అంతవరకు వచ్చిన మహామహులు ఎందరో నాటకాలలో, సినిమాలలో నటిస్తూ "నటన" ప్రాశస్త్యం పెంపొందిస్తూ ఉంటే, ఎక్కడనుండి ఊడిపడిందో ఓ పల్లెటూరి వాటం....నటన లేదు గిటన లేదు, అసలు నటించడం ఏమిటి nonsense....జీవించాలి అంతే. సినిమాలయితే ఆయా పాత్రల్లో జీవించాలి, నిజజీవితంలో మన పాత్రలోనే మనమే జీవించాలి.....అని తెగేసి రుజువు చేసారు.
నీకు నువ్వే సాటి వేరెవరూ లేరు అని ఎవరి గురించైనా అనాలి అంటే అది ఒక్క సావిత్రిగారి గురించి మాత్రమే అనగలం.
డిసెంబర్ 24...ఈ కళామతల్లి ముద్దుబిడ్డ జీవనాడులు కృగిపోయి, అశువులు బాసిన రోజు. ఓ గొప్ప వెలుగు వెలిగి, అందరి చేత దాసోహమనిపించుకుని, చివరికి మనశ్శాంతి కరువై లోకాన్ని వీడి వెళ్ళిపోయారు.
ఆ మహానటికి ఇదే నా అశ్రునివాళి.
అక్కయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ ఫొటో పంపవా అని ప్రేమగా మా నాన్నగారు ఉత్తరం రాస్తే వెంటనే తన స్వహస్తాలతో చేసిన సంతకంతో పాటు ఫొటో మా ఇంటికి వచ్చిందిట. ఆ అదృష్టం నేను నోచుకోలేకపోయానే అని బాధపడినా, మా నాన్నగారికి దక్కినందుకు ఆనందంగానే ఉంటుంది.
గుండెల్లో నిండిన అభిమానం ఎలా చూపించాలో తెలియక కాగితంపై ఇలా ఒంపేసాను. ( ఇవి ఓ 12 యేళ్ల క్రితం గీసిన బొమ్మలు). ఇంతకుముందు బ్లాగులో పెట్టినవే అయినా మరొక్కసారి చూడాలనిపించి, చూపించాలనిపించి....

"నా తెగులు" మృత్యుంజయ్ గారు వేసిన మాయశశిరేఖ బొమ్మ....అద్భుతానికి మారుపేరు.
http://mrithyunjaya.blogspot.com/2010/02/maya-bazaar.html
(సావిత్రి గారి వర్ధంతి Dec 26 అని వికీ లో ఉంది. కానీ మన శిరాకదంబం రావుగారు Dec 24 అని చెప్పడం వల్ల ఇవాళే నివాళి అర్పించేసాను. వికీ కంటే రావుగారి మీద నాకు గురి ఎక్కువ. :) గీతగారొచ్చి మళ్ళీ 26 అంటున్నారు. నాకు confusion గా ఉంది. 24 అయినా 26 అయినా నివాళులర్పించడం ముఖ్యం కాబట్టి ఈ పోస్ట్ continue చేస్తున్నాను.)
36 comments:
మహా నటి సావిత్రి తో పోటీ పడగలిగిన నటి భారత సినిమా ఫీల్డ్ లో లేదంటే అతిశయోక్తి కాదు. నాలాంటి సావిత్రి అబిమానులం , మీనాకుమారిని సావిత్రి ఆఫ్ నార్త్ అని పిలిచేవాళ్లం. మీనాకుమారి కానీ, సుచిత్రా సేన్ కానీ మాయాబజారు శశిరేఖ లు కాలేరు.వైవిధ్యమైన నటన సావిత్రి సొంతం. అన్నీ రకాల పాత్రలు సునాయాసం గా చెయ్యగలిగేది.
మహానాటికి నివాళులు ఆర్పిస్తున్నాను మీతోపాటు.
"మీనాకుమారి కానీ, సుచిత్రా సేన్ కానీ మాయాబజారు శశిరేఖ లు కాలేరు"......ఎంత బాగా చెప్పారండీ, అక్షరసత్యం!
మా నాన్నగారూ వాళ్ళు కూడా మీనాకుమారిని హిందీ సావిత్రి అని పిలిచేవాళ్ళు.
జూ.శశిరేఖగారూ...
