StatCounter code

Wednesday, March 10, 2010

మహిళా బిల్లు-సార్థకత

మహిళా బిల్లు ఆమోదం ముదావహం. ఈ బిల్లు ఆమోదానికి కారణమయినవారందరికి పేరుపేరునా ధన్యవాదములు. ఎన్నాళ్ళనుండో ఊరిస్తున్న బిల్లు ఈనాడు అలరించింది.

దీనివల్ల చట్టసభలలో మహిళలపాత్ర మెరుగుపడుతుంది. మహిళాలోకానికి కాస్తయిన తోడు దొరుకుతుంది. కానీ ఈ హక్కుని ఉపయోగించుకుని రాజకీయ రంగప్రవేశం చేసే మహిళలు ఎవరు? సామాన్య మహిళకు ఈ హక్కు అందుబాటులో ఉంటుందా? ఈరోజు ఎక్కడో ఒక వ్యాసం చదివాను (ఈనాడు లో అనుకుంటాను). ఈ హక్కు భార్యలకే కానీ, సామాన్య మహిళలకి కాదు అని. ఇక్కడ భార్యలు అంటే రాజకీయనాయకుల భార్యలు.

చాలానాళ్లనుండీ పురుషులు, స్త్రీలు అనే రెండు జాతుల మధ్య అధికారం, శృంఖలాలు, విభేదాలు లాంటి అంశాలు రాజ్యమేలుతూనే ఉన్నయి. స్త్రీ తన హక్కు కోసం పోరాటం మొదలుపెట్టి(ఫెమినిజం) బానిసత్వ శృంఖలాలను తెంచుకుని స్వేచ్చా వాయువులు పీల్చే దిశగా సాగుతోంది. ఈ మార్గంలో ఇంతకుముందు రెండు గా ఉండే జాతులు ఇప్పుడు నాలుగయ్యాయి. అవి 1) ఉన్నత తరగతి పురుషులు (upper class men) 2) ఉన్నత తరగతి స్త్రీలు (upper class women) 3) దిగువ తరగతి పురుషులు (lower class men) 4) దిగువ తరవతి స్త్రీలు (lower class women) ఇక్కడ తరగతి అనే విభజన ఆదాయము బట్టే కాని కులము బట్టి కాదు.


ఈ తరగతులలో మొదటి జాతి అయిన ఉన్నతతరగతి పురుషులు...వీళ్ళ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీలేదు. మనకి తెలిసిందే....ఇంకా ఈ పురుషసమాజ భావలను పట్టుకుని వ్రేలాడుతుంటారు.

ఉన్నత తరగతి స్త్రీలు దిగువ తరగతి పురుషులపై అధికారం చలాయించి అదే స్త్రీవాదమనే భ్రమలో ఉన్నారు. వీళ్ళు ఆటో, రిక్షా వాళ్ళమీద లేదా చిన్నస్థాయి ఉద్యోగులమీద ఊరికే అరవడం. స్త్రీవాదమని పేరు చెప్పి ఆ మగవారిని రాచిరంపాన పెట్టడం. కాలు తొక్కాడు, చెయ్యి చూపాడు అని కేసులు పెట్టడం. ఈ మగజాతి (దిగువజాతి)అంటేనే అసహ్యం అని డాబు కొట్టడం. ప్రతీ మగవాడిని అనుమానంగానే చూడడం. పబ్లిక్ లో నులుచుని పొగ త్రాగడం, మందు కొట్టడం....సరదా కోసం కాదు, గొప్పకోసం, తన ఉనికి చాటుకోవడం కోసం...సరదా కోసమే చెయ్యడంలో ఏ తప్పు లేదు. అది వాళ్ళ వాళ్ళ ఇష్టం.కానీ వీళ్ళు అలా కాదు, అదేదో సినిమాలో డైలాగులాగ,వీళ్ళా రూటే వేరు. ఆధునికతని కట్టు, బొట్టు, మాటతీరులోనూ ప్రతిబింబించడం, ఇంటికి వెళ్ళి భర్త మాట తూచాతప్పక పాటించడం. ఇది వీళ్ళు చేసే పని. ఇంట్లో భర్త చేత తిట్లు తినడం, బయటికొచ్చి స్త్రీవాదమని అరవడం. ఇటువంటి వారి గురించి రంగనాయకమ్మగారు ఒక మాట అన్నారు..."స్లీవ్లెస్స్ జాకెట్లు, బాబ్ కట్ లు, హై హీల్సు స్త్రీవాదాన్ని చాటి చెప్పవు"

