StatCounter code

Tuesday, July 12, 2011

చెత్త కబుర్లు

ఈ మధ్య మనసుని కాస్త కలచివేసిన కబుర్లన్నమాట:

1) మొన్న ఆ మధ్య నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కి వెళ్లాల్సొచ్చింది. స్టేషన్ బయట ఓ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు....వాళ్ళ చేతుల్లో చిన్న చిన్న జెండా కాగితాలు, గుండుసూదులు (అల్పీలు). ఎవరినీ ఏమీ అడగకుండా, చేతికి ఎవరు దొరికితే వాడి చొక్కాకి ఆ జెండాలు అతికించేస్తూ రెండు రూపాయిలు వసూలు చేస్తున్నారు. అసలు ఎంత సామర్ధ్యంగా చొక్కాలో, చేతులో దొరకబుచ్చుకుంటున్నారంటే...ఇంక చెప్పలేను. చుట్టూ ఉన్నవాళ్ళందరికీ తగిలించేస్తున్నారు. అడక్కుండా. విదిలించుకుపోతే అల్పీ గుచ్చుకుంటుందేమో అని భయం. పైగా తగిలిస్తున్నది జాతీయ జెండా. వద్దు పో అంటే జెండాకి అవమానమనో లేక నలుగురూ గేలి చేస్తారనో, కోప్పడతారనో అందరూ పెట్టించుకుంటున్నారు. పెట్టించుకున్నాక చచ్చినట్టు రెండు రూపాయలు ఇవ్వాల్సిందే. లేదంటే ఆ ఆడవాళ్ళు అరిచి గోల చేసి నానాయాగీ చేస్తారు. వాళ్ల చేతికి దొరికిన ప్రతీవాడు, జెండా గుచ్చుతుంటే బిత్తరపోయి చూడడం...అసహాయంగా జేబులోనుండి రెండు రూపాయలు తీసి ఇవ్వడం. ఐదు నిముషాలో ఓ ఐదుగురికైనా గుచ్చుతున్నారు జెండాలు. ఆ లెక్కన ఐదు నిముషాలకి పది రూపాయిలు. గంటలో 120 రూపాయలు...బాగానే ఉంది సంపాదన. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న నాకు ఎంత చిరాకేసిందో! ఏమిటీ దౌర్జన్యం! దేశభక్తిని, జాతీయ జెండాని ఉపయోగించుకుని (అడ్డం పెట్టుకుని) అక్రమాలు, అరాచకాలు చెయ్యడం ఇంత దిగువ స్థాయి నుండీ ఉందని నాకిప్పటివరకూ తెలీదు.

2) రేడియో లో...అదే ఏదో ఒక FM లోఓ దిక్కుమాలిన ప్రోగ్రాం వస్తుంది. దాని పేరు "లాయల్టీ టెస్టు". మొన్న విన్నాను....జాకీలు ఒకబ్బాయికి ఫోన్ చేసి
జాకీ: నిన్న మీ సాయంత్రం ఎలా గడిచింది. ఏం చేసారు? మీ అనుభవాలు మాతో పంచుకోవచ్చు.
అబ్బాయి: అశ్విని తో ఉన్నాను.
జాకీ: అశ్విని ఎవరు?
అబ్బాయి: నా గర్ల్ ఫ్రెండు
జాకీ: మీరిద్దరూ ఏం చేసారు? ఎక్కడెక్కడ తిరిగారు మాతో పంచుకోవాలనుకుంటే చెప్పొచ్చు.
అబ్బాయి: సినిమా, డిన్నర్...వగైరా వగైరా.

వెంటనే జాకీలు ఇంకో అమ్మయికి లైన్ కలిపారు. అవతలనుండి ఆ పిల్ల గొంతు...

అమ్మాయి: అశ్విని ఎవరు? దానితో నువ్వేం చేసావు? ఎక్కడ తిరిగావు? ఎన్నిసార్లు పడుకున్నావు? నిన్న నన్ను కలవడానికి రాను అని చెప్పినదానికి కారణం ఇదా? ఎన్నాళ్ళుగా సాగుతోంది ఈ వ్యవహారం?
అబ్బాయి: ఓహ్ అనిత....నువ్వా, అదీ అదీ ప్చ్ అదీ అది కాదు...అశ్విని అంటే.... (నసుగుతున్నాడు)
అమ్మాయి: 4 letter word కనీసం ఓ ఐదు సార్లు!
అబ్బాయి: ఇంకా నసుగుతూనే ఉన్నాడు
అమ్మాయి: పిచ్చి పిచ్చిగా తిడుతోంది, బూతులు తిడుతున్నాది...విజృంభించేస్తున్నాది. ఒకే మాట "దానితో ఎన్నిసార్లు పడుకున్నావ్" అని కనీసం పదిసార్లు అడిగుంటుంది.