మీ పోస్టులు చూస్తుంటే మిమ్ముల్ను అలా సంబోధించాలనిపించింది. సావిత్రిగారి అసలు పేరు మారుతి కాదనుకుంట... మారుతి సావిత్రిగారి సోదరి పేరు అని గుర్తు. సావిత్రిగారి మీద ఎంతో రీసెర్చ్ చేసి ఒక బృహత్తర గ్రంధం రాసిన మూర్తి వాడ్రేవుగారిని సంప్రదించవచ్చు. వీలైతే నేను కూడా ఆయనను అడుగుతాను. ఫేస్ బుక్ లో ఆయన సావిత్రిగారిపేరు మీద ఒక ఎకౌంట్ కూడా నడుపుతున్నారు. కింద దాని URL ఇస్తున్నాను.
http://www.facebook.com/pages/Mahanati-Savitri/207695867450
కృతజ్ఞతాభినందనలతో
తేజస్వి(ప్రజ్ఞ)
meeru cheppindi correct. but thana death day 24th kaadu 26th dec. don't get confuse. 24th dec bhanumathi death day.
@తేజస్వి గారూ
అవునా? ఒకసారి నేను టీవీలోనే విన్నో, ఎక్కడో చదివానో ఆవిడ పేరు మారుతి అని! అదే నిజమనుకున్నాను. మీరు వాడ్రేవుగారిని అడిగితే మటుకు నాకు తప్పకుండా చెప్పండి, సవరించుకుంటాను. నేనూ కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. facebook URL ఇచ్చినందుకు చాలా చాలా thanks. its wonderful.
మీరు జూ. శశిరేఖ అన పిలిచినందుకు మహదానందంగా ఉంది. ధన్యవాదములు. :)
@గీత గారూ
సావిత్రి వర్ధంతి Dec 26 అని వికీ లో ఉంది. కానీ మన శిరా కదబం రావుగారు 24 అని చెప్పారు. నేను ఆయన్ని follow అయిపోతున్నాను. నేను వికీ కంటే ఆయన్నే ఎక్కువ నమ్ముతాను. ఇప్పుడు మీరు 26 అని చెప్పడంతో నాకు confusion గా ఉంది. ఏది నమ్మడం?
Thanks for the comment!
ఓ ఈ పోస్ట్ ఆపడానికిదా కారణం...
సజీవంగా వున్న మహానటికి నివాళులు...బాగుంది.
@ఆదిత్య గారూ
అవునండీ ఇదే కారణం. :D
ధన్యవాదములు.
మహా నటి సావిత్రి గారంటే నాకు చాలా ఇష్టం,, డేట్ ఎప్పుడైతేనేం ఆవిడ కు నిజమైన నివాళి ఇచ్చారు సంతోషం,,
మీరు గీసిన చిత్రాలు చాలా బాగున్నాయి,, "కన్యాశుల్కం" సినిమా లో ఆవిడ నవ్వు, "మయాబజార్" లో ఎస్వీఆర్ గార్ని అనుకరిస్తూ మాయా శశిరేఖ గా ,, మిస్సమ్మ లో మేరీ గా ఆమె నటన న భూతో న భవిష్యతి,, లిస్ట్ చాలా ఉంటుంది,, మనకి ప్లేస్ చాలదు,, ఉదా: దేవదాస్
ఓలేటి గారూ
ధన్యవాదములు.
నిజమే....మాయాశశిరేఖ గా మేరీగా ఆవిడ నటన న భూతో న భవిష్యతి....అలాంటి నటన మరెవ్వరికీ సాధ్యపడదు. పెళ్లి చేసి చూడు, దేవదాసు, అర్థాంగి, కన్యాశుల్కం, దొంగ రాముడు, తోటికోడళ్ళు, అప్పుచేసి పప్పుకూడు, నర్తనశాల, పాండవవనవాసం గుండమ్మ కథ...ఓహ్, ఒకటేమిటి ఇలా వీటిన్నిటిలోనూ ఆవిడ నటన గురించి పెద్ద పెద్ద వ్యాసాలు రాయొచ్చు....ఎన్ని పేజీలైనా చాలవు.
ఓహో, మీరుకూడా మూర్తిగారి వాల్ మీద ఇప్పుడే రాశారా! btw, చెప్పడం మరిచాను. మూర్తిగారు అమెరికాలో ఏరోనాటికల్ ఇంజనీరుగా చేసి(చేస్తున్నారో...చేసి రిటైరయ్యారో గుర్తులేదు) అక్కడే స్థిరపడిన తూ.గో.జిల్లావాస్తవ్యులు. ఆయనకు కొద్దికాలం క్రితమే సావిత్రిగారి మీద ఆసక్తి కలిగింది....సావిత్రిగారు నటించిన ఒక సినిమాను కాకతాళీయంగా చూశాక. ఆ సినిమాలోని ఆమె నటన చూసి ఆయన ఒక్కసారి స్థాణువైపోయినట్లై...ఆమెకు అభిమానిగా మారారు. ఆ తర్వాత ఆమెపై రీసెర్చ్ మొదలుపెట్టారు. దానికోసం ఇండియా వచ్చి ఆమె పుట్టిన ఊరు దగ్గరనుంచి ఎన్నో ఊళ్ళు తిరిగి(ఆమె పరిచయస్తులతో మాట్లాడటానికి) విలువైన సమాచారం సేకరించి పుస్తకం రాశారు. మీరు కూడా సావిత్రిగారి వీరాభిమానులు కనుక వెంటనే మూర్తిగారి మిత్రుల జాబితాలో చేరిపోవచ్చు. నేను కూడా రిఫరెన్స్ ఇస్తాను.
