StatCounter code

Thursday, October 13, 2011

భావుకపిత

మన బ్లాగర్లలలో చాలామంది చాలా భావుకతతో బోల్డు బోల్డు రాసేస్తుంటారు కదా. పువ్వు గురించో, నవ్వు గురించో, "నువ్వు" గురించో...బలే రాస్తుంటారు. అలాగే రాధాకృష్ణుల గురించి...విరహవేదనల గురించి, ఆమె గురించి, అతని గురించి...ఏవేవో రాస్తుంటారు.

మనకి అంత భావుకత లేదు, అదంటే ఏమిటో కూడా తెలీదు. అసలు వీళ్ళెలా రాస్తుంటారా అని తెగ ఆశ్చర్యపోతుంటాను. చివరికి నిన్న తెలిసింది. మన నేస్తం లేరూ ఆవిడ చెప్పారు "చాలా చిన్న విషయాన్ని స్ట్రైట్ గా చెప్పకుండా చిలవలు పలవలుగా చెప్పిరాసేదాన్ని భావుకత అంటారు" అని. ఇది చాలదూ మనకి! అసలే ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రకం మనం. చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతాం. ఆ..మనకేం తక్కువ, మనం రాయలేమా అని మొదలెట్టాను. కాకపోతే అది భావుకత లా కాకుండా భావుకపిత లా వచ్చింది. అందుకే నా ఈ ప్రహసనానికి "భావుకపిత" అని పేరు పెట్టాను. బ్లాగు వీధులలో భావుకపితబావుటా ఎగురవేయాలని నిర్ణయించేసుకున్నాను.

ఆ నిర్వచనం చూసాక నాలో భావుకపిత్వం పొంగిపొర్లింది. రాసేసాను...నాలో భావుకపిని కదిపి, కుదిపి పారేసాను.

1) నేస్తం.....నాకు కావాలి....అవును, నాకు కావాలి.

అది గుండ్రంగా ఉంటుంది నీ ముఖం లాగే
మృదువుగా ఉంటుంది నీ మనసులాగే
మధురంగా ఉంటుంది నీ పలుకులాగే

ఒక్కసారి హత్తుకుంటే చాలు విస్ఫోటనాలు కలిగిస్తుంది.
ఆ పరిమళం మనోహరంగా ఉంటుంది
ఆ తీపి జ్ఞాపకాలు ఎన్నటికీ వీడవు.

గుండె నాలుకపైకి వచ్చేస్తుంది....
ఆ రుచి, ఆ ఆస్వాదన అనితరసాధ్యం.....

అదేమిటో తెలుసా నేస్తం...చెప్పేస్తున్నా..చెప్పేస్తున్నా...అదే సున్నుండ...అది కావాలి నాకు...ఇవ్వావూ!

2) అదిగో ఆ గదిలో ఆ చిట్టచివర్న ఆ మూల నావైపే చూస్తోంది
ఒంగి, వినయంగా, ఓరకంట చూస్తోంది
ఆ చూపులు "నీకోసమే, నువ్వెప్పుడొస్తావా అని" అన్నట్టు ఉన్నాయి.
నే వెళ్ళగానే ఏ క్షణమైనా వర్షించేలా ఉన్నాయి.
మెల్లగా, మృదువుగా ఆ హృదయంలోనుండి మాటలు వినిపిస్తున్నాయి.....

"ఇంకా ఎంతసేపు...ఈ యాతన "నీకోసమే" అని చెబుతున్నా రావేం!
రా, నువ్వొస్తే నా ఈ నిరీక్షణ ముగుస్తుంది.
ఆఖరి బొట్టు వరకు నీకోసమే.....

ఎహే ఎంతసేపు నాకుతావ్ చెయ్యిని, వచ్చి కడుక్కో"

అని ఆ మూలన, వాష్ బేసిన్ నుండి పిలుస్తున్న కొళాయి పిలుపులు నాకు లీలగా వినిపిస్తున్నాయి.

