులు, భారతీయులు....మనందరం.

తంజావూరు రాజు సంగతి కూడా అంతే. అవి ఆయన సంపాదించిన పుస్తకాలే అని చెప్పి ఉంది.

సరే ఇదంతా ఎందుకుగానీ దీని మీద నీకు తెలిసిన వివరాలతో, రిఫరెన్సులు ఇస్తూ ఒక మంచి పోస్ట్ రాయి. రిఫరెన్సులివ్వకపోతే మళ్ళీ నువ్వు చెప్పినది ఎవరూ నమ్మరు. రిఫరెన్సు లేనంతకాలం అక్కడ రాసినది, నువ్వు చెప్పినది నిజమవడానికి సమానమయిన probability ఉంది. కాబట్టి ఒక చక్కని పోస్ట్ రాయి. నాతో పాటూ అందరికీ తెలుస్తుంది.

Anonymous said...

ఒకప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ వారు పెట్టిన నవలల పోటిలో, తంజావూరు రాజులు మీద రాశిన ఒక నవలలో ఇవి అన్నీ ప్రస్తుతించారు.
---
రిఫరెన్సు లేనంతకాలం అక్కడ రాసినది, నువ్వు చెప్పినది నిజమవడానికి సమానమయిన probability ఉంది. కాబట్టి ఒక చక్కని పోస్ట్ రాయి. నాతో పాటూ అందరికీ తెలుస్తుంది.
---

నాకు తమిళ బాషమీద పట్టుకానీ, ఇష్టం కానీ లేవు.
మరి ఎలా చెప్తున్నావు అంటే, రాజరాజ నరేంద్రుని చరిత్రలో ఈ నది ప్రస్తుతి వస్తుంది, అతని కొడుకు రాజేంద్ర చోళుడు (చోళుడు ఎట్టా అయ్యాడో, రాజరాజ చోళుడి కూతురి కొడుకు ఇతను, కానీ కొడుకుగా చలామణి అవుతున్నడు) అదే నది ఒడ్డున ఒక గుడి కట్టించాడు, టేలర్ చెప్పిన ఆ పలానా గుడికన్నా ముందే (ఐదువందల ఏళ్ళ ముందే) ఆ నదికి ఆ పేరు వున్నది, మరి అలాంటప్పుడు ఆ పేరుకి మరి ఆ అర్ధం ఎలా సరిపోతుంది? అని వెతికాను, అలా దొరికింది ఇది

సవ్వడి said...

సౌమ్య!
చాలా మంచి పోస్ట్ పెట్టారు. ఆ ఏక శిలా విగ్రహాలు చాలా బాగున్నాయి. పొటోస్ బాగున్నాయి. చెప్పిన విషయాలు బాగున్నాయి.
సరస్వతీ మహల్ గురించి చిన్న విషయం.... అక్కడ మన తెలుగు గ్రంధాలు, గొప్ప పుస్తకాలు చాలా ఉన్నాయట! వాటిని చూసేవారు లేకపోవడం ఇబ్బందిగా ఉంది. అంతే కాకుండా తెలుగు గైడ్ కూడా లేరట! మన ప్రభుత్వానికి వాటిని రక్షించే బాధ్యత ఉంటే బాగుండేది కదా! అనిపిస్తుంది.

ఆ.సౌమ్య said...

@తార
hmmmmmmm

@ సవ్వడి
ధన్యవదములు. అవును సరస్వతి మహల్ లో తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయిట. అక్కడ గైడ్స్ ఎవరూ లేరండీ. మామూలు లైబ్రరీలాగే ఉంది. తమిళ్, తెలుగు ఏ భాష కి సంబంధించిన గైడ్ కూడా అక్కడ లేరు. మనంతట మనమే వెళ్ళి అన్నీ చూసుకోవాలి. మన పుస్తకాలని మనం కాపాడుగోగలిగితే బాగుండేది. ఎవరో ఒకరు అ పని చేస్తున్నారుగా అని ఇప్పుడు సంతోషిద్దాం :)

స్నిగ్ధ said...

సౌమ్య గారు,మీ టపా,ఫోటోలు బాగున్నాయ్యండీ...as ususual...
కబుర్లు చక్కగా చెప్తూ మధ్యలో ఆ ట్విస్ట్ ఏంటండీ...

waiting for your second part...

ఆ.సౌమ్య said...

ఆ మీ కామెంటు ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను. :)
50వ కామెంటు మీదే!
ట్విస్ట్‌లేమీ లేవండీ, త్వరలోనే రాస్తాను రెండవ భాగం.
ధన్యవాదములు.

స్నిగ్ధ said...

Heyyyyyyyyyyyyy,మీ టపాలో యాభైయ్యో కామెంట్ నాదే .....
:)

ఆ.సౌమ్య said...

అవును అచ్చంగా మీదే :D
Thanks!

బులుసు సుబ్రహ్మణ్యం said...

చెక్కిన చేతులకు జోహార్లు అనగా ఏం రాసారా అని ఆలోచించాను.పూర్తిగా చదివిన తర్వాత ఇంకో అనుమానం వచ్చింది. రచన బాగుందా ఫొటో లు బాగున్నాయా. రెండూ చాలా బాగున్నాయి కాని ఫొటోలు కొద్దిగా ఇంకా ఎక్కువ బావున్నాయనిపించింది.

ఆ.సౌమ్య said...

@ సుబ్రహ్మణ్యం గారూ
హహహ నేను ఇక్కడ చూపించాలనుకున్నది కూడా అదే, నా రచనా శైలి కంటే కళా వైభవం బావుండడమే ఇక్కడ ముఖ్యోద్దేశ్యం :)

ఓపికగా చదివి అనాలిసిస్ చేసినందుకు ధన్యవాదములు.

Anil Atluri said...

బాగుంది సౌమ్యా..అన్నట్టు ఇది 56 వ వ్యాఖ్య..మరి ఆ వంద ఎప్పుడు చేరుకుంటుందో! ఫోటోలు బాగున్నవి.

ఆ.సౌమ్య said...

Thanks అనిల్ గారు :)
హహహ వందా! 50 రావడమే విశేషం. ఆ తరువాత ఇంకెతొస్తే అంత. మరీ అత్యాశకి పోకూడదు కదా :)