సావిత్రి గారు సినిమాల్లో నటించటానికి ముందు నాటకాల్లో కూడా యాక్ట్ చేసారని చదివాను.సావిత్రి గారి జీవితకథ బుక్ గా వచ్చింది.చదివి చాలా రోజులు అయినందువల్ల సరిగా గుర్తులేదు.రాణీ లాగా ఎంతో వైభవం గా బ్రతికిన ఆవిడ చివరి రోజులలో దుస్థితి గురించి చదువుతుంటే ఏడుపు వచ్చేసింది.
@తేజస్వి గారూ
మూర్తి గారి గురించి మీరు చ్ఫెప్పిన విషయాలు విన్నక చాలా ఆనందం కలిగింది. ఎంత అభిమానముంటే అంత రిసెర్చి చేస్తారు చెప్పండి. ఇంకా ఆలశ్యమేమిటండీ వెంటనే ఆయన స్నేహితుల జాబితాలో జాయిన్ అయిపోతాను....నన్ను రికమండ్ చేసేయండి :)
ఆయన రాసిన పుస్తకం పేరేమిటో చెప్పగలరా? కొన్నుకుంటాను.
@ అనూ గారూ
అవునండీ సావిత్రిగారు మహారాణిలా ఎంతో గొప్ప బతుకుబతికి చివరికి దీన స్థితిలో పరమపదించారు. ఆ మధ్య మాటీవీలో వచ్చే జయప్రదాం లో కమల హాసన్ సావిత్రి గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. వీలైతే వినండి. youtube లో దొరుకుతుంది.సావిత్రి గారి గొంతు వినాలనుందా?...అయితే ఆవిడ నిర్వహించిన జనరంజని కార్యక్రమం ఇక్కడ వినండి.
http://www.eemaata.com/em/issues/200811/1349.html
కళ్ళతో బలే నటిస్తారు సావిత్రి గారు.సావిత్రిగారి వర్ధంతికి నేనుకూడా నివాళి అర్పిస్తున్నా...
నేను కూడా మహా నటి సావిత్రి కి వీరాభిమానిని మీ బ్లాగు ద్వారా ఆ మహా నటికి నా నివాళి
http://www.uhpublisher.com/Home
అసలు మాయాశశిరేఖగా యస్వీఆర్ గారిని అనుకరించిన తీరు అద్భుతం... ఆ మహానటికి అశృనివాళి. మీరు గీసిన బొమ్మలు బాగున్నాయ్.
సావిత్రిగారి అసలు పేరు కూడా సావిత్రేనట. సావిత్రిగారి అక్కపేరు మారుతి అని మూర్తిగారు తెలిపారు. మూర్తిగారి వాల్ మీద చూడండి.
అవునండీ, మిమ్మల్ని అలాగే శశి రేఖ లాగే ఊహించేసుకుంటున్నా నేను కూడ..మీరు ఆర్టిస్ట్ కూడానా? వావ్! చాలా బాగా వేసారు....ఒక ఫుటొ పంపించకూడదూ మీది...బ్లాగులొ పెట్టినా ఫర్వాలేదు...నాకూ సావిత్రి గారంటే చాలా ఇష్టం...'ముద్దబంతి పువులు పెట్టీ మొగిలి రేకులు జడను గుచ్చీ'..ఎక్సల్లెంట్...
Shiva gari commente naado kudaa..
నేను కూడా గొంతు కలిపి, బహుముఖ ప్రజ్ఞావంతులైన సావిత్రి,భానుమతి గార్లకు నివాళి అర్పిస్తున్నాను.
[అవునండీ "అశృ" అనివ్రాశారేమిటి, అసలే మీ గురించి "ఆ. సౌమ్య గారు బహు భాషా ప్రవీణురాలు." అని అనుకుంటాఉంటాఉంటాం కూడానూ...]
నాతోపాటూ నివాళులర్పించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదములు.
@తేజస్వి
అవునా అండీ, ఆవిడ అసలు పేరు కూడా సావిత్రేనా!...thanks you నాకు తెలియజేసినందుకు. and thanks for sending me the website...Its wonderful, thank you so much!
