StatCounter code

Thursday, January 27, 2011

యేడాదయిందోచ్!

చాలారోజులయింది నా బ్లాగ్ మొహం చూసి. ఈ సంవత్సరానికి ఇదే మొదటి పోస్టులాగుంది (కొత్తసంవత్సర శుభాకాంక్షలు మినహాయిస్తే). ముందుగా నా ఈ పోస్ట్ చదువుతున్నవాళ్ళందరూ నాకు శుభాకాంక్షలు తెలుపండి. నేను బ్లాగు రాయడం మొదలెట్టి ఒక సంవత్సరమైంది (జనవరి 9 కి). దిగ్విజయంగా బ్లాగుల్లో యేడాది పూర్తిచేసినందుకు సంతోషంగా ఉంది. ఈ యేడాదిపాటూ నాకు చేయూతనిచ్చి, ప్రోత్సహించిన బ్లాగ్మితృలందరికీ ధన్యవాదములు. నా చేత బ్లాగు మొదలెట్టించిన ఒక అజ్ఞాత అభిమానికి కృతజ్ఞతలు. అసలు ఆ అజ్ఞాత బ్లాగు మొదలెట్టమని చెప్పినప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. కాబట్టి అతనికి/ఆమెకి ప్రత్యేక ధన్యవాదములు. ఈ సంవత్సరకాలంలో నేను కొద్దిమంది స్నేహితులని, కొద్దిమంది శతృవులని సంపాయించుకున్నాను. శతృవులందరూ అజ్ఞాతలే కాబట్టి వారి సంగతి పక్కనబెడితే కొందరు వ్యక్తులతో నాకు కలిగిన స్నేహం మరపురానిది, అపురూపమయింది. నా బ్లాగు కష్టాలలో అండగా నిలిచి, చేయూతనిచ్చిన నా స్నేహితులకు ఇవే మనఃపూర్వక కృతజ్ఞతలు. నన్ను మెచ్చుకుంటూ/వ్యతిరేకిస్తూ కామెంట్ల వర్షం కురిపించినవారందరికీ పేరు పేరునా ధన్యవాదములు.

ఈ సంవత్సర కాలంలో 38 పోస్టులు రాయగలగడమే కాక మరొక కొత్త ఫొటోల బ్లాగు కూడా మొదలెట్టగలిగాను. 4000 పైచిలుకు హిట్లు వచ్చాయి. అందులో పైచిలుకు హిట్లు నేను చూసినవే అనుకున్నా నాలుగువేల సంఖ్య చూడముచ్చటగా ఉంది. నేను చర్చించదలుచుకున్న విషయాలు మరెన్నో ఉన్నా, ఇప్పటివరకూ రాసినవి సంతృప్తికరంగానే ఉన్నాయి. నా రాత, టపా టపాకి అభివృద్ధి చెందతున్నదని మితృలు చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంది. ఈ రకంగా తెలుగుకి మరింత దగ్గరగా ఉండడంలో ఒక ఆనందం లభిస్తున్నాది. నాకిష్టమైన సాహిత్య చర్చకు ఇక్కడ ఎక్కువ ఆస్కారం లభిస్తుండడం కూడా సంతోషంగా ఉంది. తెలుగులో వస్తున్న కొత్త సాహిత్య ప్రక్రియలు, కథలు, కవితలు అన్నిటినీ తెలుసుకునేందుకు చాలా ఉపయోగకరంగా ఉంది. అంతేకాక బిజీ బిజీ బ్రతుకులలో నా అల్లరిని, చిలిపితన్నాన్ని బయటపెట్టుకునే మరో వేదికగా కూడా మారింది. నా ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునేందుకు నాదంటూ ఉన్న నా బ్లాగుపై మక్కువ ఎక్కువతూనే ఉంది. ఈ బ్లాగు ఒక వ్యాపకం స్థాయి నుండీ వ్యసనం స్థాయికి పెరిగి దుర్వ్యసనంగా మారుతుందేమోనని భయంగా ఉంది. :)

మరొక్కసారి నన్ను ప్రోత్సహించిన మితృలందరికీ ధన్యవాదములు. ఈ కొత్త సంవత్సరంలో కూడా మీ ప్రోత్సాహాన్నీ ఆశిస్తున్నాను, ఇస్తారు కదూ!