లైన్ కట్ అయింది.

జాకీ: యా చెప్పండి, అనిత మీ గర్ల్ ఫ్రెండు కాదా?
అబ్బాయి: అవును తను నా గర్ల్ ఫ్రెండే
జాకీ: మరి అశ్విని? మీ ఇంకో గర్ల్ ఫ్రెండా?
అబ్బాయి: యా అవును, ఇప్పుడు పెంట పెంట అయింది
జాకీ: గుడ్ లక్!

లైన్ కట్ అయింది.

జాకీ: అదండీ సంగతి. ఆ అబ్బాయి తన సమస్యని పరిష్కరించుకుంటాడని అనుకుంటున్నాము. వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఇంకా మీరెవరైనా ఈ లాయల్టీ టెస్టు కి మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ని పంపించాలనుకుంటున్నారా అయితే పేరు, ఫోన్ నంబర్ మాకు పంపించండి.

ఇది విన్నాక నాకు ఒళ్ళుమండిపోయి ఆ రేడియో పీక నొక్కాను. ఆ ప్రోగ్రాం కనిపెట్టినవాడిని జైల్ లో పెట్టాలి. వెర్రి వేయి తలలతో వీర విహారం చేస్తోంది. ....పైత్యప్రకోపానికి కాబోలు!

3) మొన్న మెట్రోలో వెళ్ళవలసి వచ్చింది. రద్దీగా ఉండడంతో నేను, నా ఫ్రెండు నిలుచున్నాము. మిగతావాళ్ళు కూడా మా వెనుకే తోసుకుంటూ ఎక్కడంతో మేమిద్దరం కాస్త దూరం అయ్యాము. నేను తన దగ్గరకి వెళ్ళిపోదామనుకునేంతలో ఒక స్టేషన్ వచ్చింది. బిలబిలమంటూ జనాలు ఎక్కారు. కొందరు ఆడవాళ్ళు ఎక్కి నా చుట్టూ చేరారు. చూడడానికి చాలా మొరటుగా ఉన్నారు. కొందరు పల్లెటూరి వాళ్ళలాగ అడ్డపంచె కట్టుకున్నారు. ఓ 7-8 మంది ఉంటారు. అటు, ఇటు తోసుకుంటూ నా చుట్టూ తిరుగుతున్నారు. నేను నా ఫ్రెండు దగ్గరకి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంటే వాళ్ళు నాకు అడ్డొస్తున్నారు. నన్నస్సలు వెళ్ళనివ్వట్లేదు. జాగా లేదు అంటున్నారు. నాకు చిరాకేసింది. ఎందుకు వీళ్ళు నన్నిలా ఆపుతున్నారు అని విసుక్కున్నాను. నన్ను పద్మవ్యూహంలో బిగించినట్టు బిగించారు. ఎటూ కదలడానికి కుదరలేదు. ఊపిరి ఆడకుండా ఉంది. కాసేపు అలాగే నిల్చున్నాక ఇంక వాళ్ళకి గట్టిగా చెప్పాను నేను అటు వెళ్ళాలి దారి ఇవ్వమని. చాలా ఇరుకుగా కొంత దారి ఇచ్చారు. కష్టపడి వాళ్ళని తప్పించుకుని అటువైపు చేరాను. నేను నడుస్తున్నంతసేపు వాళ్ళు నాకు తగులుతూనో, గుద్దుతూనో ఉన్నారు. నా ఫ్రెండు దగ్గరకి చేరి ఎందుకో నా బేగు మీద చెయ్యి పెట్టేసరికి అది తెరిచి ఉంది. లోపల పర్స్ లేదు. నాకెంత గాబరా వేసిందో! నా పర్స్ కనిపించడం లేదు అంటూ పెద్దగా అరిచాను. నాకు కావలసినవి, ముఖ్యమైనవి అన్నీ అందులో ఉన్నాయి. మేమిద్దరం కింద పడిపోయిందేమో అని వెతుకుతున్నాం. నాకు మతిపోయింది. నేనెప్పుడూ పర్స్ పోగొట్టుకోలేదు. నా బేగు విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇలా ఎప్పుడూ జరగలేదు...ఎక్కడ పోయిందో అనుకుంటూ ఇద్దరం వెతుకుతున్నాం. ఈ లోగా ఆ ఆడవాళ్ళు అక్కడనుండి కదిలే ప్రయత్నంలో ఉన్నారు. బహుసా తరువాతి స్టేషన్లో దిగుతారు కాబోలనుకుని నా పర్స్ కోసం చూస్తున్నాను. ఆ ఆడవాళ్ళ కాళ్ళ మధ్యలో కనిపించింది. ఒకావిడ దాన్ని కాళ్ళ మధ్యలోకి తోస్తోంది. నేను గబుక్కున ముందుకి దూకి పర్స్ దొరకపుచ్చుకున్నాను. వాళ్ళు కాస్త బిత్తరపోయినట్టు చూసి మళ్ళీ మామూలయిపోయారు. అక్కడ ఉన్న మాకు, మిగతావాళ్ళకి స్పష్టంగా అర్థమవుతున్నది ఇది వాళ్ళ పనే అని. అంతవరకూ నన్ను పద్మవ్యూహంలో బంధించడానికి కారణం కూడా అదే. వెంటనే బేగులో సెల్ కోసం చూసాను. ఉంది. ఇంకేమీ పోలేదు పర్స్ తప్ప. నా అదృష్టం బావుండి దొరికింది. బహుసా వాళ్లు దొంగిలించినప్పుడు పొరపాటున కిందకి జారిపడినట్టుంది. అదే నిముషంలో అది నా కళ్ళబడింది. నేను మెరుపులా ముందుకి దూకి తీసుకోవడంతో నాకు దక్కింది. వాళ్ళతో గొడవపెట్టుకుని తిడదామనుకున్నాను. కానీ నా దగ్గరా సాక్ష్యాలు ఏవి? నీ సంచికి నువ్వు జిప్ పెట్టుకోలేదు, పర్స్ పడిపోయింది అని వాళ్ళు నా మీద పడితే? పైగా వాళ్ళు చాల బలిష్ఠంగా, మొరటుగా ఉన్నారు. "డిల్లీలో మొదటి పాఠం: ఎవరితో గొడవపెట్టుకోకూడదు. ఇక్కడి మనుషులతో వేగలేము." ఇది గుర్తొచ్చి ఊరుకున్నాము. వాళ్ళు అక్కడనుండి కదిలి తరువాతి బోగీకి వెళ్ళారు. అక్కడనుండి అలా కదులుతూ ఒక్కో బోగీకి వెళుతున్నారు. ఇలా ఊరుకుంటే లాభం లేదనిపించింది. తరువాత స్టేషన్ లో పోలీసులు మెట్రోలో చెకింగ్ కి వచ్చినప్పుడు వాళ్ళకి కంప్లైంట్ చేసాను. ఇలా ఇలా జరిగింది. నా అనుమానం వాళ్ళ మీద. పైగా వాళ్ళు ఇలా ఒక బోగీ నుండి ఇంకో బోగీకి వెళుతూ ఉన్నారు అని చెప్పాను. వెంటనే ఆ పోలీసులు వాళ్ళ వెనుకే వెళ్ళారు. వాళ్ళని ఏవో అడుగుతూ ఉన్నారు. ఈలోగా నా స్టేషన్ వచ్చి నేను దిగిపోయాను.

