StatCounter code

Tuesday, April 6, 2010

దేవుని రూపం !

దేవుణ్ణి నమ్ముతావా అని ఒక స్నేహితుడు అడిగిన ప్రశ్నకి నా సమాధానం:

"ఈ ప్రపంచలో ఏదో ఒక శక్తి ఉంది అని నేను నమ్ముతున్నాను. దానికి ఒక ప్రత్యేక రూపమిచ్చి ఆ రూపం కోసం గొడవపడను. ఆ శక్తి ఈ కొట్లాటలకు, నమ్మకాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు అతీతమైనది. అది నాకు ప్రాణాన్నిచ్చింది. అంతకుమించి ఇంకేం కాదు. అది నన్ను ముందుకు నడిపించదు, చావకుండా ఆపదు. నా స్వశక్తితోనే నేను ముందుకు సాగాలి. మార్గంలో వచ్చే అవాంతరాలను నేనే ఎదుర్కోవాలి. నా శరీరంలో అవయవాలకు చేవ తగ్గగానే నేను నశించిపోతాను. అంతే. ఆ శక్తి ఏమిటి, ఎక్కడనుండి వచ్చింది, దానికి మూలమేమిటి అన్న దానిపై ఈనాటికి పరిశోధన జరుగుతూనే ఉంది. సైన్సు దాన్ని “ఇది” అని నిరూపించేవరకు దానికి నేను రూపమివ్వను. ఒకవేళ దాన్ని సైన్సు నిరూపించలేకపోతే అందరు దాని రూపం ఒకటే అని నమ్మేవరకు నేను దానికి రూపమివ్వను. ఒకవేళ అలాంటి శక్తే ఉంటే అది ప్రపంచం మొత్తానికి ఒకే విధంగా కనిపించాలి. అలా కనిపించేవరకు దానికి నేను ఏ రూపు ఇచ్చుకోలేను. శక్తికి వివిధ రూపాలనివ్వడమే ఈ రాగద్వేషాలకి ప్రధాన కారణం. దానికి నేను లోను కాను, కాలేను."





47 comments:

Anonymous said...

సౌమ్య సమాధానం విని శవం లోని భేతాళుడు అక్కడ నుంచి మౌనంగా నిష్క్రమించాడు

Anonymous said...

wordpress home page లా బ్లాగర్లో ఏమి లేదాండీ?

Srujana Ramanujan said...

చక్కగా చెప్పారు. ఇలాంటి వాటికి వ్యాఖ్యలు కూడా రావండీ ఇక్కడ :(

ఆ.సౌమ్య said...

అఙ్ఞాత గారు, మళ్ళీ భేతాళుడు ఎప్పుడు నిద్రలేస్తాడండీ, నన్ను ఇంకో ప్రశ్న వేసి మళ్ళీ నా సమాధానం వినాలి కదా :)

ఆ.సౌమ్య said...

@కృష్ణ గారూ,
బ్లాగరులో హోంపేజ్ అంటూ ఏమీ లేదు.
www.blogspot.com
www.blogger.com
కి వెళ్ళి జీమైల్ a/c తో log-in అవ్వొచ్చు

ఆ.సౌమ్య said...

@సృజన
భలేవారే, ఇలాంటివాటికి అస్సలు కామెంట్లు రానేరావు. ఏదో మీలాంటి అభిమానం ఉన్నవాళ్ళు తప్ప వేరేవాళ్ళు తొంగి చూడరు కూడా :)

వేణూశ్రీకాంత్ said...

ఆలోచన బాగుంది :-) కానీ చదవగానే వచ్చిన మొదటి ఆలోచన, నువ్విలా ఉంటేనే నేను నువ్వున్నావని నమ్ముతాను లేదంటే నీకు నాకు రాం రాం అని గొడవ పెట్టుకున్నట్లు అనిపించింది :-)

ఆ.సౌమ్య said...

@ వేణూ శ్రీకాంత్
ఇందులో తగవుకేమీ లేదండీ. దేవుని రూపం అలాగే నేను చెప్పినట్టుగానే ఉంటుంది. ఒకవేళ అలా లేదు అని నిరూపితమయితే నేను నిజంగనే రాం రాం (మగవాడయితే), సీత సీతా (ఆడవాళ్లయితే) అనేస్తా :)

vivek said...