28 comments:

జ్యోతి said...

యాపీ యాపీ బ్లాగ్ యానివర్సరీ

snigdha said...

వెరీ యాపీ బ్లాగ్ యానివర్సరీ అండీ... ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి టపాలు మీ బ్లాగ్లో వస్తాయని ఆశిస్తూ.. స్నిగ్ధ

బులుసు సుబ్రహ్మణ్యం said...

శుభాభినందనలు మరియూ శుభాకాంక్షలు.
ముందు ముందు ఇంకా మంచి టపాలు అందిస్తారని ఆశిస్తున్నాను.

>>>4000 పైచిలుకు హిట్లు వచ్చాయి.
ఇది ఎప్పటినించి? మీ గణాంకములు తప్పు అనిపిస్తోంది. ఏడాదిలో ఇంకా చాలా చాలా ఎక్కువేమో నని నా నమ్మకం.

ఆ.సౌమ్య said...

@జ్యోతి, స్నిగ్ధ గార్లకు ధన్యవాదములు. ఇంకా మంచి టపాలు రాయడానికి ప్రయత్నిస్తాను.

@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
ధన్యవాదములు. మంచి టపాలు రాయడానికి ప్రయత్నిస్తాను. నా బ్లాగరులో ప్రొఫైల్ విజిటర్స్ గా చూపిస్తున్న సంఖ్య 4256. అదే చెప్పానండీ. మాములుగా అయితే ఇంకా ఎక్కువే వచ్చి ఉంటాయి. :)

SHANKAR.S said...

మీ మొదటి బ్లాగ్వార్షికోత్సవ శుభాకాంక్షలు

శివరంజని said...

sweet soumya యాపీ యాపీ బ్లాగ్ యానివర్సరీ......ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి టపాలు మీ బ్లాగ్లో వస్తాయని ఆశిస్తూ

మాలా కుమార్ said...

హపీ బ్లాగ్ యానవర్సరీ .

మురళి said...

Congratulations...

Rao S Lakkaraju said...

హపీ బ్లాగ్ యానివర్సరీ. కీప్ ఆన్ డూఇంగ్.

మనసు పలికే said...

సౌమ్య గారు, ముందుగా మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు:) మీ బ్లాగు నుండి మరెన్నో టపాలని ఆశిస్తున్నాను.
>>ఈ బ్లాగు ఒక వ్యాపకం స్థాయి నుండీ వ్యసనం స్థాయికి పెరిగి దుర్వ్యసనంగా మారుతుందేమోనని భయంగా ఉంది. :)
హహ్హహ్హా.. నాక్కూడా అదే భయం..;)

..nagarjuna.. said...

congratulations n keep goin

చెప్పాలంటే...... said...

బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు

sunita said...

Congrats!keep writing!

Anonymous said...

congrats. మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

శ్రీనివాస్ పప్పు said...

శుభాకాంక్షలు,అభినందనలు.

Ennela said...

సుకుమారియైన మా బాలా కుమారి శశిరేఖకి అభినందన సుగంధ చందనాలు...

రాధిక(నాని ) said...

బ్లాగ్ మొదటిపుట్టినరోజు శుభాకాంక్షలు

geetika said...

మీ బ్లాగుకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీ భయం నిజంకాకూడదని మనస్పూర్తిగ కోరుకుంటూ..

గీతిక

బాలు said...

ఏడాదిలో 38 పోస్టులు... సూపరండీ మీరు.
ఒక్కరు లేక ఇద్దరు లాగా నాకు నెలకు ఒకటీ లేక రెండుపోస్టులు రాయడమే చాలా కష్టంగా ఉంది.
ఎనీవే, శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీకు ఈ వ్యసనం ముదిరిపోయి బోల్డన్ని మంచి టపాలు రాస్తారని ఆశిస్తున్నాం.