ఈ అనుభవం నాకు బాధగానూ, భయంకరంగా అనిపించింది. ఇలా గుంపులు గుంపులుగా వచ్చి రైళ్లలో, బస్సులలో దొంగతనాలు చేస్తారని నాకు తెలీదు.


............................................................చెత్త కబుర్లు సమాప్తం..................................................36 comments:

రవికిరణ్ said...

ఏదో మీరు చెత్త కబుర్లన్నారేగానీ, అవి మాత్రం అక్షరసత్యాలు. మరీ ముఖ్యంగా FM రేడియోలు. నిన్నో మొన్నో పేపర్లో చదివాను FMలో News చాన్నెళ్ల కోసం త్వరలో వేలంపాటలు వేస్తారట.. :-(

చాలా బాగా రాసారండీ!

hari said...

meeru Bindas channel lo emotional athyachar choodaranukunta, adi chooste telustadi, videos tho choopistadu aa FM program laaga

Indian Minerva said...

అనుమతిలేకుండా ముట్టుకోవడమేంటండీ మరీనూ. దేశభక్తో మరోటో నేనైతే గూబమీద ఒక్కటిద్దును.

శరత్ 'కాలమ్' said...

బావున్నయ్ మీ కబుర్లు. చెత్త టైటిలుకి సరిపోలేదు.

శరత్ 'కాలమ్' said...

నా ఇంతకుముందు వ్యాఖ్యలో స్పష్టత లేదని ఇది వ్రాస్తున్నా. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను కాబట్టి మంచి కబుర్లు అని అన్నాను.

మురళి said...

కబుర్లు బాగున్నాయ్ కానండీ, శీర్షిక కొంచం తప్పు దోవ పట్టించేదిగా ఉంది..

శ్రీరామ్ said...