3) ఎంత బరువైనా మోస్తారు
రాచిరంపాన పెట్టినా సహిస్తారు
ఈడ్చితన్నినా భరిస్తారు
సూదులు పెట్టి పొడిచినా కిక్కురుమనరు

పైగా మీరు
భూమాతకి అతిదగ్గరగా ఉన్నాము కదా అని ఆనందిస్తారు
మనిషి నడకకు, నడతకు సాయం చేస్తున్నామని మురిసిపోతారు
మాకు మేమే సరిజోడి అని తలెగరేస్తారు

అవసరం తీరాక మిమ్ములను నిర్దాక్షిణ్యంగా అవతల పారేసినా పన్నెత్తి మాటాడరు, కన్నెత్తి చూడరు

మీ ఓరిమికి, కూరిమికి జోహార్లు ఓ ప్రియ పాదరక్షలూ!

అవేనండి కాలిచెప్పులు! :)

4) అత్తకోడళ్ళ మధ్య చిచ్చుపెడతావు
భార్యాభర్తల మధ్య అపార్థాలు తెస్తావు
యజమాని, సేవకుని మధ్య మంటలు రేపుతావు
కుట్రలు,కుతంత్రాలు నింపుకుని భయంకరమైన క్షుద్రవిద్యలను ప్రోత్సహిస్తావు
బాల్యవివాహ కథలు చెబుతావు
అనాగరికమైన అంశాలను ప్రస్తావిస్తావు
అవన్నీ చూసే ఆడవాళ్ల చేత కన్నీరు పెట్టిస్తావు

తెలుగు టీవీ సీరీయలూ...నీకిదేం పాడుబుద్ధి!

5) నువ్వంటే వ్యామోహం
నీ చేయూత కావాలని ఆరాటం
అన్నివేళలా సదుపాయంగా ఉంటావని నమ్మకం
మిలమిలమెరుస్తూ, దృఢంగా, బలంగా చేతిలో ఒదిగిపోతావ్
నీ చేరువ అభివృద్ధికి సంకేతం
నువ్వంటే నాకు ఇష్టం, నిజంగా

కానీ....కానీ.....

ఎందుకో నాకంటూ ఉన్నదాన్ని, నాలో ఏకమైపోయిన దాన్ని, నా సొంత చేయిని చూడగానే నిన్ను మరచిపోయి హాయిగా ముద్దలు కలుపుకుని ఆనందంగా తినేస్తాను.

నీ ఉపయోగాన్ని తోసిరాజని, నీ మీద ఉన్న ప్రేమని చంపేసుకుంటూ నేను చేస్తున్న ఈ పనిని క్షమిస్తావు కదూ ఓ చెమ్చా (స్పూన్)!

మరి నా భావుకపిత ఎలా ఉందో చెప్పండి? మీకు నచ్చే ఉంటుంది నాకు తెలుసు :P
అస్సలు మొహమాటం లేకుండా పొగిడేయండి ఏం! :)55 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

చూస్తున్నాను కానీ ఏమి కనిపించటం లేదు
రాద్దామనుకున్నాను కానీ వేళ్ళు కదలటం లేదు ఆలోచిస్తున్నాను కానీ మనస్సు స్పందించటం లేదు
ఇప్పుడే తెలిసింది గుండె బండ బారిపోయిందని

వి.టా.హా

..nagarjuna.. said...

సూపరు :)

వేణూరాం said...

ఎహే ఎంతసేపు నాకుతావ్ చెయ్యిని, వచ్చి కడుక్కో"

అని ఆ మూలన, వాష్ బేసిన్ నుండి పిలుస్తున్న కొళాయి పిలుపులు నాకు లీలగా వినిపిస్తున్నాయి>>>>


baaboi.. sooparasalu ;)

నేనూ ఒదుల్తా కపిత్వం...!

నీకోసమే. నా అన్వేషణ
నీకోసమే నా నిరీక్షణ
నీ కూత కోసం చెవులు రిక్కిస్తూ..
నీ అలజడి కోసం ఊపిరి బిగబడుతూ...
నీలో నాకింత చోటిస్తావని ఆశిస్తూ... ఎదురుచూస్తున్నా..

