StatCounter code

Monday, June 14, 2010

ఆ వ్యాఖ్యలు నావి కావు

ప్రియమైన బ్లాగరులందరికీ,
నా ప్రొఫైల్ వాడుకుని, నా పేరుతో ఎవరో ఫేక్ కామెంట్లు రాస్తున్నారు. ఇది చాలా బ్లాగులలో నేను గమనించాను. ఎవరికి నా మీద ఎటువంటి కక్షలున్నయో నాకు తెలీదు. అసలిదంతా ఎందుకు చేస్తున్నారో కూడా నాకు తెలీదు. తెలిసి నేనెవ్వరికి ఎటువంటి హాని తలపెట్టలేదు. తెలియక కూడా నేను ఎవ్వరినీ హర్ట్ చెయ్యలేదు. మీరు నా పేరు మీద ఎటువంటు అసభ్యకరమైన వ్యాఖ్యలు చూసినా అవి నేను రాసినవి కావు అని గమనించగలరు. నేను ఇప్పటి వరకు ఎవరి బ్లాగులోనూ అసభ్యకరమైన కామెంట్లు గానీ, ఎవరినీ కించపరుస్తున్నట్టుగానీ, బూతులుగానూ రాయలేదు, రాయను కూడా.

నా పేరు మీద ఎటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చూసినా వాటిని వెంటనే డిలీట్ చేయవలసిందిగా బ్లాగరులందరికి హృదయపూర్వక మనవి.

ధన్యవాదములతో
సౌమ్య










38 comments:

Anonymous said...

ఇందింకా బాగుంది పేరు మీద పేటెంట్ ఉందా , భూప్రపంచం లో మీకున్న పేరు ఎవరికీ ఉండకూడదా ఏంటి . మీ ప్రొఫైల్ వాడుకోవటం ఏమిటి ,భ రా రే బ్లాగులో ఆ కామెంట్ డిలీట్ చేసింది నేనే వేరే దగ్గర పేస్టు చేయబోయి ఇక్కడ చేసాను . లేకపోతే రంగనాయకమ్మ గారి మీద రాసిన చెత్త ఎవరో ఎత్తి చూపిస్తున్నారని ఈ తెలివితేటలు వాడుతునట్లు ఉంది . ఇక ఇప్పుడు మా అమ్మ బాబుల్ని ఆడిపోసుకొవలేమో ఈ పేరు పెట్టినందుకు .
--సౌమ్య

ఆ.సౌమ్య said...

@ ఇంకో సౌమ్య
అయ్యో అంతమాటెందుకండీ. పేరు మీద నాకు ఏ పేటెంటు లేదు.
కానీ ఈ బ్లాగ్లోకంలో ఇప్పటికి అందరికీ తెలిసిన సౌమ్యలు ఇద్దరే. ఒకరు "Sowmya writes" సౌమ్య, ఇంకొకటి నేను. వేరే బ్లాగుల్లో కూడా నా ప్రొఫైల్ వాడి ఎవరో నా పేరు మీద అసభ్యకరమైన కామెంట్లు రాసారు. ఇదీ అలాగేనేమో అనుకుని స్పందించాను. హర్ట్ చేసి ఉంటే క్షమించండి.

లేదా ఒకవేళ ఈ ఇంకో సౌమ్య పేరుతో కామెంట్లు రాస్తున్నవారు....నాతో ఆడుకోవాలని,నన్ను హేళన చెయ్యాలని ఇలా నా పేరు పెట్టుకుని ఈ విధంగా నాకు జవాబిస్తూ నేను దానికి సమాధానమిస్తూ ఉంటే చూసి నవ్వుకునేవాళ్ళయితే....మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పడమే నా ఉద్దేశ్యం.

Anonymous said...

>>తెలిసి నేనెవ్వరికి ఎటువంటి హాని తలపెట్టలేదు. తెలియక కూడా నేను ఎవ్వరినీ హర్ట్ చెయ్యలేదు.

మీ onlyforpraveen బ్లాగు చూసి ప్రవీణ్ బాధపడకుండా ఉంటాడా? అతని రాతలు బాగుండవు. నేనూ ఒప్పుకుంటాను... నిజంగా మీరు అతన్ని హర్ట్ చేయడంలేదా? మిమ్మల్నేదో అన్నానని కాకుండా ఒకసారి ఆలోచించడి.