"Is you patner a snake ?" అన్న US రేడియో ప్రోగ్రాం కి మన దేసీ నకలు ... ఆహా...!!

మాలా కుమార్ said...

డిల్లీ లో మాకు తెలిసిన వాళ్ళొకరు చెప్పారు , వాళ్ళ పక్కింట్లోని పనమ్మాయి ఆయన షర్ట్ జేబులో నుంచి డబ్బులు తీసుకుంటూ వుంటే పట్టుకున్నారట . అప్పుడా పనమ్మాయి అతనే తన చేయి పట్టుకున్నాడని గోల గోల చేసిందిట. అనుదుకే మాకు తెలిసినాయన ఆయన కళ్ళ ముందే పనమ్మాయి పర్స్ ల్లోనుంచి డబ్బులు తీసుకుంటుంటే ఏమి మాట్లాడ కుండా వూరుకొని తరువాత పనమ్మాయి ని మానిపించేసారట . అది విని బాబోయ్ డిల్లీ అనుకున్నాను . ఇప్పుడు మీరు రాసింది చదువుతుంటే ఇంకా బాబోయ్ అనిపిస్తోంది :)

ఇందు said...

సౌమ్యగారూ....ఇవి మీకు చెత్తకబుర్లు అనిపించినా చాలాచోట్ల ఎప్పుడూ జరిగేవేనండీ...మరీముఖ్యంగా అలా గుంపులుగా వచ్చి దొంగతనం చేయాలనుకోవడం మనం పల్లెవెలుగు బస్సు కిక్కిరిసి ఉన్నప్పుడు తెలుస్తుందీ....వాళ్ళు తట్టలు,బుట్టలు అవి,ఇవి తెచ్చి మనమీద పడేస్తారు...వచ్చి వాటి పక్కన నిల్చున్నట్టు మన పక్కన నిల్చుని..అటు,ఇటు కదలనివ్వరు...ఇక ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా..మెడలో చైనో...చెతికి ఉంగరమో..వాచీనో...పర్సో స్వాహా!

ఇక హరిగారు చెప్పినట్టు ఆ ఎమొషనల్ అత్యాచార్ అంకచండాలపు ప్రొగ్రాం! మీరు చెప్పినవి అన్ని ఎంచక్క కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు...

ఆ జాతీయజెండా గుచ్చడం...ఏం చెబుతాం! నాలాంటివాళ్ళు డెఫెనెట్గా విక్టింస్ అవుతారు :)

మధురవాణి said...

బాబోయ్.. ఏంటివన్నీ అసలు.. మొదటిది చూసి ఆశ్చర్యపోయా.. రెండోది చూసి షాక్ అయ్యా.. మూడోది చదివి వణుకొచ్చేసింది.. :(
అసలా ప్రోగ్రాం ఏంటి.. ఆ మాటలేంటీ.. అయితే, రేడియో ప్రోగ్రామ్స్ కి కూడా సెన్సార్ బోర్డ్ ఒకటి పెట్టాలేమో.. నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయా రేడియోలో.. ఎవరన్నా చిన్న పిల్లలు వింటే ఎలా.. నిజంగా నమ్మలేకపోతున్నా నేనైతే!

వేణూరాం said...

హ్మ్మ్... మీ చెత్త కబుర్లు వణుకు తెప్పించేలా ఉన్నాయ్. ఆ చివరాఖరిది మరీనూ.. మీరు ఎంత అదృష్టవంతులు కాకపోతే మీ పర్సు మీకు దొరుకుతుందీ?
ఇంకా ఇవేం చూశారూ?
ప్రశాంతీ ఎక్స్ప్రెస్ లో బెంగుళూర్ రావాలీ.. నా సామిరంగా దౌర్జన్యం చేసి దోపిడీ చేస్తారు.. అడుక్కునే వాళ్లకి రూపాయ్ ఇవ్వడానికి బాధ పడేవాళ్ళు కూడా మినిమం పది రూపాయలు చదివించుకుంటారు. .కొంత మంది భోగీ చివరి రూం లలో దాక్కుంటారు.. వాళ్ళతో వాదించలేం ఆ లాంగ్వేజ్ భరించలేం. ;) ;)

ఎఫ్ఫెం లలో ఫోన్ చేసి బకరాలని చేసే ప్రోగ్రాంస్ వినాల్సి వస్తూంటుంది అప్పుడప్పుడూ.. ఇదేం పైశాచిక ఆనందమో చెత్త వెధవలకీ..

ఇలా చెప్పుకుంటా పోతే.. ఎన్నో.. ఎన్నెన్నో అండీ..

బులుసు సుబ్రహ్మణ్యం said...