ఈ రోజయినా సరయిన సమయానికి రావా.. ఓ ధూమ శకటమా..!

SHANKAR.S said...

భావ కపితా పితామహి, కపియిత్రి సౌమ్య గారు తెలుగు జాతి జలదరించే విధంగా గొప్ప గొప్ప కావ్య ఖండ ఖండాలు రాయాలని, తెలుగు సాహిత్య చరిత్ర చెదలు పట్టి చలించిపోయేలా రాసి చెత్తబుట్ట, ముష్టి బొచ్చె కాదేదీ కపిత్వానికనర్హం అని రుజువు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆవిడ వాష్ బేసిన్ కపితకు "సా'హత్య' అకాడమీ అవార్డ్" ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

subha said...

అదే సున్నుండ..., ఓ తెలుగు టీవీ సీరీయలూ...నీకిదేం పాడుబుద్ధి! ఆహా కపిత్వం ఏమో గానీ టీ.వీ. సీరియల్ కు మంచి చురకే అంటించారు.. మొత్తానికి మీ కవిత్వం కెవ్వు కేక సుమండీ..

kallurisailabala said...

ఆహా ఓహో
ఎహే ...హాయ్ హాయ్ ఇంకా నాకు రాదు...అదర గొట్టేసారు మీ అభిమాన సంఘం లో నాకు కూడా కూసింత చోటు ఇప్పించండి.

Bhardwaj Velamakanni said...

LOOOOOL :))

మాలా కుమార్ said...

బ్లాగు ల లో వచ్చే కవితలు చూస్తుంటే నాకూ ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది ఇలా ఎలా రాయగలుగుతారా అని . ఇప్పుడర్ధమైంది :)
మీ భావుకపిత లు బాగున్నాయి .

ఇందు said...

నాకు అన్నిటికంటే ఆ 'కుళాయి ' కపిత సూపర్ నచ్చిందండీఈ

వహ్వా! వహ్వా! మీకు మీ కపిత్వానికి జోహార్లు :)))))

శ్రీరామ్ said...

:-))

yaramana said...

హా.. హా.. హా..
హాయిగా నవ్వుకున్నా.
జరూక్ శాస్త్రి (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి)..
పట్టాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి)..
గుర్తొచ్చారు.
థాంక్యూ!

భాస్కర రామి రెడ్డి said...

ఏంటి సౌమ్యగారూ, పొద్దునీడి బాగానే ఉన్నట్టున్నారు కదా? ఇంతలో ఏం కరిచింది :P

మనోజ్ఞ said...

ఒసేయ్ నీ పిచ్చి పైత్యానికి దారి తీసింది, నాకు ఎక్కింది వెర్రి. బాబోయ్ నాకు కూడా కపిత్వం వచ్చేస్తోంది. దేవుడా నువ్వే కాపాడాలి నన్ను.

Ennela said...

kavayitri sowmya ki jai jai jai..
inta andamgaa koodaa wraayochchaa!wash basin kavita bhale undi...venuram gaari bassu kavita koodaa...sankar cheppinattu awardulu prakatinchadaanni nenu support chestunnaa...

మధురవాణి said...

కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్.. సూపర్ గా ఉన్నాయి మీ భావుకపితలు.. :)))
అన్నీటి కంటే కొళాయి కవిత ఎక్కువ బావుంది, ఆ తర్వాత సున్నుండ, తర్వాతే మిగతావి.... :))))))
మీ కవితా ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించండి.. :D

ఆ.సౌమ్య said...

@బులుసుగారూ
చూసారా నా భావుకపిత మీలో ఎంత స్థితప్రజ్ఞత తీసుకొచ్చిందో! :P

@ నాగార్జున
థాంక్సులోయ్!

ఆ.సౌమ్య said...