3 yrs back nenu mimmalni idhe qustn adiginappudu...inchu minchu ilanti answer ee chepparu...appatiki ippatiki meeru ichina samaadhaanam lo spastatha ekkuva undi....:)...

devudu,dayyam,..me abhiprayam,..veeti sangathi ela unna..okkati matram nerchukunnanu...nammina siddhanthanni balaparchadam!!

edo cheptham ankunnanu,..edo raasinattu unna..nenu cheppalankundi artham ayindhi ankuntanu!!!

ఆ.సౌమ్య said...

@vivek
నువ్వు చెప్పింది అర్థమయిందిలే...నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండకపోతే నమ్మడమెందుకు. కాబట్టి ఇంకో మూడేళ్ళ తరువాత నన్ను, నువ్వు ఈ ప్రశ్న అడిగినా ఇదే చెప్తాను కాకపోతే ఇంకాస్త ఎక్కువ clarity వస్తుందేమో అప్పటికి :)

ATOZORGANICS RAAVIRAMANA said...

హిందూ మతంలో దేవుని రూపం ఆదైవం లో నిక్షిప్తమైన శక్తి లక్షణానికి ప్రతీక ఈ శక్తి ఏమిటనేది ఇప్పటికీ సైన్సుకు అంతుచిక్కని రహస్యమే అంగీకరిస్తారా

RAMBABU said...

Your friend means Only energy exits. Exactly, but physics given names to that energy and history, philosophy/ers has given shapes to that energy. Those who knows Science believes their energy and those with less awareness of science believes themselves and a pictorial form of energy

Now u decides which one is correct

ఆ.సౌమ్య said...

@space effect
శక్తి ఉందని నేనెప్పుడో అంగీకరించాను కదండీ, కానీ అది హింద్దు మతలో ఉంది లేదా వేరే ఏదో మతంలో ఉంది అన్నదే నేను నమ్మను. శక్తి అనేది ఉంటే అన్ని మతలలో ఒక్కటిగానే ఉండాలి, అందరికి ఒక్కలాగే కనిపించాలి.

ఆ.సౌమ్య said...

@RAMBABU
i am clear about my thoughts, i don't have to decide again on it. i
definitely don't believe in pictorial form of energy irrespective of my knowledge in science.

I agree with my friend (i don't know who he/she is. since you said "friend" i am also referring him/her in the same manner)in existence of energy.

హరి said...

మీరు శక్తిని నమ్ముతున్నారు. మీరు ఆ శక్తి నుండి ప్రతిఫలం ఏమి ఆశించడం లేదు. ఆ శక్తి ప్రతిగా మీకు ఏమైనా ఇస్తుందన్ననమ్మకం కూడా మీకున్నట్టు కనిపించడం లేదు. ఇదే నాస్తిక వాదం.

ఆ.సౌమ్య said...

@ హరి గారూ,
అవునండీ నేనేమీ ఆశించట్లేదు, ఆశించినా ఇస్తుందన్న నమ్మకం కూడా నాలో ఎప్పుడూ కలగలేదు. ఇది ఏ వాదమో నాకు తెలీదు. ఒకవేళ ఇదే నాస్తికవాదమయితే నేను నాస్తికురాలినే.

ATOZORGANICS RAAVIRAMANA said...

సౌమ్యగారూ శక్తి అనేది హిందూ మతం లో మాత్రమే వున్నదని నేను చెప్పలేదు వెరే మతాలలో లేదనీ చెప్పడం లేదు కనబడటం అనే విషయమై కనిపిస్తే అది దైవశక్తి ఎందుకౌతుంది ఈ శక్తినే గాడ్సెల్స్ అని సైంటిస్టులు పరిశోధన చేస్తున్నారు ఈ గాడ్ సెల్స్ ను లక్షల సంవత్సరముల క్రితం గ్రంధముల మరియు విగ్రహముల రూపంలో తరువాతి తరాలవారికి అందుబాటులో వుండేటట్లు మన పూర్వీకులు సాంప్రదాయాలు కట్టుబాట్లు రూపంలో అందించిన అపురూపమైన కానుక

ఆ.సౌమ్య said...

