StatCounter code

Thursday, July 28, 2011

చిత్రలేఖనం - ఓ వైవిధ్యమైన దృక్కోణం - ఆంజనేయులు

"కళతో లీనమయ్యే ఏ కళాకారుడైనా తన కళాసృష్టి ముగించాక దానికేసే కొద్ది క్షణాలు తమకంగా చూసుకుంటాడు.ప్రసవవేదన పడి బిడ్డను కన్నాక తల్లి ఆ బిడ్డ కేసి చూసుకోడానికి, అలానే ఒక కళాకారుడు తన "సృష్టిని" చూసుకోడానికి మధ్య తేడాలేదు." అని ఎక్కడో చదివాను.

ఊహకి రూపమిచ్చి, జన్మనిచ్చే ఒకే ఒక సాధనం చిత్రలేఖనం. భావవ్యక్తీకరణకి తిరుగులేని సాధనం చిత్రలేఖనం. ప్రకృతి అందాలను, జీవితపరమార్ధాలను, సంప్రదాయలను, చరిత్రను, భవిష్యత్తులోని ఆశలను అన్నిటినీ కుంచెనుండి జాలువార్చగల కళాకారుని ఊహ అద్వితీయం. అటువంటి ఊహాశక్తిగల కళాకారుడిగా పుట్టడం ఒక అదృష్టం. అటువంటి ఒక అదృష్టవంతుడు ఆంజనేయులు ఉరఫ్ అంజి.

ఆర్కూట్ పరిచయమైన కొత్తల్లో నా పైంటింగ్స్ కొన్ని అందులో పెట్టాను. ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది. మీ బొమ్మలు బావున్నాయి, నా బొమ్మలు కూడా చూడండి అని. సహజంగానే పొంగిపోయి వెళ్ళి అతని ప్రొఫైల్ చూసాను. చాలా మామూలుగా ఉన్నాడు. సరే బొమ్మలు చూద్దామని వెళ్ళాను...అంతే ఆశ్చర్యం, అద్భుతం....అతను వేసిన బొమ్మలు చూసి చేష్టలుడిగిపోయాను. అతను ఎంత పెద్దచిత్రకారుడో తెలిసాక నా బొమ్మలు బావున్నాయి అని మెచ్చుకున్న అతని మంచి మనసుని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. మైల్ చేసాను మీ అంత గొప్ప కళాకారుడు నా బొమ్మలను బావున్నాయి అనడం నా అదృష్టం అంటూ. చాలా సాదాసీదాగా వచ్చింది జవాబు. నాకు ఉత్సాహం వచ్చింది. నా బొమ్మలని కొన్నిటిని పంపించాను. వాటిని ఎలా అభివృధి పరుచుకోవలో వివరిస్తూ మైల్ ఇచ్చారు అంజి. అలా మొదలైంది మా పరిచయం 2007 లో.

నల్గొండ జిల్లలో, గారిడెపల్లి గ్రామంలో లక్షమ్మ, సత్యం దంపతులకు 1976 లో జన్మించిన ఆంజనేయులు విద్యాభ్యాసం అక్కడే కొనసాగించారు. చిన్నతనంలో commercial signboard ల మీద పైంటింగ్ వేసేవారు. ఆ తరువాత చిత్రకళపై ఉన్న ఆసక్తి తో హైదరాబాదులో JNTU college of Fine Arts లో విద్యనభ్యసించారు.

ఒక్కో కళాకరునిది ఒక్కో శైలి, ఒక్కో రకమైన చిత్రం. ఈ వైవిధ్యానికి కారణం అతడు/ఆమె జీవితాన్ని, సమాజాన్ని చూస్తే దృష్టి కోణం. అంజి గారి ఊహ ఎప్పుడూ ఒక తెల్లని గోడ కి అతుక్కున వస్తువులు, దాని నీడ చుట్టూ తిరుగుతుంటాయి. జీవితం అంటే అనంతం కాదు...అది ఒక చట్రంలో బంధించబడి ఉంటుంది. It is Specific, Precise and Finite.....కాబట్టి ఏది చేసినా perfect గా గోడకు మేకు కొట్టినట్టు చెయ్యాలి అని చెబుతున్నట్టు తోస్తాయి. తన చిత్రాలు ఊహాప్రపంచంలో కొట్టుకుపోతున్నట్టు ఉండవు. ఇక్కడలేనిదేదో చూపించవు. మన చుట్టూ ఉన్న విషయాలే, మనకి తెలిసిన వస్తువులే కేన్వాస్ పై కనిపిస్తాయి. తన బొమ్మలు మనల్ని వేరే ప్రపంచానికి తీసుకుని వెళ్ళవు కానీ ఈ ప్రపంచంలోనే, ఈ మనుషుల మధ్యనే ఒక కొత్త భావాన్ని కలిగిస్తాయి. ఈ లోకాన్నే మరింత అందంగా చూపుతాయి.