@ రాజ్
వామ్మో, నువు నాకంటే సూపరుగా రాసావు కదా....ఎంతైనా కుడిభుజానివి కదా, ఆమాత్రం ఎఫెక్ట్ ఉంటుందిలే :)

@ శంకర్ గారూ
అబ్బ నా మీద మీకెంత అభిమానమండీ...చాలు బాబు ఇది చాలు ( కళ్ళు తుడుచుకుంటూ సౌమ్య).
మీరు అంతలా అడగాలిటండీ...రాసేస్తాను, మీ అందరి కోసం ర'చించి' పారేస్తాను.
నాకసలే బోలెడంత మొహమాటమూ, సిగ్గూనూ...మీ కోరిక కాదనలేను...అలాక్కాన్నీండి. ఈ బిరుదులు,సన్మానాలు ఏవోఇచ్చేయండి...మీ కోరిక తీర్చడమే నాకు ఆనందదాయకం. :D

ఆ.సౌమ్య said...

@సుధ గారూ
ఏదో మీ అభిమానం...థాంక్సులు! :P

@శైలు
మీ అందరి అభిమానం చూస్తుంటే నాకు కళ్ళు చెమరుస్తున్నాయి...వా ఆ...ఈ ఆనందసమయంలో ఇంకో భావుకపిత రాసేయాలనుంది ;)
తప్పకుండా శైలు తప్పకుండా...నా అభిమాన సంఘంలో నీటు చోటు లేకుండానా! :)

ఆ.సౌమ్య said...

@భరద్వాజ గారూ
లోల్ లో ఐదు "ఓ" (O) లున్నాయి. అంటే మీకు బాగా నచ్చిందన్నమాట నా భావుకపిత :D
థాంక్సులు!

@ మాల్ గారూ
హమ్మయ్యా మీకూ అర్థమయిందా...మరింకెందుకాలశ్యం...మీరూ మొదలెట్టండి. కావాలంటే నేను చేయూతనిస్తాను ;)

ఆ.సౌమ్య said...

@ ఇందు
నాకు కూడా ఆ కొళాయి కవితే బాగా నచ్చింది....సేం పించ్.
ఊరుకో....ఆట్టే పొగడకు నాకు అసలే సిగ్గెక్కువ ;)

@ శ్రీ రాం గారూ
నా భావుకపిత చూసి మీకు నోట మాట రావట్లేదా, అలా నవ్వి వెళ్ళిపోయారు! :D

ఆ.సౌమ్య said...

@ యరమన గారూ
అమ్మో, చాలా పెద్ద పొగడ్తండీ అది...జరుక్ శాస్త్రి గారు, పట్టాభిగారూ గుర్తొచ్చారంటే....నా జన్మ ధన్యమయినట్టే....you made my day :) thank you!

ఆ.సౌమ్య said...

@ భ.రా.రే గారూ
మీకస్సలు కపిహృదయం లేదు...వేస్ట్ మీరు...పొండి ;)

@ మనోజ్ఞ
నీకు అంతేనే....కపిహృదయం లేని పాషాణ హృదయురాలివి....పో

ఆ.సౌమ్య said...

@ ఎన్నెల గారూ
అందంగా రాసానా! అబ్బ మీరెంత మంచోరో...నన్నెంత బాగా పొగుడుతున్నారో!
నాకు అవార్డులు అవీ....అబ్బే ఎందుకండీ... సరే లాక్కాన్నీండి..మీ కోరిక నేనేందుకుకాదనాలి.

@ మధుర
హహహ అందరికీ ఆ కొళాయి కవితే బాగా నచ్చినట్టుంది.
తప్పకుండా కొనసాగిస్తా...నువ్వు చెప్పాక ఆపుతానా...నీ కోసం రాస్తా!

Anonymous said...

అదిరాయి మీ కవితలు. మా బుర్రలను చైతన్య పరిచిన ఇలాంటి కవితలు మీరు ఇంకా రాయాలని ఆకాంక్షిస్తూ ...

రసజ్ఞ said...