తార said...

ayyo antha raise avatam yendukandi, maku evareki inko soumya gaaru vunnaru ani teliyadu kada.

anduloonu, ila fake profiles kotha kaadu.

ఆ.సౌమ్య said...

@ Mr. Anonymous.
ప్ర.పీ.స.స పెట్టకముందు ఏం జరిగిందో, ఎందుకు ప్ర.పీ.స.స పెట్టబడిందో, నాకు ప్రవీణ్ కి ఏం వాగ్యుద్ధాలు నడిచాయో మీకెమైనా తెలుసా? నాకు ప్రవీణ్ కేకాదు. ప్రవీణ్ కి ఇంకా కొదరు బ్లాగర్లకి మధ్యన ఏం నడిచిందో, ఎంతమంది తన వల్ల హర్ట్ అయ్యారో మీకేమైనా తెలుసా? అతని రాతలు బాగుండకపోవడం ఒక్కటే ప్ర.పీ.స.స పెట్టడానికి కారణం కాదు, గ్రహించగలరు.ఇవన్నీ తెలియకుండా ఎందుకండీ తలదూర్చడం.

యుద్ధం ప్రకటించినవాడిని ఎదుర్కోవడం వీరత్వమే అవుతుందిగానీ హింస అవ్వదు. గ్రహించగలరు. అయినా ఇవన్ని ఇప్పుడు నేను ప్రూవ్ చెయ్యల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న అందరికి మార్తాండ గురించి, మా గురించి అంతా తెలుసు.

ఆ.సౌమ్య said...

@ తారా
రైజ్ అవ్వడం కాదు. నా జాగ్రత్త లో నేనుండాలి కదా, అందుకే రాసాను.

తార said...

సౌమ్యగారు నా కామెంట్ మిమ్మని ఉద్దేశించి కాదు Anon కామెంట్ పెట్టిన సౌమ్య గారిని ఉద్దేశించి.

ఆ.సౌమ్య said...

ఓహ్ అవునా, అలా అయితే వాకే!

Anonymous said...

తార గారు అంటే నేను భూతులు రాస్తునట్లు ప్రచారం చేస్తుంటే నోరు మూసుకుని కూసువాలేమో సరేలెండి మూసుకుంటున్న , బాగా బుద్ధి చెప్పారు .

Ram Krish Reddy Kotla said...

సౌమ్య గారు నాకొక డౌట్ వచ్చింది .. సౌమ్య ప్రొఫైల్ పేరు తో వ్రాసిన ఆవిడ కామెంట్ డెలీట్ చెయ్యబడింది కదా భా.రా.రే గారి బ్లాగ్ లో.. అది తనే డిలీట్ చేసింది అని ఆమె(అజ్ఞాత) కామెంట్ కూడా రాసింది...అలా రాసిన కామెంట్ అజ్ఞాత రూపంలో రాయడం ఎందుకు..ఇంతక ముందు రాసిన ప్రొఫైల్ తోనే రాయోచ్చుకడా... పైగా ఆ కామెంట్ డిలీట్ చేసింది బ్లాగు రచయితా భా.రా.రే గారు... సో దీన్ని బట్టి నాకు ఏం అర్థం అయిందంటే, మొదటగా కామెంట్ రాసిన సౌమ్య మాములుగానే రాసింది కానీ మిమ్మల్ని అనుకరిస్తూ రాయలేదు, దీనికి మీ స్పందన చూసి ఎవరో ఆటపట్టించాలని అలా అజ్ఞాత కామెంట్ మీ మీదకి వదిలి క్రింద సౌమ్య అని రాసారు అని నా డౌట్ .. సో మొదట రాసిన సౌమ్య, తరువాత అజ్ఞాత రూపంలో సౌమ్య అని రాసిన వారు వేరు వేరు అని మనకు అర్థం అవుతుంది ....ఏమంటారు??

ఆ.సౌమ్య said...