దొంగతనాలలో దౌర్జన్యం ఎక్కువయిపోతోంది. మనలో ధైర్యం సన్నగిల్లుతోంది. పక్కవాడు తమాషా చూస్తాడే కానీ తోడు రాడు. బహుశా ఇదే అలుసుగా తీసుకుంటున్నారు వాళ్ళు.

మీరింకా అలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారా. దేవుడే మిమ్ము కాపాడుగాక.

మీ చెత్త కబుర్లు మంచిగా ఉన్నాయి. చిన

కొత్తావకాయ said...

హ్మ్.. ఏం చెప్తాం. కలికాలం. ముందు ముందు ఇంకెన్ని చెత్త విషయాలు చూడనున్నామో!
లండన్ లో ఉండే నా స్నేహితురాలు ఇలాంటి కబురే చెప్పింది నిన్న. కొత్తగా ఇల్లు మారారట వాళ్ళు. నాలుగేళ్ళ పిల్లాడిని బయటకు ఆడుకోడానికి పంపించి తను లోపలి నుంచి చూస్తొందిట. పదేళ్ళ పిల్లలు (మన పక్క దేశం వాళ్ళు) ఓ ముగ్గురు వీడిని కొట్టడం చూసి, వెళ్ళి సర్ది చెప్పి వచ్చిందిట. "మళ్ళీ ఏం చేస్తారో" అని అటే ఓ కన్ను వేసి ఉంచిన నా స్నేహితురాలికి కనిపించిన విషయమేమిటంటే.. ఆ నాలుగేళ్ళ పిల్లాడికి ఈ పదేళ్ళ పిల్ల వెధవలు చెప్పకూడని మాటలు నేర్పుతున్నారట. పరిగెత్తుకెళ్ళి కొడుకుని లోపలికి తెచ్చేసుకొని, నేను ఆన్లైన్ కనిపిస్తే భోరుమంది. "ఏమే! మన పిల్లల్ని పాడవకుండా కాపాడుకోలేమా?" అని. మనసు వికలమయిపోయిందనుకో.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

చేతుల్లో చిన్న చిన్న జెండా కాగితాలు, గుండుసూదులు (అల్పీలు). ఎవరినీ ఏమీ అడగకుండా, చేతికి ఎవరు దొరికితే వాడి చొక్కాకి ఆ జెండాలు అతికించేస్తూ .....మీరు అర్జంటుగా మెల్ బ్రూక్స్ ఎయిర్ ప్లేన్ సినిమా చూడాలి,చూసాకా ఇలా గుచ్చేవారిని యేం చేయాలో స్పష్టంగా అరమవుతుంది.మీ కడుపు చెక్కలయితే నా పూచీ కాదు.మిగతా సమస్యలపై నాకు అవగాహన లేదు.

Anonymous said...

మీ అనుభవాలతో అందరమూ ఇంకా జాగ్రత్తగా ఉంటామని ఆశిస్తాను.
నాకెందుకో ఆ ఎఫ్.ఎం రేడియో (ఇలాటిదే టీవీలో ఏదో కార్యక్రమం, పేరు గుర్తులేదు) ప్రోగ్రాం అంతా స్టేజి మేనేజ్మెంట్ అనిపిస్తుందండీ. లేకపోతే ఎవరైనా వ్యక్తిగత జీవితాన్ని అంత అసహ్యంగా బయట పెట్టుకుంటారా?
శారద

Sujata said...

Hee Hee Sowmya - Delhi makes you tough. Delhi teaches you how to survive. Wish I can have another innings there.

కృష్ణప్రియ said...

జండాలు గుచ్చి డబ్బులు వసూలు చేయటం నేనూ చూశాను.

ఇంకో చెత్త విషయం.. మా కాలేజ్ ఎదురుగా ఒక ఇరవై మంది బస్ స్టాండ్ లో ఉండేవారు. పది మీటర్ల దూరం నుండే దుర్గంధం వచ్చేట్టు గా ఉండేది వాళ్ల బట్టలు, చాలా మురికి గా, గజ్జ్జి,గాయాల నుండి చీమూ, నెత్తురూ కారుతూ, మీదకి వచ్చి డబ్బు వసూలు చేసేవారు. వద్దంటే చేతులు పట్టుకుని.. విదిలించుకుంటే బుగ్గలు పట్టుకుని అడుక్కునేవారు. పైగా కళ్ళతో నవ్వుతూ..

ఎవ్వరూ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలియదు. ఇప్పుడు అనిపిస్తుంది. అంత మంది కాలేజ్ అమ్మాయిలం ఉండేవాళ్లం. అస్సలూ చైతన్యం లేకుండా .. ఒక్కసారైనా వాళ్ల గురించి ఏం చేయాలని ఆలోచన కూడా రాకుండా.. నేనూ exception కాదు. వాళ్లతో గొడవ అని కొద్దిగా చిల్లర తో రెడీ గా ఉండటం తప్ప.. ఏమీ చేయలేదు. :-(

నేస్తం said...