ఫొటో తీసారా లేదా బొమ్మ వేసారా అని విస్మయం కలుగుతుంది. His observation capacity is mind blowing! తన ప్రతిభ అసాధారణం. ఎన్నో రకాల పైంటింగ్స్ చూసిన నాకు "ఇలా కూడా వెయ్యొచ్చా" అనిపించింది తన బొమ్మలు చూసాక. ఈ చిత్రాలను చూస్తే మీకూ అలాగే అనిపిస్తుంది.





మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అంజి గారూ చాలా exhibitions కండక్ట్ చేసారు ఇప్పటివరకూ....వాటి వివరాలు:

TANGERINE ART SPACE “TURN OF THE TIDE”
THE GRAND BALL ROOM, THE TAJ WEST END,
BANGOLORE, 2011,INDIA

LATTITUDE 28 ART GALLERY " THE ANNUAL"
NEW DELHI 2011, INDIA

INDIA FINE ART GALLERY "HY-TIMES"
MUMBAI 2011, INDIA

KALAKRITI ART GALLERY‘PENTAGRAM’
HYDERABAD 2010, INDIA

KALAKRITI ART GALLERY,
HYDERABAD 2009, INDIA

HASTA GALLERY ' A LONG SHORT CUT '
HYDERABAD 2009, INDIA

OPEN EYED DREAMS ‘ VISIBLE INVISIBILITIES’
COCHIN 2008, INDIA

KANVAS ART GALLERY ‘COLORS OF HYDERABAD’
KOLKATTA 2008, INDIA

OPEN EYED DREAMS 'MYSTERIES:PICTURES OF MYSTICAL MEMORIES'
COCHIN 2007 , INDIA

OPEN EYED DREAMS 'THE DOUBLE',
COCHIN 2007, INDIA

HASTA GALLERY, 'LOOK AGAIN"
HYDERABAD 2007, INDIA

KALAHITA ART FOUNDATION
HYDERABAD 2006, INDIA

SHILPARAMAM,
HYDERABAD 2006, INDIA

ఇప్పుడు ఈ జూలై 31 న బెంగళూరులో ఒక exhibition నిర్వహించబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు వెళ్ళి చూడవచ్చు, నచ్చితే తన బొమ్మలు కొనుక్కోవచ్చు.


అంజి గారు బోలెడు పుస్తకాలు చదువుతారు. నాకు MARIA ABROMOVICH అనే చిత్రకారిణి గురించి ఆవిడ వేసిన live performance photos గురించి నాకు చెప్పేవారు. అలాగే arts and feminism గురించి కూడా చెప్పేవారు. తను వేసిన బొమ్మలు పూర్తయినవి, సగం వేసినవి నాకు చూపించేవారు. ఇప్పటివరకూ తనని ముఖాముఖి కలవకపోయినా తన స్నేహం నాకు అపురూపం.

చిత్ర కళకి పరిమితులు లేవు. ఎటువంటి భావననైనా ఆవిష్కరించగల శక్తి ఈ కళకి మాత్రమే ఉంది. అటువంటి చిత్రకళను తన సాధనతో, అకుంఠిత దీక్షతో సొంత చేసుకున్న ఆంజనేయులు గారికి హేట్స్ ఆఫ్. ఇంతటి అపురూపమైన స్నేహం నాకు లభించడం నా అదృష్టం.


28 comments:

"Shivudu" said...

Amazing.. Ila kuda painting cheyyocchu ani ippude anipinchindi.. Great..

మనసు పలికే said...