@ Anonymous,
మీరు నిజంగా సౌమ్య అయితే మిమ్మల్ని తారగారు ఏమీ అనలేదండీ. కానీ ఇలాంటివి ఇంతకుముదు జరిగాయి కాబట్టే ఇలా స్పందించాల్సి వస్తోంది. పైగా మీరు ఆ కామెంటుని తొలగించారన్నారు. కానీ అది తొలగించినది బ్లాగు రచయిత అని తెలుస్తూనే ఉందిగా.

పైగా అంత రోషం ఉన్నవాళ్లు ఇప్పుడెందుకు అఙ్ఞాత పేరుతో రాస్తున్నారు. ఇక్కడ కూడా మీ అసలైన పేరుని వాడొచ్చుగా

ఆ.సౌమ్య said...

@కిషన్
exactly, మీరు అనుకున్నట్టుగానే నాకూ అనుమానం వచ్చింది అందుకేగా భ.రా.రే బ్లాగులో రెండవ పారా రాసాను.

"లేదా ఒకవేళ ఈ ఇంకో సౌమ్య పేరుతో కామెంట్లు రాస్తున్నవారు....నాతో ఆడుకోవాలని,నన్ను హేళన చెయ్యాలని ఇలా నా పేరు పెట్టుకుని ఈ విధంగా నాకు జవాబిస్తూ నేను దానికి సమాధానమిస్తూ ఉంటే చూసి నవ్వుకునేవాళ్ళయితే....మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి."

ఒకవేళ వీరిద్దరూ వేరే అయితే ఆ రెండోవారికి నా సమాధానం ఒక్కటే..."మీ ఇష్టం వచ్చినట్లు ఏడవండి".

Anonymous said...

Mind your words first, I know what I am . If you don't know something then keep silent or check with somebody who knows it. The comment was deleted by me, that is displaying the message due to some problem with some blogger template check with Mr. Reddy for proper info.

Mr. Kishan Reddy for also the same answer, I didn't understand why your are interfering here unnecessarily with half knowledge.
I stopped to use the same ID after looking at your post.

krishna said...

సౌమ్య గారు,
బ్లాగరులో మనం వేరెవారి బ్లాగులో రాసిన కామెంట్లు డిలీటు చేసుకునే అవకాశం వుంది అనుకుంటాను. ఒకే పేరు వున్నావారు కామెంటు చేస్తె ఇబ్బందే. కాకపొతే మీ ప్రొఫైల్ వాడుకొవడం ఎలా కుదురుతుంది ? వారి ఐకాన్ మీద క్లిక్ చేస్తె మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుందా ? ఏమన్నా కంఫ్యూజన్ వుందేమొ చూసుకోండి, కుట్ర అవ్వకూడదని ఆశిస్తాను.

ఆ.సౌమ్య said...

@ Anonymous
మీరెందుకు ఇంత కోప్పడుతున్నరో నాకర్థం కావట్లేదు.
మీ పేరు నిజంగా సౌమ్య అయి ఉంటే, మేము చేసిన ఏ కామెంట్లు మీకు వర్తించవు. మీకా విషయం నేను ముందే చెప్పాను. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ అని కూడా చెప్పాను. భ.రా.రే బ్లాగులోనే కాదు ఇంకో బ్లాగులో కూడా నా పేరు మీద కామెంట్లు చూసాను. ఇంతకుముందు కూడా ఇలాగే నా ప్రొఫైల్ ని వాడుకుని కొందరు వెధవ కూతలు కూసారు. ఇప్పుడు మళ్ళీ నా పేరుతో వ్యాఖ్యలు చూసేసరికి ఇవన్నీ రాయాల్సి వచ్చింది. మిమ్మల్ని ఇక్కడ ఎవరూ తిట్టలేదు, అపార్థం చేసుకోలేదు మీ పేరు నిజంగానే సౌమ్య అయితే. కాబట్టి కూల్ గా ఉందండి. మీ పేరు సౌమ్యే అయితే, మీరు నిజాయితీగానే ఆ వ్యాఖ్యలు చేస్తే ఈ కామెంట్లు మిమ్మల్ని కాదని మరోసారి చెప్తున్నాను.

we will mind our own words, you don't have to bother about it. keep yourself cool my dear!