మీలో భావు కవి(పి)త్వం పొంగి పొర్లుతోంది మీ కుళాయిలాగానే! మీ సున్నుండ కవిత చదువుతుంటే నాకు నా చాక్లేటు కవిత గుర్తొచ్చింది. మీరొక పెద్ద కవయిత్రి అయిపోతారు సౌమ్య గారు!

kri said...

Fantastic!

నేస్తం said...

కుళాయి కవితను కపిత అని అనకూడదేమో ..చాలా బాగా రాసావ్ సౌమ్యా.. నాకు సున్నునండ కవితకూడా చాలా చాలా నచ్చేసింది ..మరి మీద రాసావుగా :) అలా అనికాదుగాని నీలో మంచి భావుకత్వం ఉందమ్మాయ్..ఒప్పేసుకున్నాం

ఛాయ said...

మీ భావుకపిత బాగుంది,
ఆనందం పంచింది,

నెట్ అంతా వెతికినా,
గూగులంతా కేలికినా ,
ఇంతకన్నా దొరికేనా !!!!
అందుకోండి నా అభినందన.....

చాతకం said...

ఆహా, ఓహొ, హాహా.. హా సీతా, లక్ష్మణా అంటూ ఈ మాయా శశిరేఖ ధాటికి ఏ మారీచుడైనా ఫట్. అదిరిపొయింది ఈ కపిత్వభరిత టపా. దీన్ని కపిత్వం అనే కంటే పొడుపు కథలు అనటం కరక్టేమో?
మొదటి కపితకి గులాబ్ జామూన్, రెండవ దానికి టాయిలెట్, మూడవ దానికి మా గ్రౌండ్ ఫ్లొరులో ఉన్న టెంప్ కంప్యూటర్ ప్రోగ్రామర్లు, నాలుగవ దానికి సెల్ ఫోన్ గుర్తుకు వచ్చాయి. :)

Anonymous said...

సౌమ్య గారు,

మీ వ్యాఖ్యలు నా స్పందన బ్లాగులో చదివాను. వివాహవ్యవస్థ పై మంచి క్లారిటి ఉంది. నాదోక చిన్న రిక్వెష్ట్. మీ దృష్ట్టిలో మగవారికి పెళ్లి వలన కలిగే లాభాలు ఎమీటీ? అననే టాపిక్ మీద మీ అభిప్రాయలు వివరించగలరా?

Thanks in advance.
శ్రీనివాస్

Anonymous said...

ఇవి పొడుపు కథలు. ఇవి కవితలు కాదు కదా తవికలు కూడా కాదు.

కాముధ

ఆ.సౌమ్య said...

@ తొలకరి
థాంక్సులు. మీ బుర్రలని చైతన్యపరిచాయా!...వామ్మో, నా భావుకపితలు ఇంతపని చేస్తాయనుకోలేదు సుమండీ! :P

@ రసజ్ఞ గారూ
ధన్యవాదములు. మీరెంత మంచోరండీ..నన్ను కవయిత్రి కమ్మని ఆశీర్వదించారు. అలాగే అయిపోతా, తప్పకుండా అయిపోతా :) ఇంతకీ మీ చాక్లేట్ కపిత ఏది? మాకు కూడా వినిపించండి.

ఆ.సౌమ్య said...

@ నేస్తం
అంతా నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి.....మీరుగానీ నిర్వచనం ఇచ్చిందకపోతే నేనిలా కపియిత్రిని అయ్యుండేదాన్ని కాదు...నా భావుకపిత ఇలా ఉప్పొందేది కాదు. ధన్యోస్మి! థాంక్సులు :D

@ kri
thank you so much!

ఆ.సౌమ్య said...

@ ఛాయ గారు
చూసారా చూసారా మీకు కూడా కపితలు ఎలా తన్నుకొచ్చేస్తున్నాయి...అదే ఈ భావుకపిత మహిమ! :D
నా భావుకపితాగానం మీకు నచ్చి మెచ్చినందుకు ధన్యవాదములు.

