కార్తీక్ పెళ్ళి అని తెలిసిన రెండు నెలల ముందు నుండి మొదలయ్యింది హడావుడి. తను పెళ్ళి తేదీ చెప్పగానే "అరే సరిగ్గా నేను మా ఊరు వెళ్ళే ట్రిప్ ప్లాన్ చేసుకునే టైములోనే పడిందే" అని ఒకింత ఆశ్చర్యం, సంబరం. బలే బలే అనుకుంటూ తయారయిపోయాను. చాలామంది బ్లాగు మితృలు వస్తున్నారని తెలిసి సంతోషమనిపించింది. బ్లాగు/బజ్జు లలో పరిచయమైన మితృలతో సరదాగా కబుర్లు చెబుతున్నానుగానీ ఇప్పటివరకూ కలవలేదు. బాగ తెలిసిన స్నేహితులు కానీ కలుసుకోలేదు...ఇప్పుడు కలుసుకోబోతున్నాను. బ్లాగు మితృలతో కలిసి హైదరాబాదునుండి ప్రయాణం....మరి హైదరాబాదులో మితృలను కూడా కలిసేస్తే పోలే! చాలామందికి కలుస్తానని చాలాసార్లు మాటిచ్చాను. కానీ కుదరలేదు. ఇప్పుడు అవకాశమొచ్చింది. నవంబర్ 10 సాయంత్రం మా ఊరునుండి రైలెక్కాను. ఎన్నో చిత్రమైన ఊహలు...వాళ్ళు అలా ఉంటారా, ఇలా ఉంటారా....ముఖాముఖి కలిసి మాట్లాడితే ఎలా ఉంటుంది! ఇవే ఆలోచనలతో గడిపాను.
బ్లాగులోకంలో ఒక పెద్దాయన మా ఇంటిపేరు చూసి మీకు ఫలనావాళ్ళు తెలుసా అని అడిగారు ఓ రెండేళ్ళ క్రితం. "తెలుసు" అని చెప్పగానే మొదలయ్యింది మా స్నేహం. ఆయనతో మాట్లాడుతుంటే మా మావయ్యతోనో, మా పెద్దన్నయ్యతోనో మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఆయానెవరో ఇంకా తెలీలేదా అదేనండీ మన పప్పుసారు - పప్పు శ్రీనివాసరావు గారు. హైదరాబాదులో రైలు దిగి నేరుగా పప్పుశ్రీనివాసరావు గారింటికి వెళ్ళాను. మరి ముందే మాటిచ్చేసాను కదా. నేను ఢిల్లీ నుండి బయలుదేరుతున్నాను అని చెబితే "పుట్టింటికి స్వాగతం" అని చెప్పారు. ఏంటో అనుకున్నాను...కానీ నిజంగా అక్కడకి వెళ్ళాక నాకు మా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. కాంతిగారు ఎంత సరదాగా, ఎంత చనువు గా మాట్లాడారని. ఇంట్లో పిల్లలాగే చూసుకున్నారు. నిజంగా నాకు అస్సలు కొత్తగా అనిపించలేదు. వాళ్ళ అమ్మాయి ఎంతో సరదాగా కబుర్లు చెప్పింది. నాకస్సలు కొత్తగా అనిపించలేదు. వాళ్ళింట్లో పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి బోల్డు కబుర్లుచెప్పి బయలుదేరుతుటే....కాంతి గారు బొట్టు పెట్టి, బట్టలు చేతిలో పెట్టారు. మొదట కోపం వచ్చినా, ఆ ఆప్యాయతకి, అభిమానానికి మనసు తడి అయ్యింది.
ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఇంచుమించు ఒకటే. కబుర్లు చెప్పుకోవడం మొదలెట్టామా గంటలు గంటలు...టైమెంత గడిచిందో తెలియదు. మనిషిని చూడకపోయినా మనసుకి ఎంతో దగ్గర. ఆవిడ దగ్గర నాకెంతో చనువు, ఎంతో అభిమానం. మరి ఆవిడకి నేనంటే ఇంకా అభిమానం లేకపోతే నాకెందుకు కావలసిన పుస్తకాలు పంపిస్తారు చెప్పండి. :D మీకర్థమయిపోయింది కదూ...అవును, సుజాతగారే....చిన్ననాటి స్నేహితురాలిని కలిసినట్టు అనిపించింది. గలగల కబుర్లు చెప్పేసుకున్నాం. నాకిష్టమైనవన్నీ వండి పెట్టారు మధ్యాన్నం భోజనానికి. బలే తమాషాగా అక్కడకి వేణు గారు వచ్చారు. ఉన్నది కొన్ని నిముషాలే అయినా, ఆయనని కలిసి మాట్లాడడం బావుంది. ఇంతలో గురువుగారు ఫోను "వస్తున్నానండీ" అని. ముందే తెలుసు బులుసుగారు వస్తునారని. ఇంక ఇద్దరం ఎదురుచూస్తూ కూర్చున్నాం. నవ్వితే నవ్వండి అనుకుంటూ వచ్చేసారు. అదే సమయానికి నా ప్రియస్నేహితురాలు అపర్ణ వచ్చింది. ఇంకేముంది కబుర్లే కబుర్లు. బులుసు గారిని కలవడం ఎంత సంతోషమనిపించిందో చెప్పలేను. బ్లాగులో ఎంత హుషారుగా టపాలు రాస్తారో అంతే హుషారుగా కబుర్లు కూడా చెబుతారు. ఆయన శరీరానికే వయసొచ్చిందిగానీ మనసుకి కాదు. మాతో కలిసిపోయి ఎంత చక్కగా మాట్లడారో....ఆయన హుషారు చూస్తే నాకు కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. ఈలోగా నమూనా అదే అదే నాగమురళీధర్ నామాల వచ్చారు అక్కడకి. :) తరువాత రెహ్మాన్ వచ్చాడు. వీళ్ళందరినీ ఇలా కలుసుకోవడం ఎంత బావుందో చెప్పలేను. క్షణాలు ఎలా దొర్లిపోయాయో తెలియలేదు. సుజాతగారింటికి వెళ్ళడం, కబుర్లుచెప్పుకోవడం....ఒక గొప్ప అనుభూతి. నేను జీవితంలో అపురూపంగా దాచుకునేవాటిలో సుజాతగారి స్నేహం ఒకటి.
(వరూధినిగారూ...అలా చూడకండి...నాకు వణుకొస్తోంది...బాబోయ్ గజ గజ. :( నేను పప్పుసారింటికి, సుజాతగారింటికి మాత్రమే ప్లాన్ చేసాను. మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోయాయి. ఈసారి మీ ఇంటికి తప్పకుండా వస్తానని మాటిచ్చాగా...మనిద్దరం మధ్య ఒప్పందం జరిగిపోయింది...మీరు మళ్ళీ అలక్కూడదన్నమాట, నాతో మాట్లడకుండా ఉండకూడదన్నమాట..సరేనా! ) :D
రాత్రి ప్రయాణం అనంతపురానికి అదే జీవనికి. మజ్జిగ చిలికే (మనసుపలికే-అపర్ణ), అల్లవుద్దిన్ మిల్క్ షేక్(రెహ్మానుద్దిన్ షేక్), గెంతి (బంతి), కలిసి రైలెక్కాం. సుజాతగారు మాకు రైల్లోకి ఫలహారాలు కట్టిచ్చారు. నాకిష్టమైన బొబ్బట్లు నాకోసం ప్రత్యేకంగా కట్టి ఇచ్చారు. రైలు ప్రయాణం ఎంతో సరదాగా సాగిపోయింది. బంతి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎంత శ్రద్ధ, ఎంత caring, ఎంత బాధ్యత! ఎవ్వరికీ అసౌకర్యం కలగకూడదని ఎంత తాపత్రయపడ్డాడో! బలే ముచ్చటేసింది నాకు. అనుకున్నట్టుగానే జీవని ప్రసాద్ గారింట్లో దిగాము. ఆయనకి ఇబ్బంది అవుతుంది మనసులో అనిపిస్తూనే ఉంది గానీ వేరొకచోట దిగడానికి ఆయన ససేమిరా అన్నారు. అక్కడకు చేరాక నా కుడిభుజం, ప్రియ మితృడు అయిన రాజ్ ని కలుసుకోవడం గొప్ప ఆనందంగా అనిపించింది. నా బజ్జు నేస్తాలయిన నాగార్జున, వికటకవి శ్రీను, వెన్నెల కిరణ్ కూడా వచ్చారు.