లత said...

మీ బ్లాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

పరిమళం said...

వార్షికోత్సవ శుభాకాంక్షలు !

సత్య said...

బాలాకుమారి, సుకుమారి, మాయా శశిరేఖ గారికి,
వివాహ భొజనం లాంటి బ్లోగ్ కి,
హార్దిక శుభాకాక్షలు!!!


బార్ లో పార్టీ ఇస్తూ మందు మానాలి అన్నట్లు,
బ్లొగ్ లో పొస్త్ వేస్తూ బ్లొగింగ్ మానాలి అంటే ఎలా అండీ...(జొక్)

మీ వ్యసనం లోకప్రియమవ్వాలని కోరు కుంటూ....

ఆ.సౌమ్య said...

శుభాకాంక్షలు అందజేసిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదములు.
Thanks a lot! :)

కృష్ణప్రియ said...

కంగ్రాట్స్.. సౌమ్య.. Keep blogging.

మల్లాది లక్ష్మణ కుమార్ said...

శుభాకాంక్షలండీ సౌమ్య గారూ! యెందుకంటె, నా సొది సుమాల బంతిపూల పరిమళం మీరు కూడా అందుకొగలిగారు. మీ నమో నమహ్ ప్రయోగం ' అదుర్స్ '. అల్లి బిల్లి అల్లరితొ, జడ గంటలు కట్టుకుని చారెడు మొహానికి ఇంతింత కాటుక పూసుకుని వయ్యరాలు పొతూ పరుగులు తీసె బాపూ బొమ్మె గుర్తొస్తొంది మీ కబుర్లు వింటె. బెచ్చాట , నెల బండ, యేడు పెంకులాట ... అహా హా ఈ రొజుల్లొ యెన్నాళ్ళకి వినగలిగాను ఈ తెలుగు ఆటలు. తెలుగు తీయదనం ఇస్టమైన వాళ్ళందరికీ సంక్రాంతి మధుర జ్ఞాపకం అవుతుంది, చిన్నప్పటి చిరు జ్ఞాపకాలతొ. మీకు ధన్య వాదాలు. ఇక పొతె, నెను రాసిన పుటలలొ, హిందీ గొల కూడా ఉన్నది.. చదివి ఆనందించగలరు.

మీ శశిరెఖ వెషం కూదా గొప్పగా రాయగలిగారు. ఇక మిమ్మల్ని తిట్టుకునెదెవరు? అంతా తసమదీయులె!! మీ పద ప్రయొగం, రచనా సైలి అమొఘం!

ఇత్త నెనెప్పుదు రాస్తానొ యెమొ !!!!?????!!!!! ???

ఆ.సౌమ్య said...

@krishnapriya garu
thanks a lot!

ఆ.సౌమ్య said...

@లక్ష్మణ్ గారూ
మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు...మీ కామెంటు చదివాక అలా అలా ఆకాశంలోకి ఎగిరిపోయాననుకోండి....ముఖ్యంగా బాపు బొమ్మ గుర్తొస్తోంది అన్నారే..అక్కడే ఫ్లాట్....చాలా చాలా థాంక్సండీ :)

నా పోస్టులు మీకు నచ్చినందుకు చాలా సంతోషం...మీ బ్లాగు లో ప్రసాదం పోస్ట్ చదివాక మిగతా పోస్టులన్నీ ఓ మారు చూసాను...చదవాల్సినవాటిగా గుర్తు పెట్టుకున్నాను కూడా...మీ హిందీ గోల చదువుతా త్వరలో...బాగా రాస్తున్నారు మీరు కూడా.

కామెంటు రాసినందుకు, నా బ్లాగుని మెచ్చుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు.

Venugopal said...

Congrats Soumya ji...