ఇక మూడవజాతి దిగువతరగతి పురుషులు...వీరు ఎగువ తరగతి స్త్రీ,పురుషులకు లోబడి ఉండి, దిగువ తరగతి స్త్రీల మీద అధికారం చలాయించడం.వీరు కాస్త ఆధునికత, కాస్త పాతపద్ధతుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు.

ఇక నాలుగవజాతి దిగువతరగతి మహిళలు. వీరు, అటు ఉన్నత తరగతి స్త్రీపురుషుల అధికారానికి, ఇటు దిగువ తరగతి పురుషుల అధికారానికి బలయిపోతూ ఉంటారు....The most suppressed women.

ఈ నాలుగింటి మధ్యలో ఇంకో జాతిని స్త్రీలను కూడా చేర్చొచ్చేమో. మధ్యతరగతి స్త్రీలు అనొచ్చేమో. వీరు కూడా దిగువజాతి పురుషులలగా ఆధినిక, సాంప్రదాయ భావల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు.


ఇప్పుడు అమలులోకి వచ్చిన మహిళా బిల్లు ఉన్నతతరగతి మహిళకలే అందుబాటులో ఉంటే మాత్రం దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. సామాన్య స్త్రీలకు ఎటువంటి ఉపయోగమూ ఉండదు. పరిస్థితిలో ఏ మార్పు ఉండదు. చట్టసభలలో ప్రవేశించే ఉన్నతతరగతి స్త్రీలు, పురుషులకి రబ్బరు స్టాంపులలాగ మారితే ఈ మహిళా బిల్లుకు సార్థకత సున్నా. అలా జరగకుండా అన్ని వర్గాల స్త్రీలకి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.





15 comments:

ప్రియ said...

మీ కల నెరవేరాలని...

..nagarjuna.. said...

"స్లీవ్లెస్స్ జాకెట్లు, బాబ్ కట్ లు, హై హీల్సు స్త్రీవాదాన్ని చాటి చెప్పవు"- i second

vivek said...

ఉన్నత తరగతి స్త్రీలు దిగువ తరగతి పురుషులపై అధికారం చలాయించి అదే స్త్రీవాదమనే భ్రమలో ఉన్నారు.,....i tell u..this is THE BEST LINE in ur blog...ee paragraph antha chala baaga raasaru...

and coming to womens bill...meeranattu enno anumanalu unnayi....adi nijanga upayogapadthundha,ledha annadhi mathram vechi chudali.....Lets Just BE POSITIVE!!

prasad said...

ఈ మాటలు పడికట్టు పదాల లా ఉన్నాయి. స్త్రీ తన హక్కు కోసం ఎవరితో పోరాడుతోంది? మీరు కానీ మీకు తెలిసిస్న వాళ్ళూ కానీ ఎవరితోనైనా పోరాడారా. అవతలి వాళ్ళూ (మగాళ్ళూ, పాత నమ్మకాలా అడవాళ్ళూ) పోరాడితే కదా పోరాటం అనేది ఉండేది. స్త్రీ బానిసత్వ శౄంఖలాలను ఏ స్త్రీలు తెంచారు? మనకున్న మిధ్యా ప్రజస్వామ్య వ్యవస్థ లో స్త్రీల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వేస్తున్న వేషాల ఫలితమే ఈ రిజర్వేషన్లు. ఇంటివద్ద పిల్లలను సాకటం బానిసత్వమైతే ఆఫీస్ లో బాసు మాటలు పడుతూ, తద్వారా వచ్చిన దబ్బుల కోసం పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ, అమా నాన్న ల మంచితనాన్ని వాడుకొని పిల్లలని వాళ్ళ మీద వదిలి పెడుతూ, మగ వాడిని ఒక ఆడంగి వెధవగా చేస్తూ, వాడిని అదొక గొప్ప అనే భ్రమ లో ఉంచే ఈ కొత్త విలువలు కూడా, సహజ మైన ప్రకృతి నిర్దేసించిన ధర్మం నుంచీ వేరు చేసె ఒక బానిసత్వమని ఎప్పటికి తెలుసుకొంటారో.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Well said.