జీవని గురించి గత యేడాదికి పైగా తెలుసు. ప్రసాద్ గారి నిజాయితీ, సమర్థత...జీవని సభ్యుల దయార్ద్ర హృదయం గురించి తెలుసు కానీ అక్కడికి వెళ్ళి కళ్ళారా చూసాక అర్థమయ్యింది మన బ్లాగుల్లో జీవని గురించి విన్నది కన్నది ఎంతో తక్కువ అని. మేరుపర్వతమంటి మనసులు అంటే ఏంటో స్వయంగా చూసాకగానీ అర్థం కాలేదు నాకు. వారి ముందు చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో చిన్నదిగా కనిపిచింది. కుటుంబంలో ఏ ఒక్కరికో ఇటువంటి మనసు ఉంటే సరిపోదు బృహత్కార్యాలకి....ఎలా రాసిపెట్టి ఉందో, ఎక్కడ కుదిరారోగానీ ప్రసాద్ గారు, వారి సతీమణి made for each other మాత్రమే కాకుండా also made for others అనిపించారు. దాదాపు పదిమందిమి వెళ్ళాము అక్కడకి. పొద్దున్నే లేచి ఎంతో ఓపికతో మాకోసం ఫలహారాలు, మధ్యాన్నం భోజం అన్నీ వండి ఎంతో ఆదరణ చూపించారు. ప్రసాద్ గారి తల్లిదండ్రులు వయసులో ఎంత పెద్దవారో మనసులోనూ అంతే పెద్దవారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. "మాకోసం చాలా శ్రమపడుతున్నారండీ" అంటే "నీకలా కనిపిస్తున్నాదా? చూడు మా ముఖాల మీద చెమట బిందువైనా లేదు" అని నవ్వుతూ చమత్కరించారు. వారి ఆప్యాయత చూసాక నాకు అనిపించింది "జీవని పిల్లలు ఎంత అదృష్టవంతులో" అని. జీవని విద్యాలయం కడుతున్న చోటు చూడడానికి వెళ్లాము. మాతో పాటు కారులో ఎవరో ఇద్దరుముగ్గురు వచ్చారు. వారెవరో తెలీదు. ఒక కుర్రాడు...నాకంటే కొంచం పెద్దవారేమో, రాజ్ తో ఏవో మాట్లాడారు. ఎవరోలే అని నేను పట్టించుకోలేదు. జీవని విద్యాలయం కడుతున్న ప్రదేశం ఎంత బావుందని! చుట్టూ కొండలు, పచ్చని చెట్లు......ఆహ్లాదకరమైన ప్రకృతి. అటువంటి బడిలో, ఆ ప్రకృతి ఒడిలో పిల్లలు పెరిగితే ఇంక అంతకుమించి అదృష్టం ఏముంది. ఎదురుగా ఉన్నా "శ్రీనివాస రామానుజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(SRIT) కి వెళ్లాము. అక్కడకి వెళ్ళగానే ఒకతను వచ్చి మీరొస్తున్నారని చైర్మేన్ గారు చెప్పారంటూ సాదర అతిధి మర్యాదలు చేసి కాలేజీ మొత్తం చూపించాడు. ఈ చైర్మేన్ ఎవరబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయాను. SRIT చాల పెద్ద కాలేజీ. విశాలమైన ప్రాంగణం, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లేబ్స్, తరగతి గదులు. అక్కడ నన్ను బాగా ఆకర్షించినది వారి రీడీంగ్ రూం మరియు లైబ్రరీ. ఏ కాలేజీ లైబ్రరీలలోనూ చూడని పుస్తకాలు కనిపించాయి అక్కడ. పాఠ్య పుస్తకాలతోపాటు మంచి తెలుగు సాహిత్యం కనిపించింది. నాకిష్టమైన పుస్తకాలెన్నో కనిపించాయి. ఆ పుస్తకాల సేకరణ వెనుకాల కర్త, కర్మ క్రియ జీవని ప్రసాద్ గారేనని తరువాత తెలిసింది.
కాసేపటికి బిలబిలమంటూ పిల్లలు చుట్టుముట్టారు. అక్క, అన్నయ్యా అంటూ మా ఒళ్ళో కూర్చుని, భుజాలమీదెక్కి ఊపిరి సలపనిచ్చారు కాదు. మేము తెచ్చిన చిన్న చిన్న బహుమతులు అందుకుంటుంటే వారి మొహాలలో వెల్లివెరిసిన ఆనందం చూసి "ఇది చాలు ఈ జన్మకి" అనిపిచింది. ఆ చిన్నారుల నవ్వుల ముందు వేల వజ్రాలు కూడా దిగదుడుపే. చిట్టి పొట్టి పిల్లలు సీతాకోకచిలుకల్లా చుట్టూ చేరి "అక్కా ఇది కావాలి, అది కావాలి, వీడు చూడు ఇలా చేస్తున్నాడు, నా రిబ్బను పోయింది, నేనో జోక్ చెబుతా, నేను మిమిక్రీ చేస్తా, నేను పాట పాడుతా, నాకు ఇన్ని మార్కులొచ్చాయి, మా మేషారు ఇలా అన్నారు " అని కబుర్లు చెబుతుంటే ఏవో తెలియని ఆనందలోకాల్లో విహరిస్తున్నట్టు అనిపించింది. నాకు జామకాయలు ఇవ్వలేదు అని ఒక పిల్ల అలక, వీడు నన్ను బెదిరిస్తున్నాడు అని ఇంకో పిల్ల కోపం, అమ్మాయిల చేతికి ఏవో వేసారు (గాజులు) అవి నాకు కావాలి అని ఒక బుజ్జి బాబు అల్లరి, నాకు ఫొటో తియ్యవా అన్నయ్యా అని ఇంకో చిన్నారి సరదా....ఓహ్ ఒకటా, రెండా! వారి అలకలు తీరుస్తూ, బుజ్జగిస్తూ, సరదాగా ఆటపట్టిస్తూ, చక్కిలిగింతలు పెడుతూ నేను నా వయసు మరచిపోయి చిన్నపిల్లనైపోయాను. వారితో గడిపిన ఆ కొన్ని గంటలు వెలకట్టలేనివి. వారితో సమయం గడిపిన తరువాత అమ్మ ఒడిలో నిదురిస్తున్నంత ప్రశాంతంగా అనిపించింది. ఎర్రటి ఎండ తరువాత కురిసిన చిరుజల్లు వలే హాయిగా అనిపించింది. మనసుకి కొత్త శక్తిని, కొత్త ఉత్తేజాన్ని కలిగించింది.