@చాతకం
హిహిహి థాంక్సులు! అబ్బే పొడుపుకథలు కావండీ...భావుకపిత అలాగే ఉంటుంది...ఎవరో, ఎందుకో ఏమిటో చెప్పరు. ఇదీ అంతే. :D

@కాముధ
ఇది కవిత అనీ తవిక అనీ నేను అనలేదే?..ఇది భావుకపిత...దానికి మీరు పొడుపుకథ అని పరు పెట్టుకుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు :P
ధన్యవాదములు!

Anonymous said...

సౌమ్య గారు,
మగవారికి పెళ్లి వలన కలిగే లాభాలు ఎమీటీ? అనే విషయం పై, మీ అభిప్రాయం చెప్పలేదు. చెపుతారో లేదో తేలియదు. మీకు ఇష్ట్టం లేకుంటే, ఇంతక్రితమే ఆ వ్యాఖ్యను పబ్లిష్ చేయవలసిన అవసరం లేదుకదా! ఇన్ని దినాలు మీరు అభిప్రాయం ఎదురు చూసాను. ఎకనామిక్స్ లో పి చ్ డి చేసిన వారికే లాభాల గురించి తెలియంటె మిగతావారు ఆలోచించవలసిన విషయమే!

ఆ.సౌమ్య said...

శ్రీనివాస్ గారూ
మన్నించండి.ఈరోజు మీ వ్యాఖ్యకు ప్రతి వ్యాఖ్య రాసాననే అనుకున్నాను. మరచిపోయాను.
టైప్ చేసాను గానీ పోస్ట్ చెయ్యడం మరచిపోయాను. నేను రాసినది:

"ముందుగా ధన్యవాదములు.మీరు అడిగినది ఈ పోస్టుకి సంబంధం లేని విషయము. అందుచేత దానిగురించి ఇక్కడ చర్చవలదు. ఇక మీరడిగినదానిపై నా అభిప్రాయం సమయము, సందర్భము, అవకాశము వచ్చినప్పుడు తప్పక చెబుతాను".

ఇంక అభిప్రాయం రాయనప్పుడు మీ వ్యాఖ్యని ఎందుకు పోస్ట్ చేసానంటారా...మీరు నా బ్లాగులో వ్యాఖ్య పెట్టారు...మీరు నా అతిధి...అతిధిని గౌరవించడం నా ధర్మం. మర్యాదగా, సంస్కారవంతంగా వచ్చిన ఏ వ్యాఖ్యనైనా నేను గౌరవిస్తాను. అందుకే పొస్ట్ చేసాను రెండోది కూడా.

ఇంక...నేను నాకు అభిప్రాయం లేదనో, తెలీదనో, తెలుసనో చెప్పలేదు. మీకలా అనిపిస్తే అలాగే అనుకోండి నాకేమీ అభ్యంతరం లేదు. :) ఇంకోమాట economics కి భార్యాభర్తలు-పెళ్ళి కి సంబంధించిన వ్యవహారానికి ఏ మాత్రం సంబంధం లేదు...గ్రహించగలరు. అంతమాత్రాన నాకు అభిప్రాయం లేదనో, తెలీదనో అనుకుంటే నా తప్పు కాదు. నాకు వివాహవ్యవస్థ పై మంచి క్లారిటీ ఉందని మీరే ఒప్పుకున్నారు. :)

ఇంక ఈ విషయం పై ఎటువంటి వ్యాఖ్యలు పోస్ట్ చెయ్యను, స్పందించను..చెప్పి మనేయాలి కదండీ అందుకే. అన్యధా భావించవద్దు. చెప్పానుగా, సందర్భము, అవకాశము వస్తే నా అభిప్రాయాన్ని మీతో తప్పక పంచుకుంటాను. మరొక్కసారి ధన్యవాదములు.

రసజ్ఞ said...

ఇదిగో సౌమ్య గారు ఇక్కడ! http://navarasabharitham.blogspot.com/2011/08/blog-post.html

ఆ.సౌమ్య said...

