StatCounter code

Tuesday, September 28, 2010

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు....

ఇవాళే ఖలేజా పాటలు విన్నాను, "సదాశివా" పాటలోని లిరిక్స్ నాకు బాగా నచ్చాయి. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాసారు. ఈయన సాహిత్యం అంటే నాకు మాచెడ్డ చిరాకు, ఏదో పిచ్చిపిచ్చిగా రాస్తుంటారు. కానీ ఈ పాట బాగా రాసారు, సిరివెన్నెల రాసారేమో అన్నంత బాగా రాసారు. ముఖ్యంగా "లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు, నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనేపోడు"....ఈ రెండు ముక్కలు నాకు బాగా నచ్చాయి. శివతత్వాన్ని జనపదాల్లో బాగా చెప్పారు. దేవుని గురించి వర్ణించే పాటలనగానే ఎక్కువగా సంస్కృత పదాలొచ్చేస్తాయి అందులో. కానీ ఈ పాటని అతి తక్కువ సంస్కృత పదాలతో, చక్కని తెలుగులో ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే జనపదాలలో, పల్లెపదాలలో, సూటిగా చక్కగా చిక్కులేకుండా చెప్పారు. కాకపోతే పాట మధ్యలో ఓ మూడు, నాలుగు ఇంగ్లీషు ముక్కలొచ్చాయి, అదొక్కటే కాస్త ఎబ్బెట్టుగా ఉంది (సంస్కృతం పోయి, ఇంగ్లీషు వచ్చె ఢాం ఢాం ఢాం అని పాడుకోవాలేమో ఇప్పుడు :D). ఈ పాటని మణిశర్మ సంగీత సారధ్యంలో కారుణ్య, రమేష్ వినాయగం పాడారు. సంగీతం చాలా వెరైటీగా, గొంతులు కూడా విలక్షణంగా ఉన్నాయి. ముఖ్యంగా రమేష్ గారి గొంతులో ఒకరకమైన వణుకు ఉంది, అది వినడానికి ముచ్చటగా ఉంది. ఆ పాట మీకోసం....


పల్లవి: సదాశివా, సన్యాసి, తాపసి, కైలాసవాసి,
నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లెకాశీ.

చరణం1: ఏయ్...సూపులసుక్కాని దారిగా, చుక్కలతివాసీ మీదిగా,
సూడసక్కనిసామి దిగినాడురా, ఏసెయ్‌రా ఊరువాడా దండోరా.
ఏ రంగులహంగుల పొడలేదురా, ఈడు జంగమశంకరశివుడేనురా...
నిప్పు, గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా; నీ తాపం, శాపం తీర్చేవాడేరా.

పైపైకాలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల...

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు,
నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనేపోడు.

ఓం నమఃశ్శివ జై జై జై

(ఇక్కడ ఉన్న ఇంగ్లీషు ముక్కలని కట్ చేస్తున్నాను)

సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి,
నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లెకాశీ.

చరణం2: ఏయ్...ఎక్కడ వీడుంటే నిండుగా, అక్కడ నేలంతా పండగా..
చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా, అడుగేసాడంటా కాచే దొరలాగా.
మంచును మంటను ఒక్కతీరుగా లెక్క సెయ్యనేసెయ్యని శంకరయ్యగా,
ఉక్కుపంచగా ఊపిరి నిలుపాడుగా, మనకండాదండా వీడే నికరంగా.

సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా...

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు,
నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనేపోడు.

ఈ పాటని వినాలనుకునేవారికి:



19 comments:

3g said...

అవునండీ ఈ పాట నాక్కూడా వినగానే నచ్చేసింది. సాహిత్యంతో పాటు మణిశర్మ వాడిన డిఫరెంట్ ఆర్కెస్ట్రా వల్ల మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది.

ఆ.సౌమ్య said...

@ 3g
అవునండీ, చాలా విలక్షనంగా పదే పదే వినాలనిపించేలా ఉంది కదా సంగీతం, కామెంటినందుకు ధన్యవాదములు.

రాజ్ కుమార్ said...

pata inka vinaledu.. vini vachi malli commentuta... :)

Sai Praveen said...

>>"ఈయన సాహిత్యం అంటే నాకు మాచెడ్డ చిరాకు, ఏదో పిచ్చిపిచ్చిగా రాస్తుంటారు. కానీ ఈ పాట బాగా రాసారు, సిరివెన్నెల రాసారేమో అన్నంత బాగా రాసారు."
సరిగ్గా నా అభిప్రాయాలు కుడా ఇవే. నేను పాట విన్నాను కానీ ఎవరు రాసారో తెలియదు. సిరివెన్నెల అనే అనుకుంటున్నాను. రామ జోగయ్య శాస్త్రి పాట నాకు పూర్తిగా నచ్చడం ఇదే మొదటి సారి. ముందు విన్న పాటల్లో అక్కడక్కడ కొన్ని మంచి వాక్యాలున్నా మిగిలిన పిచ్చి రాతల్లో అవి కలిసిపోతాయి. అయన అన్ని పాటలు ఇలాగే రాస్తే బాగుంటుంది. :)
మీరన్నట్టు రమేష్ గారి గొంతులో వణుకు పాటకు అందాన్ని తీసుకొచ్చింది. ఒక యోగి భజన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అది వింటే.