పోస్ట్ బాగుంది సౌమ్యా ..మరీ విచిత్రంగా తయారవుతున్నారు జనాలు :)
మధు ఆ ప్రోగ్రాం ఏం చూసావ్ సచ్ కా సామ్నా అనుకుంటా ఒక హింది ప్రోగ్రాం ..దానికి వెళి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారట :)

kallurisailabala said...

ఇవి అస్సలు చెత్త కబుర్లు కదండి Fm లు కొంచం ఓవర్ చేస్తాయి అని తెలుసు కాని మరి ఇలా అమ్మో తలచుకుంటేనే భయంగా ఉంది .ఇక మీ దేశభక్తి అనుభవం అయితే నిజమే అది కూడా ఆగష్టు 15 , జనవరి 26 వస్తే ఇంకా ఎక్కువగా ఉంటోంది ఇక మీ మూడో అనుభవం ...చదివి వణుకొచ్చేసింది

ఆ.సౌమ్య said...

@రవి కిరణ్ గారూ
FM లో News చాన్నెళ్ల కోసం వేలం పాటలా...అబ్బబ్బా ఇంకెన్ని ఘోరాలు జరగబోతున్నాయో!
ధన్యవాదములు!

@ hari
సాధారణంగా నేను టీవీ చూడను. హిందీ చానళ్ళు అసలు చూడను. సినిమాలు తప్ప టీవీలో ఇంకేవీ చూడను..అందుకే నాకు తెలీదు. fm లో విన్నప్పుడు కొత్తగానూ, చెత్తగానూ అనిపించింది.
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ Indian Minerva
నాక్కూడా గూబ పగలగొట్టాలనే అనిపించింది...కానీ అది ఢిల్లీ అని గుర్తుకు వచ్చింది. దాని రూటే సెపరేటు లెండి. అందుకే దూరంగా నిలుచుని అసహ్యించుకున్నాను.

ధన్యవాదములు!

@ శరత్ గారూ
చాలారోజులకి వేంచేసారు...ధన్యవాదములు!
చెత్త కబుర్లంటే చిరాకు తెప్పించాయని అలా టైటిల్ పెట్టానండీ! నా అభిప్రాయలతో ఏకీభవిస్తున్నందుకు సంతోషం! :)

ఆ.సౌమ్య said...

@ మురళీ గారూ
మీ వ్యాఖ్య, శరత్ గారి వ్యాఖ్య చూసాక "చిరాకు తెప్పించే కబుర్లు" అని టైటిల్ పెట్టి ఉండాల్సింది అనిపించింది. అంటే ఇవి మంచివి, ఉల్లాసాన్ని కలిగించేవి కావు కాబట్టి చెత్త అని పెట్టానన్నమాట.
ధన్యవాదములు!

@ శ్రీరాం గారూ
ఓహ్ అలానా...నాకు తెలీదు. ఏమిటో పైత్యం తారాస్థాయికి చేరడం అంటే ఇదే కాబోలు! ధన్యవాదములు!

snigdha said...

మొదటిది చదువుతోంటే ఇలా కూడా జరుగుతుందా అని అనిపించింది..రెండోది టి.వి ల నుంచి ఈ పైత్యం రేడియో కి కూడా పాకిందా అని అనిపించింది...ఇందు గారన్నట్టు అమ్మో ఓ రోజు ఎమొషనల్ అత్యాచార్ అన్న ప్రోగ్రాం కి బలయ్యి పోయా...ఎందుకు ఇలాంటి చెత్త ప్రోగ్రాములు వేస్తారో టి.వి ల్లో...ఈ మధ్య రేడియోల్లో ఫోన్లు చేసి బక్రా చేసే ఓ తొక్కలో ప్రోగ్రాం వస్తోంది...అదేమి పైశాచిక ఆనందమో తెలీదు..మూడోది బాబోయి...జాగ్రత్తగా ఉండాలని తెలిసింది...మీ పర్స్ దొరికింది అండ్ మీరు ధైర్యం గా వెళ్ళి పోలిసులకి చెప్పొచ్చారు... ...

శ్రీ said...

హా... అలాంటి రేడియో ప్రోగ్రాం ఒకటి ముంబైలో కూడా వచ్చేది మూడేండ్ల క్రితం మాట(ఇప్పటి సంగతి తెలీదు ). 'మియ్యావ్ ఎఫ్.యం' అని ప్రత్యేకించి ఆడవాళ్ళ కోసం ఒక స్టేషన్ ఉండేది..వినేది మాత్రం అందరూను. రాత్రి 11 తరువాత వాడెవడో 'అనిల్ శ్రీవాత్సవ' అనే జాకి (స్టేషన్ వాడిదే అనుకుంటా..వాడి గొంతు చాల బావుంటుంది) ఫోన్ చేసిన అడోళ్ళతో 'అ' నుండి 'ఱ' దాకా అన్ని మాట్లాడేవాడు.