ఆ.సౌమ్య said...

@ కృష్ణా
ప్రొఫైల్ వాడుకోవడంలాంటివి చిన్నచితక పనులు. నేను కూడా చెయ్యగలను. మీ ప్రొఫైల్ వాడుకుని మీ పేరుతో కామెంటగలను. దాని మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది కూడా. ఇలా చాలమందికి ఇదివరలో జరిగాయి.అవన్నీ జుజూపి.

కుట్రలైనా, కురుక్షేత్రాలైనా నే చెప్పేది ఒకటే...."మీఇష్టం వచ్చిన చావు మీరు చావండి"

నేను said...

ఎమిటి భారతవీరకుమారి, ప్ర పీ స స సెగట్రీ దగ్గరా ఈ పిల్ల చేస్టలు. ఏమి ఈ కండకావరము.

ఎవరక్కడ urgent గ తీగలవీరుడు ప్ర నా అన్నకి చెప్పి ఆ IP address లు కనుక్కోండి. వాళ్ళ సంగతేంటో తేలుద్దాం.

:-)

ఆ.సౌమ్య said...

@ Badri
అద్దీ లెక్క, అలా దులపండి బద్రిగారు. మన అన్న సంగతి వీళ్లకి తెలవదల్లే ఉంది. అన్నని పిలవండి చెప్తాను. నిముషంలో పనయిపోతుంది :)

Ram Krish Reddy Kotla said...

@ Anonymous (alias Soumya) : I know when to interfere, and you don't need to tell me about that. I have only expressed my doubt, why you (if u were really another soumya) didnt give the comment with your profile instead of anonymous and for ur info, am not here with half-baked knowledge.

Well, what do u you mean by "stopped to use the same ID after looking at your post" ??..which post of mine are you referring to here?

Anonymous said...

చేతబడి నేర్చుకుందాం - సంస్కృతిని ఉద్దరిద్ధాం http://parnashaala.blogspot.com/2010/06/blog-post_13.html

sowmya said...
హ హ హ కేక!

June 13, 2010 10:41 PM

పై వ్యాఖ్య మీరు రాసిన దా లేక వేరే వారెవరైనా రాశారా?

ఆ.సౌమ్య said...

@Anonymous

ఇది నేను రాసినదే, పర్ణశాలలో మాత్రమే రాసాను.....ఇంకెక్కడా రాయలేదు.

Unknown said...

ayyabaaboy chaala jaruguthunnay telugu blogs lo. this is bad.
i had a desire to write in telugu before, but i think i should stick to english then.

ఆ.సౌమ్య said...

@Anil Kumar
తెలుగు బ్లాగుల్లో ఇంతకన్నా ఎక్కువే జరుగుతున్నాది. కానీ మీరలా తొందరపడి నిర్ణయాలు తీసేసుకోకండి. తెలుగులో రాస్తూ మన తెలుగుని నిలబెట్టుకుందాం, ఏమంటారు? కాకపోతే వచ్చేముందు కాస్త తోలు మందం చేసుకుని రండి. నేను చాలా పచ్చిగా మాట్లాడుతున్నట్టు మీకనిపిస్తున్నా అదే నిజం :)

Ram Krish Reddy Kotla said...