..nagarjuna.. said...

అసలా ఇంగ్లీష్ ముక్కలు అనవసరంగా పెట్టాడు (ఐడియా ఎవరిదో గాని లాగిపెట్ట కొట్టాలి ). తెలుగు పలుకులతో, మాం....చి సంగీతంలో తన్మయంతో (ఆ మాత్రానికే తన్మయం ఏంట్రా అనొద్దు నాక్కుడా తెలవదు ) ఉండగా పాయసం తింటున్నప్పుడు పంటికింద రాయిలా వస్తాయి ఆ రీమిక్స్ ముక్కలు....అప్పటిదాకా బిల్డ్ అయిన భావాలమీద నీళ్ళు చల్లుతూ....

>> లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు,
నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనేపోడు.

>>మంచును మంటను ఒక్కతీరుగా లెక్క సెయ్యనేసెయ్యని శంకరయ్యగా

too good

’భూమ్ శకనక’, ’పిలిచే..’ కూడా బావున్నాయి

వేణూశ్రీకాంత్ said...

హ హ మీకా ఇంగ్లీష్ నచ్చలేదా.. ప్రస్తుతం వస్తున్న భజన్స్ ఫీల్ తెప్పించడానికి కలిపినట్లున్నాడు, ఎక్కువగా నార్త్ ఇండియాలోనూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ భజన్స్ లోనూ ఈ తరహావి ఉంటాయి. నాకు ఆలైన్స్ కూడా నచ్చేశాయి :) హమ్మింగ్ కి. ఇంక రమేష్ కైలాసవాసీ... అని వణికించినది చూసి మొదటి సారి విన్నపుడు నవ్వొచ్చింది కానీ తర్వాత బాగానే ఉందనిపించింది.

వేణూశ్రీకాంత్ said...

మీకభ్యంతరం లేకపోతే ఆ పాట పూర్తి పాఠం ఇక్కడ ఇస్తున్నాను ఇంగ్లీష్ బిట్ తో కలిపి. ఇష్టంలేకపోతే ఈ వ్యాక్య అప్రూవ్ చేయకండి.
చిత్రం : ఖలేజా
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
స్వరం : రమేష్ వినాయగం, కారుణ్య.

ఓం నమో శివ రుద్రాయ ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిఠలాక్షయ ఓం నమో భస్మాంగాయా
ఓం నమో హిమశైలావరణాయ ప్రమథాయ
ధిమి ధిమి తాండవకేళీ లోలాయ

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ..
నీ పాద ముద్రలు మోసీ పొంగిపోయినాదె పల్లె కాశీ..
హె!.. సూపుల సుక్కాని దారిగా చుక్కల తీవాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా ఏసెయ్ రా ఊరూ వాడా దండోరా
ఏ రంగుల హంగుల పొడలేదురా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా
నీ తాపం శాపం తీర్చేవాడేరా...
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల
లోకాలనేలేటోడూ నీకు సాయం కాకపోడూ
ఏయ్ నీలోనే కొలువున్నోడూ నిన్ను దాటీ పోనేపోడూ

ఓం నమః శివ జై జై జై ఓం నమః శివ జై జై జై
ఓం నమః శివ గ్రూవ్ టూ ద ట్రాన్స్ అండ్ సే జై జై జై
సింగ్ అలాంగ్ సింగ్ శివ శంభో ఆల్‍దవే
ఓం నమః శివ జై జై జై హీల్ ద వరల్డ్ ఈజ్ ఆల్ వీ ప్రే
సేవ్ ఔర్ లైవ్స్ అండ్ టేక్ ఔర్ పెయిన్ అవే జై జై జై ..
సింగ్ అలాంగ్ సింగ్ శివ శంభో ఆల్‍దవే

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ..
నీ పాద ముద్రలు మోసీ పొంగిపోయినాదె పల్లె కాశీ..

ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ
చుట్టు పక్కల చీకటి పెళ్ళగించగా
అడుగేశాడంటా కాచే దొరలాగా
మంచును మంటను ఒక్క తీరుగ
లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యగా
ఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురా మనకండా దండా వీడే నికరంగా
సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా..
లోకాలనేలేటోడూ నీకు సాయం కాకపోడూ
ఏయ్ నీలోనే కొలువున్నోడూ నిన్ను దాటీ పోనేపోడూ

ఓం నమః శివ జై జై జై ఓం నమః శివ జై జై జై
ఓం నమః శివ grove to the trance and say జై జై జై
sing along sing శివ శంభో All the way
ఓం నమః శివ జై జై జై heal the world is all we pray
save our lives and take our pain away జై జై జై ..
sing along sing శివ శంభో All the way

వేణూశ్రీకాంత్ said...

English lyrics with english text :) ha ha నచ్చలేదు రా బాబు అంటె మీ కామెంట్ స్పేస్ హైజాక్ చేసేసి మరీ రాసేస్తున్నానా :) అభ్యంతరమైతే అప్రూవ్ చేయకండి.

