మొన్న సుజాత గారు శారదా శ్రీనివాసన్ గారి పుస్తకం గురించి తన బ్లాగులో రాసాక, నాదగ్గరున్న ఎప్పటివో పాత బాలనందం కార్యక్రమాలు గుర్తొచ్చాయి. "ఆపాత" జ్ఞాపకాలు మీకోసం. బాలన్నయ్య, బాలక్కయ్య తెలిసినవాళ్ళకి ఇవి అపురూపాలు. ఇవి విని అందరూ తమతమ బాల్యంలోకి హాయిగా వెళ్ళిపోండి! :)
9 comments:
వీటిలో 'బుజ బుజ రేకుల పిల్లుందా...' నా ఆల్ టైం ఫేవరేట్ :))
బాగుందండీ టపా..
మా అమ్మ నేర్పించిన ఆ పుట్టిన రోజు పండుగ పాట నాకెంతో ఇష్టం. బుజబుజరేకుల పిల్లుందా కూడా చాలా మంచిపాట. మొద్దబ్బాయి కూడా గుర్తే. పొట్టిబావ చిట్టిమరదలు ప్రోగ్రాంలో అయితే ఆ చిట్టిమరదలు పొట్టిబావను ఏడ్పించినా కొద్దీ భలే ఉంటుంది కదా. నిజంగానే అవన్నీ చాలా మంచి ప్రోగ్రాంస్.
నాకు కూడా బుజ బుజ రేకుల పిల్ల బాగానచ్చిందండీ.. మొట్టమొదటి సారిగా మీనాక్షి గారి బ్లాగ్ లో చూశా ఆ పాట..
ఇంత కలెక్షన్ ఎక్కడ సంపాదించేరూ?? మీరు సూపరండీ..;)
ఒక్కసారిగా చిన్నతనపు జ్ఞాపకాల పుటలు తెరిచేసికున్నాయి.... సింప్లీ సూపర్బ్ !!!!!
wow thanks a lot sowmya :)
@ మురళీ గారూ
నాక్కూడా ఆ పాట భలే ఇష్టం!
Thanks.
@జయ గారూ
అన్నీ విని మీరు మీ చిన్నతనంలోకి వెళ్ళిపోయినట్టున్నారు! నాకు భలే ఆనందంగా ఉంది మీ అందరి సంతోషం చూస్తుంటే
ధన్యవాదములు!
@ రాజ్
కదా, బలే తమాషాగా ఉంది ఆ పాట!
ఎలా సంపాయించానా....మనసుంటే మార్గముంటుంది :)
Thanks!
@ ఫణిబాబు గారూ
మీరు కూడా చిన్నతనంలోకి వెళ్లిపోయారా...భలే!
thanks!
@ వేణూ
:) u r most welcome!
నాకు ఆకాశవాణి అనగానే మన కోరుకొండ రికార్డింగే గుర్తొస్తుందే! మంచి పాటలు పంచిపెట్టావ్. థాంక్స్!
@ కొత్తవకాయ
హహహ ఈ పోస్టు రాస్తున్నంతసేపు నాకు కోరుకొండే మెదిలింది హృదిలో...మన రేడియో ప్రోగ్రాములు గుర్తున్నాయా....అవో రోజులు లే!
Post a Comment