మధ్యాహ్నం మా అందరి భోజనాలయ్యాక పిల్లలకి భోజనాలు పెడుతున్నారు ప్రసాద్ గారి అమ్మగారు మరియు శ్రీమతి. వారితో పాటు రెహ్మాన్ కూడా వడ్డిస్తున్నాడు. అటుగా వెళ్తూ ఈ తతంగాన్ని గమనించాను. మొత్తం పాతిక మంది పిల్లలకి ఎంతో లాలనగా, ఒక్కొక్కరిని ప్రత్యేకంగా చూస్తూ, ఎవరికి ఏమి కావాలో శ్రద్ధగా అడిగి తెలుసుకుని, కొసరి కొసరి వడ్డించి, తినకపోతే మెల్లిగా మందలించి ఆప్యాయంగా తినిపిస్తున్నారు వారు. ఆ దృశ్యం చూసి నా కళ్ళకొసల నీరు నిలిచింది. ఆ కరుణార్ద్రహృదయులముందు నాకు నేను ఎంతో చిన్నదానిగా కనిపించాను. వారి జీవితం ఎంత ధన్యం! ఇంక నేను ఆగలేకపోయాను. వారితో చేరి నేనూ కూడా పిల్లలకు వడ్డిస్తూ, తినిపిస్తూ అలౌకికానందాన్ని పొందాను. అన్నాలయ్యాక విశ్రాంతి తీసుకుంటుంటే ఇందాకల కారులో కనిపించిన కుర్రాడు మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ పక్కనే బల్లేసుకుని మామూలుగా, అతిసాధారణంగా అందరిలాగా భోజనం చేస్తున్నారు. ఎవరబ్బా ఇతను అని విచారిస్తే అతనే ఆ SRIT చైర్మేన్ సాంబశివరావుగారు అని తెలిసింది. అవాక్కయిపోయాను, నిజంగా. ఎంత సాదాసీదాగా ఉన్నారు! ప్రసాద్ గారిని అభిమానంగా అన్నయ్య అని పిలుస్తూ, ఏ భేషజం లేకుండా, ఇంట్లో మనిషిలాగ మెసలుతున్నారు. SRIT లో మాకు నచ్చిన విషయాలు తెలియపరుస్తూ వారిని మనస్పూర్తిగా అభినందిందాము. జీవని విద్యాలయంలో వీరూ భాగస్వాములే అని తెలిసి సంతోషించాము.
ఇందరి కరుణమాయుల చల్లని చేతులలో ఎదగబోయే ఆ పసిమొగ్గలకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. ఎవరన్నారు ఆ పిల్లలకి ఎవరూ లేరని?...చల్లని మనసులు కలిగిన ఇందరు ఉత్తములు వారికి అండగా ఉండగా వారికన్నా ధనవంతులు ఎవరు!
ఆ భూమి మీద విరిసిన నక్షత్రాల కోసం ఇంతటి కృషి చేస్తున్న ప్రసాద్ గారి కుటుంబానికి, మిగతా జీవని సభ్యులకు ఇవే నా హృదయపూర్వక జోహార్లు. నేను సైతం నేను సైతం జీవని పాటకు గొంతు కలిపేను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.
ప్రసాద్ గారి కుటుంబ సభ్యుల అభిమానాన్ని, చిన్నారుల నవ్వుల పువ్వులను ఒడుపుగా మూటగట్టుకుని కార్తీక్ పెళ్ళికి పులివెందులకి బయలుదేరాం. ఇంక అక్కడనుండి మొదలయ్యింది ఆనందహేల. బ్లాగులోనూ, బజ్జులోనూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉండే మేము అందరం ఇలా డైరెక్ట్ గా కలిస్తే ఇంకేమైనా ఉందా...మా నవ్వులతో పులివెందుల దద్దరిల్లింది. మా ఆటపాటలతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. మేము మా గోల తప్ప మరో ప్రపంచాన్ని పట్టించుకోలేదు. పెళ్ళికి శంకర్ గారు, విజయమోహన్ గారు, నాగ ప్రసాద్ కూడా వచ్చారు. ఇంక ఆటలు, పాటలు, అరుపులు, కేకలు, జోకులు, సెటైర్లు...ఒకటేమిటి...రెండు రోజులు ఎడతెరిపి లేకుండా నవ్వుతూనే ఉన్నాం. ఒక్కసారిగా కాలేజీ రోజులకు వెళ్ళిపోయినట్టనిపించింది. అందరం చిన్నపిల్లలమైపోయాం. ఎప్పటినుండో పరిచయమున్న నేస్తాల్లా కబుర్లు చెప్పేసుకున్నాం. కార్తీక్ అటువైపు పెళ్ళిలో కూర్చున్నాడేగానీ మనసంతా ఇటువైపే ఉంది. పది నిముషాలకొకసారి మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు.