చూడండి అజ్ఞాత అలియాస్ సౌమ్య గారు...మీరు మరీ టూ మచ్ ఇంటలిజంట్ అనేసుకుంటున్నారా? నా బ్లాగ్ లో మీరు కామెంట్ ఇచ్చి మీరే డిలీట్ చేసి - ప్రాక్టికల్ గా చూపించాను అని ఫీల్ అవుతున్నారా...ఇలాంటి తిక్క ప్రాక్టికాల్స్ చాలా చూసా.. First you get the difference between 'This post has been removed by the author' and 'This post has been removed by the blog owner'..first tells that the post has been removed by the one who has written and the latter by the owner of blog. భా.రా.రే గారి బ్లాగ్ లో "ఈ పోస్ట్ బ్లాగ్ రచయిత" డిలీట్ చేసాడు అని ఉంది .. అది చూసి నేను కేవలం నా సందేహం మాత్రమే వివరించాను సౌమ్య గారికి...అంతే గాని మీరు డిలీట్ చెయ్యలేదు అని ఘంటా పథంగా ఏమీ చెప్పలేదు .. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇంతాలా బుజాలు తడుముకోవడం... ఏదో కోపం గా ఓ కామెంట్ విసిరితే మీ సైడ్ వాదన నిజం అయిపోతుందా? అది నిజంగా మీరే డెలీట్ చేసి ఉంటె ...ఫైన్ ...ఓకే .. నిజంగా అపుడు ప్రాబ్లెం సాల్వ్ అయినట్లే... కానీ నేనేమి తిక్క సుప్పోర్టులు చెయ్యలేదు.... First get that better... Why dont u put ur side of evidence in a cool way rather than going for rude manner...
ఈ క్రింది కామెంట్ నా బ్లాగ్ లో ఇంకో సౌమ్య గారు పంపారు :
------------
@కృష్ణారెడ్డి ఈ క్రింది కామెంట్ ఎవరు డిలీట్ చేసారు మీరా ?
----

Sowmya said...
This post has been removed by the author.
June 15, 2010 6:15 AM
----

ఇందుకే చెప్పేది విషయం తెలియకపోతే ఊరుకోవాలి అని . పైగా చెప్పిన తరవాత కూడా తిక్క ప్రశ్నలు , అసలు విషయం తెలియకుండా తిక్క సపోర్ట్లు చేయకండి

---------
this showz everything..well thats it... Its just i expressed doubt and doesnt mean that you imitated some one in the name of anonymous. Well, if u would like to put your comments in anonymous way, its upto you...but that caused confusion here... Anyway, its up to you if u still wanna throw some stones. Thats it from my side. Period.

Unknown said...

.ఇలాంటి తిక్క ప్రాక్టికాల్స్ చాలా చూసా. >> మరే మీకు మండినట్లు మాకు మండదు మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే. మీకెందు అంత దురద ? ఆ విషయమేదో ఆ బ్లాగు ఓనర్ చెప్పే వాళ్ళు కదా ఆయన డిలీట్ చేస్తే. మీకు అంత కోపం వస్తే మీరు పని కట్టుకు రాసిన దానికి ఊరికే మాటలు పడిన నాకెంత రావాలి ?

Fun Counter said...

Namasthe,

Naa peru Phani Madhav Kasturi, 1986-89 Maharaja Model High shcool lo 8th to 10th chadivaanu. appudu ramabhayamma garu maa principal. AJ Sarma mastaru, saraswathi teacher, jayalakshmi teacher maaku teachers. PDMP pantulu garu telugu mastaru. Manda Manikyam garinti pakkana George school compond lo maa illu. 1989-90 Inter Maharaja College lo BIPC konnallu MPC konnallu chadiva. 1986-1989 varaku Music college lo Mridangam - Subbaraya sarma gari daggara nerchukunna. nenu ekkuvaga mimicry programs chesevanni. ippudu ade naa profession ayindi. Nenu Delhi Telugu Academy programs lo kooda chala programs chesanu. My name is Phani Madhav . No. 9849299691 mail id funcounter@gmail.com ...

Thanks and Regards
Phani Madhav Kasturi

ఆ.సౌమ్య said...

అమ్మ తల్లి ఇంకో సౌమ్యా, నీకో దండం. సౌమ్య అని రాసుకుంటావో, సేమ్యా అని రాసుకుంటావో నీ ఇష్టం. కానీ నిజానిజాలు మాకు బాగా తెలుసు. ఎవరు ఏ కామెంటు డిలీట్ చేసారో, ఎందుకు చేసారు మాకు క్షుణ్ణంగా సాక్షాలతో సహా తెలుసు. తమరికి ఎక్కడ కాలినా, మండినా మాకభ్యంతరం లేదు. ఆ పొగేదో ఆపే ఏర్పాటు చేసుకోండి.

by the way ఇందాకలేదో నా పేరు మార్చుకుంటాను, ఇక ఈ పేరు వాడను అని ఏవో చిలకపలుకులు చెప్పినట్టు గుర్తు. ఇప్పుడేమో మళ్ళీ మీకు చాలా అవమానం కలిగించే, మీకు చెడ్డపేరు తెచ్చే "సౌమ్య" పేరునే ఉపయోగిస్తున్నారు, ఎందుకంట?