ఆ.సౌమ్య said...

@prasad

"మగవారిని ఆడంగి వెధలా చేస్తూ"....అని మీరు అన్నారంటే మీకు స్త్రీ పురుషుల సమానత్వం మీద ఎంత నమ్మకముందో తెలుస్తోంది...మీ ఆలోచన పరిధికి, విశాల హృదయానికి జోహార్లు!

ప్రకృతి పరంగా కాస్త అసమానత్వం (పిల్లల్ని కనడం, దానికి 15 యేళ్ళ వయసు నుండి తయారవ్వడం) ఉందే తప్ప బుద్ది పరంగా ఏ రకమైన అసమానత్వం లేదు అని మీరెప్పుడు తెలుసుకుంటారో. ఆ చిన్ని అసమానత్వాన్ని అడ్డుపెట్టుకుని పురుషాధికారాన్ని ఆడువారి మీద రుద్దలేరని ఎప్పుడు గ్రహిస్తారో. ఈ ప్రకృతిపరమైన సమానత్వాన్ని కూడా అధిగమించడానికే ఈ కాలంలో మహిళలు పిల్లల్నే కనవద్దని నిర్ణయించుకుంటున్నారు. కొన్ని కుటుంబాలలో పురుషులు,స్త్రీలు కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు,అటువంటి కుటుంబాలను నేనెరుగుదును....అందులో ఏ తప్పు లేదని మీరు గ్రహించలేకపోవచ్చు.

సాటి మనిషిని మనకి సమానంగా జాతి,కుల,మత,వర్గ విచక్షణ లేకుండా సమానంగా చూడగలగడమే నాగరికత.

ఇక నా పోరాటం గురించడుగుతారా.....దాని గురించి రాయాలంటే 2-3 టపాలు రాయాల్సి వస్తుంది. మీకు తెలిసిన ప్రపంచమే ప్రపంచం కాదండీ. ఎవరు పోరాడారో, పోరాడుతున్నారో నా కళ్లతో నేను చూసాను.

"మనకున్న మిధ్యా ప్రజస్వామ్య వ్యవస్థ లో స్త్రీల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వేస్తున్న వేషాల ఫలితమే ఈ రిజర్వేషన్లు."... నా బాధ కూడా అదే. ఈ మహిళా బిల్లు, రాజకీయ వేషాలకి అతీతంగా సామాన్య మహిళ వరకు చేరుతుందని ఆశిస్తున్నాను. చేరబోదేమోనని భయం వ్యక్తం చేస్తున్నాను.

ఆ.సౌమ్య said...

ప్రియ, nagarjuna, vivek, చెప్పు దెబ్బలు-పూలదండలు
మీ అందరికి ధన్యావాదములు :)

karthik said...

చట్టాలతో మార్పు రావాలనుకోవడం అత్యాసే!
విల్లియం బెంటిక్ సతి సహగమనాన్ని 1815 లో నిషేదించాడు.. కానీ అది పూర్తిగా మాసిపోవడానికి ఇంకొక 100 ఏళ్ళు పట్టింది.. అదికూడా ఆడవాళ్ళు బయటకు రావడం, చదువుకోవడం వగైరా కొంత జరిగాక.. ఎందుకంటే మనం ఏ చట్టానైనా అంత సీరియస్ గా పాటించిన దాఖలాలు చరిత్రలో లేవు.. నాకు తెలిసినంతవరకూ ఈ చట్టం వల్ల ఎవరైనా బాగుపడతారు అంటే వాళ్ళు ఇప్పటికే పై లెవెల్లో ఉన్నవాళ్ళు..