ఇంక అసలు విషయం గురించి నాలుగు మాటలు - అదే కార్తీక్ పెళ్ళి - వధూవరులిద్దరూ చిలుకాగోరింకల్లా లాగ చక్కగా ఉన్నారు. పెళ్ళి చాలా బాగా జరిగింది. రాయలసీమ, కర్ణాటక రుచులతో పసందైన భోజనాలు, అందమైన పందిళ్ళు, అభిమానించే మనుషుల మధ్య కార్తీక్ పెళ్ళి వైభోగంగా జరిగింది. కార్తీక్-సౌమ్య లు కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, స్నేహితుల్లా కలిసిమెలిసి ఆనందంగా జీవితం గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వారిద్దరికీ వివాహమహోత్సవ శుభాకాంక్షలు!
పెళ్ళి అయిన తరువాత మేమంతా చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. ఎంత మంచి విషయమైనా ముగింపుకి రాక తప్పదు కదా.... మరచిపోలేని మధురానుభూతులను మూటగట్టుకుని, అందరివద్దా వీడుకోలు తీసుకుని ఎవరిదారిన వాళ్ళు బయలుదేరాం. మళ్ళీ ఎప్పుడో, ఎక్కడో.....తప్పకుండా కలుసుకుందాం నేస్తాలూ!
మూడురోజులు ఆనందజలధిలో ముంచేసి, అందమైన అనుభూతులను బహుమతిగా ఇచ్చిన బ్లాగు/బజ్జు నేస్తాలందరికి ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతలు!
40 comments:
ఓహ్ అద్బుతం.....సౌమ్య గారు
మంచి మనుషులు,మానవత్వాలు...ఇంత ప్రేమ గురిచి ఉదయం నుంచి చదువుతూ మనసు చాల హాయి గ ఉంది.మాతో ఈ విషయాలు అన్ని పంచుకున్నందుకు ధన్యవాదా
nice nararation
అబ్బ.. సౌమ్య గారూ... ఎంత ఓపిగ్గా రాశారో.. అద్భుతం అంతే:):) నేను మిస్ చేసిన విషయాలు కూడా రాసి మరి కొన్ని ఙ్ఞాపకాల్ని ముందుంచారు. చదువుతుంటే మళ్లీ మళ్లీ ఆ రెండు రోజులకే వెళ్లిపోతున్నా.:) అయినా మళ్లీ మళ్లీ చదువుతున్నా. అద్భుతం సౌమ్య గారు:):)
మమ్మల్ని కూడా నీతో పాటు జీవనికి తీసుకెళ్ళిపోయావు అంతే ఈ పోస్టుతో
చాలాఆఆఆ రోజులైంది మీ బ్లాగులో కామెంట్ పెట్టి.
హైదరాబాద్ ఎపిసోడ్ ఎందుకు మిస్సయ్యానా అనేంతగా రాసారు....ప్చ్ బ్యాడ్ లక్.
ప్రసాద్ గారి కుటుంబసభ్యుల గురించి సరిగ్గా చెప్పారు ’they are made for others' అని :)
బ్లాగ్ మిత్రులను చిన్నారులను కలుసుకునే అవకాశం ఇప్పించినందుకు ఈ బ్లాగుముఖంగా ప్రసాద్ గారి కుటుంబసభ్యులకు, ’జీవని’ బృందానికి, పన్లోపని కార్తిక్ కు ధన్యవాదాలు _/\_
చాలా బాగా జరిగినట్లుంది మీ ట్రిప్.. చదువుతుంటేనే, భలే ఉంది అనిపిస్తుంటే, అవన్నీ అనుభవించడం గ్రేట్!
జీవని ప్రసాద్ గారి గురించి తెలుసుకోవడం ఇంకా బావుంది :)
నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టించేసారు సౌమ్యా.. :(
ఏం చెప్పాలో తెలీట్లేదు.. మేం రాలేకపోయినా మీరందరూ అక్షరాల్లో మీ మధురానుభూతిని మాకూ పంచుతున్నందుకు బోల్డు థాంకులు..
ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఉండే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బ్లాగు బజ్లో కలిసిన స్నేహితులందరూ అభిరుచి కలిపిన నేస్తాలవడం, దాదాపూ ప్రతీ రోజూ అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉండటంతో నిజంగా అందరూ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న చిన్నప్పటి నేస్తాల్లా అనిపిస్తారు. వాళ్ళందరినీ బయట కలుసుకుని సరదాగా సమయం గడిపే అవకాశం రావడం నిజంగా అదృష్టం. మీరన్నట్టు, భవిష్యత్తులో ఎప్పుడో ఎక్కడో మనందరం కలిసే అవకాశం రావాలని కోరుకుంటున్నా.. :)
ఏమో, నాకైతే నిన్ను మొదటి సారి కలుసుకున్నట్లు అనిపించనే లేదు. బహుశా మనం ఎప్పుడూ ఉత్తరాలు, ఫోన్లలో కలుసుకుంటూ ఉండటం వల్లనో, లేదా ఆలోచనల్లో సారూప్యతో మరి!
సమయం మాత్రం ఇట్టే గడిచిపోయింది. బులుసు గారు,అపర్ణ రావడం నిజంగా చాలా సంతోషం కల్గించింది. సమయానికి మురళి కూడా! మురళి అంత సీరియస్ సెన్సిటివ్ బజ్జులు రాస్తాడా.....వచ్చాడంటే బోల్డు నవ్వులు పంచుతాడు. వాళ్ళ కారు డ్రైవర్ సంగతి చూడు, ఎంత జోవియల్ గా చెప్పాడో!
అన్నింటికంటే ముందు, నీ ఓపిక్కి మెచ్చుకోవాలి. అంత హడావుడిగా అన్నిప్లేసులు ఒక్కదానివీ ఎలా తిరిగావో!
మొత్తానికి నీకు నా లైబ్రరీ లోంచి ఏం పుస్తకాలు కావాలో తీసుకోమని సడన్ గా అందామని ముందు ప్లాన్ చేశాను. కానీ కబుర్లలో పడి మర్చే పోయాను. నువ్వైనా అడగాలా వద్దా?
నువ్వు ప్రేమతో తెచ్చిన మీ విజీనారం కోవా రుచి మర్చిపోలేకుండా ఉన్నాం! అక్కడినుంచి ఎవరైనా హైద్ వచ్చేవాళ్లుంటే, వచ్చినప్పుడల్లా తెచ్చే ఏర్పాటు చూడరాదూ?
మళ్ళీ ఎప్పుడు హైద్రాబాదు వచ్చినా, మా ఇంటికి రాకుండా వెళ్ళావో? నీ పని అయిందే!
సూపరు.. మనం కలిసిన తర్వాత విష్యాలు తెలిసినవే గానీ హైదరాబాద్ విషయాలు ఇప్పుడే తెలిశాయి.
నేనెప్పుడు కలుస్తానో మరి..;)
నిజం చెప్పొద్దూ.. పెళ్ళికి బయలుదేరే రోజు కోసం వారం రోజుల ముందు నుండీ రోజులు లెక్కపెట్టుకున్నాను. ఇంత మంది స్నేహితులని కలవటం అంటే మాటలా మరీ?
నా జీవితం లో మరిచిపోలేని రోజుల్లో ఆ రెండు రోజులు ఉంటాయ్.
మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏమో..! భలే తాజా జ్నాపకాలు సెగట్రీగోరూ.. భలే రాశారు ;)
simply superb
కార్తీక్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ఇంత మంది ఆప్తులని పోండి వారి ఆదరణలో తడిసి ముద్దయిన మీరు నిజంగా అదృష్టవంతులే! మీలో ఒకదానిని కానందుకు చాలా బాధగా ఉంది!
Jealous!Jealous!Jealous!!!
చాలా బాగా రాసావ్ సౌమ్య.. అయితే ఈ ట్రిప్ చాలా మంది బ్లాగర్స్ని కలిసావన్నమాట... అసలు ఎక్కువ మంది బ్లాగర్స్ని కలిసిన ఘనత నీదేనేమో :)))
I hate you
I hate you
I hate you :-)
పై కామెంట్ బట్టి అర్ధం అయ్యింది కదా.. మీరు ఎంత కళ్ళకు కట్టినట్టు రాసారో ...
జీవని గారి గురించి ఎప్పుడు విన్నా చాలా గర్వం గా ఉంటుంది... అలాంటి ఆయన మన స్నేహితుడు అని.. మీరు రాసిన విధానం మరింత బాగుంది....
>>> ఇందరి కరుణమాయుల చల్లని చేతులలో ఎదగబోయే ఆ పసిమొగ్గలకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు.........
Well said. జీవని ప్రసాద్ గారికి అభినందనలు.
నేను కార్తీక్ గారి పెళ్ళికి రాలేక పోయినందుకు ఇప్పుడు చింతిస్తున్నాను. మీ సరదా కబుర్లు మాతోటి పంచుకున్నందుకు సంతోషం.
ఈ జీవన సంధ్యా సమయం లో మీ అందరి పరిచయం కలగడం, ప్రత్యక్షం గా కొంతమందిని కలవడం నా అదృష్టం గా భావిస్తున్నాను. థాంక్యూ.