@ Space effect
ఆ విగ్రహాల వలన, గ్రంధాల వలనే కదండీ అన్ని రకాల గొడవలును. శక్తి అనేది ప్రపంచమంతటికి ఒక్కటే అయినప్పుడు అన్ని రకాల రూపాలెందుకు, ఇన్ని తేడాలెందుకు? ఆ కానుకేదో అపురూపమని మీరనుకుంటున్నారు. ఆ కానుక వల్ల చాలా గొడవలని నేననుకుంటున్నాను.

సైంటిస్టులను పరిశోధన చెయ్యనివ్వనీండి, ఏమి చెప్తారో చెప్పనీండి. ముందే చెప్పాను కదండీ సైన్సు నిరూపించలకపోతే శక్తి అందరికి ఒకలాగే కనిపించాలని.

నేను said...

sakti nundi emi aasinchanu ani swa"sakti" nundi edo aasistunnatlunnaru :-)

ఆ.సౌమ్య said...

@Badri
of course స్వశక్తి నా చేతిలో ఉంది. అది నాది. దాన్ని నేను ఎలాగైనా ఉపయోగించుకోగలను. ఏమి ఇస్తుందో ఇవ్వదో తెలియని "శక్తి"కన్నా, నాచేతిలో ఉన్న "స్వశక్తి"ని నమ్ముకోవడంలో నాకెంతో ఆనందం ఉంది.

మంచు said...

ఆ శక్తికి ఒక రూపం ఇస్తే ఎమిటి ప్రాబ్లం ?

ఆ.సౌమ్య said...

@ mamcu pallaki
రూపమివ్వడం వల్లేగా రకరకాల మతాలు, పద్ధతులు,రాజకీయాలు, రాగద్వేషాలు,కొట్లాటలునూ

Nrahamthulla said...

దేవుని రూపం ;
మూడు వాదాలున్నాయి:
* 1. రూపరహితుడు - నిర్గుణ నిరాకారుడు
* 2. రూపరహితుడు - సాగుణ నిరాకారుడు
* 3. సరూపుడు - సాగుణ సాకారుడు
దేవుడు ఆడా?మగా? ;
* అల్లాహ్ లింగరహితుడు
* ఆదిశక్తి స్త్రీ.
* యెహోవా పురుషుడు
వివిధ తెగల, మరియు జానపద నిర్వచనాలు;
* ఆస్ట్రలాయిడ్లు అనే ఆదిమ తెగ వాళ్ళు దేవుడిని "అట్నటు" అంటారు.అంటే "ముడ్డిలేనివాడు","ఎటువంటి అశుద్దాన్నీ విసర్జించని వాడు" అని అర్ధం.
* "చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే ఒక్కడైన ఆ పరమేశ్వరున కు మొక్కి చూడరా హరే హరే " అనే పాట మన పల్లెటూళ్ళ లో ప్రజలు ఎప్పుడో పాడారు.
* ఈ ఈశ్వరుడినే అరబ్బీ భాషలో అల్లాహ్ అంటారు.
వివిధ సందర్భాలలో "దేవుడు" పదం వినియోగం;
* రాయైతేనేమిరా దేవుడు - హాయిగా ఉంటాడు జీవుడు - ఉన్నచోటే గోపురం ఉసురు లేని కాపురం - అన్నీఉన్న మహానుభావుడు-- వేటూరి
* మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - ఆత్రేయ
* దేవుడికేం హాయిగ ఉన్నాడు-ఈ మానవుడే బాధలుపడుతున్నాడు - శ్రీశ్రీ
* పిల్లలూ దేవుడూ చల్లనివారే
* రాయిరా దేవుడు - తాగితే ఊగడు - మైలవరపు గోపి
* ఎంతో రసికుడు దేవుడు
* మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు - దాశరధి

ఆ.సౌమ్య said...