అప్పుడే మన అసెంబ్లీ లాబిల్లో భార్యను పదవిలో కూర్చోబెట్టి పీ.ఏ. గా చక్రం తిప్పాలని ఎం.ఎల్.ఏ. ల మధ్య సంభాషణ జరుగుతోంది..


ప్రచార కార్యదర్శి,
గుంటనక్కల సంఘం..
తెలుగు బ్లాగులు..

ఆ.సౌమ్య said...

నువ్వు చెప్పినది చాకా కరక్ట్ కార్తీక్,
ఈ బిల్లు పై లెవెల్లో ఉన్న ఆడవాళ్ల చేతుల్లోనే ఇరుక్కుంటుందేమో అని నా భయం

మంచు said...

:-)

కెక్యూబ్ వర్మ said...

కార్తీక్ మొ.గాగలవాళ్ళ అనుమానాలే కాదు జరగబోయేది అదే. SC, ST reserved స్థానాలలో వాళ్ళకనుకూలురకు నిలబెట్టి గెలిపించుకుంటున్నారు పెద్దవారు. సర్పంచ్ లుగా, MPTC, ZPTC స్థానాలలో వున్నవారు వాళ్ళింటి పాలేల్లో, లేక చదువురానివారో వాళ్ళ మాటవినేవారో వుంటున్నారు. అలాగే ఇది భార్యల (నాయకుల) రాజ్యంగా మారుతుంది. ఎక్కడో కొంత మార్పువున్నా అది ఒక శాతమై వుంటుంది.
స్త్రీ స్వేచ్చ గురించి ఇప్పటికి అందరిలో వున్న అభిప్రాయాలు అసంపూర్ణం. మనకు ముందుగా మనం ఒకే సంతానం అన్న దృక్పధమే కొరవడి వున్న స్థితినుండి ఇంకా బయటపడలేదు. ఉద్యోగం సంపాదన, పిల్లల కార్పొరేట్ చదువుల నిమిత్తం తప్పక చేయిస్తున్నాం. ఆర్థిక స్వేచ్చ సంపాదిస్తున్న స్త్రీలలో కూడా చాలామందికి లేదు. 1వ తారీఖునాడు ఆఫీసుకొచ్చి భార్య జీతమందుకునే వాళ్ళున్నారు. వాళ్ళ ATM card లుకూడా వీళ్ళ దగ్గరే వుంటాయి. elite section లో వున్న అవలక్షణాలే స్త్రీ స్వేచ్చగా భావించి దానిని వ్యతిరేకించేవారు ఎక్కువయ్యారు. చలం అన్న మాటలు ఇప్పటికీ అక్షర సత్యాలే.వాళ్ళకీ మెదడు, శరీరం వున్న విషయం గుర్తించని స్థితిలోనే వున్నాం. మార్పు కొంత వున్నా అది మానసికంగా పూర్తిగా అంగీకరించే స్థితికి చేరుకోలేదు. అయినా పయనం అభివృద్ధి వైపే సాగుతుందని ఆశిద్దాం.

సామాన్యుడు said...

నేనిక్కడ మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన మరుక్షణమే రాసాను చూడగలరు..నిఝంగా యిది మహిళలకు మోక్షమా..http://saamaanyudu.wordpress.com/2010/03/09/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9D%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B3%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D/

ఆ.సౌమ్య said...