ఓం నమః శివ జై జై జై ఓం నమః శివ జై జై జై
ఓం నమః శివ grove to the trance and say జై జై జై
sing along sing శివ శంభో all the way
ఓం నమః శివ జై జై జై heal the world is all we pray
save our lives and take our pain away జై జై జై ..
sing along sing శివ శంభో all the way

రహ్మానుద్దీన్ షేక్ said...

పాట చాలా బాగుంది కానీ ఈ పాటకు కూడా మాయా శశిరేఖ నాట్యం వేస్తుందా(శివతాండవం మాదిరి)
ఇప్పటికి ఈ పాట ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదే!!!!
ఈ పదాలు కూడా చాలా బాగా శివతత్వాన్ని తెలుపుతున్నాయండోయ్
"మంచును మంటను ఒక్కతీరుగా లెక్క సెయ్యనేసెయ్యని శంకరయ్యగా,"

ఆ.సౌమ్య said...

@సాయి ప్రవీణ్
హ హ మీకు కూడా నాలాగే అనిపించింది. ఎంతైనా మనిద్దరం సిరివెన్నెలకి వీరాభిమానులం కదా! :)

మీరు చెప్పినది కరక్ట్, రామ జోగయ్య శాస్త్రికి మంచితారలకన్నా పిచ్చి రాతలే ఎక్కువ.Thanks for the comment!

ఆ.సౌమ్య said...

@ నాగార్జున
బాగా చెప్పావు బాసూ, నిజంగానే నాకూ అలాగే అనిపించింది,...అవిడియా ఇచ్చినవాడిని లాగిపెట్టి కొట్టాలని :P
నిజంగానే ఈ పాట 2-3 సార్లు వింటే తెలియకుండానే ఒకలాంటి తన్మయత్వం వస్తున్నాది, నువ్వు కరక్టే.

భూం శకనక, పిలిచే నాకు మరీ అంతగా నచ్చలేదు, అంత impress చెయ్యలేదు. ఈ సదాశివ పాటే సూపరు డూపరు

ఆ.సౌమ్య said...

@వేణూ శీకాంత్ జీ
మీకు ఇంగ్లీషు ముక్కలు కూడా నచ్చాయా...జిహ్వకో రుచి :D

హమ్మయ్య మీరు ఆ ఇంగ్లీషు ముక్కలు కూడా ఇచ్చి బతికించారు. అవి రాయాలంటే జాగ్రత్తగా వినాలి, ఎందుకొచ్చిన గొడవలే అని పక్కనపెట్టేసాను. మీరు ఆ పని పూర్తిచేసారు. చాలా చాలా Thanks

ఇందులో హైజాక్ చెయ్యడమేమీ లేదండీ, మీరిచ్చి మంచిపనే చేసారు, ధన్యవాదములు. :)

ఆ.సౌమ్య said...

@రహ్మానుద్దిన్
అదేంటండీ...ఏ పాటైనా మనసుకి పట్టేస్తే మాయాశశిరేఖ చిందులేస్తుంది (నాట్యం చెయ్యదు, మనకి రాదు...చిందులు మాత్రమే వచ్చు :P)

నిజం, నేను కూడా ఎన్నోసార్లు విన్నాను ఈ పాటని,అయినా తనివితీరట్లేదు. Thanks for the comment!


@వేణురం బాబు
విన్నారా ఇప్పటికైనా?

3g said...

ఆ టేక్సీ పాటకూడా బాగుందండి వెరైటీగా
"కోడ్తే కోమాలోకి జారిపోద్ది జన్మ
ఫోటో ఫ్రేముల్లోకి చేరిపోద్ది బొమ్మ" లాంటి తమాషా పదాలతో వినబుద్దేస్తుంది. మిగతావన్నీ మణిశర్మ రొటీన్ స్టైల్లోనే ఉన్నాయికాని ’భూమ్ శకనక’ పాట లిరిక్స్ వల్ల కొంచెం ఎలివేట్ అయ్యింది.

ఆ.సౌమ్య said...

@ 3G
అవునండీ, టేక్సీ పాట కాస్త వెరైటీగా ఉంది, మొదటిసారి విన్నప్పుడు భలే నవ్వొచ్చింది కానీ సంగీతం అంత గొప్పగా అనిపించలేదు నాకు.

hari said...

ee madhya janalaku telugu artham kaatledani, konchem english lo raasinattunnaru paata ni :D

ఆ.సౌమ్య said...

@ హరి
హహహ అలాగంటారా, నిజమే సుమండి! :D

Thanks for the comment.

mrityunjay said...

సౌమ్య గారికి.
మీ టెంప్లెట్ ఆహ్లాదంగా వుంది..కొత్తపోస్టులు అదుర్సో అదుర్స్ !

ఆ.సౌమ్య said...

@ మృత్యుంజయ్ గారూ
బహుకాలదర్శనం, ధన్యవాదములు.

టెంప్లేట్, పోస్టులు మిమ్మల్ని ఆహ్లాదపరచినందుకు సంతోషంగా ఉంది. :)