@ Nrahamthulla గారూ
మీరిచ్చిన సమాచారం బావుంది. ఇని రూపాలున్నయి కాబట్టే నాకు ఏరూపము వద్దనుకుంటున్నాను. రూపాలెక్కువవుతున్నకొద్దీ కోరికలు, ఆశలు, అహంభావాలు, అహంకారలు ఎక్కువవుతూ ఉంటాయి (మనుషులకి)కాబట్టే ఏ రూపము వద్దు. ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు అనే నమ్మకం నాకెప్పుడూ కలగలేదు. కాబట్టి పేరెందుకు, రూపమెందుకు?

మంచు said...

మతాలు :: మతాలు ఎప్పుడూ మంచే చెప్తాయి... ఒక మతం లొ వుంటూ ఆ మతం పేరు చెప్పుకుంటూ ఎవరయినా తప్పులు చేస్తే..అది మతం తప్పు కాదు.. ఆ వ్యక్తి తప్పు.. కసబ్ చేసిన పనికి ముస్లిం అందరూ అలానే వుంటారు అనుకొవడం కరెక్ట్ కాదు..

పద్దతులు :: పైన చెప్పినట్టు మతాలు ఎప్పుడూ మంచి పద్దతుల్నే ఫాలొ అవమని చెబుతాయ్.. పద్దతులు లేకుండా జీవించడం అంటే ... ఎవరిస్టం వారిది.. కానీ యే మతం తప్పుడు పద్దతులు నేర్పదు

రాజకీయాలు: దీనికి మతం ఒక్కటే కాదు.. ఈ విషయన్నయినా కలుషితం చేసే శక్తి వుంది..

రాగద్వేషాలు & కొట్లాటలు గట్ర గట్ర : హ్మ్మ్ ఆఖరు వంద సంవత్సరాలు తీసుకుందాం.. మొదటి , రెండవ ప్రపంచయుద్దాలు, ఆ తరువాత జరిగిన చిన్న చిన్న యుద్దాలు , జీనొసైడ్స్ (మూకుమ్మడి హత్యలు), హొమిసైడ్స్ (మాములు హత్యలు) .... ఇలా ఒకరిని ఒకరు చంపుకన్న సంఘటనలు అన్నీ పరిశీలిస్తే ఇందులొ ఎంత శాతం మతానికి సంభందించినవి.. మతం పేరు చెప్పి ఎంతమంది చంపుకున్నారు.. రాగద్వేషాలకి మతం ఒక కారణం మాత్రమే.. ప్రపంచ యుద్దాల్లొ, సరిహద్దు గొడవల్లొ కొట్ల మంది చనిపొయారు.. అందువల్ల సరిహద్దులు చెరెపేసి ప్రపంచం అంతా ఒకే దేశం గా వుందామా.. ఒకానొక దేశం లొ కేవలం మనిషి ఎత్తుని బట్టి కూడా రాగద్వేషాలు ఏర్పడ్డాయ్... పొడుగొళ్ళు, పొట్టొళ్ళు వేరు వేరు ముఠాలుగా ఒకరినొకరు నరుక్కున్నారు... ఆఖరికి మన తెలంగాణ విషయం లొ కూడా అప్పటివరకు అన్నదమ్ముల్లా వున్న వారు విడిపొయి కారాలు మిరియాలు నూరుకున్నారు.. సొ రాగద్వేషాలకు మతమే కారణం కాదు... మతం కూడా ఒక కారణం అవ్వొచ్చు అంతే..

మతం - పద్దతుల్లొ ఒక 90% మంచి వుండొచ్చు.. 10% తప్పు వుండొచ్చు.. (ఆ తప్పు కూడా అప్పటి పరిస్తితుల్లొ అదే కరెక్ట్ అయి వుండొచ్చు) ... 90% మంచి ని చూసే వారు అదే ఫాలౌ అవుతారు... 10% చెడు ని చూసినవారు మతం అంటె అదే అనుకుని మిగతా 90% మంచిని దూరం చేసుకుంటారు...