నేను పైన రాసిన పోస్ట్ ని తప్పుగా అర్థం చేసుకుని, కొందరు మిత్రులు నన్ను అడిగిన ప్రశ్న కి సమాధానం ఇక్కడ రాస్తున్నాను.
నేను "స్లీవ్ లెస్స్ జాకెట్లు, హై హీల్సు" అని రంగనాయకమ్మగారిని quote చేయడానికి కారణం నాకు వాటి మీద ఉండే ఏహ్యభావం కాదు. కాని మనసులో జాఢ్యాన్ని తరమకుండా ఊరికే సోకులు పోయేవాళ్ల గురించి మాత్రమే చెప్పాను. నిజమైన ఆదర్శ భావాలు ఉండి స్లీవ్ లెస్స్ జాకెట్లు, హై హీల్సు వేసుకున్న వాళ్లపై నాకు ఎటువంటి దురభిప్రాయము లేదు. తప్పు అని కూడా చెప్పను. గ్రహించగలరు.

Anonymous said...

సౌమ్యగారూ , మహిళా రిజర్వేషణ్ల పైన మీరు వ్రాసిన ఈ టపా చాలా బాగుంది. ఇవాళ్టి రోజున కార్యాలయాల్లో స్త్రీ-పురుష నిష్పత్తి కాస్త ఆరోగ్యకరం గానే ఉంది. మున్ముందు ఇది ఇంకా పెరుగుతుంది కూడా,అది కూడా మన దేశానికి దేశ వ్యవస్థలకు చాలా మంచిది.

మీరన్నట్టు ఇది రాజకీయ నాయకుల భార్యల మరియు కుటుంబ సభ్యుల (కూతుళ్ళ,కోడళ్ళ )సంక్షేమ పధకం గా మారొచ్చు.కానీ మనం మంచి వైపే చూద్దాం,ఏదో ఒకరకం గా మహిళా ప్రాతినిథ్యం పెరుగుతుందిగా అంత మందిలో అర్హులైన వాళ్ళు కనీసం ఒక 20% ఉన్నా అది శుభసూచకమే కదా.

లోక్ సభ లో ఇదింకా ఆమోదం పొందలేదనుకోండి ,అది కూడా జరగాలని అశిద్దాం.

ఒకటండీ ఈ రిజర్వేషణ్లు వాడుకొని ("A.P. local bodies elections lO women have 50% reservation ")గెలిచే మహిళామణుల మీద ఒక బాధ్యత ఉంటుంది వారు చేతనైనంత వరకు మిగతామహిళలు రాజకీయ ప్రవేశం చేసి తమకంటూ ఒక స్థానం సంపాదించుకొనేలా చొరవ తీసుకోవాలి. మనదేశంలో ఒక ఇబ్బంది ఉంది ,ఒక పధకం వలన గాని ,ఒక వ్యవస్థ వలన గాని ఉపకారం పొందాక ఆ వ్యక్తులు(a majority of them) తమ స్వార్థాలే చూసుకుంటారు.తమ పిల్లల పిల్లల పిల్లలు వరకు ఆ రిజర్వేషణ్లు ఉండాలని కోరుకుంటారు ఇటు వంటి రిజర్వేషణ్లు వాడుకునే మహిళలలో 10% మందైనా వచ్చే దఫా మేము జనరల్ కేటగిరీ లో పోటీచేస్తాం ఈ అవకాశాన్ని మరొక మహిళ కు ఇస్తాం అని అనుకుంటే .జనరల్ కేటగిరీ లో పోటీ చేసినా గెలిచే స్థాయి కి ఈ ఐదేళ్ళలో ఎదుగుతామని ముందుకెళితే 20 యేళ్ళలో దేశం యొక్క దశ-దిశ మారి మరో నవసమాజ స్థాపన జరుగుతుంది.

ఆ.సౌమ్య said...

@ సుబ్రహ్మణ్యం గారూ
మీరు చెప్పినది చాలా కరక్టు...సీటు పొందిన మహిళలు నేను చెప్పినట్టు ఉన్నత తరగతి లోకి చేరిపోయి మిగతావారి రాకకు ఆటంకమవుతున్నారు. ఎప్పటికైనా ఈ అడ్డులు తొలుగుతాయని ఆశిద్దాం.
ధన్యవాదములు!