ఎన్నెల
అలాగే ఊహించేసుకోండి...మరేం పర్లేదు. :) నా ఫుటో ఆ అండీ..అంటే మరీ మరీ...ఇంతకుముందు బ్లాగులో పెట్టానండీ, కాకపోతే అల్లరిమూక ఎక్కువయిపోవడంతో తీసేసానండీ. మీకు చూపిస్తాలెండి ఎప్పుడైనా!
@ఊకదంపుడు
అర్రెర్రె చా ఎంత తప్పు చేసాను. అసలు చూసుకోనేలేదండీ. ఇప్పుడే సరిచేసాను. చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదములు. అయినా నా బహుభాషాప్రావీణ్యత్వం మీద టపా చదివి కూడా నా గురించి అలా అపోహ పడితే ఎలాగండీ, మీరు మరీను :D
@sowmya garu...asalu savithri gari gurinchi edanna doubt unte nannu adogochu kada,..:D..!!Vadrevu murhty garu,nenu,inka kondaru orkut lo chala yrs nundi frnds,so,miku direct ga kakapoina,indirect ga aayanatho parichayam unnatte...
Miru thappakunda aa book chadavali,..its all completely about SAVITHRI,..!!
Miru raasindi bagundi,....me nannagariki pampina photo maku kuda chupisthe santhoshisthamu!!:)
@వివేక్
ఓ అవునా మూర్తిగారు orkut లో కూడా ఉన్నారా?
నాకు ఎప్పుడూ చెప్పలేదేం? అలాగే ఆ పుస్తకం తప్పకుండా చదువుతాను, thanks!
బాగా గీ[రా]శారు.నా సావిత్రిని ఎటాచ్ చేసినందుకు ధన్యవాదాలు.
@ మృత్యుంజయ్ గారూ
ధన్యవాదములు...its my pleasure!
sweet soumya మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
thanks a lot Siva darling! :)
నీకు మీ కుటుంబ సభ్యులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఆ. సౌమ్య గారూ !
నామీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. వ్యాఖ్యలు ఆలస్యంగా చూడడం వలన వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాను. వికిపీడియాలో తేదీ విషయం నాకు తెలీదు గానీ, నా చిన్నప్పట్నుంచీ పత్రికలు చదవడం అలవాటు. జెమిని టీవీ ప్రారంభ సంవత్సరంలో ప్రసారమైన ' సినిమా క్విజ్ ' నిర్మాణ సమయంలో చాలా పరిశోధన చేసాను. అనేక పత్రికలలో వచ్చిన సీనియర్ ఫిలిం జర్నలిస్టుల వ్యాసాలు సేకరించాను. సినిమాలపై పరిశోధన చేసిన వారినుంచి కొంత సమాచారం సేకరించాను. వాటి ఆధారంగానే శిరాకదంబం లో రాస్తున్నాను.
ఒక్క విషయం. ప్రతీ విషయం ప్రచురించే ముందు వికిపీడియాలో కూడా చూడడం నాకలవాటు. వారి సమాచారంలో చాలా విషయాల్లో పొరబాట్లు దొర్లడం నేను గమనించాను. ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోవడం నా అలవాటు. నూరు శాతం నా సమాచారం సరైనదే అని నేను చెప్పలేను గానీ నమ్మడానికి నాకున్న ఆధారం నా దగ్గరున్న వివిధ పత్రికలు, పుస్తకాలలోని సమాచారం. గీత యశస్వి గారి లాంటి మిత్రులు తమకు తెలిసిన సమాచారం గురించిన వివరాలు తెలిపితే నా సమాచారంలో ఏవైనా తప్పులుంటే దిద్దుకుంటాను.
@రావు గారూ
నాకు తెలుసండీ...మీరు ఈ విషయాలలో చాలా రిసెర్చ్ చేసి ఉంటారని మీ పోస్టులు చూస్తేనే అర్థమయిపోతుంది ఎవరికైనా. అందుకే మీమీద నాకంత నమ్మకం. :)
మీ సావిత్రి టపా ఇప్పుడే చూశాను.
చాలా బాగుందండి.
చక్కగా రాశారు.
మీరు సావిత్రి అభిమానులు.
మా తరం వాళ్ళు సావిత్రి పిచ్చోళ్ళు.
మీ కన్నా మా డిగ్రీ పెద్దది!
Savitri intiperu Nissenkara ...kommareddy kadhu.
Svaithri's surname is Nissenkara...not Kommareddy..
Savithris Surname is Nissenkara..not Kommareddy........
Post a Comment