హహహ...రసజ్ఞ గారూ బలే ఉంది...ఆశ్చర్యకరంగా మనిద్దరం ఒకే రకంగా రాసాం కాకపోతే చాక్లేటు, సున్నుండ అంతే తేడా...i really enjoyed it, excellnt! :)))

కృష్ణప్రియ said...

:)) సౌమ్యా!

మీరూ కూడా కవయిత్రి అయిపోయారా! ఇక నేనే మిగిలి ఉన్నాను. నేనూ రాస్తానుండండి త్వరలో.

కుళాయి కవిత ని మొదట రెండు లైన్లు చదివి చీపురు కట్ట పైన కవిత్వం అనుకున్నా :)

krishna said...

మీరు దీన్ని చూసి పులకించి (inspire) అయ్యి రాసారని మాత్రం అనుకోవటంలేదు
Kotha Kavita

http://www.eemaata.com/em/issues/201109/1813.html

krishna said...

మీరు దీన్ని చూసి పులకించి (inspire) అయ్యి రాసారని మాత్రం అనుకోవటంలేదు
Kotha Kavita

http://www.eemaata.com/em/issues/201109/1813.html

krishna said...


చిలకలపూడి స్టేషన్నించి
చక్కా వచ్చానింటికి.
గేటు ముందు
చిత్తం వచ్చినట్టు పెరిగింది
పచ్చ గడ్డి.
కిటికీ భుజం మీదకు
కొమ్మ సాచి
స్నేహంగా ఊగుతోంది
దానిమ్మ.
వసారా చూరులో
గజిబిజి గడ్డి పోచల్లోంచి
కిచకిచలాడాయి
బుల్లి ఎర్ర నోళ్ళు.

గడియ తీస్తే
తలుపు మూల
తన పేరును వల్లె వేసుకుంటూ
ఇల్లలలుకుతోంది కందిరీగ.
పడగ్గదిలోకి తొంగి చూస్తే
పిల్లాపాపలతో పలకరింపుగా
మీసాలు ఊపాయి బొద్దింకలు.

వంట గదిలో
బంగాళా దుంపల పొట్టల్లోంచి
చొచ్చుకొచ్చాయి
బొటన వేలంత మొక్కలు.
నీళ్ళ బిందెలో
నింపాదిగా ఈత్తున్నాయి
చిరు చిరు తోక జీవులు.
చక్కెర డబ్బా ముందు
మాటలు మీటుతూ
కూలీ చీమల బారులు.
అల్మరా మూలల్లో
చీకటి లోపలి చీకటిలో
జోగుతూ బల్లి గుడ్లు.
చెక్క బీరువా మీద
చెద పురుగులు చెక్కిన
చిత్ర లిపి?

ధుమధుమలాడుతూ
కలియదిరుగుతుంటే
నా రాకను పసిగట్టి
ఆవలిస్తూ వచ్చి
హాజరీలో నిలబడ్డాయి
చెత్త బుట్ట
చీపురు కట్ట.

ఈమాత సౌజన్యం తో,రచన : ఇంద్రాణి

Zilebi said...

ఆ ?

సౌ !

మ్ ?

య !

సౌమ్యులకి కపి తలా ?

సౌ మొట్టికాయలండీ !

ఆ.సౌమ్య said...

@కృష్ణప్రియ గారూ
తప్పలేదండీ...కపితావేశం పెల్లుబికి వస్తుంటే రాయకుండా ఉండలేకపోయాను :) మీరు కూడా ఆలశ్యం చెయ్యకుండా రాసేయండి కపిత్వం. మేము చదివి పెడతాం. :D

@ కృష్ణ గారూ
హహహ మంచి కవిత అందించారు....చెత్తబుట్ట, చీపురుకట్ట....చాలా బావుంది. ఇది నేను ఇంతకుముందు చూడలేదు. బలే ఉంది. నా పులకింతకి ఇది కాదులెండి కారణం :)
thanks!