ఈ సారి ఎవరయినా జండా పెడితే...జైహింద్ అని, ఒక పావలా చాక్లెట్ వాళ్ళ చేతిలో పెట్టండి :-) కుక్క కాటుకు చెప్పు దెబ్బ

వేణూ శ్రీకాంత్ said...

హ్మ్ చెత్తకబుర్లు కావండీ చిరాకు తెప్పించే కబుర్లైనా మంచి కబుర్లు ఇలాంటివి కూడా జరుగుతాయని అందరికి చెప్పవలసిన కబుర్లు..
మొదటి సంఘటన చదవగానే నిన్నే పేపర్ లో చదివిన వార్త గుర్తొచ్చింది. కొందరు అమ్మాయిలు హాఫ్ స్కర్ట్ లు వేసుకుని బైక్ మీద వచ్చే కుర్రాళ్ళని రోడ్ మీద ఆపి సేవాసదన్ పేరుతో బలవంతంగా వంద నుండి ఆపై డబ్బులు వసూలు చేస్తున్నారట. పరిశీలిస్తే వారు చెప్పే వివరాలు ఏవీ కరెక్ట్ గా లేవు ఇదంతా పెద్ద మోసం అని బయటపడిందిట.
ఎఫ్ ఎమ్ ప్రోగ్రాం ఏదో అమెరికన్ రేడియో ప్రోగ్రాంకి కాపీ అండీ.. పైన అల్రెడీ చెప్పారు కదా. అలాంటివి వినకుండా ఉండటమే వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన మొదటి స్టెప్..
మూడవ సంఘటన గురించి విన్నాను కాని మొదటి సారి ఇలా నాకు తెలిసిన వారికి జరగడం.. మీ పర్స్ మీకు దొరకడం చాలా అదృష్టం అనే అనుకోవాలి అంతే..

ఆ.సౌమ్య said...

@ మాలా కుమార్ గారూ
మీరు చెప్పినది చాలా చిన్న విషయమండీ...పనివాళ్ళు ఓనర్లని చంపేసి డబ్బూ దస్కం ఎత్తుకుపోయిన కేసులు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడి వింతలూ డిల్లీలోనే జరుగుతాయి తెలుసా!
ధన్యవాదములు!

@ ఇందు
అవునా, ఏమో నేను దొంగలబారిన పడలేదు పెద్దగా...అందుకే నాకు చాలా భయం వేసింది.
"ఆ ఎమొషనల్ అత్యాచార్ అంకచండాలపు ప్రొగ్రాం!"...అబ్బ ఎంతసేపు నవ్వుకున్నానో ఆ తిట్టు చూసి...భలే ప్రయోగించావ్..జై జంధ్యాల!...ఇలాంటివాటికి బాగా పనికొస్తాయేం ఈ తిట్లు. :)
అదే నీలాంటి అమాయకులను పట్టుకునే జెండాలు గుచ్చుతున్నారక్కడ :)
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ మధురా
హ్మ్, నేనూ నీలాగే బెంబేలెత్తిపోయాను :)
ధన్యవాదములు!

@ రాజ్
హ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఫోన్లో బకరాలు చేసేవరకూ ఓకేగానీ మరీ ఇలా దారుణంగా వ్యక్తిగత విషయాల గురించీ....అదే ఆశ్చర్యమేసింది నాకు! అసహ్యం కూడా అనుకో!
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ బులుసు గారూ
"....పక్కవాడు తమాషా చూస్తాడే కానీ తోడు రాడు." ...అవునండీ బాగా చెప్పారు. నా పర్స్ పోయేటప్పుడు ఇదే పరిస్థితి...చుటూ ఉన్నవారంతా ఇది చాలా సహజం, వింతేముంది అన్నట్టు చూసారే తప్ప ఒక్కరూ ముందుకి రాలేదు.

నేను అలాంటి ప్రోగ్రాంస్ చూడట్లేదండీ....నేను టీవీ చూడను, fm వినను...కాకపోతే ఆ రోజు నా ఖర్మ కాలి రేడియో పెట్టాల్సివచ్చింది...పెట్టగానే ఇది వినాల్సి వచ్చింది. అంతా ప్రారబ్ధం! :(
ధన్యవాదములు!

