StatCounter code

Friday, September 2, 2011

సహాయం చెయ్యండి...ప్లీజ్! (updated)

Up date -1 (02-09-2011)

ప్రతీక్ కి సొంత అక్కచెల్లెళ్ళు, అన్నాదమ్ములు ఉంటే వాళ్ళ బోన్ మేరో తో ప్రతీక్ బోన్ మేరో 99% మేచ్ అవుతుంది కాబట్టి పని సులువయ్యేది. కానీ ప్రతీకే మొదటి బిడ్డ. తన తల్లి బోన్ మేరో ని టెస్ట్ చేసారు. రిపోర్ట్స్ నిన్న సాయంకాలం వచ్చాయి. తల్లి బోన్ మేరో తో కుదరదని చెప్పారు. కాబట్టి ఆ option కూడా మూసుకుపోయింది. ఇంక డోనర్స్ కోసం వేచి చూస్తున్నారు. కేసు ఇంకా complicate అయ్యింది. ఇప్పుడు డోనర్ involve అయి ఉన్నారు కాబట్టి కావలసిన డబ్బు 20 లక్షలు దాటుతుందని అంచనా. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అది కనుక మంజూరు అయితే 10 లక్షలు వస్తాయి. అయినా కూడా ఇంకా 15-20 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. దయచేసి సహాయం చెయ్యండి. చిన్నారి ప్రతీక్ ని బ్రతికించండి.

Actual (01-09-2011)

ముందుగా బ్లాగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు!

ఈ పండుగ రోజు ఇటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు బాధగా ఉంది కానీ తప్పట్లేదు.

నా స్నేహితుడు దూసీ శ్రీనివాస్, చీపురుపల్లి వాస్తవ్యుడు, ఇప్పుడు హిస్టరీలో phd చేస్తూ, DL పాస్ అయి, భద్రాచలం లో గవర్న్మెంట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. నేను శ్రీనివాస్ MA కలిసి చదువుకున్నాము HCU లో. అతని చెల్లెలు పద్మజ తరువాత మా HCU లోనే ఆంత్రపోలజీలో MA చేసింది. హాస్టల్ లో తను నా రూములోనే ఉండి HCU పరీక్షకి ప్రిపేర్ అయ్యేది. దానితో పద్మ కూడా నాకు బాగా క్లోజ్ అయింది. MA పూర్తి అయిన వెంటనే పద్మజ కి పెళ్ళి అయింది. తన భర్త వైజాగ్ లో ఉద్యోగి. వాళ్ళకి ఆరునెలల క్రితం బాబు పుట్టాడు. బుల్లబ్బాయి గారిని చూసి తల్లిదండ్రులు మురుసిపోతూ పెద్దల ఆశీర్వాదంతో, అందరి సమక్షంలో ప్రతీక్ అని పేరు పెట్టారు. మూడు నెలలు గడిచిన తరువాత రాకుమారుడు ఎనీమిక్ గా ఉన్నాడని తెలిసి డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్ళారు. కొంతకాలం ట్రీట్‌మెంట్ జరిపాక తెలిసిన భయంకరమైన నిజం ఆ తల్లిదండ్రులను, మేనమామను కుదిపేసింది. పిల్లాడికి బోన్ మేరో ట్రాన్స్‌ప్లాన్టేషన్ చెయ్యాలి. ఎక్కడో లక్షలలో ఒకరికి సంక్రమించే ఈ వ్యాధి మా చిన్నారి ప్రతీక్ కి దాపురించడం విచారకరం. ప్రతీక్ కి ఇప్పుడు ఆరునెలలు. తను ఇప్పుడు వెల్లూర్ CMC ఆస్పత్రిలో ఉన్నాడు. బాబుకి నాలుగు వారల లోపు బోన్ మేరో ట్రాన్స్‌ప్లాన్టేషన్ జరగాలి. దానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది. నా స్నేహితుడి కుటుంబం మనలాంటి మధ్య తరగతి కుటుంబమే. 20 లక్షలు అంటే భరించలేనంత భారం. నా మితృడు ఎలాగైనా అష్టకష్టాలు పడి fund raise చెయ్యాలని చూస్తున్నాడు. అందులో భాగం గా ఈ కింది బ్లాగు మొదలెట్టాడు. ఈ బ్లాగులో అన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. అన్నీ చదివి ఆ చిట్టిబాబుని బతికించడానికి మీకు చేతనైన సహయం చెయ్యండి...ప్లీజ్.


ఈ ఆపరేషన్ నెలరోజులలోపు జరగాలి. మీరు చేసేది ఎంత చిన్న సహాయమైనా సరే ఓ పసిప్రాణాన్ని కాపాడుతుంది. ఏ తప్పు చెయ్యని ఆ చిన్నారి ఆరునెలల వయసులో ఆస్పత్రిలో దీనంగా పడుకుని ఉన్నాడు. ఇంక వాళ్ళ అమ్మ పద్మజ పరిస్థితి వర్ణనాతీతం. మీకు చేతనైన సహాయం చేసి ఆ తల్లిని కడుపుకోతకి దూరం చెయ్యండి. ఆ చిన్నారి మొహం లో నవ్వులు పూయించండి. ఇది హాక్స్ మైల్ కాదు. నన్ను నమ్మండి. ఫోన్ నంబర్లు, బ్యాంకు వివరాలు అన్నీ పైన ఇచ్చిన బ్లాగులో ఉన్నాయి. గుర్తుంచుకోండి...సమయం చాలా తక్కువ ఉంది. నాలుగు వారాలలోపు ఆపరేషన్ జరగాలి. మీ సహయానికి వారి కుటుంబము, నేను ఎల్లప్పుడు కృతజ్ఞులుగా ఉంటాము. సహాయంతో పాటు బాబు తొందరగా కోలుకోవాలని ఆశీర్వదించడం మరచిపోకండి.