ఉదా : గాంధిజి లోనూ అందరూ చూసిన ఎన్నొ మంచి విషాలతొ పాతు కొన్ని చెడు లక్షణాలు వున్నయి వున్నాయి.. కొంతమంది ఆ కొంత చెడు చూసి ద్వెషించే వారు ఆయన చూపిన చాలా మంచి దారుల్ని వదులుకుంటున్నారు.. ఆయన్నే పూర్తిగా నమ్మి ఆయన నడిచిన మంచి బాటలొ నడవాలనుకున్నవారు .. అతన్నుండి మంచినే తీసుకున్నారు కానీ అతని చెడుని తీసుకోరు.. అతని పేరు చెప్పుకుని ఇప్పుడు కాంగ్రెస్స్ చేసే చెడుకి అసలు అంతే లేదు.. సొ గాంధి గారు కూడా మతం లాంటి వారు.. అతని కొంత చెడుని చూసి అతన్ని ద్వెషిస్తారా.. అతని పేరు చెప్పుకుని ప్రస్తుత కాంగ్రెస్స్ చెసే వెధవ పనుల్ని చూసి అయనా అంతే అని అతన్ని అసహ్యించుకుంటారా , లేక అతని చూపిన మంచి దారి చూసి అది ఫాలొ అవుదామనుకుంటారా అన్నది ఆ వ్యక్తిని బట్టి ఆధారపడి వుంటుంది.. :-)

ఎదయినా ఒకమతం (హిందు , ముస్లిం ఎదయినా ) ని ముందు పూర్తిగా అర్ధం చేసుకుంటే.... దాంట్లొ అసలు ఎం వుందొ తెలుసుకుంటే..అది తప్పొ వొప్పొ నిర్ణయించే అవగాహన వస్తుంది....పూర్తిగా అర్ధం చేసుకొవడం చాలా కస్టం .. అందులోనూ హేవిలీ బైయాస్డ్ అయిన వాళ్ళు అర్ధం చేసుకొవడం ఇంకా కస్టం..

మతాన్ని నమ్మిన సగటు మనిషి మిగతా మతాల వారి మీద ఎంత ద్వేషం చూపిస్తాడొ తెలీదు కానీ ఈ మతం నమ్మని వాళ్ళు మాత్రం నమ్మేవారిని ఎక్కువ కించపరుస్తారు కదా..

మంచు said...

Please see last paragraph of

http://venkatakrishnanaram.wordpress.com/2010/04/05/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%A1%E0%B0%97%E0%B1%8A%E0%B0%A1%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81-%E0%B0%B0%E0%B0%82%E0%B0%A1%E0%B1%80-3/

His explanation was better than mine..

hari said...

nelavanaka cinema lo manchi dialogue untadi, jandhyala gaaru raasindi
" devudane vadu ledane vaadi maata lo nu unnadani anukune vaadi manasu lo nu untadata"

Anonymous said...

ఆధ్యాత్మిక పరిభాషలో దాని పేరు శక్తి కాదు చైతన్యం.
అగోచరమైన ఆ చైతన్యమే పురుషుడు.అదే పరమాత్మ.
నామ,రూపాలకి అతీతమైన ఆ చైతన్యం అందరికీ ఒక్కటే.
మార్పులకి లోనవుతూ నామ,రూపాలతో మనకి గోచరమయ్యేది శక్తి..అదే ప్రకృతి.
శాస్త్రం పరిధి చాలా చిన్నది...చూస్తేగానీ నమ్మని శాస్త్రం భగవంతుడి గురించి
ప్రపంచానికి తెలియజేసేది ఏమీ లేదు.చూసింది చూసినట్టు చెప్పటం తప్ప.
వేదమూ అలాంటి శాస్త్రమే...అందుకే భగవంతుడ్ని గురించి వర్ణించి వర్ణించి వేదాలు
అలసిపోయాయి అంటారు...అలాంటి వేదాలే దత్తప్రభువు ముందు నాలుగు కుక్కలై
ఆయన పాదాలు నాకుతున్నాయి అంటారు.(శునకం అనేది కేవలం పోలిక)
ఈ శ్లోకం చూడండి :
సప్తాశ్వరధమారూఢం శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం.
ఇది వేల సం II రాసిన శ్లోకం.
భావం:
ఏడు గుఱ్ఱాలు పూనిన రధమెక్కి తెల్లటి పద్మాన్ని ధరించి వస్తున్న సూర్యుడికి నమస్కారం.
అర్ధం పర్ధం లేకుండా వుంది కదూ...అర్ధంకానిది ప్రతిదీ అర్ధం పర్ధం లేకుండానే వుంటుంది.
గుఱ్ఱానికి అర్ధం రంగు, పద్మం అంటే కిరణం ఇప్పుడు అర్ధాన్ని ఆస్వాదించండి.
ఏడు రంగులు కలిసిన తెల్లటి కాంతి కిరణాలతో వెలుగునిస్తున్న సూర్యుడికి నమస్కారం.
మనవాళ్లు కనిపెట్టిన వాటినే మనం మళ్లీ మళ్లీ ఎంతో శ్రమించి కనుగొంటున్నాం.....
భగవంతుడ్ని చేరడానికి దగ్గరి దారి ఒకటుంది...అది శ్రీ గురుచరిత్ర పారాయణ...
భగవంతుడిలో ఐక్యమైన సద్గురువులు శిరిడి సాయి బాబా,రమణ మహర్షి,రామకృష్ణ పరమహంస
లాంటి వారి చరిత్రలు పారాయణ చేస్తూ....వారు ఆచరించి చూపిన ధర్మమార్గాన్ని ఆచరిస్తుంటే వారు తప్పక కరుణిస్తారు.
భగవంతుడి నామస్మరణ కలియుగంలో ఆయన్ని చేరడానికి దగ్గరి దారి అని వేదవ్యాస మహర్షి చెప్పారు.
భగవంతుడు,సద్గురువు వేరు కాదని గురుగీతలో వుంది.