అంజి గారి పెయింటింగ్స్ నిజంగా అద్భుతం... మరో మాట లేదు సౌమ్య గారు.. ఇంత చక్కని చిత్రకారుడిని పరిచయం చేసినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు. అంజి గారి గురించి అయితే ఏం మాట్లాడాలో తెలియడంలేదు. హి ఈజ్ జస్ట్ అమేజింగ్..

నాగేస్రావ్ said...

"పడమరన ఇటాలియన్ ని తెలుగు ఆఫ్ ది వెస్ట్ అంటారుట తెలుసా!"
నిజ్జంగానా? మీ wishful thinkంగా??
అలా ఎందుకనరా అని అనిపించేది. కాని మన దేశంలోనే ఉత్తరాన వాళ్ళకి చాలామందికి తెలుగు అనే భాష ఒకటుందని తెలీదు, అంతా 'మదరాసీ'యే. మరి ప్రపంచాన పడమరోళ్ళకి తెలుసంటారా!!

ఆ.సౌమ్య said...

shivudu
అవునండీ నాక్కూడా అలగే అనిపించింది మొదటిసారి చూసినప్పుడు
ధన్యవాదములు మీ వ్యాఖ్యకి!

@అప్పు
కదా! అద్భుతం కంటే మరో మాట లేదు!
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ నాగేస్రావు గారూ
బహుకాల దర్శనం :)
హహహ అది నా wishful thinking అండీ. ఊరికే సరదాకి అలా రాసాను. ఇటాలియన్ ఆఫ ది ఈస్ట్ అనడం ఇష్టం లేక :D

మధురవాణి said...

WoW! Amazing paintings!

స్వామి ( కేశవ ) said...

సౌమ్య గారూ చాలా బాగా రాసారు ..

మొదలు పెట్టిన తీరు అత్యద్భుతం ..
ఒక గొప్ప కళాకారుడి గురించి చెప్పినందుకు మీకు దన్యవాదాలు..

ఇందు said...

సౌమ్యగారూ...అస్సలు అవి పెయింటింగ్స్ అని మీరు చెప్పకుండా ఫొటోస్ అని చెప్పుంటే అస్సలు డౌట్ లేకుండా నమ్మేసేవాళ్ళం. అంత అద్భుతంగా ఉన్నాయ్! మీరు చెప్పింది నిజమె! అంజి ఊహాలోకాల్లో విహరిస్తూ ఆ లోకాలని కాన్వాసుపై గీయకుండా తన చుట్టు ఉండే అతిసామాన్య వస్తువులను ప్రతిసృష్టి చేస్తున్నారు. ఇలాకూడా గీయొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది :)

వేణూశ్రీకాంత్ said...

పెయింటింగ్స్ చాలా బాగున్నాయ్ సౌమ్య.. అంత మంచి చిత్రకారుడిని పరిచయం చేసినందుకు నెనర్లు..

కృష్ణప్రియ said...

Wow! జీన్స్ పాంట్, అరటి పండు.. సోడా బాటిల్.. టూ మచ్!

పద్మవల్లి said...

సౌమ్యా అవి అచ్చం ఫొటోస్ లా ఉన్నాయి. పెయింటింగ్స్ అని చెప్పకుండా ఉంటే తెలిసేదే కాదు. అద్భుతంగా ఉన్నాయి. మంచి కళాకారుడిని గురించి కూడా తెలిసింది.

SHANKAR.S said...

unbelievable. కళాకారుడి సృజనకి ఎల్లలు లేవు అని మరొక్కసారి నిరూపించిన ఇంత గొప్ప ఆర్టిస్ట్ ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సౌమ్య గారూ.

చాతకం said...

కాదేదీ చిత్రలేఖనానికి అనర్హం. అన్ని చిత్రములు జీవం ఉట్టిపడేలా చాలా బాగున్నాయి. ఆంజనెయులు గారికి శుభాకాంక్షలు తెలుపగలరు.

కొత్తావకాయ said...

"అద్భుతం!!" వేరే పదం సరిపోదు. నిజాయితీగా, అమాయకంగా, అబ్బురంగా, అపురూపంగా చెప్పావు టపాలో చిత్రకారుడి గురించి, అతనితో స్నేహం పట్ల,కళ పట్ల నీకున్న మక్కువ గురించి. భేష్!