16 comments:

SRRao said...

మంచి ఉద్దేశ్యంతో చేసిన మీ అభ్యర్థన వలన ఆ బాబు తప్పక ఆరోగ్యవంతుడవుతాడు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

శిరాకదంబం వెబ్ పత్రిక

కనకాంబరం said...

సహృదయతతో చేసే మీ యీ కార్యక్రమం సత్ఫలితాన్ని యిస్తుందని ఆకాంక్షిస్తున్నాను . విషయం తెలిసి హృదయం ద్రవించింది. ప్రతీక్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా .భగవంతుని వేడుకొంటున్నా. డబ్బు బంపడానికి ఈజీ వే వుంటే చెప్పండి. ...శ్రేయోభిలాషి నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాంబరం)

ఆ.సౌమ్య said...

రావు గారూ
మీ వంటి సహృదయుల ఆశీర్వాదబలం...బాబు బతికితే అంతే చాలు. ధన్యవాదములు.

ఆ.సౌమ్య said...

రాఘవేంద్ర రావు గారు
ధన్యవాదములు. మంచి మనసుతో ముందుకి వచ్చినందుకు కృతజ్ఞతలు.
మీరు ఈ కింద ఇచ్చిన అకౌంట్ కి డబ్బుని transfer చెయ్యొచ్చు.

A/C Number : 00501050219043
A/C Holder : T L V Pavan Kumar
First name : Tanikella
Last name : Lakshmi Venkata Pavan Kumar
Bank : HDFC Bank
Branch : DWARAKANAGAR (Vizag)
IFSC Code : HDFC0000050

లేదా

ఈ కింద ఇచ్చిన పేరు మీద DD పంపవచ్చు.

Name: Prateek T V

Address:

C/o Dr. Biju George, M.D, D.M, Associate Professor,

Dept of Clinical Haematology,
CMC, Vellore, Tamil Nadu, India

మీ సహాయానికి ముందస్తు కృతజ్ఞతలు.

కొత్తావకాయ said...

Will try to help. I appreciate u for bringing this issue to everyone's notice.

ఆ.సౌమ్య said...

@కొత్తావకాయ
Thanks a lot!

ఛాయ said...

మంచి చెయ్యాల్నుకొనే వారికి దేవుని సాయం ఉంటుంది. నేను తెలిసినవారికి చెపుతాను మరి..

శిశిర said...

ఒక మంచి ఉద్దేశ్యంతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం తప్పక సఫలీకృతమవుతుంది. అందరి సహాయ సహకారాలతోనూ బాబు తప్పక కోలుకుంటాడు. నా వంతు ప్రయత్నం నేనూ చేస్తాను.

గీతాచార్య said...

Thanks a lot for the concern shown by you. నాకు తెలిసినంతలో ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కామెంట్లో మీరిచ్చిన ఎడ్రసు, ఎకౌంటు నమ్బర్లని బ్లాగు టపాలోనే పెడితే బాగుంటుందేమో?

And if the efforts are sincere, nothing comes in the way, and if ever they come, can be over come easily. All the best for the kid, and GOD must bless him.

ఆ.సౌమ్య said...

ఛాయ, శిశిర, గీతాచార్య గార్లకు
మనఃపూర్వక ధన్యవాదములు!

@గీతాచార్య
అవన్నీ ఈ లింక్ లో ఉన్నాయి.

http://www.help-prateek.blogspot.com/

ఈ లింక్ బ్లాగులో ఇచ్చాను.

గోదారి సుధీర said...

సౌమ్య గారూ ,కొన్ని పాపులర్ బ్లాగ్స్ లో కూడా ఈ విషయాన్ని వచ్చేలా చేయండి.అట్లాగే మన hcu గ్రూప్స్ ఫేస్ బుక్ లో.... అట్లా వుంటే అక్కడ కూడా ప్రయత్నించండి.టైం చాలా తక్కువగా వుంది కదా .నాకు వీలయింది నేను చేయడానికి ప్రయత్నిస్తున్నా .అల్ ది బెస్ట్ .

గోదారి సుధీర said...

సౌమ్య గారూ ,కొన్ని పాపులర్ బ్లాగ్స్ లో కూడా ఈ విషయాన్ని వచ్చేలా చేయండి.అట్లాగే మన hcu గ్రూప్స్ ఫేస్ బుక్ లో.... అట్లా వుంటే అక్కడ కూడా ప్రయత్నించండి.టైం చాలా తక్కువగా వుంది కదా .నాకు వీలయింది నేను చేయడానికి ప్రయత్నిస్తున్నా .అల్ ది బెస్ట్ .

gora said...

sowmya garu..
nenu kuda hcu andi.. babuki twaraga baagavvalani nenu korukuntunna..
chethanaina help thappakundaa chesthamu.. padmaja anthropology ante 2006-2008 MA batch ammayena andi.. thanaithe naku thelusu, nenu naaku thelisina vallandariki message pamputhanu...

ఆ.సౌమ్య said...

సుధీర గారు
ఫేస్బుక్ లో పెట్టామండీ....నాకుతెలిసినవాళ్ళందరికి మైల్స్ కూడా ఇస్తున్నాను. మీరు మంచి మనసుతో ముందుకి వచ్చారు...చాలా సతోషం. చాలా చాలా thanks.

మీరు HCU నా? ఏ బేచ్? ఏ dept?

ఆ.సౌమ్య said...

@ gora
అవును ఆ అమ్మాయే! మంచి మనసుతో సహయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు! మీకు తెలిసినవాళ్లందరికీ చెప్పండి. Thank you!

గీతాచార్య said...

How is the Kid now madam? Is there any progress?