ఆ రెండు రోజుల మన అల్లరి మరోసారి గుర్తొచ్చింది. చాలా బీబత్సంగా ఎంజాయి చేసిన రోజులవి. మల్లి ఎప్పుడు కలుస్తామో తెలీదు గానీ జీవని లోనే కలవాలి అని ఉంది
Excellent post!
సౌమ్యా చాలా బాగా రాసావు ... కళ్ళకు కట్టినట్టుగా రాయడం వాళ్ళ ఏమిటో చాలా మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది
మేము పెళ్ళికి రాలేదు అనే ఫీలింగ్ నీ పోస్ట్ చదవడం వల్ల తగ్గింది ..ఎందుకంటే నువ్వు కళ్ళకు కట్టినట్టు చూపించావు గా
జీవని పిల్లలగురించి రాసినా ఆ పేరాలు చదివేటప్పుడు అనుకోకుండానే కళ్ళంటా నీల్లోచ్చాయి .... నువ్వు చాలా లక్కీ అందరినీ కలిసావు ... వారందరి ఆత్మీయతా కళ్ళారా చూసే అదృష్టం దక్కింది
నువ్వన్నట్టు భవిష్యత్తులో ఎప్పుడో ఎక్కడో మనందరం కలిసే అవకాశం రావాలని కోరుకుంటున్నా.. :)..
అందరికీ ధన్యవాదాలు. మీరు ఇలా బ్లాగుకొరు చొప్పున పొగిడితే భయం వేస్తుంది. ఇక్కడ మేము సంస్థను నిర్వహిస్తుండొచ్చు కానీ, జీవనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తున్న వందలాది మంది మంచి మనుషులకు మీ అభిమానాన్ని, పొగడ్తలను,క్రెడిట్ ను బదిలీ చేస్తున్నాము. ఇదొక కలెక్టివ్ వర్క్. మేం కొంత మందిమి ఏమీ చేయలేము. ఎంతో మంది సహకారం వల్లే సాధ్యం. మీరు ఇస్తున్న నైతిక , ఆర్థిక మద్దతుతో జీవని సంస్థను, జీవని విద్యాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దడానికి మా శాయశక్తులా పనిచేస్తాం.
మంచుపల్లకి గారు,
ముందుగా కార్తీక్ కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు...
ప్రతి పేరా మళ్ళీ మళ్ళీ చదవాలానిపించేలా వ్రాశారు. అలాగే కొన్ని ఫోటోలు కూడా పెట్టవలసింది:-)
ఈసారి ఎప్పుడన్నా కుదిరితె జీవని కి ఒకసారి వెళ్ళిరావాలి
@ పానీపూరీ 123
రాసినది నేనండీ, మంచు పల్లకి గారు కాదు :((
ఇది నా బ్లాగు :(((
> ఇది నా బ్లాగు :(((
హో మాయాశశిరేఖ/సౌమ్య గారు, పేరు తప్పు సంభోదించినా, మిగిలిన సమాచారం అంతా మీ బ్లాగ్‌కి సంభందించినదే :-)
చాలా బాగా రాశారు సౌమ్య :-) మమ్మల్ని కూడా మీతో తిప్పేశారు :-)
బాగుంది సౌమ్యా.. దూర ప్రయాణాలయినా శ్రమకోర్చి పిల్లలని కలిసి వాళ్ళ మనసుల్లో ఆనందాన్ని నింపి మంచి పని చేశారు. మీకందరికీ అభినందనలు. నూతన దంపతులకి శుభాకాంక్షలు.
కెవ్వు కేక :)
>>వారి సతీమణి made for each other మాత్రమే కాకుండా also made for others అనిపించారు ఈ వాక్యం ఎంత నిజమో కదా..!!
లవ్లీ పోస్ట్ :)...
@శేఖర్
ధన్యవాదములు!
అవునండీ...మంచి మనుషుల మధ్య గడిపిన ఆ క్షణాలు అపురూపం!
@ sivaprasad గారూ
thanks
@ అప్పు
:)) నేను ఇది ఇంత విపులంగా రాయడానికి కారణం అదే...చదువుకున్న ప్రతీసారీ ఆ రెండురోజులకూ వెళ్ళిపోవచ్చు :)
@ పప్పుసారూ
ధన్యవాదములు...మరి మీరు రాలేదుగా, అందుకే :)
@ నాగార్జున
అవును, హైద్ ట్రిప్ లో నువ్వు కూడా ఉండి ఉంటే బాగుండేది. అయినా అక్కడ అనంతపురంలో నిన్ను కలుసుకోవడం బావుంది...happy to meet all of you!
@ మేధ గారూ
thanks, అవునండీ బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం!
@ మధురా
:)) మళ్ళీ అందరం కలుద్దాములే...నువ్వొచ్చినప్పుడు మళ్ళీ ప్లాన్ చేద్దాం, సరేనా! కళ్ళు తుడిచేసుకో :)
@ రాజ్
హహహహ..అవునూ వారమేంటి పది రోజులముందునుండే ఎప్పుడొస్తునా ఆరోజు అని నేను రోజులు లెక్కెడుతూ ఉన్నా!