@జిలేబీ గారూ
సౌమ్యులం కాబట్టే సున్నితంగా కపిత్వాలు రాసేసాం. :))
అబ్బే ఇప్పుడు మొట్టికాయలు అవీ ఎందుకండీ, నాకసలే మొహమాటం..వెనక్కి తీసేసుకోండి :P

namasteandhra said...

సౌమ్య గారు, నమస్కారం.

అమెరికాలో మేం ప్రచురిస్తున్న నమస్తే ఆంధ్ర పత్రికలో బ్లాగ్లోకం అనే శీర్షికన బ్లాగుల్లోని టపాలను అందిస్తున్నాం. అలా వచ్చే టపాలన్నీ బ్లాగు చిరునామా, పేరుతో సహా వస్తాయి. ఇప్పటికే కొందరు బ్లాగర్ల అనుమతి తీసుకున్నాం. చదువరి, కొత్తపాళి, రెంటాల కల్పన, వేణువు వేణు, మనసులో మాట సుజాత తదితరుల బ్లాగుల నుంచి కొన్ని టపాలను ప్రచురించాం. అలాగే మీ బ్లాగు నుంచి టపాలను ప్రచురించడానికి మీ అనుమతి కావాలి. ఒకవేళ మీరు అనుమతిస్తే, ఎప్పుడు ఏ టపాను అందులో ప్రచురించదలచుకున్నా ముందుగా మీకు తెలియజేస్తాం., ఏవైనా అభ్యంతరాలుంటే తెలుపగలరు.

ధన్యవాదాలు

ఇది మా అక్టోబరు సంచికలో బ్లాగుల పేజీ లింకు.
http://issuu.com/namastheandhra.com/docs/na_oct_issue/27

namasteandhra said...

our another mail id
namonthly@gmail.com

ఆ.సౌమ్య said...

namasteandhra
నమస్కారమండీ
చాలా సంతోషం. తప్పకుండానండీ, నాకెలాంటి అభ్యంతరము లేదు. మీరు ప్రచురించదలుచుకునే ముందు ఒక్కమాట చెబితే చాలు.
ధన్యవాదములు

ఇట్లు
ఆ. సౌమ్య

luckysonu said...

కపిత్వం అంటే ఏమో అనుకున్నా !
నిజ౦గా ఇదే
ఇలా౦టి వాటికీ
www .luckysonu99 .blogspot .com

Anonymous said...

భావుకతని ఇంత అవమానిస్తారా... ఇంసల్ట్!

ఆ.సౌమ్య said...

@luckysonu
:))) Thank you!

ఆ.సౌమ్య said...

@tetageeti
మీరు మరీ పర్సనల్ గా తీసుకుంటున్నారు మురళీ గారూ :P
కొంపదీసి నా మీద మీ మార్కు పోస్టు వేస్తారా ఏమిటి...అబ్బే ఇది ఉత్తుత్తినే...అబ్బే :D

శశి కళ said...

sowmya...mee bhaavukatha denito polchalemu...keka ante...

kiran said...

బాబోయ్...గురూజీ..నమో..నమః..
దొర్లి దొర్లి దొర్లి నవ్వింగ్ ఇక్కడ :D
ఇలా రాయడం ఎలా..హౌ???

vivek said...

ahaa...oho...super....meeru kanipettina ee kottha saahithi prakriyaku nenu vaarasudni ayyi..mimmalni aadarshanga theesukoni tvaralone nenu rayaboye bhaava-kapitvalani bayataki theesukosthanu...!! :)

ఆ.సౌమ్య said...

@శశికళ గారూ
హిహిహిహి thank you

@ కిరణ్
హహహహ ఏంటో అంతా నీ అభిమానం...రాయడం ఎలా, హౌ అంటే ఏం చెప్పగలను....కొన్ని కొన్ని అలా వచ్చేస్తుంటాయి అంతే :)

@ వివేక్
హహహ...వారసుడివి అవుతావా..కుమ్మేయ్, చెప్తాను :D