ఆ.సౌమ్య said...

ఆధ్యాత్మికత అన్నది మతానికి అతీతమైనదని నా భావం.
అది శక్తో, చైతన్యమో, ప్రకృతో...లేక దేవుడో ఏదో ఒకటి...మన చేతిలో లేనిది, మనకు సంక్రమించినది. అది ఉన్నదనే ఎరుక ముఖ్యం.

దానికి ఒక రూపం ఇవ్వడం కానీ, ఫలానా విధంగా పూజించడం గానీ నేను చెయ్యను. ఎందుకంటే అదెలా ఉంటుందో నాకు తెలీదు. ఎలా పూజిస్తే అనుగ్రహిస్తుందో నాకు తెలీదు. ఫలానా రూపం, ఫలానా పూజ అనుకోవడం వలనే తంటాలు. కానీ నాకు తెలుసు అది "ఒకటి" ఉందని. దాన్ని ఆమోదించి ముందుకు సాగిపోవడమే తప్ప అతిక్రమించి సాధించగలిగేదేమీ లేదు. ఆ ప్రకృతిని అంగీకరించి, ఆమోదించి శాంతిని పొందడమే ఆధ్యాత్మికత అని నా భావం.

మీ అభిప్రాయములు పంచుకున్నందుకు ధన్యవాదములు.

Anonymous said...

ఆధ్యాత్మికత అనే సముద్రంలో కలిసే నదులే మతాలు.
మీరెలా వున్నా...దానికి ఫర్లేదు...అదిప్పుడు మన దగ్గరకొచ్చి..
ఇలా చెయ్యి అనదు...ఫలానాలా చేస్తా అంటే ఒద్దు అనదు.
ఏదైనా చేస్తేనే ఏదో ఒకటి పొందగలం అని మాత్రం చెప్పిందది.
ఏం చెయ్యలా అనేది మన ఇష్టానికే ఒదిలింది....

ఆ.సౌమ్య said...

అలా అన్నారు బావుంది. నా వృత్తిని నేను సక్రమంగా నిర్వర్తిస్తూ, నా బాధ్యతలు సరి అయిన సమయంలో నిర్వర్తిస్తూ ఇతరులని బాధపెట్టకుండా ఉండేవరకు నా శాంతి నాకు దూరమవ్వదు. అటువంటి శాంతిని నాతో ఎల్లప్పుడూ ఉంచుకోవడమే ఆధ్యాత్మిక సాధన.....అది చేస్తే చాలు కదా ఈ జీవితానికి.

Anonymous said...

చాలా (enough,more)

ఆ.సౌమ్య said...

@ ఆదిత్య గారూ
thank you :)

Anonymous said...