ఇదే మీకు నాకు మధ్య జరిగే చివరి వాదము. ఇంక నా బ్లాగులో మీ కామెంట్లు అనుమతించబడవు, గ్రహించగలరు.

Ram Krish Reddy Kotla said...

@ఇంకో సౌమ్య, మా దురద సంగతి మేము చూసుకుంటాంలే గాని...ఇక్కడ అతిగా దురదలు, మరియు మంటలు ఎక్కుతున్నవి ఎవరికో అందరికీ తెలుసులే.. అయినా మా సౌమ్య గారిని నేనేదో ఏదో డౌట్ అడిగితే మీకెందుకు అండి... ఒకవేళ అది మీరే డిలీట్ చేసినదే అయితే ఆ విషయం ఏదో మామూలుగా చెప్తే సరిపోయేదిగా.. మధ్యలో అజ్ఞాతగా కంమెంట్లు ఇచ్చి లేని పోనీ డౌట్లు కలిపించడం ఎందుకు...ఓకే ఫైన్...ఇక ఈ ఆర్గుమెంట్ పెంచాదల్చుకోలేదు...ఎవరేం రాసుకున్నా సౌమ్య గారి గురంచి మాకు తెలుసు కాబట్టి...ఈ టాపిక్ పెంచడం అనోసరం..సౌమ్య గారు ఎలాగు ఇక మీ కామెంట్స్ మోడరేట్ చెయ్యరు....Get a Life, inko soumya.

ఆ.సౌమ్య said...

@ Ramakrishna
Thank you very much for your support!

Vinay Datta said...

I'm pleasantly surprised to know that you are a sister of Aalamuri Sudharani garu. I'm a student of Neetha Chandrasekhar. Both of them are friends. I'm at Chennai. Please let me know if you happen to come here.

హను said...

emo anDi, evari ni nammaTaniki ledu , ee madya komchem jagrattaa.

ఆ.సౌమ్య said...

@ Madhuri,
wow, nice to meet you. i heard of Neetha Chandrasekhar garu a lot. sure, i will meet you if i come to chennai. are u still learning music? kacherilu chestunnara?

ఆ.సౌమ్య said...

@ Hanu

అవునండీ ఎవరినీ నమ్మలేము. కాబట్టి ఎవరినీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమే.

mrityunjay said...

వావ్..ఇంటరెస్టింగ్!

ఆ.సౌమ్య said...

మృత్యుంజయ్ గారూ
మా గొడవ మీకంత ఇంటెరెస్టింగా అనిపించిందా? :)

Vinay Datta said...

as of now, I confined myself to singing lullabies for my son. He's now 10, and still wants to read stories and sing for him at bed time. Recently he declared that he wants to blog in telugu.he doesn't read or write telugu but once or twice he tried to type telugu through english. I'll have to work towards assisting him start his own blog. siraa kadambam garu is helping me.

స్థితప్రజ్ఞుడు said...

మీ బాధ నాకర్ధమయ్యింది....సౌమ్య గారు...

సౌమ్య అంటే మాయా శశిరేఖ అనే తెలుసు బ్లాగ్ జనాలకి....

అసలెవరండీ అంత లేసి మాటలంటున్నారు...మా సౌమ్య గారిని...


అన్నకు చెప్పి అజ్ఞాతసౌమ్య అని పేరు పెట్టి కథొకటి రాయిన్చారనుకో....

దెబ్బకు ఈ అజ్ఞాతలందరూ అలా పడుంటారు అంతే...

ఆ.సౌమ్య said...

@ స్థితప్రజ్ఞుడు
పోనీలెండి మీరైనా అర్థం చేసుకున్నారు, నాకు అదే చాలు :P
అదీ అలా చెప్పాండి వీళ్ళకి...నన్నేమైనా అంటే అన్న చేత కథ రాయించడానికి ఎమతమంది సిద్ధంగా ఉన్నారో వీళ్ళకి తెలియాలి :D