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఇవి ఫోటోస్ అనే అనుకున్నాను. ఇటువంటివి కూడా ఇంత అందంగా పేయింట్ చెయ్యవచ్చునని ఇప్పుడే తెలిసింది. (నాకు చిత్రలేఖనం మొదలైన వాటిమీద పెద్దగా ఆసక్తి లేదు.)

మట్టిలో మాణిక్యాలు అంతకన్నా ఏమి చెప్పగలము. పరిచయం చేసినందుకు థాంక్యూ.

తృష్ణ said...

అద్భుతంగా ఉన్నాయండి..no other words. పరిచయం చేసిన మీకూ, వేసిన అంజనేయులు గారికీ కూడా అభినందనలు.

Sreenu Vattipally said...

OMG. మీరు చెప్పెంత వరకు అవి పేంటింగ్స్ అని నమ్మలేక పోయాను. Marvelous!!!.

సుజాత వేల్పూరి said...

అద్బ్బుతం అపూర్వం ఇలాంటి మాటలేవీ చాలవేమో అని భయంగా ఉంది . ఇలాంటి చిత్రాలొకసారి శ్రావణ్ దీపాల గారు తన బజ్ లో పెట్టారు. అవి పోర్ట్రైట్స్!

అబ్బ, ఆ అరటి పండు మీద మచ్చలు, స్టీలు చెంబైతే అసలు కేక! చెంబు మీద పడుతున్న వెలుగు, చెంబులో ప్రతి ఫలిస్తున్న లైటు, నేల మీద పడుతున్న దాని నీడ...జీన్సు మీద మురికి..అతాటున చూస్తే ఫొటోలే అనిపించేస్తున్నాయి.

ఎంత సాధన, ఎంతటి ఏకాగ్రత, ఎంతటి సృజనాత్మకత!

మాటల్లేవంతే

Anonymous said...

నేనమ్మను, ఇవి ఫొటొలే, ఫొటొలు తీసి MSపైంట్ లో background మార్చేసారు.
మీ రెంత మా విజిన్నారం వాళ్ళైనా సరే నేనమ్మను,

కాముధ

రాజ్ కుమార్ said...

అద్భుతం.. అమోఘం... వేరేమాటల్లేవండీ.. అదరహో.. తప్పకుండా వెళ్ళాలీ ఆ ఎగ్జిబిషన్ కీ..
అంతగొప్ప కళాకారులయిన అంజిగారూ మీ ఫ్రెండ్ అవ్వటం మీరూ, మేమూ గర్వపడాల్సిన విషయం...
ఎక్స్లెంట్ పోస్ట్ అండీ..

Anil Dasari said...

I wonder how he managed to avoid brush bristle marks! If those are oil on canvas in deed, what kind of canvas was it that has no texture!!

Remarkable achievement. But these two questions still bother me.

శిశిర said...

అద్భుతమైన కళ, అరుదైన కళాకారుడు.

మురళి said...

too good

E.V.Lakshmi said...

Wow!Really amazing.

వేణూశ్రీకాంత్ said...

అబ్రకదబ్ర గారు ఈ లింక్ ఓ సారి చూడండి..
http://www.explore-drawing-and-painting.com/oil-pastel-painting.html

ఆ.సౌమ్య said...

కామెంటు పెట్టిన అందరికీ చాలా చాలా ధన్యవాదములు!
ఈ పోస్ట్, మీ కామెంట్లు చూసి అంజి గారు చాలా సంతోషించారు.

ఆయన్ వెబ్ సైట్ ఇంకా నిర్మాణంలో ఉంది...తయారవ్వగానే నేను మీ ముందుంచుతాను.

Once again Thanks everyone!

ఆ.సౌమ్య said...

@ అబ్రకదబ్ర గారూ
మీ సందేహాలను అంజి గారితో ముఖాముఖి మాట్లడి నివృత్తి చేసుకోవచ్చు.

His contact details:

Mail: pauperanzi@gmail.com

Ph no: 09704960000

అబ్రకదబ్ర గారు మాత్రమే కాదు ఎవరైనా అంజిగారిని కాంటాక్ట్ చెయ్యాలంటే చెయ్యొచ్చు. అతనికి అభ్యంతరం లేదు.

spandana said...

WOW! No words!