చాలాని పూర్తి చెయ్యకుండానే...పంపించాను
అలా అనడంలో తెలుకున్నది చాలా? చాలా ఉందా?
అనే అర్ధంలో వాడాను.....

ఆ.సౌమ్య said...

@ఆదిత్యగారు
ఓహ్ అలా అన్నారా!
నేను చాలు కదా అన్నానుగా, దానికి సమాధానంగా "చాలా" (అంటే అదే చాలా ఎక్కువ) అని అన్నారనుకున్నా.

హ్మ్ చాలా అంటే ఇప్పటికిదే తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవలసినది చాలా ఉంది, తెలుసుకోవాలనే నిరంతర ప్రయత్నం మాత్రం వీడలేదు.

ఆ.సౌమ్య said...

@ఆదిత్యగారు
మీరిలా నా బ్లాగంతా చదివి కామెంట్లు రాయడం నాకు పట్టరాని ఆనందంగా ఉంది....కృతజ్ఞురాలిని :)

Anonymous said...

విషయం ఏంటంటే...
నాకూ అంతే ఆసక్తిగా వుంది.

ఆ.సౌమ్య said...

@ ఆదిత్యగారూ
నా అదృష్టం...Thank you so much! :)

Anonymous said...

అయ్యో..అంత మాటే...
ఇంతకీ మీరు దేశరాజధానిలో ఏంచేస్తున్నట్టు?
తెలుగు సినిమాలక్కడ నడుస్తాయా?

ఆ.సౌమ్య said...

@ ఆదిత్య గారూ
నేను దేశ రాజధానిలో దేశాన్ని ఉద్దారించడం కోసం పాటుపడుతున్నాను...అంటే రిసేర్చి చేస్తున్నానన్నమాట. :D.
నేనొక think Tank లో పని చేస్తున్నానండీ.

తెలుగు సినిమాలు ఎక్కడైనా నడుస్తాయండీ....వాటికి కాళ్ళిచ్చేదే మనం కదా. ఇక్కడా ఒకటీ అరా నడుస్తూ ఉంటాయి. :P

Anonymous said...

మీరు పరిశోధకురాలన్నమాట..అర్ధశాస్త్రం కదా.
ఆ చెఱువులో ఓ చేపన్నమాట...మత్స్యావతారం.
తెలుగు సంఘాలున్నాయట కదా..
వాటి పనేంటి?....

ఆ.సౌమ్య said...

మరే, ఆ చెరువులో చేపనే....తిమింగలం అవుదామని ప్రయత్నం.

తెలుగు సంఘాలున్నాయి కానీ వాటి దరిదాపులకి కూడా పోలేదు నేనింతవరకూ, ఏదో ఆంధ్ర భవన్ లో అప్పుడప్పుడూ పుష్టిగా లాగించడం తప్ప.

Anonymous said...

తిమింగళమే... భారీ కదా....అసలే భోజనప్రియురాలిలా ఉన్నారు.
పోనీ..మత్స్యకన్య...ఇది బాగుంటుంది కదా..

ఆ.సౌమ్య said...

ఆ పరిశోధనలో ఆ మాత్రం భారీకాయం లేకపోతే మాట నెగ్గదండీ, అందుకే ఆ ప్రయత్నం.

మరే భోజనప్రియురాలినే, వేస్తే పెద్ద చేపకే వెయ్యాలి గాలం..అందుకే తిమింగలానికి వేసా. :D

సుజాత వేల్పూరి said...

సౌమ్యా, ఇదెప్పుడు రాశావు? మొదటి కామెంట్ భలే నవ్వించింది నన్ను!

ఎనీ వే, చాలా బాగా రాశావు!కామెంట్లు రావని ఎవరో రాశారు గానీ మంచి చర్చ జరిగింది!

Anonymous said...

బాగు...బాగు..
మీరు గొప్ప స్థాయికి రావాలి.

ఆ.సౌమ్య said...

@ ఆదిత్య గారూ
ధన్యవాదములు.

@సుజాత గారు
ఇది ఎప్పుడో ఏప్రిల్ లో రాసానండీ. అప్పట్లో మీకు నా బ్లాగుతో అంత ఎక్కువ పరిచయం ఉన్నట్టు లేదు. :)