@రాజేంద్ర గారూ
మెల్ బ్రూక్స్ ఎయిర్ ప్లేన్...అవునా, అయితే అర్జంట్‌గా ఈ సినిమా చూసేస్తా...అలా జెండా గుచ్చినవాళ్ల పనిపడతా!
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@కొత్తవకాయ
జాగ్రత్త తల్లోయ్...పిల్లాడినక్కడే పెంచబోతున్నావ్...ఎన్ని కళ్ళు వేసి కాపాడతావో మరి నీ ఇష్టం.
ధన్యవాదములు!

@ శారద గారూ
పోనీ అంతా స్టంట్ అనుకున్నా ఈ వేషాలు మితిమీరిపోయి రోత పుట్టిస్తున్నాయి...కాదంటారా?
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ Sujata
hehehe very true. వీలైతే ఢిల్లీ మీద కొన్ని టపాలు సీరీస్ గా రాద్దామనుకుంటున్నా!
ధన్యవాదములు!

@ కృష్ణప్రియ గారూ
అబ్బ మీరు చెబుతుంటేనే చిరాకుగా ఉంది, మీరెలా భరించారో! ఒక్కోసారి అలా అయిపోతుంటుంది అంతే!
ధన్యవాదములు!

మనసు పలికే said...

అమ్మో సౌమ్య గారూ...:((( దొంగతనం సంఘటన అయితే దారుణం నిజంగా.
ఎఫ్.ఎం. ప్రోగ్రాములేనా, టి.వి.లో కూడా ప్రోగ్రాములు అలాగే తగలడ్డాయి కదా, నడిరోడ్డు మీద జనాల్ని బకరాలు చెయ్యడం.. ఏంటో వెర్రి ఆనందాలు.

ఆ.సౌమ్య said...

@ నేస్తం
బాబోయ్ ఆత్మహత్యలే దారుణం!
ధన్యవాదములు!

@ శైలబాల
హ్మ్ ఏం చేస్తాం చెప్పండి, అలా తయారయ్యారు జనాలు!
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ స్నిగ్ధ
అవునట, ఆ ఎమొషనల్ అత్యాచార్ గురించి అందరూ చెబుతున్నారు. నేను చూడకుండా పుణ్యం చేసుకున్నాను.మరి మనం పోలీసులకి చెప్పకుండా ఊరుకుంటే ఇలాంటివి ఇంకా హెచ్చుమీరుతాయి కదా అందుకే చెప్పొచ్చాను.
ధన్యవాదములు!

@ శ్రీ
మియ్యావ్ ఆ...హహహ. బాబోయ్ ఆ జాకీకి ఫోన్ చేసి మాట్లాడినవాళ్లననాలసలు!
హహ బలే ఐడియా చెప్పారు...కానీ ఇప్పుడు పావలా కి విలువ లేదు, చాక్లేట్లెక్కడొస్తాయి చెప్పండి. కానీ ఈ ఐడియా బానే ఉంది. ఎక్లైర్స్ చాక్లెట్స్ కొనేసి సంచిలో పెట్టుకు తిరగాలి. జెండా పెట్టగానే చాక్లేట్ చేతిలో పెడితే మూసుక్కూర్చుంటారు ఏమీ అనలేక :)
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ వేణు శ్రీకాంత్
అవును, ఇలాంటి బోగస్ వి చాలా జరుగుతాయి. ఒకసారి ఇక్కడ మెట్రో స్టేషన్ బయట కొందరు విద్యార్ధులు స్కూల్ యూనిఫాం వేసుకుని చందాలు వసూలు చేస్తున్నారు అనాధ బాలబాలికలకోసమని. మాకు నమ్మకం కుదరక నిలదీస్తే వాళ్ళ దగ్గర సరి అయిన ప్రూఫుల్లేవు...మేము గట్టిగా తిట్టేసి వచ్చేసాము.
నిజమే ఆరోజు పర్స్ అదృష్టంగా దొరికిందిలెండి.
ధన్యవాదములు!

@ అప్పు
నిజమే వెర్రి వేయి రకాలని...ఏమి చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు కాబోలు!
ధన్యవాదములు!

శ్రీ said...

బొంబాయిలో ఇంతే, బొంబాయిలో ఇంతే అనుకున్నా.

ఢిల్లీలో కూడా అంతే అన్నమాట.

రొంబా మోసం!

ఆ.సౌమ్య said...

శ్రీ (కాలాస్త్రి)
అయ్యో ఢిల్లీ తో పోల్చుకుంటే బొంబాయి ఎంతో బెటరండీ బాబూ. నన్నడిగితే బొంబాయిలో మనుషులు చాలా మంచివాళ్ళు. ఇక డిల్లీ లో...అడక్కండి....రొంబ రొంబ రొంబ మోసం :)

ధన్యవాదములు!