భలేగా ఎంజాయ్ చేసాం కదా :)))
@ సుజాత గారూ
అవునండి, మీరైతే అస్సలు నాకు కొత్తగా అనిపించ్లేదు. మీ ఇంట్లో అనదరం కలుసుకోవడం బావుంది.
>>మొత్తానికి నీకు నా లైబ్రరీ లోంచి ఏం పుస్తకాలు కావాలో తీసుకోమని సడన్ గా అందామని ముందు ప్లాన్ చేశాను.<<
వా ఆ వా ఆ...ఆ మాట ఇప్పుడా చెబుతారు...అన్యాయం!
మీ పుస్తకాల వైపు ఆశగా రెండు మూడు సార్లు చూసాను కూడాను...వా ఆ వా ఆ :((
హహహ కోవా..తప్పకుండా మీరు అడగాలేగానీ ఆ మాత్రం ఏర్పాటు నేను చెయ్యనూ!
@ పక్క (బ్లాగు) ఇంటి అబ్బాయిగారూ
:))
ధన్యవాదములు!
@ రసజ్ఞ గారూ
Thanks
@శారద గారూ
హహహహ :))
@ నేస్తం
thanks...అవునండోయ్, ఎక్కువమంది బ్లాగర్లను కలిసిన ఘనత నాదేలా ఉంది...నేను గమనించనేలేదు సుమీ :)
@ మంచు గారూ
హహహహ పర్లేదు పర్లేదు...ఇంకా హేటండి..ముందు ముందు ఇంకా రాస్తాగా :)))
అవును, జీవని గారు మనకి ఫ్రెండు అవ్వడం మన అదృష్టం.
ధన్యవాదములు!
@ బులుసుగారూ
అదృష్టమంతా మాదండీ. :) మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది
ధన్యవాదములు!
@గిరీష్
thanks a lot
@ శ్రీను
thanks
తప్పకుండా మళ్ళీ కలుద్దాం...అది జీవనిలో అయితే మరింత సంతోషం :)
@శివరంజని
thanks...yes మనం తప్పకుండా కలుద్దాం! :)
@ ప్రసాద్ గారూ
జీవనిలో భాగమయిన సభ్యులందరికీ మా జోహార్లు!
ధన్యవాదములు!
@పానీపూరి గారూ
ధన్యవాదములు!
తప్పకుండా జీవనిని సందర్శించి రండి. మీకు మంచి అనుభూతులు మిగులుతాయి...నాది గ్యారంటీ!
@వేణు
thanks a lot!
@ శిశిర గారూ
ధన్యవాదములు!
పిల్లలతో ఆడిపాడేసరికి ప్రయాణ శ్రమ తెలీనే లేదండీ :)
@కిరణ్
thanks a lot :)
ammo...ammo..ammo...entha kutra..entha mosam...mundocchina orkut kante venakocchina facebook ekkuva ainattu....nannu vadilesi mee blog frnds ni kalusthara.....chusthunna..chusthunna...antha observe chesthunnaa....:x
(me posts chaduthunna kani,comments rayalante telugu lo type cheyalemo anukoni aagipothunna,tarvata cheddham le ani...kani,chivariki itlane kanisthunna...em anukokundri...mana baddhakam meeku thelsu kada..:D)
@వివేక్
ఆహ..హైదరాబాదులో ఉన్నన్నాళ్ళు కలిసావేమిటి? ఫోన్ చేస్తావు తప్ప ఎప్పుడైనా వచ్వావా నన్ను చూడడానికి? నేను పెద్దదాన్ని, నువ్వు చిన్నవాడివి. పెద్దవాళ్ళని చూడడానికి చిన్నవాళ్ళే రావాలి! :)
హహహ సరదాకి అన్నానుగాని...ఈసారి తప్పకుండా కలుస్తాను, నీకిస్తానన్న పుస్తకం కూడా ఇస్తాను, సరేనా! మొన్న పెళ్ళి హడావుడిలో కుదరలేదు.
తెలుగులో రాయడం చాలా సులువు వివేక్. లో రాయొచ్చు. lekhini.org లో చక్కగా సులువుగా రాయొచ్చు. ఇవాళే మొదలెట్టు. next time నువ్వు నా బ్లాగులో కామెంటు రాసేటప్పుడు తెలుగులో రాయాలి, సరేనా?
చదువుతున్నట్టుగా లేదు .....................
అవును నిజం ....................................
..................................................
..............................................
కోపగించుకోకండి
నా అభిప్రాయం నేను చెప్పాను..
................
చదువుతున్నట్టుగా లేదు
.....................................
నేను కూడా అక్కడుండి ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఉంది
బుద్ధమురళి గారూ
ధన్యవాదములు! మీకు అలాంటి భావన కలిగినందుకు చాలా సంతోషం! :)
Post a Comment